• December 1, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనితను చంపేస్తానన్న డాక్టర్ బాబు.. వార్నింగ్ ఇచ్చిన దీప

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనితను చంపేస్తానన్న డాక్టర్ బాబు.. వార్నింగ్ ఇచ్చిన దీప

    కార్తీక దీపం నేటి ఎపిసోడ్‌ అంటే బుధవారం అంటే డిసెంబర్ ఒకటో తేదీన Karthika Deepam Episode 1211లో మోనిత మొసలి కన్నీరు కారుస్తుంది. డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కార్తీక్‌ను ఎన్నుకునే కార్యక్రమంలో మోనిత ఎంట్రీ ఇస్తుంది. మొదటి నుంచి కథ అంతా వివరిస్తుంది.. కార్తీక్‌ను దోషిగా నిలబెట్టి తనకు న్యాయం చేయమంటూ దొంగ కన్నీరు కారుస్తుంది మోనిత. ఎపిసోడ్‌ ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం.

    కార్తీక్‌ గురించి స్టేజ్ ఎక్కిన సౌందర్య ఇలా మాట్లాడింది.. కార్తీక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు థ్యాంక్స్.. డిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. ఇది నిజం.. మా అబ్బాయి చాలా మంచివాడు.. మృదుస్వభావి, మొహ మాటం ఎక్కువే..చిన్నప్పుడు స్టెతస్కోప్ కావాలని ఏడ్చేశాడు.. బొమ్మ స్టెతస్కోప్ కొనిచ్చాం.. అప్పుడు ఫిక్స్ అయ్యాం.. డాక్టర్ అవుతాడని.. ఇంకో ఘటన ఏంటంటే.. అని సౌందర్య చెప్పేలోపు మోనిత ఎంట్రీ ఇస్తుంది.

    మీకంటే బాగా నేనే చెబుతాను డాక్టర్ కార్తీక్ గురించి.. అందరి కంటే ఎక్కువగా నాకు తెలుసు కాబట్టి నేను మాత్రమే చెబుతాను అని మోనిత అంటుంది.. ఓ మనిషి గురించి ఎక్కువగా తెలిసేది.. తల్లిదండ్రులు, గురువు, బాల్య స్నేహితులకు, కట్టుకున్న భార్యకు మాత్రమే తెలుస్తుంది.. నా తరువాత కార్తీక్ అర్దాంగి, భార్య, సతీమణి దీప మాట్లాడుతుంది.. మీవారి గురించి ఎవరో ఊరు పేరులేని వారు చెబితే ఏం తెలుస్తుంది..దీప రా.. మాట్లాడు అని సౌందర్య అంటుంది.

    కానీ అంతలోపు మోనిత స్టేజ్ ఎక్కేస్తుంది. మోనిత ఏంటిది రాను అన్నావ్ కదా? అని భారత అంటుంది. వచ్చాను కదా? అని మోనిత కౌంటర్ వేస్తుంది. నేను డాక్టర్ నే కదా? వచ్చే హక్కు.. మాట్లాడే హక్కు నాక్కున్నాయ్.. పక్కకి జరిగితే నేను మాట్లాడతాను ఆంటీ గారు అని మోనిత అంటుంది.. ఇక మోనిత రెచ్చిపోయి మాట్లాడేసింది.

    ‘అందరికీ నమస్కారం.. ఇది డాక్టర్స్ మీటింగ్.. డాక్టర్స్ కాని వారు ఇక్కడ కొందరు యాక్టర్స్ కనిపిస్తున్నారు.. డాక్టర్ కానీ వాళ్లను ఇక్కడకు ఎందుకు రానిచ్చారు.. అసలు విషయానికి వస్తే.. అధ్యక్షుడిగా ఎన్నికైన కార్తీక్‌కు హార్టి కంగ్రాట్యులేషన్స్.. వారి భార్యకు ఎక్కువ తెలుసు అని అన్నారు. మనకు చెబుతారు అని అన్నారు.. కార్తీక్‌కు పెళ్లైన తరువాత కొద్దిరోజులకే విడిపోయారు. ఆ తరువాత పదకొండేళ్లు దూరమయ్యారు..

    ఈ మధ్యే కలిశారు.. అసలు భర్తతో కలిసిలేని భార్యకు ఏం తెలుస్తుందంటారు.. పేషెంట్‌కు ట్రీట్మెంట్ చేయని డాక్టర్ ఏం చెప్పగలడు.. ఇదీ అంతే.. అని మోనిత రెచ్చిపోతుంది. ఇక ఆపు మోనిత అని భారత అంటుంది. ఏంటి భారతీ ఎందుకు ఆపాలి. ఓ డాక్టర్‌గా, బాధితులురాలిగా మారతాను.. గైనకాలజిస్ట్, ప్రేయసిగా మాట్లాడతాను.. కార్తీక్ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిలా మాట్లాడతాను.. అని మోనిత అంటుంది.

    మా ఇద్దరి గురించి ఏమీ తెలియదని నేను అనుకోను. మా గురించి అన్ని చోట్లా వచ్చాయి.. అయితే వచ్చిన దాంట్లో నిజానిజాలు పూర్తిగా తెలియవు.. అవి చెప్పేందుకే వచ్చాయి. అందుకే వచ్చాను.. అందరూ ఏకగ్రీవంగా కార్తీక్‌ను ఎన్నుకున్నారు అంటూ మోనిత మాట్లాడుతూ ఉంటే.. కార్తీక్ వెళ్లిపోయేందుకు లేచి నిల్చుంటాడు. కార్తీక్ ప్లీజ్ కూర్చో.. నిజాలు చెబుతాను.. అందులో అబద్దాలుంటే.. చివరకు నువ్ చెప్పు.. అని మోనిత కౌంటర్లు వేస్తుంది.

    కార్తీక్ చెడ్డవాడు అని నేను అనడం లేదు.. నాకు న్యాయం చేస్తేనే ప్రెసిడెంట్‌గా కొనసాగుతాడు అని మోనిత అంటుంది. దీంతో భారతి భర్త రవి లేచి.. మోనిత ఏంటి న్యూ సెన్స్.. పర్సనల్ మ్యాటర్స్ ఈ డాక్టర్స్ ఫంక్షన్‌లో ఏంటి.. ఏంటిది రచ్చ అని అంటాడు..దీంతో మోనిత కౌంటర్ వేస్తుంది. రవి బాగా చెప్పాడు..ఈ ప్రెసిడెంట్ ఎందుకు? మనలో ఎవరికి కష్టం వచ్చినా న్యాయం కోసం కదా?.. నేను ఈ అసోసియేషన్‌లో సభ్యురాలిని కదా?. అందరికీ న్యాయం చేస్తాను అన్న కార్తీక్.. నాకు అన్యాయం చేశారు.. అని మోనిత అంటుంది.

    ఇక మరో డాక్టర్ లేచి అసలు పాయింట్‌కు రండి అని అంటుంది.. కట్టుకున్న భార్య అలిగి వెళ్లిపోతే.. నా దగ్గరకు వచ్చేవాడు.. పెళ్లి చేసుకుంటాను అన్నాడు.. నమ్మాను.. పెళ్లి పీటల మీద కూర్చున్న తరువాత.. ఈ మహానుభావురాలు కార్తీక్ అమ్మగారు.. పీటల మీద నుంచి కార్తీక్‌ను లాక్కెళ్లింది.. గుండెలు పగిలేలా ఏడ్చేశాను.. పెళ్లాడతాను అని వందల మంది క్యూలో నిల్చున్నారు.. అయినా వందల మందిని కాదని కార్తీక్‌తో పెళ్లికి సిద్దమైతే.. వాళ్ల అమ్మగారు లాక్కెళ్లారు..

    నేనేం కావాలి.. అందరికీ మా గురించి తెలిసింది.. నా బతుకు మోడుపోయింది. వేరే వాళ్లు నన్ను చేసుకోరు.. నన్ను కాదంటారు.. నేను ఏమై పోవాలి.. నాకు అన్యాయం జరిగింది.. నీ భర్త రవి చేస్తే నీకు తెలుస్తుంది. రెంటికి చెడ్డ నావ అయింది.. చావలేనూ బతకలేనూ.. కార్తీక్ నా ప్రేమ ఒప్పుకోడు.. నా ప్రేమ చావదు.. దిక్కుతోచని పరిస్థితిలో.. బిడ్డకు తండ్రినయ్యాను.. ఆర్టిఫిషయల్ ఇన్‌సిమినేషన్.. బిడ్డ పేగు మెడలో.. గుళ్లో దంపతులుగా శాంతి పూజ చేశాం.. సాక్ష్యాలు నా చేతిలో ఉన్నాయి.. కార్తీక్ వల్ల కలిగిన కొడుకు అక్కడున్నాడు.. గుండెల్లో ఇంకా కార్తీక్ మీద టన్నుల కొద్దీ ప్రేమ ఉంది.. పెద్దల్లారా? తోటి డాక్టర్ లారా.. మీరే చెప్పండి.. నన్ను స్వీకరించడం లేదు.. మీరే నాకు న్యాయం చేయండి..

    జైలుకెళ్లాను, శిక్షను అనుభవించాను.. బిడ్డను కన్నాను లేదు.. నన్ను అంగీకరించడం లేదు.. నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు.. మోసగాడా? అమాయకుడా? తెలివైన వాడని అనాలా?.. మీరే చెప్పండి.. మోనిత బతుకు ఇలా అన్యాయం అయితే.. మీరు మాత్రం అతడిని అందలం ఎక్కిస్తారు.. ప్రెసిడెంట్‌ను చేస్తారు.. అని మోనిత రెచ్చిపోయి నటిస్తుంది. దీంతో దీప రంగంలోకి దిగుతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మోనిత పరువుతీసేలా ఉంది దీప. ఇక చివరకు మోనిత మళ్లీ రెచ్చిపోయినట్టుంది. ఆనంద్ రావు గారు మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యాడురా? అని చెబుతుంది మోనిత. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్టర్ బాబు.. నిన్ను చంపేస్తాను మోనిత అని ఆవేశపడిపోతాడు. కానీ సౌందర్య మాత్రం ఆపుతుంది. నీక్కూడా ఆడపిల్లలున్నారు.. వాళ్లకు కూడా నాలానే అంటూ పూర్తి చేసేలోపు.. దీప ఆగ్రహావేశాలతొ వస్తుంది.. ఇంకోసారి నా బిడ్డల గురించి మాట్లాడితే అంటూ మోనితకు వార్నింగ్ ఇచ్చేసింది.

    Leave a Reply