• December 4, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనిత వలలో చిక్కిన డాక్టర్ బాబు..రెండో రోజూ కనిపించని వంటలక్క

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనిత వలలో చిక్కిన డాక్టర్ బాబు..రెండో రోజూ కనిపించని వంటలక్క

    కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అంటే.. Karthika Deepam Episode 1214.. అంటే శనివారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. దీంతో పేషెంట్ భార్య పెట్టిన శాపనార్థాలకు కార్తీక్ ఆందోళన చెందుతాడు. మరోవైపు కార్తీక్ గొప్పదనం గురించి సౌందర్య తన మనవరాళ్లకు చెబుతుంటుంది. అయితే కార్తీక్‌ను ఇలా ఇరికించిన మోనిత మాత్రం తాపీగా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేసింది. కానీ రెండో రోజు కూడా వంటలక్క కనిపించలేదు. ఆ అనుమానం రాకుండా సౌందర్యతోనే ఆ క్లారిటీని ఇప్పించారు. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ ఇలా కొనసాగింది..

    పక్కకి తప్పుకో, సర్జరీ పోస్ట్ పోన్ చేద్దామని అన్నాను.. నిండు ప్రాణాన్ని బలితీసుకున్నావ్..ఎవరు బాధ్యత వహించాలి అంటూ కార్తీక్‌ను డాక్టర్ రవి నిలదీస్తాడు.. మీరే కాపాడాలి అంటూ ప్రాధేయపడ్డ పేషెంట్ భార్య మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంంటాడు. ఇలా హాస్పిటల్‌లో రచ్చ జరుగుతూ ఉంటే.. మోనిత ప్రియమణిల మీద షాట్ ఓపెన్ అవుతుంది.

    తాపీగా ఇంట్లో కూర్చున్న మోనితకు.. ప్రియమణి కాఫీ తీసుకొస్తుంది. కాఫీ.. కాఫీ.. ఏంటో అంత రచ్చ చేశాక కూడా మోనితమ్మ ఏమీ మాట్లాడటం లేదు.. అని ప్రియమణి కసురుకుంటుంది. అయితే జయంతి నుంచి సక్సెస్ అనే మెసెజ్ రావడంతో.. కాఫీ బాగా కలిపావ్ ప్రియమణి అంటూ మోనిత ప్రశంసిస్తుంది.. ఇంట్లోనే కూర్చుని కాఫీలు ఆర్డర్ చేస్తున్నారు.. నేను ఏ పని చేయను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని మోనితకు ఎదురుచెబుతుంది ప్రియమణి..

    ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నానని అనుకుంటున్నాను..ఈ ఒక్క కాఫీతో మీ కార్తీక్ అయ్య పని అయిపోయింది.. కాఫీతో పని అయిపోవడం ఏంటి అమ్మ అని ప్రియమణి అంటుంది. నీకు అర్థం కావడానికి ఇంకాస్త టైం పడుతుంది ప్రియమణి.. వెళ్లు.. ఆనంద్ రావు పని చూసుకో..అంటూ అసలు విషయాన్ని మనకు చెబుతుంది. ఆపరేషన్‌కు వెళ్లే ముందు కార్తీక్ తాగిన కాఫీలో మత్తు మందు కలిపించే ప్లాన్ వేసింది మోనిత. దీంతో మోనిత వలలో పడ్డాడు కార్తీక్.

    మై డియర్ కార్తీక్.. ఈ మోనిత ఏం చేయగలదో.. ఏం చేస్తుందో నీకు ఇప్పట్లో అర్థం కాదు.. ఈ మోనితను తక్కువ అంచనా వేస్తున్నావ్ కదా?.. కాఫీతో కార్తీక్ జీవితానికి చెక్ పెట్టేశాను.. అంటూ మోనిత సంబరపడుతుంది. ఇక ఆస్పత్రిలో పేషెంట్ భార్య నానా రకాల శాపనార్థాలు పెడుతుంది. బతుకుతాడని అన్నావ్.. పెళ్లి అన్నావ్.. మనవరాళ్లను చూస్తాడు అన్నావ్.. అప్పుచేశానని అంటే.. బతుకుతాడని భరోసానిచ్చావ్.. ఇప్పుడు ఏం చేయమంటావ్.. నా పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు.. మమ్మల్ని రోడ్డుకీడ్చావ్.. అంటూ తల్లడిల్లిపోయింది.

    ఆపరేషన్ చేయకపోయినా కొద్ది రోజులు బతికుండేవాడేమో.. అయ్యో దేవుడా ఇద్దరు పిల్లలను పెట్టుకుని ఏం చేయాలి.. చచ్చిపోయిన వాళ్లను బతికిస్తాడని అంటారే.. బతికి ఉన్న వాడిని చంపేశావ్.. ఇప్పుడు ఎంత ఏడ్చినా మీ నాన్న రాడమ్మ.. మనం ఎట్లా బతికేది.. అప్పు చేసి వచ్చాను. వాటిని ఎలా తీర్చేది.. మనకు ఈ కర్మ ఏంటి.. నువ్వే చంపేశావ్ నా మొగుడ్ని.నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా?.. నీకు ఆడపిల్లున్నారు అన్నావ్ కదా?.. వారికి మా పాపం తగులుతుంది.. నా తాళిని తెంచావ్.. నా బతుకును నాశనం చేశావ్.. నీ బతుకు మట్టి కొట్టుకుపోతుంది.. ఈ పిల్లలను ఎలా సాకాలి.. వీరి చదువులు, పెళ్లిళ్లు ఎలా.. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం లేదే.. మనం ముగ్గురం ఇంత విషం తాగి చద్దాం.. నువ్ బాగు పడవ్ డాక్టరయ్య.. నీ పిల్లలు బాగుపడరు.. నా తాళిని తెంపేసి వెళ్తున్నావ్.. పైన దేవుడున్నాడు.. నీకు శిక్ష వేస్తాడు..అంటూ శాపనార్థాలు పెట్టేపింది.

    పేషెంట్ భార్య మాటలు, శాపనార్థాలు గుర్తు చేసుకుని కార్తీక్ బాధపడ్డాడు. ఇలా ఆసుపత్రిలో కార్తీక్ బాధపడుతుంటే.. ఇంట్లో మాత్రం పిల్లలు, ఆనంద్ రావు, సౌందర్యలు కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తుంటారు. చీమ కన్నా చిన్నదేంటి? అంటి శౌర్యఅడగడటం.. ఆ ప్రశ్నకు.. చిన్న చీమ అంటూ ఆనంద్ రావు సమాధానం ఇస్తాడు. కాదు.. చీమ నోట్లో ఆహారం అంటూ శౌర్య జోకులు వేస్తుంటుంది..

    ఇవన్నీ మీ అమ్మ దగ్గర నేర్చుకుని మా దగ్గర ప్రయోగిస్తున్నారా?..అని ఆనంద్ రావు అంటే.. ఎక్కడ నేర్చుకుంటే ఏమవుతుంది? అని శౌర్య అంటుంది. చీమ అంటే గుర్తుకు వచ్చింది..చిన్నప్పుడు కార్తీక్‌కి చీమ కుడుతుంటే కూడా చీమను ఏం చేయలేదు.. పెద్దోడు చాలా మంచోడు ఎవ్వరికీ ఏ హానీ చేయడు..అని సౌందర్య అంటుంది. మీ అబ్బాయి కాబట్టి గొప్పలు చెప్పుకుంటారు అని శౌర్య అంటుంది.

    మా అబ్బాయి అని కాదు.. అన్నింట్లో ఫస్ట్.. బాగా చదువుకున్నాడు కాబట్టే పెద్ద డాక్టర్ అయ్యాడు.. మీరు కూడా మంచి పేరు సంపాదించుకోవాలి.. ఆపరేషన్ చేసేటప్పుడు డాడీని చూశారా? అని శౌర్య అంటుంది. అలా చూడనివ్వరు అని సౌందర్య అంటే.. నాకు తెలుసు, డాడీ మొహం ఎలా పెడతాడో తెలుసు.. భారతి ఆంటీ వాళ్లు చెప్పారు అంటూ డాక్టర్ బాబును హిమ ఇమిటేట్ చేస్తుంటుంది

    సిటీలోనే మీ డాడీ ఫేమస్ కార్డియాలజిస్ట్.. నాన్న చాలా గ్రేట్.. డాడీ చాలా గ్రేట్ అంటూ పిల్లలు అనేస్తారు.. వాడిని గ్రేట్ అని అనడం కాదు.. మీరు కూడా గ్రేట్ అనిపించుకోవాలి.. ఏం చదివినా నెంబర్ వన్ అవ్వాలి.. అంటూ ఆనంద్ రావు పిల్లలకు చెబుతాడు. ఇక కార్తీక్ మాత్రం ఇంకా అదే ధ్యాసలో ఉంటాడు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన కార్తీక్ తనలో తాను బాధపడతాడు.

    నాకేం అయింది..అలా ఎందుకు చేశాను.. తప్పు చేశాను.. కాదు.. పాపం చేశాను.. పెద్ద పాపం చేశాను.. ప్రాయిచ్చితమే లేదు..అని బాధపడుతుంటాడు. వెళ్తున్నావా? డాక్టర్ అయ్యా.. దీపం వెలిగించే ప్రతీ రోజు నా ఇంట్లో దీప ఆర్పావన్న సంగతి నీకు గుర్తుకు వస్తుంది.. ఆపరేషన్ చేస్తావ్ అని అనుకుంటే.. పసుపుకుంకుమ చెరిపేశావ్.. నువ్ అన్నావ్ తినేటప్పుడు నా పిల్లలకు కూడు లేకుండా చేశావ్ అని గుర్తుకు వస్తుంది.. నాశనమవుతుంది.. మట్టి కొట్టుకుపోతావ్.. నాశనమైపోతారు..అని పేషెంట్ భార్య అన్నట్టుగా కనిపిస్తుంది.

    ఇక మళ్లీ పిల్లలు, సౌందర్య, ఆనంద్ రావుల మీద సీన్ ఓపెన్ అవుతుంది. నాన్న ఇంకా రాలేదేంటి? అని హిమ అడుగుతుంది.. నేనూ ఎదురుచూస్తున్నాను ఇది నీ ప్రశ్నకు సమాధానం.. దీప బయటకు వెళ్లింది.. రేపు కూడా వెళ్తుందట.. ఇది నీ ప్రశ్నకు సమాధానం అంటూ శౌర్యకు సౌందర్య సమాధానం ఇస్తుంది.. ఆటలు అయ్యాయ్.. అమ్మానాన్నలు ఎక్కడ అని అడుగుతున్నారా? నా బుర్రతింటారా? అని సౌందర్య అంటే.. లేదు ఐస్ క్రీమ్ తింటామని కౌంటర్ వేస్తారు. సరే బాబాయ్‌తో కలిసి బయటకు పంపిస్తాను అని సౌందర్య అంటుంది.

    అదే సమయంలో ఆదిత్య పై నుంచి కిందకు దిగుతుంటాడు. ఐస్ క్రీం కోసం ఐస్ చేస్తున్నారు.. వీళ్ల మాటలు నమ్మకు మమ్మీ అని ఆదిత్య అంటాడు. .. మళ్లీ ఆ డ్యూటీ నా మీద పడుతుందని ఆదిత్య అనడంతో.. ఆల్రెడీ పడింది.. సాంక్షన్ అయిందంటూ శౌర్య అంటుంది. నాకు పని ఉందని ఆదిత్య అంటే.. అలా ఎలా బాబాయ్..దీపుగాడిని ఎత్తుకోవాల్సింది.. ఆడించాల్సింది మేమే కదా?. అని అంటారు. అంటే బ్లాక్ మెయిలా?.. ఐస్ క్రీం కొనిపించకపోతే ఆడించర? ఎత్తుకోరా? అని ఆదిత్య అంటాడు.. ఊరికే అన్నాం బాబాయ్ అని అందరూ తెగ నవ్వుకుంటారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వచ్చే వారం నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి నిన్నా, ఈ రోజు ఎపిసోడ్‌లలో  వంటలక్క మాత్రం కనిపించనే లేదు.

    Leave a Reply