- December 17, 2021
Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. బరితెగించిన మోనిత.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆదిత్య

Karthika Deepam కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు Karthika Deepam Episode 1225 ధారావాహికలో మోనిత బరితెగించింది. సౌందర్య కుటుంబానికి షాకుల మీద షాకులు ఇచ్చింది. మోనిత దెబ్బకు ఆదిత్య సైతం నోర్మూసుకున్నాడు. మరో వైపు పిల్లల కోరికలు తీర్చలేని స్థితిలో కార్తీక్, దీప పడతారు. ఇక కోటేష్, శ్రీవల్లిలు బాబు గురించి నిజం చెబుతారో లేదో తెలియాలి. అలా మొత్తానికి నేటి ఎపిసోడ్ బాగానే సాగింది.
స్కూల్‌కు వెళ్తున్నామని కానీ.. వెళ్లినట్టు అనిపించడం లేదు. బుక్స్, యూనిఫాం లేవు అని శౌర్య అంటుంది. అందుకే మీరు సోమవారం నుంచి వెళ్లేరులే అని కార్తీక్ అంటాడు.. పండక్కి నానమ్మ ఇంటికి వెళ్దామా? అని హిమ అడిగితే.. కార్తీక్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉంటాడు. తండ్రిని ప్రశ్నలతో వేధించకండి అని దీప చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న శౌర్య టాపిక్ డైవర్ట్ చేస్తుంది.
ఎక్కడికి వద్దు.. ఇక్కడే సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుందామని అంటుంది. ఇలానే స్కూల్‌కు వెళ్లి చూసొద్దామని హిమ అంటే.. ఇలా వెళ్తే అందరూ మనల్ని విచిత్రంగా చూస్తారు వద్దు అని శౌర్య అంటుంది.. ఇంతలో దీప రాకను గమనించిన శౌర్య.. అదిగో అమ్మ వస్తుంది.. అని అంటుంది. దీంతో హిమ, శౌర్యలు దీప దగ్గరకు వెళ్తారు. నాన్న స్కూల్‌కి వద్దన్నారు.. అని చెబుతారు.
బుక్స్ లేవు కదా? అని వద్దన్నాను అని కార్తీక్ అంటే.. ఈ రోజు మంచి రోజు కాదంట వద్దులే.. తరువాత వెళ్దువే లే అని దీప కూడా అంటుంది.. మళ్లీ కొన్ని రోజులకే సంక్రాంతి హాలీడేలే వస్తాయ్.. అయినా ఇప్పుడు స్కూల్‌కు వద్దులే అని అంటుంది శౌర్య. సంక్రాంతిని ఇక్కడే బాగా చేస్తారట కదా అని హిమ అంటే.. పండుగలు, సంప్రదాయాలు పల్లెల్లోనే భద్రంగా ఉంటాయ్..అని దీప అంటుంది.
అయితే మనం ఇక్కడే బాగా సెలెబ్రేట్ చేసుకుందాం.. పట్టు పరికిణీలు కుట్టించు అని హిమ అంటుంది.. నువ్ డాడీ కొత్త బట్టలు కొనుక్కోండి అని చెబుతుంది. ఏంటి ప్లానింగ్ ఇప్పటి నుంచే వేస్తున్నారా? అని దీప అడుగుతుంది. అలా ప్లానింగ్ ఏమీ లేదు.. అని శౌర్య అంటే.. ఇంతకీ కుట్టిస్తున్నావా? లేదా?.. అని హిమ మరోసారి అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక కార్తీక్, దీప ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. తరువాత చూద్దాంలే.. మీరు బయటకెళ్లి ఆడుకోండి..అని దీప సర్ది చెబుతుంది.
ఏమైంది దీప.. అని కార్తీక్ అడుగుతాడు. రుద్రాణి మన మీద పగబట్టింది.. అని దీప అంటే.. ఏమంటోంది.. ఎదురుపడిందా? బెదిరించిందా? అని కార్తీక్ అంటే.. నన్ను స్కూల్ కాంపౌండ్‌లోకి కూడా వెళ్లనివ్వలేదు.. పని ఇవ్వొద్దని చెప్పిందట..అని జరిగిన విషయాన్ని దీప చెప్పేసింది. నువ్వేం భయపడకు దీప.. అంతకన్నా ఏం చేయగలదులే.. ఇలాంటి పనులు వాళ్ల వ్యక్తిత్వాన్ని చూపుతాయ్.. అని కార్తీక్ అంటాడు
మనం ఎదురించామని కోపం.. బాకీ డబ్బులు ఇస్తామని అన్నాం కదా? పైగా ఆమెను కొట్టాను కదా అని దీప అంటే.. నువ్వే కాదు నేను కూడా కొట్టాను.. అని జరిగిన విషయాన్ని కార్తీక్ చెబుతాడు. ఏంటి కార్తీక్ బాబు.. ఎందుకు అలా చేశారు అని అడుగుతుంది.. ప్రదేశం మారినంత మాత్రాన.. న్యాయం, ధర్మం మారదు కదా?. అని కార్తీక్ అంటాడు. నేను చేయి చేసుకున్నాను.. వాళ్లమే మొరటు మనుషులు.. ఈయనేమో సుకుమారమైన మనిషి.. అని దీప తనలో తాను అనుకుంటుంది.
ప్రియమణి.. ఓ గుడ్ న్యూస్ చెప్పాలి నీకు.. అని మోనిత ఓవర్ యాక్షన్ చేస్తుంది. చేతిలో ఏంటమ్మ అది.. అని ప్రియమణి.. నీకు ఎప్పుడూ తొందరే.. అంటూ ప్రియమణి నానా హంగామా చేస్తుంటారు. మామయ్య, ఆంటీ, ఆదిత్య, శ్రావ్య ఏంటిదో చెప్పుకోండి..చెప్పిన వారికి సెల్యూట్ చెబుతుంది మోనిత.. అభిమానుల కోరిక మేరకు ఇదేంటో చూపిస్తుంది.. అని అందరికీ షాక్ ఇస్తుంది మోనిత.
గుళ్లో పూజ చేయించిన ఫోటోలను ఫ్రేమ్‌గా చేసింది. ఫోటో అదిరింది కదా.. దేవుడి సన్నిధిలో నేనూ, నా పతిదేవుడు.. అరే క్యాప్షన్ బాగుంది కదా.. ఫోటో కింద రాస్తే బాగుండేది.. అప్పుడు గుర్తుకు రాలేదు.. జంట బాగుంది కదా.. దీవించండి.. అలా కోపంగా ఎందుకు చూస్తారు.. అని మోనిత రెచ్చిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మి ఇదేంటి.. మన ఇంట్లోకివచ్చి ఈ పిచ్చి వేషాలు ఏంటి.. అని ఆదిత్య ఫైర్ అవుతాడు.
ఆదిత్య కోపం తగ్గించుకో.. ఈ ఫోటోను ఇక్కడ పెడతాను.. దిష్టి తియ్.. నేను నా కార్తీక్ చారిత్రకమైన ఫోటో.. అని మోనిత హద్దులు దాటుతుంది. ఆ ఫోటోను పీకి అవతల పారేద్దామని అనుకుంటాడు ఆదిత్య. కానీ మోనిత మాత్రం మరింత బరితెగిస్తుంది. హలో ఆగమ్మ.. నువ్ ఆ ఫోటో తీసేస్తే.. నేను ఇంటి ముందు పది ఫ్లెక్సీలు తీసి పెట్టిస్తాను.. వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెద్ద కటౌట్స్ పెట్టిస్తాను.. ఇప్పుడు మనం ఆరుగురమే చూస్తున్నాం.. అప్పుడు వీధి అంతా కూడా చూస్తుంది..
ఇంట్లో ఫోటోను ఉంచమంటావా? వీధిలో ఫోటో పెట్టమంటావా? అని మోనిత బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఎక్కువ చేస్తున్నావేంటి.. బెదిరిస్తున్నావా?. అని సౌందర్య నిలదీస్తుంది. నాకు కూడా కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయ్.. దోష నివారణ పూజ అన్నారు.. కానీ దోషం పోలేదు కదా?.. కార్తీక్ కనిపించడం లేదు.. నా బిడ్డను ఎత్తుకెళ్లారు.. ఎక్కువ చేస్తున్నాను అని అన్నారు కదా?. నేను ఎక్కువే చేస్తున్నాను. కార్తీక్ వద్దన్నా.. జైలుకి పంపించినా.. నేను కార్తీక్ కావాలనే అంటున్నాను.. ఆ దీపక్కలా వదిలేసి వెళ్లడం లేదు.. ప్రేమ ఉన్న వాళ్లు దగ్గరవుదానమి చూస్తారు.. ప్రేమ లేని వాళ్లు దూరమవుదామని చూస్తారు..
అరిచిఅరిచి నోరు పోతోంది.. అల్లం టీ తీసుకురా ప్రియమణి అని మోనిత అంటుంది. ఆంటీ అల్లం టీ తాగుతారా?. అని మోనిత అడుగుతుంది. ఇంటి సభ్యులకు ఓ ముఖ్య గమనిక.. ఫోటో తీస్తే.. వీధిలో పెట్టే ఫ్లెక్సీల సంఖ్య మరింత పెరుగుతుంది.. అని హెచ్చరిస్తుంది. అలా సీన్ అక్కడ ఎండ్ అవుతుంది. ఇక శ్రీవల్లి, కోటేశ్‌లు ఇంటికి వస్తారు. కానీ అక్కడ వారి సామాన్లు ఏవీ కనిపించవు.
వల్లి మన సామాన్లు కనిపించడం లేదేంటి.. అని కోటేశ్ అడుగుతాడు. నాకు ఎలా తెలుస్తుందండి.. దొంగలు ఎత్తుకెళ్లారా? ఏంటి.. రుద్రాణి వల్ల మళ్లీ మనం రోడ్డున పడ్డాం.. అని శ్రీవల్లి బాధపడుతుంది. పోతే పోనీలే.. మనకు బిడ్డ వచ్చాడు అని కోటేష్ అంటే.. ఎలా బతుకుతాం.. అని శ్రీవల్లి అంటుంది. మీ సామాన్లు మా దగ్గరే భద్రంగా ఉన్నాయ్ అని కార్తీక్ అసలు విషయం చెబుతాడు.. మీరు ఎవరో ఏంటో గానీ రుద్రాణి గురించి మీకు తెలీదు.. అని కోటేష్ భయపడతాడు. మీ ఇంట్లోకి మీరు రావడానికి భయపడుతున్నారు.. పర్లేదు రండి.. అని లోపలకి తీసుకెళ్తాడు కార్తీక్.
హారతిచ్చి మరీ లోపలకి తీసుకొస్తుంది దీప.. లోపలకి వచ్చి కూర్చో.. మీ ఇంట్లో మీకు మర్యాద ఇస్తున్నాను. ఈ ఇళ్లు మీది అని తెలియక అద్దె ఆవిడకి ఇస్తాను అని అన్నాను క్షమించండి అని దీప అంటుంది. మీకు తెలియక అలా చేశారు అని శ్రీవల్లి అంటుంది. మొత్తానికి డెలివరీ జరిగింది.. సంతోషం అని కార్తీక్ లోలోపల అనుకుంటాడు..
అక్కా అని పిలిచావ్.. చాలా సంతోషంగా ఉంది.. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాం.. మా ఇళ్లు దొరికాక వెళ్తామని దీప అంటే.. మా దగ్గరే ఇక్కడే ఉండండి.. అందరం కలిసే ఉందాం.. అని శ్రీవల్లి అంటుంది. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఇళ్లు.. మీరు మాకు సాయం చేశారు.. మా సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టారు.. మీ మంచితనం ఏంటో తెలుస్తోంది. కానీ ఆ రుద్రాణి.. అని కోటేశ్ అంటుంటే.. ఆ రుద్రాణి విషయం నేను చూసుకుంటాను అని దీప అంటుంది.. ఈ తతంగాన్ని అంతా కూడా అబ్బులు చూసేశాడు..
ఫోటో తీసేస్తే ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టిస్తాను అని మోనిత అన్న మాటలను సౌందర్య తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.. పెద్దోడా ఎంత పని చేశావ్ రా.. తలెత్తుకోలేకుండా చేశావ్.. ఒక్కతప్పుకే మన ఫ్యామిలీ మొత్తం మూల్యం చెల్లించుకుంటోంది అని సౌందర్య అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య వస్తాడు. బాధపడుతున్న సౌందర్యను ఇంకా బాధపెడతాడు.
ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. ఫోటోలు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెడతాని అంటోంది.. చంపేయాలని అనిపిస్తోంది.. కానీ సంస్కారం అడ్డు వస్తోంది..దీనంతటికి కారణం నువ్వే మమ్మీ.. అని ఆదిత్య అంటే.. నేనేం చేశానురా అని సౌందర్య బాధపడుతుంది.. పూజ చేయించింది నువ్వే కదా.. నువ్ చేసిన పనికే కాన్ఫిడెన్స్ పెరిగింది.. ఇక్కడే ఉండనిద్దామా.. నువ్ చేసిన తప్పుకే ఇంటికి వచ్చింది.. అన్నయ్య పక్కన భార్యలా ఉంటుంది.. మనం మళ్లీ ఇలా సైలెంట్‌గానే ఉంటాం.. మొదట్లోనే కరెక్ట్‌గా బుద్ది చెబితే ఇంతదాక వచ్చేది కాదు.. బయట అన్నయ్య గురించి అడిగితే..వాళ్లు మోనిత గురించి అడుగుతున్నారు.. నాకేం అర్థం కావడం లేదు మమ్మీ.. అని ఆదిత్య చిరాకుగా వెళ్లిపోతాడు.
శ్రీవల్లికి దీప జాగ్రత్తలు చెబుతుంది. పిల్లలకు సంబంధించినవి శుభ్రంగా ఉంచుకోవాలి.. ఏది బాబును ఒకసారి ఇవ్వండి.. అని దీప ఎత్తుకుంటుంది. రోజుల బిడ్డల్లా లేడే.. వీడి వయసు ఎక్కువగా ఉన్నట్టుంది.. అని డాక్టర్ బాబు పసిగడతాడు. అలా ఎపిసోడ్ మొత్తానికి ముగుస్తుంది. కోటేశు ఇది మీ బిడ్డేనా.. నిజం చెప్పండి.. అని దీప రేపటి ఎపిసోడ్లో అడుగుతుంది. మరి నిజం చెబుతారో లేదో చూడాలి.