• December 27, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ప్రియమణితో కథ మళ్లీ మొదటికి.. కార్తీక్ ఆచూకి మోనితకు తెలుస్తుందా?

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ప్రియమణితో కథ మళ్లీ మొదటికి.. కార్తీక్ ఆచూకి మోనితకు తెలుస్తుందా?

    కార్తీక దీపం సీరియల్‌ ఈ రోజు ఎపిసోడ్ అంటే.. Karthika Deepam Episode 1233 నాటి ధారావాహికలో అసలు విషయం తెలిసింది. కార్తీక్, దీప తాడికొండ గ్రామానికి ఎందుకు చేరాల్సి వచ్చిందో అసలు కథ విప్పేశాడు. మోనిత దగ్గర పని చేసే ప్రియమణి సొంతూరు తాడికొండేనట. అలా మొత్తానికి రానున్న రోజుల్లో కార్తీక్, దీపల ఆచూకి ప్రియమణి ద్వారా అందరికీ తెలిసేలా ఉంది. మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా జరిగిందంటే..

    సౌందర్యకు భారతి ఫోన్ చేస్తుంది. క్లినిక్ అమ్మేసిందని చెబుతుంది. దీంతో సౌందర్య మరింత కంగారు పడుతుంది. మా ఇంట్లోనే ఉండాలి కదా? ఎక్కడకు వెళ్లింది.. అంతే కార్గీక్ గురించి తెలిసి ఉంటుందా? అని సౌందర్య కంగారు పడుతుంది. అలా సౌందర్య మీద సీన్ కట్ అవుతుంది. వంట గదిలో కూరగాయలు కోస్తూ దీప మీద సీన్ ఓపెన్ అవుతుంది.

    వంటగదిలోకి కార్తీక్ వస్తాడు. దీప అని కార్తీక్ పిలుస్తాడు.. కాఫీ కావాలా? అని దీప అడుగుతుంది. వద్దు దీప.. అని కార్తీక్ అంటాడు. రుద్రాణి వచ్చిందని కంగారు పడుతున్నారా? అని దీప అడిగితే.. ఆమె ఆలోచనలు అంతు పట్టడం లేదు అని కార్తీక్ ఆందోళన చెందుతాడు.. కూరగాయలు కోస్తుంటే పుచ్చులు వస్తాయ్.. పక్కన పెట్టేస్తాం.. రుద్రాణిని కూడా మనసులోంచి తీసేయ్.. అని దీప చెబుతుంది.

    ఎంత సింపుల్‌గా చెప్పావ్ దీప అని కార్తీక్ అంటాడు. మీరు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి.. అని దీప అంటుంది. ఇంట్లో ఖాళీగా కూర్చోటం నచ్చడం లేదు.. చిన్న ఉద్యోగం చేస్తాను.. అని కార్తీక్ అంటాడు. నా కళ్ల ముందు సంతోషంగా ఉండండి.. పిండి వంటలు చేస్తున్నాను కదా? దాంతో ఇళ్లు గడుస్తుందిలేండి అని దీప అంటుంది.. నువ్ కష్టపడుతుంటే.. నేను ఎలా ఉండాలి.. మార్కెటింగ్ చేస్తాను..అని కార్తీక్ అంటాడు.

    నిన్న రాత్రి చేయను అని అన్నారు కదా?అని దీప అంటుంది. ఇప్పుడు చేస్తాను అని అంటున్నా కదా? అని కార్తీక్ అంటాడు. ఇలాంటి పనులు మీరు చేయకూడదు.. ఇక్కడ ఒక ప్రజా వైద్యశాల పెట్టాలి.. అని దీప చెబుతుంది. అక్కడ మోనిత బస్తీలో వంటలక్క ప్రజా వైద్య శాల అని పెడుతుంది. ప్రియమైన బస్తీ వాసులారా.. వంటలక్క ప్రజా వైద్యశాల మీకోసమే పెట్టాను అని అంటుంది.

    దీంతో వారణాసి కోపంతో ఊగిపోతాడు. ఇప్పుడు ఈ ఇల్లు కొనుక్కుందిరా.. ఏం చేయలేం.. అని ఓ బస్తీవాడు అంటాడు. నాలో మీ దీపక్కను చూసుకోండి.. అని మోనిత అంటే.. నీకు మా దీపక్కకు పోలికేంటి?. కాస్త తగ్గు.. అని సరోజక్క అంటుంది. తగ్గాను కాబట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టాను.. నాకు జాలి, దయ వగైరా.. ఎక్కువ.. వాళ్లంతా ఎక్కడికి వెళ్లారో.. అందరం కలిసి వాళ్లను వెతుకుదాం.. అని మోనిత అంటుంది.

    పిల్లలు, కార్తీక్‌లను తలుచుకుంటూ సౌందర్య భాదపడుతుంది.. వాళ్లను వదిలేసి ఎలా ఉంటున్నామో నాకు ఇంకా అర్థం కావడం లేదురా ఆదిత్య అని సౌందర్య అంటుంది. నా ప్రయత్నం చేస్తున్నాను మమ్మీ.. మోనిత ఎక్కడికి వెళ్లింది కనిపించడం లేదు మమ్మీ అని సౌందర్యని ఆదిత్య అడుగుతాడు. కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసి ఉంటుందా? అందుకే వెళ్లి ఉంటుందా? అని ఆదిత్యతో తన భయాలను సౌందర్య బయటపెడుతుంది.

    మీకో విషయం చెప్పాలి.. అని రత్న సీత వస్తుంది. ఏంటి రత్నసీత అని సౌందర్య అడుగుతుంది. మోనిత బస్తీలో హాస్పిటల్ పెట్టింది అని చెబుతుంది. బస్తీకి షిఫ్ట్ అయిందా?.. అని సౌందర్య షాక్ అవుతుంది. అక్కడ ఇళ్లు కొనుక్కుంది.. మోనిత కార్తీక్ ప్రజా వైద్యశాల అనే బోర్డ్ కూడా పెట్టిందట.. అని చెబుతుంది. అలా చెప్పగానే సీన్ మళ్లీ మోనిత మీద ఓపెన్ అవుతుంది.

    బస్తీ వాసుల ఐకమత్యం.. వర్దిల్లాలి.. మై డియర్ బస్తీవాసులారా.. వైద్య సేవలను వాడుకోండి.. నాలో దీపను చూసుకోండి అని మోనిత రెచ్చిపోతుంది. దీపమ్మతో నీకు పోలిక ఏంటి?.. మేం అస్సలు రాం.. అని బస్తీ ప్రజలు అంటారు. మీరు ఎలా రారో నేను చూస్తాను.. అని మోనిత అంటుంది. ఇక ఇంతలో మోనిత వద్ద కొత్త పని మనిషి, నర్స్, అసిస్టెంట్‌గా నర్సమ్మ వస్తుంది.

    ప్రియమణి సొంతూరు తాడికొండకు వెళ్లింది.. కాదు కాదు నేనే పంపించాను అని మోనిత అసలు విషయం చెబుతుంది. నర్సమ్మ… పేరు బాగుంది.. పేరుకు తగ్గట్టు ఉద్యోగం, ఉద్యోగానికి తగ్గట్టు పేరు.. నా మనసు తెలుసుకుని పని చేసుకో.. శాలరీ అవన్నీ కూడా అరుంధతి చెప్పే ఉంటుంది కదా? అని మోనిత అంటుంది. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే కోటేశ్, శ్రీవల్లి, కార్తీక్‌ల మీద ఓపెన్ అవుతుంది.

    ఊయలలో పాపను ఆడిస్తూ ఉంటారు కోటేశు, శ్రీవల్లి. బయటకు వెళ్లేందుకు చూస్తుంటారు. దీపక్క వచ్చాక వెళ్తామని అంటే.. నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు. నేను ఎత్తుకుంటే ఏడుపు ఆపడం ఏంట్రా విచిత్రంగా అని కార్తీక్ మురిసిపోతాడు.. అలా సీన్ అక్కడితో ఎండ్ అవుతుంది. మళ్లీ మోనిత కథే చూపిస్తారు.

    ఆంటీగారు మామయ్యగారు మీకొక స్వీట్ న్యూస్. వంటలక్క ప్రజా వైద్యశాల పెట్టాను.. కార్తీక్ ఆశీస్సులతో డాక్టర్ మోనిత అని ఉంటుంది.. స్వీట్ న్యూస్ చెబుతూ.. స్వీట్ కూడా చేయించాను.. అని మోనిత వాగుతుంటే..నర్సమ్మ వస్తుంది. వావ్ గులాబ్ జామ్ చేశావా? నాకు చాలా ఇష్టమని తీసుకుంటుంది మోనిత. నాకు నా ఫ్యామిలీయే బలం, బలహీనత.. ముందుగా వాళ్లకు ఇవ్వాలి కదా? ప్రోటో కాల్ పాటించవా? అని నర్సమ్మని అంటుంది మోనిత.

    కానీ ఎవ్వరూ తీసుకోరు.. ఈ వయసులో స్వీట్స్ అంత మంచివి కావు అని సౌందర్య, ఆనంద్ రావులపై మోనిత సెటైర్లు వేస్తుంది. ఇక ఆదిత్య, శ్రావ్యలు కూడా తీసుకోరు. వారికి నేను చెప్పిన గుడ్ న్యూస్‌తోనే కడుపు నిండినట్టుంది.. నేను తింటానులే అని మోనిత అంటుంది. గులాబ్ జామ్ ఎంత బాగుందో.. నా కార్తీక్ ఉంటే బాగుండేది.. తినిపించేదాన్ని అని మోనిత చెలరేగిపోతూ ఉంటుంది..

    లాగి పెట్టి కొడితే.. గులాబ్ జామ్, పళ్లు రెండు రాలిపోతాయి.. అని సౌందర్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నువ్ చాలా ఎక్కువ చేస్తున్నావ్..అని మోనిత అంటే.. నేను ఎక్కువే చేస్తాను.. మీకు తెలుసు. ఒక ప్రేమికురాలు.. ప్రియుడి కోసం ఏదైనా కట్టినట్టుందా? లేదు కదా? నా కార్తీక్ కోసం వంటలక్క ప్రజా వైద్య శాల అని పెట్టాను.. నా మీద కోపంతో కాకుండా మానవతా దృక్ఫథంతో ఆలోచించండి.. బోర్డు మీద వారి పేర్లు పెట్టాను.. పేషెంట్ల ఆశీస్సులు వారికే వెళ్తాయి.. అసలు ఈ విషయం తెలిస్తే.. పూజలు, అభిషేకాలు చేస్తారు.. మీరు నన్ను పట్టించుకోవడం లేదు.. నాకన్న గొప్ప ప్రేమికురాలు ఉంటారా? అని మోనిత ఇష్టమొచ్చినట్టుగా వాగుతూ ఉంటుంది.

    మాట్లాడి అలసిపోయావ్.. రెస్ట్ తీసుకో.. పెళ్లైన వాడిని ప్రేమించడం మొదటి తప్పు.. అన్యోన్యంగా ఉండేవాళ్లను విడిదీశావ్ రెండో తప్పు.. లేని పోని కలతలు సృష్టించి మా ప్రశాంతతను చెడొట్టడం మూడో తప్పు.. ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావ్.. స్త్రీ జాతిలో ఆణిముత్యం అని అనుకుంటున్నావ్ కానీ స్త్రీ జాతి తలదించుకునే పనులే చేశావ్. బస్తీకెళ్లి ప్రజా వైద్య శాల పెడితే.. నీకు జేజేలు కొడతారా? అక్కడా నా పెద్ద కోడలు దీప ఉంది.. దీప అన్నా.. డాక్టర్ బాబు అన్నా దైవంతో సమానం.. జన్మంత తపస్సు చేసినా వారి అభిమానాన్ని పొందలేవు..అని మోనితను వాయించేస్తుంది సౌందర్య.

    వైద్యం అంటే అపురూపమైన సేవ.. నీలా మనసులో కుళ్లు,ద్వేషాలు పెట్టుకుని చేయడం కాదు.. వృత్తికి కూడా అన్యాయం చేయకు మోనిత.. అని సౌందర్య తిట్టేస్తుంది. ఏంటి నర్సమ్మ ఇది..మైండ్ బ్లాక్ అయింది. బుర్ర తిరిగిపోయింది.. గులాబ్ జామ్ ఇవ్వు మళ్లీ తింటాను. అది నావంతు.. ఇది కార్తీక్ వంతు.. అని మోనిత మళ్లీ కుక్క తోక వంకర అన్నట్టుగా చేసింది.

    ఏంటి శ్రీవల్లి ఇంకా నిద్రరావడం లేదా? అని దీప అంటుంది.. బాబు నామకరణానికి పంతులిని పిలుస్తున్నా అని శ్రీవల్లి చెబుతుంది. అయితే వంటలన్నీ నేను చేస్తానులే అని దీప అంటే.. డెకరేషన్ నేను, పిల్లలు చేస్తాం అని కార్తీక్ అంటాడు. మీరెంత మంచోళ్లు అని కోటేష్ అంటే.. మీరే మాకు ఆశ్రయం ఇచ్చారు.. మేమే మీకు రుణపడి ఉన్నాం.. అని దీప అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మోనిత బిడ్డను ఎత్తుకెళ్లింది కోటేశేనని వీడియో ఆధారాన్ని మోనితకు సౌందర్య చూపిస్తుంది. దీంతో కథ ఎలా తిరుగుతుందో చూడాలి.

    Leave a Reply