• December 23, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మంచి పని చేసినా మట్టి అంటుతుంది.. దీప పిలాసఫీ సూపర్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మంచి పని చేసినా మట్టి అంటుతుంది.. దీప పిలాసఫీ సూపర్

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాటి Karthika Deepam Episode 1230 ధారావాహికలో కొన్ని ఫిలాసఫీలు చెబుతుంది. మంచితనం, న్యాయం, ధర్మం అంటే ఏంటో వివరించి చెబుతుంది. పిల్లలకు చెప్పిన సమాధానాలు తన గురించేనని కార్తీక్ తెలిసి ఎమోషనల్ అవుతాడు. మొత్తానికి దీపు గాడిని కాసేపు కనిపించకుండా చేసి శ్రావ్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ మొత్తానికి గజిబిజిగా సాగేసింది.

    బాబు కనిపించకపోతే వెతకాలి అని సౌందర్య అంటుంది. మరి మీరు ఎందుకు ఇలా రెడీ అయి ఇంట్లోనే కూర్చున్నారు అంటూ సౌందర్యపై మోనిత సెటైర్లు వేస్తుంది. నా కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. వాడు మనసు మార్చుకుంటే తప్పా రాడు.. వెతికినా దొరకడు.. కానీ నీ బిడ్డను నువ్ దాచేశావో..ఎవరైనా ఎత్తుకెళ్లారో వెళ్లి వెతుక్కో.. లేదంటే రాత్రి పడుకున్నప్పుడు వేడి వేడి అట్లకాడతో ఆటోగ్రాఫ్ పెడతాను.. అని సౌందర్య అనడంతో మోనిత మూసుకుని వెళ్తుంది.

    దీప గురించి తెలిస్తే ఏమైనా చెప్పరా వారణాసి.. అని సౌందర్య బాధపడుతూ ఉంటుంది. దీప ఎక్కడున్నావే..బాగున్నావని తెలిస్తే చాలే అంటూ లోలోపల మథన పడుతూ ఉంటుంది. ఇక కార్తీక్‌తో కలిసి పిల్లలు మొక్కలు నాటుతూ.. ఇప్పుడు ఇవి అవసరమా? ఇవి ఎప్పుడు కాయాలి.. మనం ఎప్పుడు తినాలి అని పిల్లు అంటారు. అలా అనొద్దు.. ఎప్పుడో ఎవరో నాటినవి ఇప్పుడు మనకు వస్తున్నాయ్.. మొక్కల్లా మనుషులు స్వార్థం లేకుండా ఉండాలి.. ఇవ్వడమే తప్పా తీసుకోవడం తెలియదు.. నేను పెట్టిన చెట్లు అని మీరు పెద్దయ్యాక చెప్పుకోవడానికి ఎంత బాగుంటుందో..అని కార్తీక్ పిల్లలకు మంచి మాటలు చెబుతుంటాడు. తమ్ముడు ఈ చెట్లపైనే ఆడుకుంటాడు.. అని శౌర్య, హిమలు సంబరపడతారు.

    మొక్కలు నాటుతున్నారా?. నేను కూడా నాటుతాను.. అని దీప కూడా రంగంలోకి దిగుతుంది. అయితే దీప ఒంటి మీద బంగారం లేదని గమనించిన శ్రీవల్లి..నీ ఒంటి మీది బంగారమేది అక్క.. అర్థమైందిలే అక్క అని శ్రీవల్లి అంటుంది.. బాబు నిద్రలేచాడు అని శ్రీవల్లి లోపలకు వెళ్తుంది.. తమ్ముడు నిద్రలేచాడు.. ముందు నేను ఎత్తుకుంటాను అంటూ హిమ, శౌర్యలు పరిగెత్తుతారు..

    బంగారం అమ్మేశావా?.. అని కార్తీక్ ఫీల్ అవుతాడు. తప్పని పరిస్థితిలో తాకట్టు పెట్టేశాను.. అని దీప అంటుంది. ఏం చేస్తున్నాను నేను అంటూ కార్తీక్ బాధపడుతూ ఉంటే.. అవసరానికి పనికొచ్చాయ్ అని ఆనంద పడాలి అంటూ దీప చెబుతుంది.. అమ్మ జ్ఞాపకాలు కదా? అని కార్తీక్ అంటే.. ఇలా పనికొచ్చాయ్ కదా?.. వాటిని మనం అమ్మలేదు.. తాకట్టు పెట్టాం కదా?. తెచ్చుకోవచ్చు. అని దీప అంటుంది.

    పని చేయొద్దు అంటావ్.. నువ్వేమో ఇలా చేస్తావ్.. నేను ఇంట్లోనే ఉంటూ పనికి మాలిన వాడిలా మారుతున్నాను అని కార్తీక్ బాధపడతాడు.. అలా అని ఎవరన్నారు.. నా మనస్సాక్షి, అంతరాత్మ అనేవి ఉంటాయ్ కదా?. అని డాక్టర్ బాబు ఫీలవుతాడు. ఒక్కోసారి మంచి పనులు చేసినా కూడా చేతులు మురికి అవుతాయ్.. మట్టి అంటుతుంది.. దీంట్లో మీ తప్పేం లేదు కదా?. అని మట్టి అంటిన చేతుల్నీ దీప కడుగుతూ ఉంటుంది. నేను చేసిన తప్పుల్నీ నువ్ సరిదిద్దుతున్నావ్ దీప.. అని కార్తీక్ ఫీలవుతాడు.

    నేను తల్లిని కానా, నాలో కోపం పెరగాలి కాదా?.. కార్తీక్ మీదున్న నా ప్రేమే ఆనంద్ రావుని నా దగ్గరకు తీసుకొస్తుంది.. నా బాధ వీళ్లకు తెలియడం లేదా? ఆనంద్ రావు గారు ఎక్కడున్నారు.. అమ్మను వదిలేసి వెళ్లారు.. అమ్మ మీ కోసం బాధపడుతోంది.. నా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో వీళ్లకు తెలిసేలా చేస్తాను అంటూ మోనిత తన బిడ్డ కోసం ఆరాటపడుతూ ఉంటుంది.

    దీప బంగారాన్ని తాకట్టు పెట్టుకున్న సేట్.. రుద్రాణి వద్దకు తీసుకొచ్చిస్తాడు. లెక్క రాశావారా?. ఊరి ప్రజలు ఏమని అనుకుంటున్నారు.. అని రుద్రాణి తన మనుషుల్ని అడుగుతుంది . సూపర్ అక్కా అని సమాధానం ఇస్తారు. మీరు వద్దంటే ఇవ్వలేదు.. మీరు ఇవ్వమంటే ఇచ్చాను.. అని సేట్ అంటాడు. ఆమె వచ్చి బంగారం అడిగితే నాకు అమ్మాను అని చెప్పండి.. అని రుద్రాణి చెబుతుంది.

    బంగారం ఇచ్చావ్.. డబ్బులు అడగవా? సేట్ అని రుద్రాణి అంటుంది. మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా?.. అని సేట్ వెళ్లిపోతాడు. అరేయ్ పిల్లిగడ్డం మనం అంటే ఈ ఊర్లో భయం ఉందిరా.. భూమి గుండ్రంగా ఉంది.. వీటి కోసం నువ్ నా దగ్గరకు రావాల్సిందే దీప అంటూ రుద్రాణి అనుకుంటుంది.

    రుద్రాణి సమస్యకు పరిష్కారం ఆలోచించాల్సిందేనని పడుకోకుండా దీప ఆలోచిస్తూ ఉంటుంది. డాడీ నిద్ర పట్టడం లేదు.. ఏదైనా కథ చెప్పవా?. అవునమ్మ.. ఏదో ఒక కథ చెప్పు.. పొడుపు కథలు బాగా వచ్చు కదా? చెప్పు అని పిల్లలు మారాం చేస్తారు.. మన జీవితానికి మించిన అద్భుతమైన కథలు ఏమున్నాయ్..అని దీప అంటే.. తమ్ముడు ఏడుస్తున్నాడు.. అంటూ బాబు గురించి శౌర్యచెబుతుంది.

    నాన్న ఎత్తుకుంటే ఏడుపు ఆపేస్తున్నాడు.. ఇంక ఎవ్వరూ ఎత్తుకున్న ఏడుపు ఆపడం లేదు.. అని శౌర్య అంటుంది. బాగా నచ్చినట్టున్నాడు.. అని దీప అంటే.. మంచి వాళ్లు పిల్లలకు బాగా నచ్చుతారని కోటేష్ బాబాయ్ అన్నాడు.. అని శౌర్య చెబుతుంది. మంచి వాళ్లంటే అందరికీ ఇష్టమే.. అని దీప అంటుంది. అసలు మంచితనం అంటే ఏంటి.. అని శౌర్య అడుగుతుంది.

    ఒకరు అవసరంలో ఉంటే.. నీకు ఎంత అవసరం ఉన్నా మొత్తం ఇచ్చేయడం..అని దీప చెబుతుంది. దీంతో ఆస్తి మొత్తానికి రాసివ్వడం గురించి కార్తీక్ తలుచుకుంటాడు.. అలా మొత్తం ఇచ్చేస్తే తరువాత మనం ఇబ్బంది పడతాం కదా? అని శౌర్య ప్రశ్నిస్తుంది. అదే కదా మంచితనం అంటే.. అడిగింది ఇస్తే దానం.. ఉన్నదంతా ఇచ్చేస్తే న్యాయం అవుతుందిరా.. అని దీప చెబుతుంది.

    అత్తయ్య దీపుగాడు కనిపించడం లేదు అత్తయ్య.. అని శ్రావ్య ఏడుస్తూ వస్తుంది. ఇళ్లంతా వెతికావా?.. అని సౌందర్య అంటుంది. అంతా వెతికాను.. ఎవరైనా ఎత్తుకెళ్లారా? అని సౌందర్యను శ్రావ్య అడుగుతుంది. పైన పడుకోబెట్టాను.. కనిపించడం లేదు అని శ్రావ్య చెబుతుంంది. అంతా వెతుకు.. అని సౌందర్య అనే లోపు మోనిత వస్తుంది. దీపు గాడిని తనే దాచి ఉంటుంది.. అని శ్రావ్య అనుమాన పడుతుంది.

    ఏయ్ దీపు గాడిని ఎక్కడ దాచావ్ చెప్పు అని సౌందర్య పీక పట్టుకుంటుంది.. ఎక్కడ దాచావో చెప్పు.. ఇదంతా నీ పనే అని నాకు తెలుసు.. ఎక్కడ దాచావో చెప్పు.. అని సౌందర్య అంటుంది. నా కొడుకు కనిపించక, కార్తీక్ పోయి నేను బాధపడుతుంటే.. మీరేంటి అని మోనిత అంటుంది. నీ కాళ్లు పట్టుకుంటాను.. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు.. వాడు లేకపోతే నేను బతకలేను..అంటూ శ్రావ్య విలవిల్లాడుతుంది.

    దీన్ని కాళ్లు పట్టుకుంటావేంటి అని సౌందర్య అంటుంది. నీకేం కావాలన్నా ఇస్తాను.. నా కొడుకుని నాకు ఇవ్వు.. అని శ్రావ్య బాధపడుతూ ఉంటే.. కాలు మీద కాలేసుకుని కూర్చుని.. అరెరె. శ్రావ్యను చూస్తే జాలేస్తుంది.. నా కంట్లో కన్నీళ్లు వస్తున్నాయ్.. కొడుకుని దూరం చేసుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందని. చిన్న శాంపిల్ ఇచ్చాను.. వెళ్లు శ్రావ్య.. దీపు నా గాడిని నా రూంలో బెడ్డు కింద దాచాను.. తెచ్చుకో అని అంటుంది అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్‌ ఎమోషనల్ అవుతాడు. స్కూల్‌కు వెళ్తున్న పిల్లలకు పది రూపాలు ఇస్తాడు. వద్దు నాన్న నీ దగ్గర కూడా లేవు కదా? అని హిమ అంటుంది. మీరు కూడా నా మీద జాలి చూపించకండిరా అని ఎమోషనల్ అవుతాడు. దీంతో కార్తీక్ ఏదో ఒక పని చూసుకునే వాడిలా ఉన్నాడు.

    Leave a Reply