• January 11, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అంతా ఒకే గూటికి.. మోనిత కంటపడనున్న దీప

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అంతా ఒకే గూటికి.. మోనిత కంటపడనున్న దీప
    కార్తీక దీపం ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అంటే మంగళవారం నాటి ఎపిసోడ్ అంటే Karthika Deepam Episode 1246 నాటి ధారావాహికలో అదిరిపోయే సీన్లు పడ్డాయి. ఇక అందరూ కూడా ఒకే గూటికి చేరుకున్నట్టు తాడి కొండ గ్రామానికే వచ్చారు. సౌందర్య, ఆనంద్ రావులు ప్రకృతి వైద్యం కోసం తాడికొండకు వచ్చారు. వారిని ఫాలో అవుతూ మోనిత కూడా వచ్చేసింది. మరో వైపు కార్తీక్ తన పిల్లల కోసం వంట వండుతాడు. హోటల్‌లో పని చేస్తున్నాను అనే విషయాన్ని దీప దాచి పెడుతుంది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
    ప్రకృతి వైద్యం కోసం సౌందర్య, ఆనంద్ రావులు బయల్దేరుతుంటారు. ఈ తతంతాన్ని అంతా మోనిత బయట కారులోంచి చూస్తుంది. ఈ సెంటిమెంట్ సీన్లు ఏంటి అని అనుకుంటుంది. వెళ్లొస్తాను జాగ్రత్త ఇంతకంటే ఏం చెప్పలేని అని ఆదిత్యకు సౌందర్య చెబుతుంది. వస్తానో కూడా తెలీదు అని ఆనంద్ రావు అంటాడు. మీ అమ్మనాన్నలు వచ్చాక ఇక్కడే వచ్చి ఉండమనంటూ శ్రావ్యకు చెబుతుంది. అలా ఈ ఇద్దరూ బయల్దేరుతారు. వీరి వెనకాల మోనిత కూడా ఫాలో అవుతుంది. ఈ ఆదిదంపతులు, ఆదర్శ దంపతులు ఎక్కడికి వెళ్తున్నారు.. వీళ్లని ఫాలో అయిపోతే పోలే.. మీకు దేవుడిచ్చిన కోడలు మీ వెనకే వస్తోంది.. అని మోనిత కూడా వెళ్తుంది.
    ఆ తరువాత సీన్ కార్తీక్, దీపల మీద ఓపెన్ అవుతుంది. వీడు రాత్రి ఏడ్వడు.. మంచివాడు అని దీప అంటుంది. ఏరా నువ్ రాత్రి ఏడ్వవారా అని కార్తీక్ అంటాడు.  ఏరా అని పిలవకండి.. వాడి పేరు మావయ్య పేరే.. అని దీప అంటుందీ. దీంతోవెంటనే కార్తీక్‌కు గతాన్ని, మోనిత చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంటాడు. వీడిని ఆనందు అని పిలిస్తే మామయ్య గుర్తొస్తున్నారు.. అని దీప అంటే నాకు మోనిత చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి అని కార్తీక్ అంటాడు.
    వాటిని మరిచిపోవడానికే కదా? ఇక్కడి వరకు వచ్చింది.. ఇక్కడకు వచ్చినా కూడా మోనితే గుర్తుకు వస్తే ఎలా అండి అని దీప అంటుంది. అది చేసిన పనులను మరిచిపోలేకపోతోన్నాను.. అని కార్తీక్ అంటాడు, ఆనంద్ అన్నప్పుడల్లా మామయ్య గారిని గుర్తు చేసుకోండి.. చిన్నప్పుడు ఆయనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకోండి.. మోనితను మైండ్లోంచి తీసేయండి.. అని దీప చెబుతుంది.
    సౌందర్య కారును ఫాలో అవుతున్న మోనిత.. వీళ్లు ఎక్కడికి వెళ్తున్నారు.. బ్యాగ్ సర్దుకుని వెళ్తన్నారంటే కచ్చితంగా కార్తీక్ వద్దకే.. నేనూ, కార్తీక్ కలవకుండా కొత్త ఎత్తుగడలు వేశారా? ఎన్ని వేసినా ఒక అడుగు ముందే ఉంటాను.. ఎక్కడికి వెళ్లినా అక్కడే ఉంటాను.. కార్తీక్ కనిపిస్తే కిడ్నాప్ చేస్తాను.. ఆతరువాత బుల్లి ఆనంద్‌ను వెతుక్కుంటాను.. ఎవరికీ అన్యాయం చేయలేదు.. నా ప్రేమ నిజమైతే కార్తీక్ కనిపిస్తాడు.. మేం ఒక్కటవుతాం అని అనుకుంటూ ఊహల్లో తేలుతుంది.
    భోజనం తినండి అని కార్తీక్‌ని దీప పిలుస్తుంది. నాకు ఆకలి అవ్వడం లేదు.. పిల్లలు తిన్నారా?.. అని కార్తీక్ అడుగుతాడు. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లారట.. డబ్బులు ఎక్కడివి అండి అని దీప అడుగుతుంది. నా దగ్గర డబ్బులు లేవు.. ప్రేమ ఉంది.. నువ్ నన్ను అంత అపురూపంగా చూసుకుంటూ ఉండటం కూడా ఇబ్బందిగా ఉంది.. ఓ బిడ్డలా చూసుకోకు.. నన్ను కార్తీక్‌లా నీ భర్తలా చూడు అని కార్తీక్ అంటాడు..
    నాకు పక్క ఊర్లో పని దొరికింది. మోతుబరి కుటుంబం.. వంటపని చేస్తున్నాను.. ఈ విషయాన్ని రుద్రాణికి చెప్పరట అని హోటల్ పని అని కార్తీక్ దగ్గర అబద్దం చెబుతుంది దీప. అబద్దం చెబుతున్నందుకు క్షమించండి.. అని దీప లోలోపల అనుకుంటూ ఉంటుంది. ఇంతలా తిరుగుతున్నావ్ నీ ఆరోగ్యం జాగ్రత్త.. అని కార్తీక్ అంటాడు. మీరు డాక్టర్ అని మరిచిపోలేదు.. నా విషయంలో జాగ్రత్తలు చెబుతున్నారు అని దీప అంటుంది. మీ ప్రేమేంటో నాకు తెలుసు.. అందుకే హోటల్లో పని చేయబోతోన్నాను అని మీకు చెప్పడం లేదు..అని దీప అనుకుంటూ ఉంటుంది.
    సౌందర్య తాడికొండ ఊర్లోకి ఎంట్రీ ఇస్తుంది. వీళ్లేంటి ఈ ఊర్లోకి వచ్చారు?.. ఇక్కడకు ఎందుకు వచ్చారు.. ప్రియమణి పార్టీ మార్చి వీళ్లకు హెల్ప్ చేస్తోందా?. నా ఇంట్లో ఉండి నా ఫుడ్డు తిని పార్టీ ఫిరాయిస్తావా? పీక పిసికి చంపి పారేస్తాను.. నువ్వేంటో సౌందర్య ఆంటీ నీ దగ్గరకు ఎందుకు వస్తోందో చూస్తాను.. కార్తీక్ ఎక్కడున్నావ్..  అని మోనిత అనుకుంటూ ఉంటుంది.
    ఇక మరో వైపు పిల్లలు స్కూల్‌కు బయల్దేరుతారు. దీప ఇంటికి రాదు. ఫుడ్ రెడీగా లేకపోవడంతో కార్తీక్ వంట చేస్తాడు. బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాను.. తినేసి వెళ్లండిరా.. అని కార్తీక్ అంటాడు. బ్రేక్ ఫాస్ట్‌గా కూడా అన్నమే తినాలా..ఇదేంటి పేస్ట్‌లా ఉంది.. జిగురులా ఉంది.. అని కార్తీక్ చేసిన వంటకు వంకలు పెడతారు. తినే భోజనాన్ని ఎప్పుడూ విమర్శించకూడదు.. అని కార్తీక్ చెబుతాడు. ఇంతలో దీప వస్తుంది. మీరెందుకు వంట చేశారండి.. అని అంటుంది. నువ్ వచ్చే సరికి లేట్ అవుతుంది కదా? అని కార్తీక్ చెబుతాడు. దీన్ని పంట బియ్యం అంటారు. ఆరోగ్యానికి మంచిది.. తినండని దీప చెబుతుంది.
    ప్రకృతి వైద్య శాలతో ఆనంద్ రావు, సౌందర్య దిగుతారు. భారతి గారు అన్నీ చెప్పారు.. ఉమేష్ ఈ లగేజ్ లోపల పెట్టి.. రూం చూపించండి.. రెస్ట్ తీసుకోండి..ఫార్మాలిటీస్ తరువాత పూర్తి చేస్తాం.. ఇక్కడే ఉండండి ఏం ఇబ్బందిలేదు.. అని ఆ హాస్పిటల్ యజమాని చెబుతాడు. ఓసీని ఇందుకా వీళ్లు వచ్చింది.. ప్రకృతి వైద్యశాలకు వచ్చారంటే.. మామయ్య గారికి బాగా లేనట్టుంది.. అయినా వీళ్ల జీవితాలు ప్రకృతికే అంకితం.. నాకు కార్తీక్ అంకితం.. అత్తయ్యగారు మామయ్యగారు బాయ్ బాయ్.. దేనికైనా పనికొస్తుందేమో.. ప్రియమణిని వెతుకుదాం.. అని మోనిత అనుకుంటుంది.
    ఖాళీగా ఉన్నా రాజు రాజే.. మీరు పని చేస్తే బాగుండదు.. అని కార్తీక్ వంట చేయడం గురించి దీప అంటుంది. బియ్యం.. అని కార్తీక్ ఏదో అంటుంటే.. ఏంటి సామీ..  పిల్లలకు కష్టం సుఖం అన్నీ నేర్పించాలి.. బియ్యం కొనగలం కానీ ప్రేమను కాదు.. ఈ కష్టాలు రేపు పిల్లలకు ఉపయోగపడతాయి.. అని దీప అంటుంది. హిమ, శౌర్యలు అన్నం తింటూ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు.. కార్తీక్ అంటాడు. ఒకప్పుడు పిల్లలు సుఖంగా ఉన్నారు.. ఇప్పుడుకష్టపడుతున్నారు. కానీ అవి కష్టంగా చూపించకూడదు.. పిల్లలు బడిలో పాఠాలు, జీవిత పాఠాలు ఇలా నేర్చుకుంటున్నారు.. మీరు బాధపడకండి.. వాళ్లని నేర్చుకోనివ్వండి.. అని అంటుంది.
    అమ్మ మమ్మల్ని స్కూల్ దగ్గర దిగబెట్టు.. అని పిల్లలు అంటారు. వద్దమ్మా.. ఇప్పుడే వచ్చింది కదా? కాస్త రెస్ట్ తీసుకోనివ్వు అని కార్తీక్ అంటాడు. కావాలంటనే నేను దిగబెడతాను పదమ్మా అని కార్తీక్ అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మోనిత కంట దీప పడేలా ఉంది. పిల్లాడి ఏడుపు వింటూ మోనిత ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి దీపని మోనిత చూస్తుందా? లేదా? చూడాలి. మొత్తానికి అందరూ ఒకే గూటికి చేరుకున్నట్టు అయింది.

    Leave a Reply