• January 8, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. ప్లేట్ మీల్స్ కోసం పనోడిలా డాక్టర్ బాబు.. హోటల్‌లో వంటలక్కగా దీప

Karthika Deepam నేటి ఎపిసోడ్.. ప్లేట్ మీల్స్ కోసం పనోడిలా డాక్టర్ బాబు.. హోటల్‌లో వంటలక్కగా దీప

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శనివారం నాటి Karthika Deepam Episode 1244 ధారావాహికలో గుండెలను మెలిపెట్టే సీన్లు పడ్డాయి. తన బిడ్డల ఆకలి తీర్చేందుకు డాక్టర్ బాబు తల్లడిల్లిపోయాడు. ఇక మరో వైపు రుద్రాణి ఆగడాలు, అడుగడుగునా అడ్డం పడటం, పిండి వంటలను అమ్ముడుపోకుండా చేస్తుండటంపై దీప ఆలోచనల్లో పడింది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మాత్రం అందరినీ ఎమోషనల్‌గా కదిలించేలా ఉంది.

    మోనిత దగ్గర పని చేసేందుకు కొత్త నర్స్ విన్ని వచ్చింది. ఆమెను వారణాసే తీసుకొస్తాడు. ఆటో అతను మిమ్మల్ని బాగా తిట్టాడు మేడం అని విన్ని చెబుతుంది. వాళ్ల తిట్టే నాకు దీవెనలు అని మోనిత అంటుంది. ఎందుకు అలా తిట్టారు మేడం అని విన్ని అడిగితే.. అదో పెద్ద కథ అని మోనిత టాపిక్ డైవర్ట్ చేస్తుంది. నేను కూడా మీ దీపక్కలాంటిదాన్నే.. కార్తీక్‌కు భార్యనే కదా? నన్ను కూడా అక్క అని పిలువు వారణాసి అని మోనిత అంటుంది. అది ఎప్పటికీ జరగదు.. అని వారణాసి అంటాడు. అందరి చేత నేను కార్తీక్ భార్యనే అని అనిపిస్తాను అంటూ మోనిత అంటుంది.

    ఇలా అయితే రుద్రాణి అప్పు ఎలా తీరుస్తాం.. తీర్చేయాలి.. అని బిడ్డతో ముచ్చట్లు పెడుతూ దీప వెళ్తూ ఉంటుంది. ఎదురుగా రుద్రాణి కనిపిస్తుంది. ఏం దీప అంతా కులాసానా?.. వెనకాల రంగరాజును పట్టుకుని, రెండు చేతుల సంచులు పట్టుకున్నావంటే.. రెండు చేతులా సంపాదిస్తున్నావన్న మాట.. బోనీ కూడా కాలేదేమో.. అర్థమైందా? ఈ రుద్రాణి అంటే ఏంటో అని రుద్రాణి అంటుంది.

    మీరు ఓడిపోతావనే భయం.. నాది గెలుస్తాను అనే ధైర్యం.. అని దీప అంటుంది. ఒరేయ్ గడ్డం మన పిండి వంటలు ఎలా ఉన్నాయట.. సూపర్ అంట..అక్క.. మళ్లీ మళ్లీ ఆర్డర్ ఇస్తున్నారు.. అని చెబుతారు. చూశావా? దీప.. నువ్ ఎలా ఎక్కడికి వెళ్లినా వీధిలో విగ్రహంలా అడ్డు పడతా.. అని రుద్రాణి అంటుంది. మీరు ఎదురు వచ్చినా నేను ఆగను అని మీకు తెలిసేలా చేశాను కదా? రుద్రాణి గారు.. అని దీప అంటుంది.

    తనను లాగి పెట్టి కొట్టిన సంఘనటను రుద్రాణి గుర్తు చేసుకుంటుంది. గుర్తు పెట్టుకున్నాను దీప.. అన్నీ గుర్తు పెట్టుకున్నాను.. బాండ్ మీద సంతకం పెట్టిన విషయం గుర్తు పెట్టుకోండి.. అని రుద్రాణి అంటుంది. మీ బాకీ తీరుస్తాం.. అని దీప అంటే.. సముద్రంలోని నీటిని చెంచెతో ఖాళీ చేస్తాను అన్నాడట.. లక్షల బాకీ ఎలా తీరుస్తారు.. నేను సంపాదించనివ్వాలి కదా?. అని రుద్రాణి అంటుంది.

    గాలికి చిన్న మంట ఆరిపోతుందేమో అదే.. పెద్ద మంట అయితే ఇంకా పెరుగుతుంది.. అని దీప చెప్పిన కొటేషన్‌కు రుద్రాణి షాక్ అవుతుంది. ఏంటి నీ ధైర్యం అని రుద్రాణి అంటే. ధర్మమే నా ధైర్యం అని దీప చెబుతుంది.. ఏది ఏమైనా అప్పు తీర్చలేరు అన్నది నాకు అర్థమైంది.. సంక్రాంతి ఆఫర్ ఇస్తాను.. నీ కూతుళ్లలో ఒకరిని ఇవ్వు.. అని రుద్రాణి అనగానే.. దీప అంత ఎత్తున లేస్తుంది. రుద్రాణి అంటూ అరిచేస్తుంది.

    కోపం వచ్చిందా? పూర్తిగా విను.. ఒకటి పాపను ఇవ్వడం, రెండు రంగరాజుని ఇవ్వడం, అప్పు తీర్చడం.. నీకు మూడే దారులున్నాయ్ అని దీప అంటుంది. అప్పు తీరుస్తాను.. అని దీప అంటే.. గడువు దగ్గరపడుతోంది అని రుద్రాణి అంటుంది.. గడువులోగానే తీరుస్తామని అంటుంది.. ఎలా తీరుస్తావ్ అని రుద్రాణి అడిగితే.. అవన్నీ నీకు అనవసరం.. అని దీప వెళ్తుంది. దేవుడు దిగి వచ్చి ఇస్తాడా? అని రుద్రాణి ఎగతాళి చేస్తుంది. దేవుడొస్తాడో.. దేవత వస్తుందో ఎవరికి తెలుసు. ఇంట్లో తినడానికి సరుకులున్నాయో కూడా తెలియదు కానీ ఎంత గట్టిగా మాట్లాడుతుందో చూశారా?..అని రుద్రాణి అంటుంది.

    ఆకలి బాగా వేస్తోంది డాడీ..అని పిల్లలు అన్న మాటలను కార్తీక్ గుర్తుకు చేసుకుంటాడు. పిల్లలు ఆకలితో ఎదురుచూస్తుంటారు.. బియ్యం లేవా?.. దీప ఎక్కడైనా డబ్బులు పెట్టిందేమో..అని ఇళ్లంతా వెతుకుతాడు కార్తీక్. ఇంట్లో బియ్యం లేవు.. డబ్బులు లేవు.. పిల్లలు ఆకలితో ఉన్నారు.. ఏం చేయాలి.. పిల్లలు ఎదురుచూస్తుంటారు.. ఏం చేయాలి.. ఏదో ఒకటి చేసి భోజనం తీసుకెళ్లాలి.. అని కార్తీక్ పరివిధాలుగా తపిస్తుంటాడు.

    ఆవేశపడకండి డాక్టర్ బాబు, చీటి వేసి అప్పు తీర్చేద్దాం.. అని కార్తీక్‌తో అన్న మాటలను దీప గుర్తుకు చేసుకుంది. ఆ రుద్రాణి తెలివిగా దెబ్బ కొట్టేసింది.. రుద్రాణి మాటలను గుర్తు చేసుకున్న దీప.. ఆమెను తక్కువ అంచనా వేశాను.. ఓడిపోకూడదు.. డాక్టర్ బాబు కూడా ఈ విషయంలో బాధపడుతున్నాడు.. అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇక దీప సోడా తాగుతూ.. రుద్రాణికి భయపడితే కుటుంబాన్ని పోషించుకోలేను.. అని గట్టిగా నిర్ణయించుకుంటుంది.

    ఆనంద్ రావును ప్రకృతి వైద్యం కోసం సౌందర్య తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. నువ్ వస్తే శ్రావ్య ఒక్కత్తే అవుతుంది.. వద్దు అని ఆదిత్యకు చెబుతుంది సౌందర్య. మేం బయల్దేరుతాం.. అని సౌందర్య అంటే.. ఇది ఉపయోగపడుతుందా? అని ఆదిత్య అడుగుతాడు. స్థల మార్పిడి కాస్త ఉత్తేజ పర్చుతుంది.. ఇక్కడే నాలుగు గోడల మధ్యే ఉండటం మంచిది కాదు.. పిల్లలు, కార్తీక్ గుర్తుకు వస్తుంటారు.. స్థలం మారితే కొంత కోలుకుంటాడని నమ్మకం. అని సౌందర్య అంటుంది. డాడీ రావడానికి ఒప్పుకున్నాడా? అని ఆదిత్య అంటే ఒప్పించాను అని సౌందర్య చెబుతుంది.. జాగ్రత్తరా అని సౌందర్య అంటే.. మాకేంటి మేం బాగానే ఉంటాం.. మీరే జాగ్రత్తగా ఉండండి..అని ఆదిత్య అంటాడు.

    ఇక ఊర్లోని హోటల్‌కు కార్తీక్ వెళ్తాడు. ప్లేట్ మీల్స్ కోసం నానా కష్టాలు పడతాడు. వంద రూపాయలకు ప్లేట్ మీల్స్ అని చెబుతాడు. డబ్బులేమో కార్తీక్ వద్ద లేవు. కొత్తగా ఊరికి వచ్చారా?.. పెద్ద నోటుందా?.ఏం ఆలోచిస్తున్నారు నా దగ్గర చిల్లర ఉంది.. ఎందుకు వెనుకా ముందు అవుతున్నారు.. అని హోటల్ యజమాని అడుగుతాడు. డబ్బులు లేవు.. మీల్స్ పార్సిల్ కావాలి..అని కార్తీక్ అడుగుతాడు. డబ్బుల్లేకుండా ఎలా ఇస్తారు.. ధర్మ సత్రం కాదు కదా?. బొంబాయ్ హోటల్.. అని అంటాడు.

    నేను ఈ ఊర్లోనే ఉంటాను.. సాయంత్రం డబ్బులు తీసుకొస్తాను.. ఒక్క ఫుల్ మీల్స్ పార్శిల్ ఇవ్వండని కార్తీక్ అడుగుతాడు. ఒంటి మీద ఏదైనా ఉంటే చెప్పు.. అలాంటివేం లేవు కదా?.అని హోటల్ యజమాని అంటాడు. పిల్లలు ఆకలితో ఉన్నారు సర్.. వంద రూపాయలే కదా? సర్.. అని కార్తీక్ అంటాడు. వంద రూపాయలేనా? డబ్బును అంత తేలిగ్గా తీసుకోకు.. ఏదో కోట్లు ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఒకటి రెండు నుంచి వంద లెక్క పెట్టుకుంటూ ఉంటే రెండు నిమిషాలు అవుతుంది. మొత్తానికి అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ ఆ హోటల్ పనిమనిషిగా మారుతాడు. పిల్లలకు భోజనం తినిపిస్తాడు. అదే హోటల్‌లో వంటలక్కగా దీపకు పని కూడా దొరుకుతుంది. మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా హోటల్లో పని చేస్తారేమో చూడాలి. కార్తీక్ ఇలాంటి పని చేస్తాను అంటే దీప ఎలా రియాక్ట్ అవుతుందో మరి.

    Leave a Reply