• December 3, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. పేషెంట్‌ను చంపేసిన కార్తీక్.. వంటలక్క బతుకు మళ్లీ మొదటికేనా?

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. పేషెంట్‌ను చంపేసిన కార్తీక్.. వంటలక్క బతుకు మళ్లీ మొదటికేనా?

    కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు అంటే Karthika Deepam Episode 1213లో ఏం జరుగుతుందో చూద్దాం. దీప, సౌందర్యలు జరిగిన పరిస్థితులు, జరగబోయే ఘటనల గురించి బాధపడుతుంటారు. ఇక ప్రియమణి ఇళ్లంతా చిందరవందరగా చేసిపడేస్తుంది. మోనితను రెచ్చగొడుతుంది. అయితే అసలు ట్విస్ట్ మాత్రం కార్తీక్ చేసే ఆపరేషన్ దగ్గరే ఉన్నట్టు కనిపిస్తోంది. అసలు కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందో చూద్దాం.

    కార్తీక్ ఉన్న పరిస్థితి గురించి దీపతో చెబుతూ సౌందర్య బాధపడుతుంది. కార్తీక్ బాబు మంచివారు, ధర్మం మనవైపుంది.. మోనిత పొగరు నేను అణుచుతాను అని దీప అంటుంది. ఈ మాట మీద ఉండే దీప.. పదకొండేళ్లు దూరమయ్యారు.. మీకు ఏ అచ్చటాముచ్చటా లేదు.. వాడు ప్రశాంతంగా ఎప్పుడున్నాడే.. మీ మావయ్యగారికి టాబెట్లు ఇచ్చావా?.. అని సౌందర్య అడుగుతుంది.

    ఇచ్చాను అత్తయ్య అని దీప అంటే.. ఎన్ని కష్టాలున్నా కూడా నీ ధర్మాన్ని నువ్ వీడవు కదా? నువ్ గ్రేట్ దీప అని సౌందర్య పొగుడుతుంది.. నీకు చెప్పకుండా ఓ రెండు పనులు చేశాను.. అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అంటూ.. ఆపరేషన్ వద్ద కార్తీక్‌తో సంతకం చేయించడం, పూజ చేయించడం వంటి వాటిని సౌందర్య గుర్తు చేసుకుంది.. వీలైతే నన్ను క్షమించవే అని సౌందర్య అంటుంది.. నేను మిమ్మల్ని క్షమించడమేంటి అత్తయ్య అని దీప అంటుంది..

    ఇక మోనిత ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి కనిపిస్తాయి. ఏంటి ప్రియమణి ఇళ్లంత ఇంత గందరగోళంగా ఉందేంటి? అని మోనిత అరుస్తుంది. నేనే అలా విసిరి పారేశాను.. నాకు కోపం వచ్చింది అని ప్రియమణి అంటుంది.. కోపం ఏంటి? అని మోనిత అడుగుతుంది. వాళ్లు అన్నన్ని మాటలు అన్నారు.. ఏంటమ్మ మీకు చీము, నెత్తురు, రోషం అనేవీ లేవా? మీ ఇంట్లో పని చేసే నాకే అంత కోపం వస్తే మీకు ఎంత రావాలి? మీరేం చేస్తారో అనుకున్నాను.. కానీ ఏం చేయడం లేదు.. ఆనంద్ రావు గారు అనుకుంటూ మురిసిపోతోన్నారు.. దీపమ్మ మీపై గెలుస్తూనే వస్తున్నారు.. మీ ఉప్పు తింటున్నాను.. అప్పుడప్పుడు దీపమ్మ మీద జాలీ అనిపించేది.. ఇంతకు ముందున్న మోనిత కనిపించడం లేదు.. మీరు నాకు నచ్చడం లేదు..అని ప్రియమణి ఇంకా రెచ్చగొడుతుంది.

    ప్రియమణి నా బంగారు కొండ.. నా మీద నీకు అంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది.. డాక్టర్ బాబే లోకం అని చెప్పుకునే దీపకు ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను.. దీపే నా లోకం అని చెప్పుకున్న కార్తీక్‌లను నేల మీదకు దించుతాను.. కార్తీక్ నా దగ్గరకు వచ్చేట్టు చేస్తాను..కార్తీక్, దీపలను వదిలేది లేదు.. సూపర్ ప్రియమణి, లవ్యూ ప్రియమణి.. అంటూ మోనిత మళ్లీ ఏదో కుట్రకు తెరదీసినట్టు అనిపిస్తుంది.

    డాక్టర్ బాబుగా తన వృత్తిని సక్రమంగా చేసేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. కానీ ఓ పేషెంట్ విషయంలో మాత్రం కార్తీక్ పరిస్థితి దారి తప్పింది. ఓ పేషెంట్‌కు ఆపరేషన్ చేసే సమయంలో కార్తీక్ కండీషన్‌లో లేడు. డాక్టర్ బాబు కాపాడతాడు.. దేవుడు అంటూ పేషెంట్ భార్య, పిల్లలు ఎంతో నమ్మకంగా ఉంటారు. మీరే కాపాడాలి.. మాబోటోళ్లకు గుండె జబ్బులేంటయ్యా.. అని పేషెంట్ భార్య బాధపడుతుంది.

    మీరు ఆపరేషన్ చేస్తే ఎవ్వరైనా బాగుపడతారట.. పిల్లలకు పెళ్లిళ్లు చేసే వారకైన ఉండాలని పేషెంట్ భార్య అంటే.. పిల్లల పెళ్లిళ్ల వరకు కాదు. మనవళ్లు ముని మనవళ్ల వరకు ఉంటాడు.. అని కార్తీక్ ధైర్యాన్ని ఇస్తాడు.. మీ నాన్నకు ఏం కాదు.. ఆరోగ్యంగా తిరిగొస్తారు అని పిల్లలకు భరోసానిస్తాడు.. రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లం.. ఆయన లేచి పని చేస్తే గానీ ఇళ్లు గడవదు.. అని తన పరిస్థితి గురించి చెబుతుంది. లేచి వస్తాడు.. మంచిగా చదివించండి.. వీళ్ల పెళ్లిళ్లకు నన్ను పిలవండి.. వెళ్లి తినండి.. ఆపరేషన్‌కు టైం పడుతుంది.. అని కార్తీక్ అంటాడు.

    ఇక కార్తీక్ ఇంకా ఇంటికి చేరుకోలేదేంటి? అని సౌందర్య తెగ ఆందోళన పడుతుంది. పెద్దోడు ఇంకా రాలేదేంటి? సమస్య తీరిందని సంతోషపడాలో.. మళ్లీ ఏవైపు నుంచి వస్తుందో అని భయపడాలో అర్థం కావడం లేదు అని సౌందర్య ఇంటి బయటే ఎదురుచూస్తుంటుంది. కారులోంచి దిగిన శ్రావ్య.. దీపు గాడిని చూసి వచ్చాను, మీకో శుభవార్త చెప్పాలి అంటూ ఎంతో ఆనందంగా చెబుతుంది. కానీ సౌందర్య మాత్రం వినిపించుకోదు.

    దీంతో శ్రావ్య బాధపడుతుంది. దీపు గాడి గురించి చెప్పినా పట్టించుకోవడం లేదు.. అని లోలోపల అనుకుంటుంది. ఎవరికోసం ఎదురుచూస్తున్నారు అత్తయ్య అని శ్రావ్య అంటే. పెద్దోడు ఇంకా రాలేదు.. ఏమైందా? అని ఆలోచిస్తున్నాను అని సౌందర్య అంటుంది.. మీరు నా గురించి ఎప్పుడు ఆలోచించారు కనుక అని లోలోపల బాధపడుతుంది.. ఏదో వార్త అన్నావ్ అని సౌందర్య అంటే.. వార్త కాదు అత్తయ్య శుభవార్త అన్నాను.. మీకు శుభవార్త చెప్పినా వార్తలానే వినిపిస్తుంది అని శ్రావ్య కాస్త వెటకారంగా అంటుంది..

    మా అమ్మకు రావాల్సిన నాలుగు ఎకరాలను హిమ, దీపల పేర్ల మీద ఒక్కో ఎకరం.. దీపుగాడి పేరు మీద రెండు ఎకరాలు రాస్తాను అన్ని అందంటూ శ్రావ్య చెప్పింది. అవన్నీ మనకు ఎందుకే అని సౌందర్య అంటే.. మీరు అలా అంటారని తెలుసు.. అందుకే మాకు వద్దు.. మీరే ఉంచుకోండి అని చెప్పి వచ్చానంటూ శ్రావ్య ఎంతో గొప్పగా చెబుతుంది. కానీ సౌందర్య మాత్రం వినిపించుకోలేదు. ఏమో అంటున్నావ్ అని పరధ్యానంగా అడుగుతుంది. నేను చెప్పింది వింటున్నారా? అని శ్రావ్య అంటే ఏదో చెబుతున్నావ్? అని సౌందర్య అంటుంది. తన మాటలేవి వినడం లేదని శ్రావ్య అక్కడి నుంచి వెళ్తుంది. ఈవిడకు ఎప్పుడూ పెద్ద కొడుకు ధ్యాసే అని చిరగ్గా లోలోపల అనుకుంటుంది.

    ఆక ఆపరేషన్ థియేటర్లో కార్తీక్ చేతులు వణుకుతాయ్.. ఏదేదో చేస్తాడు. డాక్టర్ రవి ఎంత వద్దన్నా కూడా ఆపరేషన్ చేసేందుకు సిద్దపడతాడు. కార్తీక్ కండీషన్ బాగా లేదని రవికి అర్థమైంది. మీ చేతులు వణుకుతున్నాయ్ కార్తీక్.. ది గ్రేట్ కార్డియాలిజిస్ట్.. చేతులు వణకడం ఏంటి? ఇది నమ్మలేకపోతోన్నాను అని రవి అంటే.. ఏం లేదు రవి.. ఆపరేషన్ ప్రారంభిద్దాం అని కార్తీక్ అంటాడు.

    మధ్యలో కార్తీక్ ఆపరేషన్ విధానం చూసి రవికి అనుమానం వచ్చి ఆపేద్దాం అంటాడు. నా కాన్సన్‌ట్రేషన్ దెబ్బతీయోద్దు.. ఆపరేషన్ ఈ పేషెంట్‌కు చాలా అవసరం అని కార్తీక్ అంటాడు. సక్సెస్ అవ్వడం ఇంకా అవసరం.. రిస్క్ తీసుకోవద్దు అని రవి అంటాడు. ఇక డాక్టర్లు లోపల ఉంటే.. బయట పేషెంట్ భార్య, పిల్లలు మాత్రం డాక్టర్ బాబు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

    చివరకు పేషెంట్ చచ్చిపోయినట్టున్నాడు. మొత్తానికి డాక్టర్ బాబు మెడకు మరో సమస్య చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే కార్తీక్‌కు అలా మత్తు రావడం వెనుక మోనిత హస్తం ఉందా? లేదా? అన్నది ఇప్పుడే తెలియడం లేదు. ఒక వేళ పేషెంట్ చచ్చిపోతే డాక్టర్ బాబుకు సమస్యలు వస్తాయి. ఇక మళ్లీ వంటలక్క బతుకు ఆగమైపోతుంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply