• December 13, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. చితక్కొట్టేసిన కార్తీక్.. రుద్రాణితో వంటలక్కకు కష్టాలు

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. చితక్కొట్టేసిన కార్తీక్.. రుద్రాణితో వంటలక్కకు కష్టాలు

    కార్తీక దీపం ఈ రోజు (సోమవారం డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్) సీరియల్ అంటే Karthika Deepam Episode 1221 నాటి ధారావాహికలో శ్రీవల్లి విషయంలో కార్తీక్ చేసిన తప్పును దీప ఎత్తి చూపుతుంది. ఇక కార్తీక్ ఫోన్‌కి పదే పదే ట్రై చేస్తున్న మోనితకు అసలు విషయం మహేష్ అనే అడుక్కునే వ్యక్తి వల్ల తెలిసింది. శ్రీవల్లి ఇంటి సామాన్ల విషయంలో రుద్రాణి మనుషులతో కార్తీక్ వైరం పెట్టేసుకున్నాడు. అలా మొత్తానికి సోమవారం నాటి ఎపిసోడ్ మంచి ఎమోషనల్ రైడ్‌గా సాగింది.

    ‘ఏంటండి మీరు.. ప్రాణం పోతోంటే అలా చూస్తూ ఉండిపోయారు’ అని శ్రీ వల్లి విషయంలో కార్తీక్‌ను నిలదీస్తుంది దీప.. ఏం చేయాలి? అని నిస్సహాయంగా కార్తీక్ బదులిస్తాడు. మీరు డాక్టర్ అనే విషయాన్ని మరిచిపోయారా? అని దీప ప్రశ్నిస్తుంది. నేను ఇప్పుడు డాక్టర్‌ని కాదు.. పట్టాని రద్దు చేశారు.. డాక్టర్‌గా కొనసాగకుండా సస్పెండ్ చేశారు అని కార్తీక్ అంటాడు..

    డాక్టర్ బాబు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి? అని దీప అంటుంది.. నువ్ అ పిలవకు దీప.. అలా పిలిచినప్పుడల్లా ఆ పాపమే గుర్తుకొస్తోంది.. మళ్లీ మళ్లీ డాక్టర్ బాబు అని అనొద్దు.. అదే గుర్తుకు వస్తోంది..అని కార్తీక్ బాధపడతాడు. డాక్టర్ వృత్తిని మాత్రమే వదిలేశారు.. మానవత్వానికి కూడా దూరమయ్యారా?.. ఆవిడకి ఇది వరకే కాన్పులు పోయాయ్.. నొప్పులతో బాధపడుతోంంది.. మీరు మాత్రం అలా ఎలా ఉండిపోయారు.. అని దీప ఎమోషనల్ అవుతుంది.

    ఆ పేషెంట్ చనిపోయినప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను.. నువ్ మానవత్వం గురించి మాట్లాడుతున్నావా? అని కార్తీక్ అంటాడు. కళ్ల ముందు రెండు ప్రాణాలు పోతోంటే.. జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నారా?.. మీరు తలుచుకుంటే ఇక్కడే ఆపరేషన్ చేయగలరు కదా?.. దారి మధ్యలో ఏమైనా జరిగితే అని దీప అంటుంటే.. ఆపు దీప అని కార్తీక్ వారిస్తాడు.

    నన్ను ఆపగలరు కానీ.. ఆ పాపం మనల్ని వెంటాడదా?.. వైద్య వృత్తికి దూరమయ్యారు.. సాటి మనిషిగా సాయం చేయలేరా?.. మనం ఉంటున్న ఈ ఇళ్లు ఎవరిదని అనుకుంటున్నారు.. అని దీప ప్రశ్నిస్తుంది. ఎవరో ఆ రుద్రాణిది అట కదా? అని కార్తీక్ అంటే.. కాదు ఆ శ్రీవల్లి వాళ్లది.. అప్పు కట్టలేదని గెంటేసిందట అని దీప అంటుంది… ఆమె మనకు పరోక్షంగా సాయం చేసింది.. భూమిలోంచే ఆ కొబ్బరినీళ్లు వస్తాయ్ కానీ.. వాటి రుచిని భూమి చూడదు కదా?. సాయం కూడా అలాంటిదే అని దీప చెబుతుంది. ఇక కార్తీక్ ఆ మాటలతో ఆలోచనల్లో పడతాడు.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. కార్తీక్ కోసం మోనిత ఫోన్‌ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. చివరకు మహేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే.. కార్తీక్ ఎక్కడున్నావ్.. ఎటు వెళ్లిపోయావ్? అంటూ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంది. ఎవడా కార్తీక్ అని మహేష్ అంటాడు. ఎవడ్రా నువ్ నా కార్తీక్ ఆడు ఈడు అని అంటున్నావ్ అని మోనిత ఫైర్ అవుతుంది. అంటే గింటే నేను అనాలని కానీ నువ్ ఎవడివిరా అని మోనిత అరిచేస్తుంటుంది.

    వాడు వీడని అంటున్నావ్.. మర్యాదగా మాట్లాడు అని మహేష్ బెదిరిస్తాడు. మర్యాదగా అడిగితే చెబుతాను అని అంటాడు. అరేయ్ బాబు నీకు దండం పెడతాను.. వాళ్లను ఎక్కడ చూశావ్.. చెప్పరా అని అంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే డబ్బుతో కొనేయోచ్చు అని అనడంతో డబ్బులిస్తే చెబుతావా? అని మోనిత అడుగుతుంది. అకౌంటర్ డీటేల్స్ చెప్పు అని అనడంతో వెంటనే 25 వేలు పంపుతుంది.

    ఏ ఐదు వందలో వెయ్యో పంపుతుందని అనుకుంటే అంత మొత్తం చూసే సరికి మహేష్ ఆశ్చర్యపోతాడు. దీంతో జరిగిదంతా చెబుతాడు. బస్సెక్కి వెళ్లారంటే.. ఎక్కడికి వెళ్లి ఉంటారు.. నాకే తెలిసిందంటే.. ఆంటీ వాళ్లకు తెలిసి ఉండదా?.. తెలిసి కూడా దాస్తున్నారా?.. ఆంటీ మీరు గేమ్ ఆడితే.. నేను డబుల్ గేమ్ ఆడతాను.. చూస్కోండి.. నేను ఏం చేయగలనో.. అంటూ మోనిత చెబుతుంది.

    ఇక శ్రీవల్లి ఇంటి సామాన్లను కార్తీక్ సర్దుతుంటాడు. అలా కార్తీక్ వాటిని టచ్ చేయడంతో రుద్రాణి మనుషులు వస్తారు. ఊరికి కొత్త అనుకుంటా? ఇది రుద్రాణి అక్క ఆర్డర్ అని అబ్బులు అనే వాడు కాస్త ఎక్స్ ట్రా చేస్తాడు. మీ రుద్రాణి అక్క తప్పు చేసింది నేను కరెక్ట్ చేస్తున్నాను అని కార్తీక్ అంటాడు. తప్పు అని చెప్పడానికి నువ్ ఎవడ్రా.. రుద్రాణక్క మనుషులం.. అబ్బులు ఇక్కడ.. వీడు మరీ నాజుగ్గా ఉన్నాడ్రా.. అంటూ కార్తీక్ మీద చేయి వేస్తారు. ఇక కార్తీక్ ఆ మూకలను చితకొట్టేస్తాడు. అబ్బుల్నే కొడతావా?.. నువ్ అయిపోయావ్ రా అంటూ అక్కడి నుంచి వెళ్తారు.

    మళ్లీ సీన్ మోనిత మొదకు వెళ్తుంది. ఒక భార్య, భర్త, ఇద్దరమ్మాయిలు వాళ్లే కదా? అంటూ మహేష్ చెప్పిన విషయాలను తలుచుకుంటోంది. నేను ఫోన్ చేస్తానని, నాతో మాట్లాడటం తప్పదని, నా నుంచి తప్పించుకోవాలని సెల్ ఫోన్ వదిలేశావ్.. కానీ నేను మాత్రం వదలను కదా? మోనిత నుంచి.. ప్రేమ నుంచి తప్పించుకోలేవ్.. మొబైల్ సిగ్నల్ లేని దగ్గర కూడా మోనిత లవ్ సిగ్నల్స్ చేరుకుంటాయ్.. అని మోనిత అనుకుంటూ ఉంటుంది.

    ‘భగవంతుడా ఇంకెన్నాళ్లు పరీక్షలు పెడతావ్.. పదకొండేళ్లు దూరమయ్యారు.. కష్టాలు పడ్డారు.. అంతా సంతోషంగా ఉందనుకుంటే.. మోనిత రూపంలో తుపాను మొదలైంది.. ఎన్నని భరిస్తాం.. ఇన్ని జరిగినా కూడా నా పెద్ద కోడలు భరించింది. చివరకు గెలిచిందని అనుకుంటే.. ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి.. ఉన్నపలంగా చెప్పకుండా అందరూ వెళ్లిపోయారు.. ఎక్కడున్నారో.. ఏం తింటున్నారో తెలియడం లేదు.. నీకే తెలియాలి ఈశ్వరా?.. చిన్న పిల్లలు కష్టం తెలియకుండా పెరిగారు.. వాళ్లను నువ్వే చూసుకోవాలి.. మనసు మారి త్వరగా ఇంటికి వచ్చేలా చూడు.. అందరూ ఉన్నా ఎవ్వరి లేనివారిలా అయిపోయారు.. కనీసం వారి ఆచూకి తెలిసేలా అయినా చేయ్ స్వామి’ అంటూ సౌందర్య దేవుడి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

    దేవుడిని ఏం కోరుకున్నావ్ సౌందర్య అని ఆనంద్ రావు అడుగుతాడు. దేవుడికి అన్నీ తెలుసు.. కానీ అడక్కపోతే కోపం వస్తుందని అడిగాను.. అని సౌందర్య సమాధానం చెబుతుంది. నవ్వించేది ఏడిపించేది అన్నీ ఆ దేవుడే.. మనం ఏం చేయలేక చూస్తుండిపోవాలంతే.. ఏడవకు సౌందర్య.. వచ్చేస్తారులే.. నువ్ ఏడుస్తుంటే.. నేనేం కావాలి చెప్పు.. అని ఆనంద్ రావు బాధపడుతుంటాడు.

    శ్రీవల్లి విషయాన్నీ, దీప అన్న మాటలను తలుచుకుంటూ కార్తీక్ బాధపడతాడు.. ఎంతో మందికి ఆపరేషన్ చేశాను.. ఎంతో మందిని బతికించాను.. కానీ ఇప్పుడివి డాక్టర్ కార్తీక్ చేతులు కావు.. అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలొ అమ్మ ఇంకా రాలేదేంటి నాన్న అని పిల్లలు అడుగుతారు.. వస్తుంది లేరా.. ఇలా రండి.. మీకో విషయం చెప్పాలమ్మ.. అని కార్తీక్ అంటే ఏంటి నాన్న అని శౌర్య.. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతోన్నామా? అని హిమ అడుగుతారు.. ఇక్కడెవరికి నేను డాక్టర్ అని చెప్పకూడదు అని అంటాడు. దాంతో పిల్లలు షాక్ అవుతారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మామూలుగానే సాగేట్టు కనిపిస్తోంది. పిల్లలు ఎమోషనల్ అవ్వడం, ఎరువుల కొట్లో ఎకౌంట్లు రాస్తాడు.. అని చెప్పండని అంటాడు కార్తీక్. మరో వైపు దీపకు వంటలక్కగా మళ్లీ పని దొరికింది. అలా ఎపిసోడ్ సోసోగా ముందుకు సాగేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply