- January 4, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. రుద్రాణి బెదిరింపులు.. దీప కోసం గాలిస్తున్న కార్తీక్

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే మంగళవారం నాటి Karthika Deepam Episode 1240 ధారావాహికలో కార్తీక్ తన కుటుంబం గురించి ఆలోచిస్తూ సతమతవుతాడు. రుద్రాణి బెదిరింపులకు కార్తీక్ భయపడిపోతారు. దీప, పిల్లలకు ఏమవుతుందా? అని కంగారు పడతాడు. మరో వైపు కార్తీక్ కోసం మహేష్ వెతుకుతుంటాడు. అలా మొత్తానికి నేటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా సాగింది.
పిండి వంటలు చేసి నా అప్పు తీర్చేస్తుందా? అంటూ రుద్రాణి రగిలిపోతుంది. కార్తీక్ అహం మీద దెబ్బకొట్టాలని రుద్రాణి ప్రయత్నిస్తుంది. ఇంట్లో బాబుకు పాలు పడుతూ ఉన్న కార్తీక్‌ను రుద్రాణి అవమానిస్తుంది. ఇంట్లో పెళ్లాం మొగుడైంది.. మొగుడు పెళ్లామైంది.. ఇలాంటి పనులు చేస్తే ఎవ్వరూ మర్యాద ఇవ్వరు సారూ.. అని రుద్రాణి అంటే కార్తీక్ ఫైర్ అవుతాడు.
పనీ పాట చేతగాని వాళ్లకు కోపం ఎక్కువ అని అంటుంటారు.. నాకు రంగరాజును ఇవ్వండి.. నాకు అసలే పిల్లలు లేరు. మంచిదాన్ని కాదు.. ఇవ్వొచ్చు కదా? బయటకు వెళ్లిన నీ పెళ్లాం దీప క్షేమంగా రావాలి కదా? అని రుద్రాణి బెదిరిస్తుంది. ఎందుకు రాదు అని కార్తీక్ అమాయకంగా అడుగుతాడు.. దీప క్షేమంగా రావాలి.. బడికెళ్లిన పిల్లలు భద్రంగా రావాలి కదా? అని అంటుంది.
రుద్రాణి గారు.. అని కార్తీక్ అరిచేస్తాడు. రోజులు బాగా లేదు.. అర్థం చేసుకోండి.. నేనేం కక్ష పెంచుకోలేదు.. రోజులు బాగా లేవని చెబుతున్నాను.. పాపం శ్రీవల్లి, కోటేశులు ఉత్త పుణ్యానికే చచ్చిపోయారు. సారు రంగరాజును ఇవ్వమంటే ఇవ్వడం లేదు.. కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారేమో.. ఆలోచించండి.. నేనేదో అన్నానో ఆలోచించుకోండి.. బుర్ర పాడుచేసుకోండి.. ఎవరి టైం ఎలా ఉంటుందో తెలీదు కదా?. జాగ్రత్త.. రంగరాజు, దీప, పిల్లలు జాగ్రత్త.. అని రుద్రాణి వెళ్లిపోతుంది.
దోష నివారణ పూజ ఫోటోను తన హాస్పిటల్‌లో పెట్టుకుంటుంది మోనిత. నువ్ లేవు.. మన బాబు లేడు.. ఏం చేస్తున్నారు ఆనంద్ రావు గారు.. బజ్జున్నారా? పడుకోండి.. నాన్న వస్తారు.. నువ్ నేను ఆనందంగా తిరిగేద్దాం.. అని బొమ్మను చూసుకుంటూ మోనిత మురిసిపోతుంది. ఇంతలో నర్సమ్మ వస్తుంది. ఫోటో బాగుంది కదా?. నేను ఎంతో అందంగా ఉన్నాను కదా? మా జంట బాగుంది కదా? అని ఇలా మోనిత ప్రశ్నలు వేస్తుంటే.. సార్ ఎక్కడికెళ్లారమ్మా అని ఏమీ తెలియనట్టుగా నర్సమ్మ అడిగేస్తుంది.
కాన్ఫరెన్స్ కదా? అని ముంబైకి వెళ్లారు.. అని మోనిత ఏదో కవర్ చేస్తుంది. మీ గురించి నాకు మొత్తం తెలుసు..అని నర్సమ్మ అనేస్తుంది. అయితే మరీ మంచిది.. నా ప్రేమ కథ అంతా తెలిస్తే నాకు ఇంకా మంచిదే. నా కార్తీక్ వస్తాడని నమ్మకం, ప్రేమనే తింటూ ప్రేమనే పీలుస్తూ ఉన్నాను.. అని మోనిత చెబుతుంది. వస్తాడని అనుకుంటున్నారా?.. ఫోటోనే చూసుకుంటూ బతికేస్తారా? అని నర్సమ్మ అంటుంది. దీంతో మోనిత ఫైర్ అవుతుంది. కచ్చితంగా కార్తీక్ వస్తాడు అని అంటుంది.
ఇక మరో వైపు మహేషు.. కార్తీక్ కోసం వెదుకులాట ప్రారంభిస్తాడు. మహేష్ కూడా తాడికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఊర్లోని జనాలను మహేష్ అడుక్కుంటూ వెళ్తాడు. ముందుగా రుద్రాణి మనుషుల్నే అడుగుతాడు. కానీ వారు ఆ ఫోటోను చూడరు. మరో వైపు రుద్రాణి మాటలను తలుచుకున్న కార్తీక్.. పిల్లల కోసం కంగారు పడతాడు. అందరూ భద్రంగా రావాలి కదా? అని రుద్రాణి మాటలు తలుచుకుని కార్తీక్ కుమిలిపోయాడు. అప్పు గురించి దీప మాటలను తలుచుకుంటూ కార్తీక్ బాధపడ్డాడు.
దీప ఇంకా రాలేదేంటి?.. అని కార్తీక్ మథన పడతాడు. శ్రీవల్లి, కోటేశులు ఉత్త పుణ్యానికే చచ్చిపోయారు.. దీప పిల్లలు కూడా జాగ్రత్త.. అంటూ రుద్రాణి అన్న మాటలు, ఆ ఆలోచనలతో సతమతమైన కార్తీక్.. రుద్రాణి అలా ఎందుకు అంది.. అర్జెంట్‌గా పిల్లల దగ్గరకు వెళ్లాలి.. అని అనుకుంటాడు. అమ్మా మహాలక్ష్మీ నాకు పని ఉంది.. స్కూల్ దగ్గరకి వెళ్లొస్తాను.. బాబును చూస్తూ ఉండమ్మా అని చెప్పి కార్తీక్ వెళ్తాడు.
ఇక స్కూల్‌లో హిమ, శౌర్యలు దీప కోసం ఎదురుచూస్తుంటారు. ఆకలితో బాధపడుతుంటారు. ఇంతలో రుద్రాణి వస్తుంది. అన్నం తినిపించేందుకు ప్రయత్నిస్తుంది. హిమ వద్దన్నా సరే తినిపించేందుకు చూడటంతో రుద్రాణి చేతిలోని అన్నాన్ని శౌర్య విసిరి కొట్టేస్తుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. పిల్లలను బెదిరిస్తారేంటి?..అని కార్తీక్ ఫైర్ అవుతాడు. లోకంలో అన్నం పెడుతుంటే.. తిట్టేవాళ్లను మిమ్మల్నే చూస్తున్నాను.. అని రుద్రాణి అంటుంది
చూడండి పిల్లలు ఎంతలా భయపడుతున్నారు.. అని కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీరు ఇంటికి వెళ్లండి.. నేను వస్తాను.. అని పిల్లలను పంపించేస్తాడు కార్తీక్. మీ ఉద్దేశ్యం ఏంటి.. మా పిల్లలకు భోజనం ఎందుకు పెడుతున్నారు.. అని కార్తీక్ అంటాడు. పిల్లలను అన్నం తినకుండా చేశావ్.. స్కూల్ నుంచి పంపించావ్ ఏం చేద్దామని అంటూ కార్తీక్‌ను నిలదీస్తుంది రుద్రాణి. అవన్నీ మీకు ఎందుకు రుద్రాణి గారు.. నా పిల్లలు నా ఇష్టం అని అంటాడు. పిల్లలను నేనేం చేస్తాను సారు.. నాకు ఒకరు కావాలి కదా? పిల్లలను ఇవ్వను అంటావా? నేనే తీసుకుంటాను.. నాకు పిల్లలంటే ఇష్టం కదా? ఏం చేయను.. దీప వచ్చిందా? ఎక్కడుందో వెతుక్కోవా?.. నా చెంప మీద చాచికొట్టింది.. బలంగా కొట్టింది లే సారు.. వస్తాను సారు.. దీపమ్మను వెతుక్కోవా.. వస్తుందని అంత ధైర్యమా?.. అని రుద్రాణి మరో భయాన్ని కార్తీక్ మనసులో నాటింది. ఇక దీప కోసం ఓ వైపు కార్తీక్.. కార్తీక్ కోసం మరో వైపు మహేష్.. ఊరంతా వెతుకుతారు. ఇందులో ఎవరు ఎవరికి దొరుకుతారో తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి.