• December 25, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. కొత్త ఆలోచన చేసిన వంటలక్క.. అమలు చేసిన మోనిత

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. కొత్త ఆలోచన చేసిన వంటలక్క.. అమలు చేసిన మోనిత

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. శనివారం నాటి Karthika Deepam Episode 1232 ధారావాహికలో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. పిల్లల గురించి రుద్రాణి చూపిస్తున్న ప్రేమను చూసి ఆందోళన పడుతుంటాడు. ఇక డబ్బులు సంపాదించడం, ఏదైనా పని చేస్తాను అని కార్తీక్ అంటాడు. దీప సైతం పిండి వంటలు చేసి అమ్ముతానని నిర్ణయించుకుంటుంది. అలా మొత్తానికి నేటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా సాగింది.

    పేరుపోయింది..హోదా పోయింది.. అలిసిపోయాను.. దీప అని డాక్టర్ బాబు ఎమోషనల్ అవుతాడు. నేను ఉన్నాను కదా?.. మిమ్మల్ని ఓడిపోనివ్వను.. అని దీప ధైర్యాన్ని నింపుతుంది. ఆస్తి ఇస్తే నీకు బాధగా లేదా? అని కార్తీక్ అడుగుతాడు. మీరే నా ఆస్తి.. అన్నీ సర్దుకుంటాయ్.. డాక్టర్ బాబు అని పిలిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది..అని దీప అంటుంది.

    పేషెంట్ చనిపోవడం, శాపనార్దాలు, రుద్రాణి అప్పు గుర్తు చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ కార్తీక్ వెళ్తుంటాడు. స్కూల్ నుంచి నడుచుకుంటూ శౌర్య, హిమలు వస్తుంటారు. కడుపులో ఏదోలా ఉందని హిమ అంటుంది.. అన్నింటికి అడ్జస్ట్ అవుదామని అంటుంది శౌర్య. ఇంతలో హిమ వాంతులు చేసుకుంటుంది. ఏం కాదులే అమ్మా అని హిమను కార్తీక్ ఓదార్చుతాడు. ఇద్దరినీ అలా పట్టుకుని తీసుకొని వెళ్తుంటాడు.

    ఏం సారు.. ఏమైంది.. పిల్ల వాంతులు చేసుకుందా.. ఒంట్లో బాగా లేదా.. అని రుద్రాణి అడుగుతుంది. బాగానే ఉంది అని హిమ అంటుంది.. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది..అని రుద్రాణి అంటే.. మీ జాలేం అక్కర్లేదు అని కార్తీక్ బదులిస్తాడు. అభిమానంతో ఇలా మాట్లాడుతున్నావ్.. నెల రోజుల గడువులోంచి రోజులు గడువులు అయిపోతున్నాయ్.. ఎలా కడతావ్.. అని రుద్రాణి అంటుంది.

    నేను ఎలాగైనా కడతాను అది మీకు అనవసరం అని కార్తీక్ అంటాడు. ఆత్మ విశ్వాసం అంటే ఎవరో అడిగారు కదా? ఇదే.. చేతుల్లో డబ్బుల్లేవ్.. అయినా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో కదా?. అని రుద్రాణి అంటుంది. తప్పుకుంటే మేం వెళ్తాం అని కార్తీక్ అంటాడు. హలో సారు పిల్లలు జాగ్రత్త.. అని చెబుతుంది. రుద్రాణి బాండ్ గురించి కార్తీక్ ఆలోచించుకుంటూ వెళ్తాడు.

    ఆ ఆంటీకి మనకు ఏంటి గొడవ..అని హిమ అడుగుతుంది. కోటేష్ బాబాయ్‌ కొంత డబ్బు ఇవ్వాలట.. అని కార్తీక్ అంటాడు. కానీ గడువు అని ఏమో అంటుంది.. అని హిమ మరో ప్రశ్న వేస్తుంది. అవన్నీ మనకు అవసరం లేదు కదా హిమ..అని శౌర్య సర్దిచెబుతుంది. పిల్లలను తలుచుకుంటూ సౌందర్య బాధపడుతుంది. ఏమైంది సౌందర్య.. హిమ, శౌర్యలు గుర్తుకు వచ్చారా?.. అని ఆనంద్ రావు అంటాడు.

    మరిచిపోతే కదా?.. గుర్తు రావడానికి అని సౌందర్య అంటుంది. అందరం కలిసి సంతోషంగా ఉందే లేదు.. దానికి తోడు ఇలా మోనిత..అని ఆనంద్ రావు బాధపడుతుంటాడు. తను రావడానికి కారణం నేను కూడా అని సౌందర్య అంటుంది.. బిడ్డని ఎత్తుకెళ్లామని నింద నిజం చేసే ప్రయత్నం చేస్తుంది.. అని ఆనంద్ రావు అంటే.. రత్న సీతను కలిశాను.. అని సౌందర్య చెబుతుంది.

    ఆమె మోనిత మనిషి కదా? అని ఆనంద్ రావు అంటే..అదొ ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాదు.. మోనిత బిడ్డ నిజంగానే లేడా? ఎక్కడైనా దాచిందా? అనేది తెలుసుకుంటాను.. ఈ విషయంలో రత్న సీతను కలవడం మంచి ప్రయత్నం అని ఆనంద్ రావు అంటాడు.. నా ప్రయత్నం నేను చేస్తున్నాను.. ఆపై ఈశ్వరేచ్చ.. అని దేవుడి మీదే సౌందర్య భారం వేస్తుంది.

    పిల్లాడికి జ్వరం రావడంతో శ్రీవల్లి కంగారు పడుతుంది. భయపడకు శ్రీవల్లి.. కార్తీక్ బాబు చూస్తాడు.. అని దీప ధైర్యం చెబుతుంది. ఇలా డ్రాప్స్ వేసినప్పుడు జ్వరం వస్తుంది. మధ్యమధ్యలో తడిబట్టతో తుడవండి.. ఏం భయపడొద్దు..అని కార్తీక్ చెబుతాడు. రేపు నామకరణం చేసుకోవచ్చా? అని శ్రీవల్లి అడుగుతుంది.. కాసేపట్లో జ్వరం తగ్గిపోద్ది చేసుకోవచ్చు అని కార్తీక్ అంటాడు

    ఇంతకీ ఏ పేరు పెడదామని అనుకుంటున్నారు అంటూ దీప అడుగుతుంది.. ఆనంద్ అని పేరు పెడదామని అనుకుంటున్నాను.. అని చెప్పడంతో దీప, కార్తీక్ షాక్ అవుతాడు. ఆనంద్.. ప్రత్యేకంగా ఆ పేరే ఎందుకు శ్రీవల్లి అని దీప అడుగుతుంది.. బాబును దత్తత తీసుకొచ్చినప్పటి నుంచి ఆనంద్ అనే పేరు పెడదామని అంటున్నాడు కోటేష్.. ఎందుకో తెలీడం లేదు.. అని శ్రీవల్లి చెబుతుంది.

    ఇక అంతా ఒకే చోట కూర్చుని అంటారు. అంత్యాక్షరి ఆడుకుందామా? అని శౌర్య అంటుంది. దీంతో కార్తీక్ నవ్వేస్తాడు. అన్నింటిని వదిలేసి.. అన్ని సౌకర్యాలు కాదని ఇక్కడకు వచ్చాం. రౌడీ అంత్యాక్షరి అంటే నవ్వొచ్చింది.. అని కార్తీక్ అంటాడు. గతి లేక తాగితే గంజి అంటాం.. అన్ని ఉండి తాగితే సూప్ అంటాం.. అని దీప చెప్పుకొచ్చింది.

    మనం అంతా కలిసి ఉంటేనే సంతోషం.. అని శౌర్య అంటుంది. అవును డాడీ అని హిమ కూడా అంటుంది.. నేను ఒక విషయం చెప్పాలి అని దీప అంటే.. నేను ఒక విషయం చెప్పాలి అని కార్తీక్ కూడా అంటాడు.. నేనూ ఒకటి అడగాలని ఉంది అని శౌర్య కూడా అంటుంది.. అంటే ముగ్గురు ఏదో ఒకటి అడగలన్నమాట.. ముందు ఎవరు అని హిమ ప్రశ్నిస్తుంది.

    అమ్మ డాక్టర్ బాబు అనేది కదా? ఇప్పుడు కార్తీక్ బాబు అంటోంది ఏంటి?.. అని శౌర్య అడుగుతుంది. ఏ రౌడీ నువ్ మామూల్దానివి అయ్యావ్.. అని కార్తీక్ అంటాడు. మా ఆయన్ను ఎలా పిలిస్తే నీకేంటి? అని దీప అంటుంది. దానికి సమాధానం నేను చెబుతాను అంటూ కార్తీక్ అసలు విషయాన్ని చెబుతాడు. డాక్టర్ అని తెలియొద్దు అన్నా అందుకే కార్తీక్ బాబు అని పిలుస్తోంది..అంటూ దీప కొత్త పిలుపు గురించి కార్తీక్ చెబుతాడు.

    మరి నువ్వేదో చెబుదామని అన్నావ్ కదా? చెప్పు అని దీపని అడుగుతాడు. పిండి వంటలు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను.. అని దీప చెప్పగానే.. నన్ను అమ్మమనలేదు అదే సంతోషం అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. అయినా ఆ పని చేయడానికి కూడా నాకేం ఇబ్బంది లేదు అని కార్తీక్ అంటాడు. మీరు నాకు ఎప్పటికీ డాక్టర్ బాబే.. అలాంటి పనులు చేయనిస్తానా? అని దీప అంటుంది. నేను ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను.. అని కార్తీక్ చెబితే.. బ్యాడ్ ఐడియా ఏం కాదు అని శౌర్య అంటుంది. అవసరమా కార్తీక్ బాబు.. నేనున్నాను కదా?. అని దీప అంటుంది. ప్రేమతో నన్ను ఏ పని చేయనివ్వకుండా ఆపకు..దీప అని కార్తీక్ అంటాడు

    ఇక ఇంతలో రుద్రాణి వస్తుంది. పిల్లలు బాగున్నారా.. ఏం వండావ్ దీప.. ఏం సారు.. నేనేం గొడవ పడటానికి రాలేదు.. స్వీట్లు, ట్యాబెట్లు, విటమిన్ ట్యాబ్లెట్లు తెచ్చాం.. తీసుకోండ్రా.. పిల్లలు తీసుకోవడం లేదంటే.. నీ పెంపకం చాలా గొప్పగా ఉన్నట్టుంది.. నేను వెళ్లొస్తాను.. మన గొడవలకు పిల్లలకు ఏం సంబంధం చెప్పండి.. వస్తాను సారు.. పిల్లలు జాగ్రత్త.. అని రుద్రాణి వెళ్తుంది.

    ఏంటి నాన్న.. ఈవిడ కొత్తగా మాట్లాడుతోంది.. అని పిల్లలు అడుగుతారు. అవసరం లేని వాళ్ల గురించి ఆలోచించడం కూడా తప్పే..ఆవిడ గురించి మరిచిపోండి.. అని దీప అంటుంది. ఇక ఉదయమే దీప వంట గదిలో కూరగాయలు కోస్తుండగా కార్తీక్ వెళ్తాడు. కాఫీ ఏమైనా కావాలా? రుద్రాణి వచ్చిందని కంగారు పడుతున్నారా? అని దీప అంటుంది. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్‌కు దీప సలహా ఇస్తుంది. ప్రజా వైద్య శాల పెడదాం అని దీప ఆలోచన చెబుతుంది. కానీ బస్తీలో ఏకంగా వంటలక్క పేరు మీద ప్రజా వైద్య శాలను మోనిత పెట్టేస్తుంది.

    Leave a Reply