• December 11, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. చలించని డాక్టర్ బాబు.. ప్రశ్నించిన దీప

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. చలించని డాక్టర్ బాబు.. ప్రశ్నించిన దీప

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్‌లో అంటే శనివారం నాడు ప్రసారమయ్యే ఈ Karthika Deepam Episode 1220 ధారావాహిక సాధారణంగానే సాగుతుంది. అయితే తనలోని డాక్టర్ బయటకు వచ్చే పరిస్థితి వచ్చినా కార్తీక్ కంట్రోల్ చేసుకుంటాడు. మరోవైపు కొడుకు కోసం సౌందర్య తల్లడిల్లిపోతుంది. ఇక వంటలక్కగా మళ్లీ దీప అవతారమెత్తేస్తోంది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందో ఓ సారి చూద్దాం.

    కార్తీక్ కోసం సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మనవరాళ్లతో కలిసి ఉన్న సంతోషమైన క్షణాలను తలుచుకుంటూ సౌందర్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య రాకతో.. కార్తీక్ గురించి ఏమైనా తెలిసిందా? అని సౌందర్య అడుగుతుంది. ఫోన్ నంబర్లు కూడా మార్చేశారు దొరకడం కష్టం అని ఆదిత్య అంటాడు. ఇలా ఎందుకు చేశారు మన నుంచి పూర్తిగా దూరం అవ్వాలని అనుకున్నారా ఏంటి? అని సౌందర్య అంటుంది..

    ఏదో కోపం వెళ్లి ఉంటారని అనుకున్నా..మళ్లీ వసారని అనుకున్నా అంటూ ఆనంద్ రావు బాధపడతాడు.. పిల్లలు లేని ఈ ఇళ్లు బోసి పోయింది.. నానమ్మ అది చేసి పెట్టు ఇది చేసిపెట్టు.. అని అనేవాళ్లు. అసలే అన్నయ్య చాలా సెన్సిటివ్.. ఆ మోనిత వల్ల ఎన్నో ఎదురుదెబ్బలు,అవమానాలు పడ్డాడు అని ఆదిత్య ఫీలవుతాడు.. అవునురా మనకు తెలీదు కానీ నరకం అనుభవించాడు.. అంటూ ఆనంద్ రావు కంటతడి పెట్టుకున్నాడు.

    అన్నింటిని తట్టుకున్న అన్నయ్య ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో.. వాళ్లంతట వాళ్లు మనసు మార్చుకుంటే తప్పా.. మనం తెలుసుకోలేం అంటూ ఆదిత్య అంటాడు.. మోనిత విషయంలో గట్టిగా ఉండాలి అని ఆదిత్య అంటే.. ఇప్పుడు అది ఎందుకు రా అని సౌందర్య అంటుంది.. బయటకు వెళ్తే అందరూ అన్నయ్య గురించి కాకుండా మోనిత గురించి అడుగుతున్నారు అని ఆదిత్య ఏదో చెప్పబోతోంటే.. ఒరేయ్ మళ్లీ పెద్దోడు ఇంటికి వస్తాడా?. నన్ను మమ్మీ అని పిలుస్తాడా? అంటూ సౌందర్య ఎమోషనల్ అవుతుంది..

    ఇక దీప దేవతకు దండం పెడుతూ.. నేను నిన్ను ఎప్పుడూ నిందించలేదు.. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రవహించే నీళ్లలా ప్రయాణిస్తూనే ఉన్నాను.. పదకొండేళ్ల తరువాత కలిశానంటే.. మళ్లీ ఇలా.. డాక్టర్ బాబు నిస్సహాయ స్థితిలోకి వచ్చాడు.. అలాంటప్పుడే నేను అండగా ఉండాలి.. అన్నీ బాగుంటే అందరూ వచ్చి చేరతారు.. కష్టాల్లో నేను ఆయనకు అండగా ఉండే ధైర్యాన్నివ్వమ్మా.. పిల్లలకి ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు.. వాళ్లను మామూలు స్థితికి వచ్చేట్టు చేయమ్మ.. మళ్లీ నా డాక్టర్ బాబుని.. డాక్టర్ బాబుగా మారేట్టు చేయమ్మ.. అంటూ తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంటుంది.

    కార్తీక్ ఫోన్ దొరికిన అడుక్కునే వాడి సీన్స్ చూపిస్తాడు. ఫోన్ బాగా కాస్ట్ లీ అనుకుంటా.. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందట.. అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయ్.. ఓ వారానికి సరిపడా వస్తాయేమో.. చూడబోతే వాడు బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు. వాళ్లకి సమాధానాలు చెబితే నాకేంటి.. ఓరీ మహేషా?.. కష్టాల్లో ఉన్నావ్.. నువ్ ఈ ఫోన్ అమ్ముకుని ఎంజాయ్ చేయ్ రా అని ఇచ్చాడంటే తనలో తాను అనుకుంటూ వచ్చాడు. పదే పదే కాల్స్ రావడంతో దాన్ని స్విచ్చాఫ్ చేసేశాడు..

    దీప గురించి తెలుసుకునేందుకు సౌందర్య బస్తీకి వెళ్లింది. వారణాసి నీకు తెలీకుండా ఉంటుందా? దీప ఎక్కడికి వెళ్లింది అంటూ సౌందర్య అడుగుతుంది. అక్క నాకు చెబితే ఇలా చేస్తానా? కాళ్లు పట్టుకుని ఆపుతాను అంటూ వారణాసి అంటాడు.. పిల్లలను, కార్తీక్‌ను, దీపను చూడకుండా ఉండలేకపోతోన్నాను ఎక్కడున్నారో మీకు తెలిస్తే చెప్పండని సౌందర్య ప్రాధేయ పడుతుంది.. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాం.. మాకు తెలీదండి.. వచ్చింది స్థలం చూసింది.. అందరికీ భోజనాలు పెడుతుందని చెప్పింది.. మాతోనే ఉంటుందని చెప్పింది కానీ ఇంతలోనే ఇలా చేసింది.. అంటూ బస్తీవాసులు అంటారు. మీ కాళ్లకు మొక్కి చెబుతున్నాను.. సత్య ప్రమాణంగా చెబుతున్నాను.. మాకేం తెలియదు.. అని వారణాసి చెబుతాడు.

    కొత్తింట్లో అందరికీ పడక వేస్తుంది దీప. వాటిని చూసి పిల్లలు అసహ్యించుకుంటారు. డాక్టర్ బాబు రండి.. నాన్న నువ్ కూడా వచ్చి పడుకో అని దీప, పిల్లలు అంటారు.. సారీ రా రౌడీ.. సారీ హిమ.. ఇలాంటి ప్లేస్‌కు తీసుకొచ్చి కష్టపెడుతున్నాను.. నా వల్ల నువ్, మీ అమ్మ ఎంతో కష్టపడ్డారు.. అని కార్తీక్ అంటే.. ఇవన్నీ మాకు అలవాటే.. బస్తీలో ఎన్ని కష్టాలు పడ్డా నువ్ మా పక్కన లేవు కదా?.. నువ్ ఇప్పుడు ఉన్నావ్ కదా? ఏది కష్టమనిపించదు.. అని శౌర్య అంటుంది. రౌడీ అంటాం కానీ మంచి రౌడీవే అంటూ కార్తీక్ ప్రశంసిస్తాడు… మనం కలిసి ఉంటే చాలు మనకేం లేకపోయినా ఓకే అని పిల్లలిద్దరూ అనేస్తారు..

    ఎవరికో బాగా లేనట్టుంది చూద్దాం పదండి అని దీప అంటుంది.. వెళ్లడం వద్దు అని కార్తీక్ అంటాడు.. తెలిసి కూడా వెళ్లకుండా ఉంటామా? అని దీప అనేస్తుంది. శ్రీవల్లి ఓర్చుకో అమ్మ అంటూ పురిటి నొప్పుల బాధపడుతూ ఉండటంతో పక్కన వాళ్లంతా సాయం చేస్తుంటారు.. ఊళ్లో డాక్టర్ కూడా లేడు.. పెళ్లికి వెళ్లాడట.. మంత్రసాని కూడా లేడు.. ఏంట్రా కోటేశు దీన్ని చంపేస్తావా? ఏంటి అని చుట్టు పక్కల వాళ్లు అంటుంటారు..

    డాక్టర్, మంత్రసాని లేకపోతే ఇలా వదిలేస్తారా?.. అంటూ దీప తల్లడిల్లిపోతుంది. మా డాడీ కూడా డాక్టరే అని పిల్లలు చెప్పబోతోంటే.. వద్దు అమ్మ అని అంటాడు.. మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేయోచ్చు కదా? అని దీప అడుగుతుంది.. నాలో డాక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడు దీప అని కార్తీక్ అంటాడు. డాక్టర్ బాబు.. ఆ అమ్మాయి చచ్చిపోతుంది అని దీప ప్రాదేయపడుతుంది..

    మనం వెళ్దామా? అని డాక్టర్ బాబు అడుగుతాడు.. డాక్టర్ బాబు వెళ్లడం ఏంటి?.. ఆ అరుపులు వినిపించడం లేదా? అని దీప అంటే.. నన్ను డాక్టర్‌గా తొలగించిన అరుపులే నాకు వినిపిస్తున్నాయని డాక్టర్ బాబు బాధపడుతుంటాడు.. మీరేం చేయలేరా? అని దీప అడిగితే.. ఏం చేయలేను అని కార్తీక్ అంటాడు.. ఆ పేషెంట్ భార్య మాటలే వినిపిస్తున్నాయని అంటాడు కార్తీక్.. ఎవరి ఫోనైనా ఇవ్వమను.. అని కార్తీక్ అంటాడు. అంబులెన్స్‌కు కాల్ చేస్తాడు.

    అంబులెన్స్ వస్తుంది.. శ్రీవల్లిని పట్టుకెళ్తుంది. ఆ తరువాత కార్తీక్‌తో దీప మాట్లాడుతుంది. ఏంటడి మీరు.. మీకేమైంది.. మీరొక డాక్టర్ ఆ విషయాన్ని మర్చిపోయారా?.. అంటూ దీప ప్రశ్నిస్తుంది. నేను ఇప్పుడు డాక్టర్‌ని కాదు.. పట్టా తీసేశారు.. రద్దు చేసేశారు.. అని కార్తీక్ చెబుతాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో దీప మళ్లీ వంటలక్క అవతారం ఎత్తుతుంది. డాక్టర్ బాబు కాస్తా ఎరువుల కొట్లో అకౌంట్స్ చూస్తాడట. మీ డాడీ డాక్టర్ అని ఎవ్వరితో చెప్పకండి అని పిల్లలకు కార్తీక్ చెబుతాడు. మరి మీ డాడీ ఏం చేస్తాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని పిల్లలు ప్రశ్నిస్తాడు. ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అంటూ కన్నీరుమున్నీరు అవుతాడు. పిల్లలు కూడా కంటతడి పెట్టేసుకుంటారు. మొత్తానికి వచ్చే వారం ఈ సీరియల్ మరింత ఎమోషనల్‌గా సాగేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply