• December 28, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఇంట్లోకి వచ్చి రుద్రాణి.. వంటలక్క వెనకడుగు వేస్తుందా?

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఇంట్లోకి వచ్చి రుద్రాణి.. వంటలక్క వెనకడుగు వేస్తుందా?

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం నాటి Karthika Deepam Episode 1234 ధారావాహికలో గుండెను మెలిపెట్టే సీన్ పడింది. కనీసం బిడ్డలకు చెప్పులు కూడా కొనలేని పరిస్థితి వచ్చిందంటూ కార్తీక్ లోలోపల కుమిలిపోతాడు. మరో వైపు మోనిత నాటకాలు తెలుసుకున్న సౌందర్య తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇంట్లోంచి మోనితను బయటకు గెంటేస్తుంది. కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా గడిచిందంటే..

    శ్రీవల్లి కోటేష్ బిడ్డ బారసాల గురించి ఆలోచిస్తుంటారు. అందరినీ పిలిచి ఉన్నంతలో చేద్దాం మని దీప అంటుంది.. మనం పిలిచినా ఎవ్వరూ రారు అని శ్రీవల్లి అంటుంది… ఎందుకు రారు.. నువ్, దీప వెళ్లి అందరినీ పిలవండి అంటూ కార్తీక్ సలహా ఇస్తాడు.. అవును అందరినీ పిలిచి భోజనాలు పెట్టి చేయి కడిగిద్దాం.. అని దీప అంటుంది. రుద్రాణిని ఎదురిస్తే.. ఊరు ఊరంతా ఇలానే తిరగబడేలా చేస్తుంది..ఎవ్వరూ రారు అని కోటేశు అంటాడు.

    ఎవ్వరు రాకపోయినా మేం ఉన్నాం కదా?. మనమే చేసుకుందామని కార్తీక్, దీప అంటారు. ఈ ఇంటి పత్రాలు తీసుకెళ్లింది కానీ సంతోషాన్ని తీసుకెళ్లలేదు కదా? అని దీప అంటుంది. కొట్లో డబ్బులు ఇచ్చారట కదా? వదిన తీసుకోండి అని కోటేశ్ ఇవ్వబోతోంటే.. డబ్బులు ఎక్కువయ్యాయా?.. మమ్మల్ని వేరు చేస్తున్నావా కోటేశు.. అని దీప ఎమోషనల్ అవుతుంది. అంత మాట అన్నారేంటి వదిన.. అని కోటేశ్ హర్ట్ అవుతాడు.

    కోటేశుకి మన ఆదిత్యకు ఉన్నట్టుగా లక్షణాలున్నాయ్ కదా?.. అని దీపతో కార్తీక్ అంటాడు. ఏంటో అన్నారు అని కోటేశ్ అడగడంతో మాట మార్చేస్తుంది దీప. ఆదిత్య గుర్తుకు రావడంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. బయటకు వెళ్లి కూర్చుంటాను అని కార్తీక్ అంటాడు. మనం రేపు అన్నీ చేసి దేవుడికి పంపించేద్దాం అని దీప అంటుంది.. మీది చాలా పెద్ద మనుసు.. అని కోటేశ్ అంటే.. దీనికి కూడా పెద్ద మనసు ఉండాలా? అని చెప్పి దీప వెళ్లిపోతుంది.

    ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇలా ఉన్నారంటే..వీళ్లు మాలాంటి వాళ్లు కాదు.. గొప్పవాళ్లు అయి ఉంటారు..మా లాంటి వాళ్లు అయితే కాదు.. దేవుడా వీళ్లను చల్లగా చూడు.. అని కోటేశు అనుకుంటాడు. ఇక సీన్ మోనిత మీద ఓపెన్ అవుతుంది. అలసిపోయాను నర్సమ్మ అని మోనిత అంటే.. కాళ్లు పట్టనా అని అంటుంది. వద్దు నా మనసు పట్టుకో చాలు అని అంటుంది మోనిత.

    అయ్యగారు కనిపించడం లేదు? అని నర్సమ్మ అడుగుతుంది. సినిమా చూసి హీరో హీరోయిన్లు ఏమవుతారని అడిగినట్టుంది.. నా కార్తీక్ లేడు.. కొడుకుని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు.. మొగుడు లేడు.. బిడ్డ లేడు.. నా బతుకు బ్లాక్ అండ్ వైట్ సినిమాల మారింది.. గుండెల నిండా ప్రేమ ఉంది అని మోనిత డైలాగ్స్ వేస్తుంది. పెళ్లైన వాడిని ప్రేమించావ్ అని అంటున్నారేంటి.. అని నర్సమ్మ అడుగుతుంది.

    దీంతో మోనితకు చిర్రెత్తుకొస్తుంది. నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తూ వచ్చాను.. ప్రేమిస్తున్నాను.. ఒక కారు కొన్న వాడు.. రెండో కారు కొంటే తప్పు పట్టని సమాజం.. పెళ్లైన వాడిని ప్రేమిస్తే అంటుందా? అని మోనిత లాజిక్కులు తీసింది. ప్రియమణి అని ఒకతి ఉండేది.. నీలానే అడ్డమైన సలహాలు ఇచ్చేది.. వద్దు వద్దు అన్నా వినలేదు.. చివరకు తాడికొండుకు వెళ్లిపోయింది.. నీ ఉద్యోగం కొండెక్కి పోకుండా ఉండాలంటే.. ప్రశ్నలు వేయకుండా ఉండాలి.. అని మోనిత స్వీట్ వార్నింగ్ ఇస్తుంది.

    కార్తీక్ మాటలను రుద్రాణి గుర్తు చేసుకుంటూ ఊగిపోయింది.. ఏంటక్కా చీకట్లో కూర్చోన్నావ్ అని రుద్రాణి మనిషి అడుగుతాడు.. ఛీ ఛీ అనిపించుకునే ఆలోచనలు..చీకట్లోనే చేయాలి అని రుద్రాణి చెబుతుంది. కోటేశ్, శ్రీవల్లి తమ బిడ్డకు బారసాల చేస్తున్నారట.. అని చెబుతాడు. ఆ పిల్లాడికి నామకరణం చేస్తున్నారంటే ఏం మాట్లాడటం లేదు ఏంటి అక్కా అని అడుగుతాడు. చిట్టి, నాన్న, కన్న అని ఎన్ని రోజులు పిలుస్తారురా..పేరు పెట్టాలి కదరా? చేసుకోనివ్వు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదరా?? నాకు పిల్లలు లేకుండా చేశారు.. కుదిరితే నా కానుకగా డ్రెస్ పంపిద్దాం.. అని రుద్రాణి అంటుంది.

    మోనిత గుట్టు బయటపెట్టేందుకు వీడియో ఆధారాలతో ఓ పోలీస్ వస్తుంది. అసలు విషయాన్నీ, వీడియోను సౌందర్యకు చూపిస్తుంది. సీసీటీవీ పుటేజ్ దొరికింది.. ఓ మనిషి సమాచారం దొరికింది.. అంటూ ఆ పోలీస్ అసలు విషయాన్ని చూపిస్తుంది. ఇక సీన్ కార్తీక్ దీపల మీద ఓపెన్ అవుతుంది. పిల్లలు తొక్కుడు బిల్ల ఆడుకుంటూ ఉంటారు.. పెద్దవాళ్లు తోరణాలు కడుతూ ఉంటారు.

    కోటేశు పంతులుకు ఫోన్ చేయ్.. అని దీప చెబుతంది. బిడ్డను కార్తీక్ చేతికి ఇస్తాడు కోటేశు. ఏంట్రా అలా చూస్తున్నావ్.. అని కార్తీక్ ఆ పిల్లాడిని ఆడిస్తాడు. వదిన పంతులు నంబర్ బిజీగా ఉంది.. తరువాత ఫోన్ చేస్తాను అని అంటాడు. ఇంతలో శౌర్యకు రాయి గుచ్చుకోవడంతో కింద పడుతుంది. చెప్పులు వేసుకుని ఆడుకోవచ్చు కదా? రౌడీ అని అంటాడు. చెప్పులు తెగిపోయాయ్ నాన్న అని శౌర్య అనడంతో.. కార్తీక్ బాధపడతాడు. దేవుడికి చెప్పులు కూడా కొనివ్వలేని స్థితికి తీసుకొచ్చావా? అని లోలోపల కుమిళిపోతాడు.

    ఏంటి అత్తమ్మ.. చిన్నరాయికి భయపడతావా? చెప్పులు కొనిస్తాలే అని దీప అంటుంది.. అమ్మ నా చెప్పులు కూడా తెగేలా ఉన్నాయ్ అని హిమ కూడా అంటుంది.. నీక్కూడా కొనిస్తాలే.. అని దీప అంటుంది. నేనూ డాడీ షాపింగ్ చేస్తాం అని హిమ హ్యాపీగా ఫీలవుతుంది.. షాపింగ్ అనకూడదు.. చెప్పులు కొనుక్కుంటాం అనాలి అంటూ దీప చెబుతుంది.

    ఏంటి మోనిత.. నీ బిడ్డను మేం దొంగిలించామా? పగ సాధించడానికి నా కొడుకు నీ బిడ్డను ఎత్తుకెల్లాడా? నోటికి ఏదోస్తే అది అనొద్దు.. తరువాత అన్నీంటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తల్లి కావడం ఒక గొప్ప వరం.. పుట్టిన బిడ్డను కూడా నీ స్వార్థానికి వాడుకున్నావ్.. బిడ్డను సైతం అడ్డం పెట్టుకుని సాధిస్తున్నావ్.. నీ అంతట నువ్వే తాళి కట్టుకున్నావ్. కార్తీక్‌ని భర్తగా ఊహించుకున్నావ్.. ఒకటో రెండో నిజమయ్యాయ్.. అబద్దాలతో అన్నీ జరగవు.. అని మోనితను నిలబెట్టి పరవుతీస్తుంది సౌందర్య.

    ఏంటమ్మ మాటలు.. వెంటనే బయటకు గెంటేయ్.. అని ఆదిత్య అంటాడు. ఏంటి అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు.. భయం పోయిందా? అని మోనిత రెచ్చిపోతుంది. దీంతో సౌందర్య మరింత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది. మానసికంగా నీ కంటే బలవంతురాలిని.. నా ఇంటికి వచ్చి నన్ను బ్లేమ్ చేస్తావా? నా కొడుకు నా కొడుకు అని అరవడం కాదు.. పిల్లలను శ్రద్దగా చూసుకోవాలి.. అపురూపంగా చూసుకోవాలి.. రోడ్డు పక్కన కారులో వదిలేసి వెళ్తే బాధ్యత అనిపించుకుంటుందా?..

    ఈ వీడియో చూడు నువ్ చేసిన నిర్వాకం, తప్పేంటో తెలుస్తుంది.. ఎవరో తీసుకెళ్తే ఈ ఇంటికి వచ్చి రచ్చ చేస్తున్నావ్.. ఏం మోనిత మాటలు పడిపోయాయా? ఇప్పుడు మాట్లాడటం లేదేంటి.. వచ్చిన రోజే గెంటేసేదాన్ని.. కానీ నీ బుద్ది నాకు తెలుసు కదా?. వీధుల్లోకి వెళ్లి రచ్చ చేస్తావ్.. చెప్పిందే చెబుతూ.. సానుభూతి సంపాదించుకోవాలని చూస్తావ్.. నిజానిజాలేంటి నిరూపించాకే.. నిన్ను బయటకు గెంటేద్దామని ఆగాను.. నువ్వే వెళ్తావా? మెడ పట్టుకుని గెంటేయాలా? అని సౌందర్య అడుగుతుంది.

    ఇంతలో మోనిత బ్యాగుని తీసుకొచ్చి పాడేస్తాడు ఆదిత్య. వెళ్లు.. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపో.. ఇది సౌందర్య ఇళ్లు అని గుర్తు పెట్టుకో.. వేషాలు గడప అవతల వేయ్.. ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రయత్నించకు.. అంటూ మోనితకు సౌందర్య వార్నింగ్ ఇస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో రుద్రాణి మళ్లీ దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. బారసాలను అడ్డుకుంటూ బిడ్డకు రంగరాజు అని పేరు పెట్టమంటుంది. దీంతో దీప మళ్లీ కొట్టేందుకు వెళ్తుంది. కానీ బిడ్డలు, భర్త పేర్లు చెప్పి దీపను రుద్రాణి భయపెడుతుంది. మరి నిజంగానే వంటలక్క వెనక్కి తగ్గుతుందా? లేదా? అన్నది చూడాలి.

    Leave a Reply