- November 27, 2021
Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనితను ఉతికించేసేలా వంటలక్క ప్లాన్

Karthika Deepam కార్తీక దీపం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అంటే శనివారం జరగనున్న 1208వ ఎపిసోడ్‌లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంతో సంతోషంగా ఉంటారు. కార్తీక్ ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయి. అలా అందరూ సంతోషంగా ఉంటే మోనిత కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఏదో ఒక ప్లాన్ వేస్తుంది కదా.. కార్తీక్ ఇంటి ముందే వచ్చి గూఢచారిలా కాపాలా కాసేసింది. శనివారం నాడు ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.
ఆనంద్ రావు, సౌందర్యలు వాకింగ్ కోసం రెడీ అవుతుంటారు. ఈ రోజు ఎందుకు కొత్తగా ఉందండి అని సౌందర్య అంటుంది. అన్ని కష్టాలు పోయాయ్.. మన దీప అలా ఒక్క దెబ్బతో అందరి కష్టాలను దూరం చేసిందని సౌందర్య అంటుంది. నాక్కూడా ఎంతో హ్యాపీగా హాయిగా ఉంది.. నిజానికి ఉన్న గొప్పదనం అదే అని ఆనంద్ రావు అంటాడు.. మేం కూడా వస్తాం నాన్నమ్మ అని పిల్లలు అంటారు.
మీరు ఎందుకే హాయిగా పడుకోండి అని సౌందర్య అంటే.. కొత్తగా అన్నావ్ కదా? రానివ్వు సౌందర్య అని ఆనంద్ రావు అంటాడు. సరే మీ అమ్మకు చెప్పి రండి అని సౌందర్య అంటుంది. ఇక మరో వైపు.. కార్తీక్ ఇంటి బయట క్యాబులో ప్రియమణి, మోనిత ఎదురుచూస్తుంటారు. కార్తీక్ అయ్య ఇంటికి అన్నారు.. బయట ఎందుకు వెయిట్ చేస్తున్నాం.. లోపలికి వెళ్లొచ్చు కదా? అని ప్రియమణి అంటుంది.
నా ప్లాన్లు నాకు ఉంటాయ్ కదా? నువ్ నోర్మూసుకుని ఉండు అని మోనిత కసురుకుంటుంది. ఇంకో చివరి అనుమానం అమ్మగారు అని ప్రియమణి అంటుంది. ఏంటో అడుగు అని మోనిత అనేస్తుంది. ఇలా క్యాబ్‌లో ఎందుకు వచ్చాం.. గూఢాచారిలా ఎందుకు చేస్తున్నాం.. అని అడుగుతుంది. కార్తీక్‌ను ఫాలో అవ్వాలి అంటూ మోనిత చెబుతుంది..ఏంటో ఈ మోనితమ్మ గారి ఆలోచనలు అంతు చిక్కవు అని లోలోపల ప్రియమణి అనుకుంటుంది.. నువ్ హ్యాపీగా ఉంటే నేను ఊరుకుంటానా? దాన్ని చెడగొట్టేందుకు నేను ఉన్నాను.. కదా? అని దీప గురించి మోనిత అనుకుంటుంది.
ఇక ఇంట్లో కార్తీక్, దీపలు సరసాలు ఆడుకుంటారు. తల తుడుస్తూ కబుర్లు చెప్పుకుంటారు. టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగితే.. ఉప్మా చేయమని అంటాడు. మీరు కోపంగా ఉన్నప్పుడే ఉప్మా తింటారు కదా? అని దీప అంటే.. ప్రేమ పొంగొ పొర్లినప్పుడు కూడా ఉప్మానే అడుగుతాను అని కార్తీక్ అంటాడు. ఇలా అమ్మానాన్నలు హాయిగా నవ్వుతూ ఉండటం చూసి పిల్లలు సంబరపడతారు. డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటారు. ఇంతలోపే కార్తీక్ చేస్తాడు. ఏమైందిరా అక్కడే ఆగిపోయారు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నమ్మ వాళ్లతో కలిసి మేం కూడా వాకింగ్ వెళ్తామని అడుగుతారు. సరే వెళ్లండి అని దీప అంటుంది.
టిఫిన్ ఏం చేయమంటారు అని పిల్లలను అడిగితే..ఉప్మా చేయమని అంటారు. పిల్లలు అలా అనడంతో దీప షాక్ అవుతుంది. మీరు అడిగింది విని అలా అన్నారా? లేక నిజంగానే ఉప్మా చేయమన్నారా? అని డాక్టర్ బాబుతో వంటలక్క అడుగుతుంది. వచ్చాకు నువ్వే అడుగు మరి అని కార్తీక్ సెటైర్ వేస్తాడు. నేను అడిగితే ఏదో ఒకటి చెబుతారు వద్దులేండని దీప అంటుంది. వెళ్లి ఉప్మా పని చూడు అని దీపకు చెబుతాడు కార్తీక్.
ఏంటమ్మా మనకీ కష్టాలు.. కారులో కూర్చుని ఇంటి బయట ఈ కాపలాలు ఏంటి అని ప్రియమణి అంటుంది.. ఎంత గొడవ అయితే అంత మంచిది.. అన్ని లాభాలు.. అని మోనిత అంటుంది. ఇంతకు ముందు మీ ప్లాన్లు కొద్దొగొప్పో అర్థమయ్యేవి.. ఇప్పుడు అర్థమవ్వడం లేదు అని మోనిత అంటుంది.. నీ బుర్రకు ప్లాన్ అర్థమైందంటే.. నా ప్లాన్ ఫెయిల్ అయినట్టే అంటూ మోనిత కౌంటర్ వేస్తుంది.
వాకింగ్ కోసం బయటకు వచ్చిన ఆనంద్ రావు, సౌందర్యలను మోనిత చూసి ఆదర్శ దంపతులు వస్తున్నాంటూ కౌంటర్ వేస్తుంది. వారు చూడకుండా క్యాబ్‌లో దాక్కుంటుంది. ఏంటమ్మ గారు ఇంతకు ముందే వాళ్లు చూడాలి.. ఎన్ని గొడవలు పెట్టుకుంటే అంత మంచిది అన్నారు. ఇప్పుడేమో ఇలా దాక్కుంటున్నారు అని ప్రియమణి అంటుంది. ఏంటో మా అత్తగారి మొహంలో ఓ ధైర్యం ఉంటుంది. అది చూస్తే నాకు భయంగా ఉంటుంది. ఎంతైనా మా అత్తగారు కదా? ఆ మాత్రం భయం భక్తి ఉండాలి.
ఉప్మా చేయమంటే.. ఇన్ని చేశావ్ ఏంటి అని దీపను అడుగుతాడు కార్తీక్. మీకు ఇష్టమైంది. ఆదిత్యకు ఇష్టమైంది.. ఇలా అన్నీ చేసేశాను అని దీప అంటుంది. మీరు కూడా తినండని కార్తీక్ అంటాడు. తినడం కంటే వడ్డించడంలోనే ఎంతో ఆనందం ఉంటుందని దీప అంటే.. ఆ ఆనందం మేం కూడా చూస్తాం.. అయితే మీరు తినండి మేం వడ్డిస్తామని కార్తీక్ అంటాడు..అలా అందరూ నవ్వేసుకుంటారు.
మీరు ఎక్కడికైనా టూర్‌కు వెళ్లండి అన్నయ్య అని ఆదిత్య అంటాడు. దీంతో గతాన్ని గుర్తు చేసుకుంటా కార్తీక్. మాకు టూర్లు కలిసి రాలేదు అని కార్తీక్ అంటాడు. నువ్వే శ్రావ్యను తీసుకుని బయటకు వెళ్లు అని అంటాడు. దీపు గాడితో ఈ సమయంలో వెళ్లలేమని శ్రావ్య అంటుంది. హమ్మయ్య థ్యాంక్స్ శ్రావ్య.. ఎక్కడ వెళ్దామని అంటావో అని భయపడ్డానంటూ ఆదిత్య అనేస్తాడు. ఇక ఇంతలో మురళీకృష్ణ వస్తాడు. మోనిత బయట క్యాబులో వెయిట్ చేస్తున్న సంగతిని దీపకు చెబుతాడు. ఆ విషయాన్ని కార్తీక్‌తో దీప చెబుతుంది. దాని సంగతి నేను చూస్తాను అంటూ ఆదిత్య రెచ్చిపోతాడు. మోనిత సంగతి మేం చూసుకుంటాం.. మేం బయటకు వెళ్తాం కదా? మోనితకు నేన సమాధానం చెప్పుకోగలను అని దీప అంటుంది.
అయితే కార్తీక్, దీప బయటకు వచ్చే సరికి మోనిత దాక్కుంటుంది. కారు అక్కడ ఉండదు. మామాగారు భ్రమ పడ్డాడేమో అని కార్తీక్ అంటాడు. అంతే అంటారా? అసలే మోనిత మారు వేషంలో వచ్చినా వస్తుంది.. అంటూ దీప కూడా ఆలోచిస్తుండటంతో.. మోనిత వచ్చిందో లేదో కానీ నువ్ కూడదా క్రిమినల్ బుర్రతోనే ఆలోచిస్తున్నావ్.. అని కార్తీక్ నవ్వేస్తాడు. చాలా రోజులకు ఇలా నవ్వేశారు అని దీప అంటుంది.
కార్తీక్ కారును మోనిత ఫాలో అవుతుంది. ఇక బస్తీలో ఏర్పాటు చేసిన క్యాంపు వద్దకు మోనిత చేరుకుంటుంది. అక్కడ ఓ పేషెంట్ విషయం గురించి మాట్లాడుతాడు.. నా మొగుడు అలిగి వెళ్లిపోయాడు.. ఆడపిల్ల పుట్టలేదని వెళ్లిపోయాడు.. నాన్న కోసం ఏడుస్తున్నాడు.. అని ఆ పేషెంట్ అంటుంది. ఆడపిల్ల పుట్టకపోతే మీరేం చేస్తారు? మనిషేనా? మనసు అనేదే లేదా? కన్న తండ్రేనా వాడు.. అని కార్తీక్ అంటాడు.
ఇదే మాట నిన్ను అడిగితే..అని మోనిత ఎంట్రీ ఇస్తుంది. నా బిడ్డను, నన్ను వదిలేశావ్ అని మోనిత అనేసింది. వస్తాను అని ఊహించలేదా? ఏమన్నావ్ కార్తీక్..వాడసలు మనిషేనా? తండ్రేనా? అన్నావ్ కదా? నాకు చేసిన అన్యాయం ఇదే కదా? నీకో న్యాయం. వేరే వాళ్లకు ఒక న్యాయమా? అని మోనిత అందరి ముందు బరితెగించేసింది. ఇక బస్తీ వాసులకు రేపటి ఎపిసోడ్‌లో జరిగిన కథ అంతా చెబుతుంది. మోనితను చితక్కొట్టించేలా ఉంది. అందరూ చీపురు కట్టలతో మోనితను కొట్టేందుకు రెడీ అయ్యారు. మరి వచ్చే వారం ఏం జరుగుతుందో చూడాలి.