- January 10, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. గుండెలను మెలిపెట్టే సీన్.. ఏడిపించేసిన డాక్టర్ బాబు

కార్తీక దీపం ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ అంటే సోమవారం నాటి Karthika Deepam Episode 1245 ధారావాహికలో గుండెలను మెలిపెట్టే సీన్ పడింది. పిల్లల కడుపు నింపడం కోసం డాక్టర్ బాబు తల్లాడటం, ఆరాటపడటం చూస్తే అందరికీ కంటతడి అవ్వాల్సిందే. ఇక రుద్రాణికి ఎదురుతిరిగి నిలిచిన వాళ్లు ఊర్లోఒకరు ఉన్నారని నేటి ఎపిసోడ్‌తో అర్థమైంది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
ఏ పనైనా చేస్తాను అని హోటల్ యజమానిని కార్తీక్ అడుగుతాడు. ఇక్కడ కంప్యూటర్లు నొక్కే పని లేదు.. కడగడం, ప్లేట్లు ఎత్తడమే ఉన్నాయ్.. అని అంటాడు. ఏ పనైనా చేస్తాను.. ఓ ఫుల్ మీల్స్ పార్శిల్ ఇవ్వండి.. అని కార్తీక్ అంటాడు. అలా ఇచ్చిన పుల్ మీల్స్ తీసుకెళ్లి పిల్లలకు తినిపించాలని అనుకుంటాడు. స్కూల్లో పిల్లలు నీళ్లు తాగి కడుపునింపుకుంటుంటారు. ఆ సీన్ చూసి కార్తీక్ బాధపడతాడు.
బంగారుతల్లులు నీళ్లు తాగుతున్నారే.. అంటూ తల్లడిల్లిపోతాడు. రౌడీ, హిమ రండిరా.. సారీరా లేట్ అయింది.. చేతులు కడుక్కొస్తాను అని కార్తీక్ వెళ్తాడు. ఇక ఫుల్ మీల్స్‌ను తన ఇద్దరి కూతుళ్లకు తినిపిస్తుంటాడు.. ఎక్కడి నుంచి తెచ్చావ్ నాన్న.. అని హిమ, శౌర్యలు అడుగుతారు. ఆకలి అవుతుంది కదా?. ఎక్కడినుంచి అయితే ఏంటి.. అని కార్తీక్ సమాధానం చెబుతాడు.
ఇంట్లో వండింది కాదు కదా? అని.. శౌర్య అంటుంది. అవునమ్మా లేట్ అవుతుంది అని.. హోటల్ నుంచి తెచ్చాను..అని కార్తీక్ చెబుతాడు. నాన్న నీ దగ్గర డబ్బులు లేవు కదా?.. ఎలా తెచ్చావ్.. అని మళ్లీ ప్రశ్నిస్తుంది. అమ్మ ఇంట్లో డబ్బులు పెట్టి వెళ్లిందమ్మ.. అని చెబుతూ తినిపిస్తాడు. డబ్బులు లేకపోయినా పార్శిల్ ఇచ్చిన హోటల్ వాడు గొప్పవాడు.. అన్న మాట ప్రకారం హోటల్‌లో పని చేయాలి.. అని కార్తీక్ లోలోపల అనుకుంటాడు.
నువ్ కూడా తిను నాన్న అని పిల్లలు అంటారు. నాకు ఆకలిగా లేదు అని డాక్టర్ బాబు అంటే.. నువ్ అబద్దం చెబుతున్నావ్ నాన్న అని హిమ అంటుంది. మాకు కడుపు నిండింది.. నువ్ తిను నాన్న..అంటూ ఇద్దరూ చెరో ముద్ద తినిపిస్తుంటారు. అలా ముగ్గురూ ఒకరినొకరు తినిపించుకున్నారు.. పిల్లలకు అన్నం పెట్టేందుకు డాక్టర్ బాబు చేసిన ప్రయత్నం అందరిన తాకేలా ఉంది.
మరో వైపు.. రుద్రాణి మాటలను తలుచుకున్న దీప.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటుంది. దేవుడే రావాలా?.. మనుషుల్లో దేవుడు ఉండరా?. అని హోటల్ వద్దకు వస్తుంది. నా పేరు దీప పిండి వంటలు చేస్తాను.. అని దీప చెబుతుంది. మరో వైపు కార్తీక్ కూడా అక్కడికే వస్తుంటాడు. నన్ను నమ్మి ప్లేట్ పార్శిల్ ఇచ్చాడు.. పని చేయాలి.. అని కార్తీక్ అనుకుంటూ వస్తాడు.
ఇవన్నీ నువ్వే చేశావా? అమ్మ చాలా బాగున్నాయ్.. అన్నీ ఇలానే రుచిగా చేస్తావా? ఈవిడగాని మన హోటల్లో పని చేస్తే అందరూ ఎగబడతారు.. అని లోలోపల అనుకుంటాడు ఆ హోటల్ యజమాని. వెళ్లి అలా కూర్చో అమ్మా.. వెనక పిల్లాడిని వేసుకుని తిరుగుతున్నావ్ అంటే.. నీకు చాలా కష్టాలున్నాయ్ అని అర్థమవుతోంది.. అమ్మాయికి కొన్ని మంచి నీళ్లు ఇవ్వండి.. చూడమ్మా నువ్ వంటలు బాగా చేస్తావ్ అని అర్థమైంది.. పని చేస్తానంటే మా హోటల్లో పని ఇస్తాను.. అని అంటాడు.
పైనుంచి దేవుడు దిగి వస్తాడా? అని రుద్రాణి అన్న మాటలను తలుచుకుంటూ.. అడక్కుండానే పని ఇచ్చారు.. నమ్మకంగా పని చేస్తాను.. రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలు.. అని దీప అంటుంది. ఓహో మీకు రుద్రాణికి గొడవ అయింది.. నాక్కూడా రుద్రాణి అంటే పడలేదు.. నేను కూడా లొంగలేదు.. అని చెబుతాడు. పార్శిల్ తీసుకెళ్లాడు.. ఇంకా పనిలోకి రాలేదేంటి.. అని కార్తీక్ గురించి అడుగుతాడు. వెనకాల నుంచి వెళ్లి కార్తీక్ పని చేస్తాడు. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు పనిలోకి వస్తాను..అని చెప్పి దీప వెళ్తుంది.
ఇక కార్తీక్ కోసం మహేష్ ఊర్లన్నీ వెదుకుతాడు. పులి మడుగు అనే ఊర్లో మహేష్ వెతుకుతాడు. ఎప్పుడు దొరుకుతారు.. నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది అని మహేష్ ఆలోచిస్తుంటాడు. నాతో మాట్లాడండి.. ఆడుకోండిరా.. ఎందుకు భయపడుతున్నారు.. నేనూ కూడా మనిషినే కదా? రాక్షసిలా కనిపిస్తున్నానా? అని హిమ, శౌర్యలను ముద్దాడుతుంది రుద్రాణి.
దీంతో దీపకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రుద్రాణి నువ్వసలు మనిషివేనా?. ఎవరు లేనప్పుడు ఇలా ఎందుకు వస్తున్నావా? పిల్లలను హింసిస్తున్నావా? అని అంటుంది. హింసించడం ఏంటి.. బుగ్గలు తడిమాను.. ఆడుకుందామని అన్నాను.. ఇందులో నేను చేసిన తప్పేంటి దీప.. నన్ను చూసి పిల్లలు ఎందుకు భయపడుతున్నారు.. అని అన్నాను.. కానీ నువ్ నోటికొచ్చినట్టు రాక్షసత్వం, కఠినత్వం అని మాట్లాడుతున్నావ్.. అని రుద్రాణి అంటుంది. మీరు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండాలని లేదు కదా?. అని రుద్రాణి అంటే.. పిల్లల మనసులో లేనిపోని విషాలు నింపకండి.. అని దీప అంటుంది. వెళ్తాను టాటా వస్తాను.. అని రుద్రాణి రంగరాజుకు కూడా బాయ్ చెబుతుంది.
ఏడ్వకండి.. ఏం కాదు.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం.. హైద్రాబాద్‌కు వెళ్దాం.. మనం ఇక్కడ ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి.. అని పిల్లలు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఒక్కసారే ఇన్ని ప్రశ్నలు అడక్కండి.. అన్నింటికి సమాధానాలు చెబుతాను.. డాక్టర్ బాబుని అడిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.. అని దీప తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది.
సౌందర్య ఈ ప్రయాణం అవసరమా?. అని ఆనంద్ రావు అంటే.. జీవితమే ప్రయాణం కదా? అందులో ఇదొక చిన్న ప్రయాణం సరదాగా అనుకోండి..అని సౌందర్య చెబుతుంది. సరదా అనే పదం మన జీవితంలోంచి వెళ్లిపోయింది.. నా గురించి, ఆరోగ్యం గురించే బాధపడుతున్నావ్ అని నాకు తెలుసు.. నేను బాగానే ఉన్నాను సౌందర్య.. అని ఆనంద్ రావు అంటాడు.
నాకు తెలుసు మీరు ఎంత బాగున్నారో.. తల్లి ప్రేమ అద్దంలా అందరికీ తెలుస్తుంది.. తండ్రి ప్రేమ ఎవ్వరికీ తెలియదు.. ప్రేమ, బాధ రెండూ దాచి పెట్టుకుంటారు.. దీపుగాడిని చూసి వచ్చారా? అని సౌందర్య అంటుంది. చూశాను నిద్ర పోతోన్నాడు.. అని ఆనంద్ రావు అంటాడు. శ్రావ్య మీరు జాగ్రత్త.. అని సౌందర్య అంటే.. ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లొద్దు.. సాధ్యమైనంత వరకుఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించు.. అని ఆదిత్యకు చెబుతాడు ఆనంద్. ఇక మోనిత వీరంతా బయటకు వెళ్లే దృశ్యాలను చూస్తుంది. రాత్రి టైంలో వెళ్తున్నారంటే కార్తీక్ ఆచూకి తెలిసే ఉంటుందా? అని మోనిత ఊహించేసుకుంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.