• December 6, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఆస్థి మొత్తం ఇచ్చేసిన కార్తీక్?.. డాక్టర్ బాబులోంచి డాక్టర్ అవుట్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. ఆస్థి మొత్తం ఇచ్చేసిన కార్తీక్?.. డాక్టర్ బాబులోంచి డాక్టర్ అవుట్

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే.. సోమవారం నాడు అంటే.. Karthika Deepam Episode 1215 నాటి ధారావాహికలో కార్తీక్ కుమిలిపోతాడు. తాను చేసిన తప్పును తలుచుకుంటి కుంగిపోతాడు. ఇక వంటలక్క కనిపించక మూడు నాలుగు రోజులు అవుతుంది. అసలు కార్తీక దీపం సీరియల్‌లో వంటలక్క లేకుండా ఉండటం అనేది జరగదు. కానీ గత నాలుగు రోజుల నుంచి ఇదే తంతు కనిపిస్తోంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో కూడా దీప కనిపించలేదు. సోమవారం నాడు ఎపిసోడ్ ఎలా ముందుకు సాగిందో చూద్దాం.

    పిల్లలు,సౌందర్య, ఆదిత్య, ఆనంద్ రావులు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ సమయంలోనే కార్తీక్ వస్తాడు. పిల్లలు కార్తీక్ దగ్గరకు వెళ్తారు. పిల్లలను చూడటంతో పేషెంట్ భార్య పెట్టిన శాపనార్దాలు గుర్తుకు వస్తాయి. ఏమైందిరా పెద్దోడా? అలా ఉన్నావ్ అని సౌందర్య అడుగుతుంది. ఏం లేదు మమ్మీ అని దిగులుగా సమాధానం ఇస్తాడు కార్తీక్.

    మ్యాటర్ ఏదో ఉందని అర్థం చేసుకున్న సౌందర్య.. అక్కడి నుంచి పిల్లలను పంపించేసే ప్రయత్నం చేసింది. ఆదిత్య.. పిల్లలను తీసుకెళ్లి ఐస్ క్రీం కొనివ్వు అని చెబుతుంది. ఆదిత్య స్లోగా డ్రైవింగ్ చేయిరా అని కార్తీక్ జాగ్రత్తలు చెబుతాడు. పిల్లలు వెళ్లాక సౌందర్య మళ్లీ అడుగుతుంది. ఏమైందిరా పెద్దోడా? అని సౌందర్య అంటే.. బాగానే ఉన్నాను కదా? మమ్మీ అని కార్తీక్ అంటాడు.. లేదురా ఏదో పొగొట్టుకున్న వాడిలా ఉన్నావ్ అని సౌందర్య అంటుంది.. అలిసిపోయాను మమ్మీ అని చెప్పి లోపలకి వెళ్లిపోతాడు కార్తీక్..

    ఇక మరో వైపు మోనిత సంబరాలు చేసుకుంటుంది. ప్రియమణి, ప్రియమణి ఇలా రా అంటూ పిలిచి గోల చేస్తుంది.. డాక్టర్ అయ్య లైసెన్స్ క్యాన్సిల్.డాక్టర్ బాబు అవుట్..డాక్టర్ గిరి అవుట్.. ఊడిపోయేలా చేశాను.. ఆ దీప ఎలా మాట్లాడేది.. నా డాక్టర్ బాబు అనేది.. నన్ను భయపెట్టేది కదా? రెచ్చగొట్టేది.. ఇప్పుడు డాక్టర్ బాబులోంచి డాక్టర్‌ను విడగొట్టేశాను కదా?. ఇప్పుడేం చేస్తావ్ దీపక్క.. అంటూ మోనిత తన రాక్షసానందాన్ని పొందుతుంది.

    డాక్టర్ రవి అన్న మాటలు, నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడని అనడం, డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడం, ఇక జీవితంలో డాక్టర్ ప్రాక్టీస్ చేయలేవు అని అందరూ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటాడు. అసోసియేషన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే తలవొంచుతాను అని అన్న మాటలు గుర్తు చేసుకున్నాడు. మోనిత చేసే అవమానాలకు తోడు.. డాక్టర్ లైసెన్స్ కూడా రద్దైతే.. పాపం అంటూ కార్తీక్‌ను జాలీగా చూస్తారు. అవన్నీ తలుచుకుని కార్తీక్ బాధపడ్డాడు.. నేను డాక్టర్‌ని కాదా? అంటూ కుమిలి కుమలి ఏడ్చాడు.

    అలా కార్తీక్ ఏడుస్తుండగా.. రూంలోకి ఆనంద్ రావు, సౌందర్య వస్తారు. ఏమైందిరా నీకు.. ఇక్కడ కూర్చున్నావేంట్రా.. ఏమైంది నాన్నా అని అడుగుతారు. జరిగిన విషయాలను కార్తీక్ చెబుతాడు. సౌందర్య, కార్తీక్ కలిసి చనిపోయిన పేషెంట్ ఇంటికి వెళ్తారు. దేవుడు అన్యాయం చేశాడు.. ఎలా బతకాలి దేవుడా.. ఏడ్వకుండా ఏం చేయాలి.. ఇళ్లు కట్టుకుందామన్నాడు.. పెళ్లి చేస్తాను అని అన్నాడు.. నేను ఎట్లా బతికేది అంటూ ఆ పేషెంట్ భార్య తల్లడిల్లిపోతుంది.

    అక్కడికి డాక్టర్ బాబు, సౌందర్య వెళ్తారు.. అదిగో ఆ డాక్టరే.. ఎందుకొచ్చావయ్యా.. కొసప్రాణం ఉందా? లేదా? అని చూడటానికి వచ్చావా? ప్రాణం పూర్తిగా పోయిందయ్యా.. కళ్లు తెరిచి చూడొయ్య.. ఇంకా ఏం చేద్దామని చూడటానికి వచ్చావ్.. గొప్ప డాక్టర్ అన్నారు కదా? బతికిస్తానని అన్నారు కదా? నా పిల్లల్ని చూడయ్యా.. దిక్కులేని వాళ్లని చేశావ్.. నాపాలిట యముడివయ్యావ్.. బతుకుతాడన్నావ్.. పెళ్లి చేస్తాడని అన్నావ్.. మనవరాళ్లతో ఆడుకుంటాడని అన్నావ్.. నా పిల్లల ఉసురు, ఏడుపు మీకు తగులుతుంది.. అంటూ రకరకాల శాపనార్థాలు పెట్టేసింది.

    మీకు అన్యాయం జరిగింది.. మీకు జరిగిన నష్టాన్నీ పూడ్చలేను.. ఏం చేసినా తీర్చలేను.. పోయిన మనిషి ప్రాణాలను తీసుకురాలేను.. కానీ ఒక్క పని చేయగలను అమ్మా.. అంటూ కార్తీక్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కార్తీక్ తన ఆస్తి మొత్తాన్ని పిల్లలకు రాసిస్తాడో ఏమో గానీ.. డాక్టర్ బాబు ఇకపై డాక్టర్ మాత్రం కాదు. మరి మున్ముందు సీరియల్ ఎలా ఉంటుందో చూడాలి.

    Leave a Reply