• November 26, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. సంతోషంగా దీప, కార్తీక్.. మోనిత కుట్ర షురూ

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. సంతోషంగా దీప, కార్తీక్.. మోనిత కుట్ర షురూ

    Karthika Deepam కార్తీక దీపం సీరియల్ నేటి ఎపిసోడ్‌ అంటే శుక్రవారం నాడు జరిగే 1207వ ఎపిసోడ్‌లో మోనిత ఏదో కుట్ర చేయబోతోందని అర్థమవుతుంది. మళ్లీ పావులు కదిపేందుకు సిద్దంగా ఉంది. లాయర్‌తో మోనిత మంతనాలు ఆడుతోంది. మరో వైపు కార్తీక్ దీప ఇద్దరూ సంతోషంగా గడిపేస్తుంటారు. ఎన్నో రోజుల తరువాత ఇలాంటి క్షణాలు వచ్చాయంటూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తుంటుంది.

    డాక్టర్ బాబు ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తుంటాయి. అందరూ కలిసి ఆటపాటలు ఆడుకుంటూ ఉంటారు. కొడుకులు, కోడళ్ల టీం అంటూ ఆటలు ఆడుకున్నారు. అందులో వంటలక్క ఓ పొడుపు కథను వేసింది. ఎంతైనా వంటలక్క కదా? తన తెలివి తేటలు ఎక్కడికిపోతాయి. ఓ చిక్కు ప్రశ్నను వేసింది. దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు.

    నీటిలోంచి పుడుతుంది.. నీళ్లో పడితే చస్తుంది.. అదేంటి? చెప్పండని వంటలక్క తన తెలివిని ప్రదర్శించింది. సమాధానం చెప్పలేక డాక్టర్ బాబు, ఆదిత్య ఇద్దరూ జుట్టు పీక్కున్నారు. మొత్తానికి వంటలక్క దాని సమాధానం ఉప్పు అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. అరే రైటే కదా? అని అనుకున్నారు. ఆ తరువాత సౌందర్య స్వీట్లు తీసుకొచ్చింది.

    మాకు ఇవ్వవా? మమ్మీ అంటే.. మీరు ముందు జంటలుగా కూర్చుంటే ఇస్తాను అని అంటుంది. అలా కార్తీక్, దీప ఒక్క చోటకు.. ఆదిత్య, శ్రావ్యలు మరో జంటగా కూర్చున్నారు. ఆదిత్య ఎప్పుడూ ఒక పని చేస్తావ్ ఇప్పుడు ఏం చేయడం లేదు ఎందుకు? అని సౌందర్య అంటుంది. సెల్ఫీ తీయరా? ప్రతీసారి తీస్తావ్ కదా? ఇప్పుడు ఎందుకు తీయడం లేదు అని సౌందర్య అంటుంది.

    దీంతో ఆదిత్య సెల్ఫీ తీస్తాడు. ఇది కదా? సెల్ఫీ అంటే.. అద్భుతంగా ఉంది.. ఫ్రేమ్ కట్టేద్దామని అంటాడు. అలా సంతోషంగా గడిపేస్తుంటారు. నాన్నమ్మ కథలు చెప్పవా? అని శౌర్య అంటే.. నానమ్మకు కథలు రావు అని హిమ అంటుంది. మీ అమ్మ అంత రావు కానీ నాకు కూడా ఒకటో రెండో కథలు వచ్చే అని సౌందర్య బుకాయిస్తుంది. అయితే చెప్పు అని ఆనంద్ రావు అంటాడు. మీరు కూడా ఏంటండి? పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా? అని సౌందర్య అంటుంది.

    పిల్లలు ఈ రోజు నా దగ్గరే పడుకోండి.. మీకు కథలు చెబుతాను.. నేను రాసుకున్న సొంత కథ చెబుతాను.. అని సౌందర్య అంటుంది. సొంత కథ అంట.. ఇంకోసారి మిమ్మల్ని కథ చెప్పమని అడగకుండా చేస్తుందేమో అని పిల్లలతో ఆనంద్ రావు జోకులు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు. ఇక డాక్టర్ బాబు, వంటలక్కలు కాస్త ఏకాంతంగా మాట్లాడుకుంటారు.

    దీప కోసం కార్తీక్.. శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకాన్ని బహుమతిగా తీసుకెళ్తాడు. సంతోషిస్తుంది. కానీ గతాన్ని తలుచుకుని వద్దని అంటుంది. అప్పుడు అంటే నేను మూర్ఖంగా ఆలోచించాను కానీ ఈ పుస్తకం అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా? అని కార్తీక్ అంటాడు. ఇది కేవలం పుస్తకం కాదండి.. నా గురువు, నా జీవితం, నా స్నేహితురాలు.. ప్రతీ అక్షరం అక్షింతలుగా మారాయి నన్ను ఆశీర్వదించాయని చెబుతుంది.

    ఇక అందులో ఓ కవిత్వాన్ని గలగలా చెప్పేస్తుంది. అది విని డాక్టర్ బాబు సంబరపడతాడు. చూడకుండానే చెప్పేశావ్ అని ప్రశంసిస్తాడు.. ఆ పుస్తకం నా జీవితం అని దీప అంటే.. అది నీ జీవతం మాత్రమే కాదు.. నా జీవితం కూడా.. మన సంసార ప్రస్థానం కూడా..నిన్నటిని మరిచిపోయి ఈ రోజే సరికొత్తగా పుడదాం.. నేను నిన్ను చాలా కష్టపెట్టాను, బాధ పెట్టాను.. తప్పులు చేశాను.. క్షమించు దీప అని అడుగుతాడు..

    కాసేపు అలా కోపంగా చూసిన దీప.. కార్తీక్‌ను కంగారు పెట్టిస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చి పనులు చేయించుకున్నట్లు.. నాకు ఈ పుస్తకం ఇచ్చాక నేను కాదంటానా? ఈ రోజు నుంచి కొత్తగా పుడదామని మీరే చెప్పారు కదా? అని దీప అంటుంది. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా పోరాడుతున్నావ్ దీప అని కార్తీక్ అంటాడు… జీవితంలో ప్రతీ రోజూ కొత్త పోరాటమే కదా?. బస్తీలో బతుకు నేర్చుకున్నాను అని అంటుంది

    బస్తీ అంటే గుర్తుకు వచ్చింది.. బస్తీ నుంచి లక్ష్మణ్ ఫోన్ చేశాడు. ఇప్పుడు అవన్నీ అవసమా? అని కార్తీక్ అంటే.. లేదు డాక్టర్ బాబు అక్కడ ఎవ్వరికీ ఆరోగ్యాలు బాగుండటం లేదట అని దీప చెబితే.. బస్తీలో హెల్త్ క్యాంప్ పెడదామని అంటాడు డాక్టర్ బాబు..మీరు ఎంత మంచివారో.. ఇలా అడగ్గానే అలా పెట్టేస్తాను అని అన్నారు అని డాక్టర్ బాబు మీద ప్రశంసలు కురిపిస్తుంది.. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెబితే.. నువ్ చేసిన వాటికి లక్షల థ్యాంక్స్ చెప్పాలి బంగారం అని కార్తీక్ అంటాడు.. ఈ పిలుపు విని ఎన్నాళ్లైందో అని దీప మురిసిపోతుంది..

    ఇక సీన్ మోనిత మీద ఓపెన్ అవుతుంది. ఎన్నో అవమానాలు పడ్డాను.. నేను గెలవాలి.. కచ్చితంగా నేనే గెలవాలి అని లాయర్‌తో ఫోన్లో మాట్లాడుతుంది. నేను చెప్పిన వాటిని ఏర్పాటు చేశారా? అని లాయర్ సురేష్ అంటాడు. తప్పకుండా మనమే గెలుస్తాం.. న్యాయం నీవైపే ఉందని లాయర్ అంటాడు. ఇక మోనిత ఈ మాటలన్నీ వింటూనే ఉంటుంది. ప్రియమణి కాఫీ అని అడిగిన వెంటనే తెచ్చిస్తుంది. ఏంటి ఇలా అడగ్గానే వచ్చావ్.. అంటే వింటున్నావా? అని ప్రియమణి అంటుంది. ప్రియమణి మనం బయటకు వెళ్లాలి రెడీ అవ్వు అని మోనిత అంటుంది..

    ఎక్కడికి అని అడగవా? అని మోనిత ప్రశ్నిస్తుంది. అడిగితే కోప్పడతారు కదా అమ్మా? అని ప్రియమణి అంటుంది. నువ్ కూడా జాగ్రత్త పడతున్నావ్ కదా? దీప ఇంట్లో కొన్ని రోజులే పని చేసినా కూడా దీప లౌక్యం నేర్చుకున్నావ్.. వెళ్లు త్వరగా వెళ్లు రెడీ అవ్వు.. మనం కార్తీక్ ఇంటికి వెళ్లాలి.. అని మోనిత అంటుంది. దీంతో ప్రియమణి షాక్ అవుతుంది. నీ రియాక్షన్ నాకు నచ్చుతుంది.. అందుకే అడక్కపోయినా చెప్పాను.. అంటూ మోనిత నవ్వుతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో హెల్త్ క్యాంప్ వద్దకు వెళ్లి కార్తీక్ పరువు తీయాలని మోనిత చూస్తుంది. మరి వంటలక్క ఏం చేస్తుందో చూడాలి.

    Leave a Reply