- November 25, 2021
Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. మోనితను చిత్తు చేసిన దీప.. కాళ్లు మొక్కాలన్న డాక్టర్ బాబు

Karthika Deepam కార్తీక దీపం సీరియల్‌లో మోనిత చేసే పనులు, అరాచకాలకు దీప ముగింపు పలికింది. బారసాల అంటూ రెచ్చిపోయిన మోనితకు దీప షాకిచ్చింది. ఇన్ని రోజులు ఏడుస్తూ బాధపడుతూ అందరినీ టెన్షన్ పెట్టిన దీప.. సైలెంట్‌గా తాను చేయాల్సిన పనులు చేసింది. కావాల్సిన సాక్ష్యాలను సేకరించేసింది. అందరి ముందు మోనిత పరువు తీసేసింది. గురవారం నాడు అంటే కార్తీక దీపం 1206 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
దొంగ సాక్ష్యాలు, శాంపిల్స్ కొట్టేయడం..మా చిట్టి చెల్లికి ఎన్ని విద్యలు తెలుసో? అని దీప అంటుంది. ఏంటి దీపక్క.. ఏం మాట్లాడుతున్నావ్..నువ్ అన్నీ అబద్దాలు చెబుతున్నావ్.. పది మందిలో గౌరవం కోసం ఈ తాళిని నేనే కట్టుకున్నాను.. అది ఒప్పుకుంటున్నాను. కానీ ల్యాబ్‌లో దొంగతనం అన్నావ్ అది మాత్రం అబద్దం.. కార్తీక్ వల్లే తల్లినయ్యాను.. ఓ రోజు రాత్రి బాగా తాగి వచ్చి అని మోనిత పూర్తి చేసే లోపే..నోర్మూయ్..మోనిత అంటూ దీప శివాలెత్తింది.
నోటికొచ్చినట్టు మాట్టాడితే చెంప పగలగొడతాను..డాక్టర్ బాబు మీద నిందలు వేస్తే ఊరుకునేది లేదు.. ఏమనుకుంటుకున్నావ్.. బారసాలకు వచ్చి.. నువ్ పెట్టింది తిని.. చాటుకెళ్లి ఏడ్చి.. బస్తికి వెళ్తాను అని అనుకుంటన్నావా? అబద్దం అందంగానే ఉంటుంది.. కానీ ఆ ముసుగు మాత్రం ఎక్కువ రోజులు ఉండదు.. ఏది అబద్దమో ఏది నిజమో తేలుస్తా? నీకు ఇచ్చి బ్యాగ్ తీసుకురా ప్రియమణి అంటూ దీప ఆర్డర్ వేస్తుంది..
మోనిత నీ బతుకే అబద్దం, నీ మాట అబద్దం, నీ ఆలోచన అబద్దం.. ఇన్ని అబద్దాల మధ్య బతుకుతున్నావ్.. జైలుకెళ్లి బతుకొచ్చావ్.. ఇంకా శిక్ష పూర్తి కాలేదు కదా?. కొత్త శిక్షలకు కూడా మళ్లీ అనుభవించేవ్ ఆగు.. బ్యాగుతో వచ్చింది.. ఇటు నుంచి ఇటే బస్తీకి వెళ్తాను అని అనుకున్నావ్ కదా?. ల్యాబ్ ఓనర్ రాసిచ్చిన పేపర్లు.. నువ్ శాంపిల్స్ తీసుకున్నావ్ అనే దానికి సాక్ష్యం అని దీప అంటే.. ఈ పేపర్లు అబద్దం.. నేను శాంపిల్స్ తీసుకోలేదు.. నాది సహజ గర్భం అని మోనిత మళ్లీ మొదటికే వస్తుంది..
నీ గుండె ఆగిపోయే సాక్ష్యం చూపిస్తాను అంటూ ల్యాబ్ ఓనర్ మాట్లాడిన.. వీడియో సాక్ష్యాన్ని చూపిస్తుంది దీప..చిట్టి చెల్లి ఇప్పుడు చెప్పమ్మా.. అరువమ్మా.. నీది సహజ గర్భమా? డాక్టర్ బాబు తాగొచ్చి తప్పు చేశాడా?.. ఆయన నీకు శ్రీవారు.. ఆమె అత్తగారు.. బారసాల.. అతిథులు.. ఆర్భాటాలు.. ఏం చెల్లమ్మ.. మాట్లాడవేంటి? అని దీప సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది
బారసాల లేదు ఏం లేదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అందరినీ వెళ్లమంటుంది మోనిత. దీంతో అతిథులందరూ వెళ్తారు.. ఇంతటితో అయిపోయిందని అనుకోకు దీప.. నా ప్రేమ అనంతం.. అందరూ కలిసిపోయాయని..అంతా ఒక్కటయ్యారని సంబరపడకు.. సినిమా అయిపోలేదు దీప.. నేను ఏం చేయగలనో.. ఏం చేస్తానో.. మీరు ఊహించలేరు.. అని మోనిత రెచ్చిపోయింది.
అలా మోనిత వాగుతుంటే.. సౌందర్య చెంప చెల్లుమనిపించింది. నా కోడల్ని నువ్ ఏం చేయలేవ్. అది బంగారమే. నువ్ ఎన్ని నీచమైన పనులు చేసినా కూడా కనిపెట్టింది.. ఇకనైనా ఒక మనిషిలా బతుకు.. పద దీప.. రారా పెద్దోడ..అని అందరూ వెళ్తుంటారు. వెళ్లండి.. అంతా అయిపోయిందని అనుకోకండి.. మోనిత.. ఇక్కడ.. ఈ ఫైల్ చాలు.. మీ పని అయిపోయితుంది.. ఖేల్ ఖతం.. వారం రోజుల్లో మీ పని క్లోజ్.. అంటూ మోనిత ఎంత అరుస్తున్నా.. నవ్వుకుంటూ ఓ చిన్న చూపు చూసి వెళ్లిపోతారు. దీంతో మోనితకు ఇంకా కాలిపోతుంది.
దీప మాటల గుర్తు చేసుకున్న కార్తీక్ తనలో తాను బాధపడుటాడు. దీప వస్తే కన్నార్పకుండా చూస్తుంటాడు.. ఎందుకని నన్నే చూస్తున్నారు అని కూడా అడగవా? ఆడది సహన శీలి.. నీకు అన్నీ తెలుసు.. ఏమీ తెలియనట్టు ఉన్నావ్.. మగాడికి ఆవేశం తప్పా ఆలోచన ఉండదు.. మోనిత కుట్రతో మనిద్దరి మధ్య దూరం పెరిగింది.. సహజ గర్భం అని చెప్పేసరికి నాకంతా తలికిందులైంది.. భూమి రెండుగా చీలిపోయిందని అకున్నాను.. అందులో నేను పడిపోతే బాగుండు అని అనిపించింది.. ఆ విషయాలు నీకు చెప్పాలనుకున్నాను.. చెప్పలేకపోయాను..
ఇద్దరి మధ్య దూరం పెరగాలంటే చిన్న మౌనం, చిన్న మనస్పర్థ చాలు.. ఇది మనిద్దరి కంటే బాగా ఎవ్వరికీ తెలియదేమో.. పదకొండేళ్ల దూరం కదా? తప్పోఒప్పో నీకు చెప్పాల్సింది.. అప్పుడు అరిచేస్తుందేమో కానీ దాచిపెడితే.. అది మోసం అవుతుంది.. దోష నివారణ పూజలు అని అవి ఇవి చేయడం, నీకు చెప్పక పోవడంతో నన్ను నీకు మానసికంగ దూరం చేసింది..
అప్పుడు అనుమానంతో నిన్ను అమాయకంగా దూరం చేసుకున్నాను.. పదకొండేళ్లు అంటే మామూలు దూరం.. మోనిత మన నమ్మకం అనే గొడను బద్దలు కొట్టింది.. అప్పుడు నీ మీద అనుమానం వచ్చేలా చేసింది. ఇప్పుడు రివర్స్‌లో కొట్టింది.. నా మీద అనుమానం వచ్చేలా చేసింది.. సహజ గర్భమని చెబితే.. నువ్ వెళ్లిపోతావ్ అని అనుకుంది. ఆ రోజు నిన్ను చెడ్డదాన్ని చేసింది.. ఈ రోజు నన్ను చెడ్డదాన్ని చేసింది.. అప్పుడు నేను నమ్మాను.. కానీ నువ్ నమ్మలేదు..
అదే మనిద్దరి మధ్య తేడా.. మగాడు ఆడదాన్ని తన సొత్తు అని అనుకుంటాడు. కానీ భార్యకు భర్తే తన ప్రపంచం.. జీవితమని అనుకుంటుంది. ఇక్కడే మగాడు స్త్రీ ముందు తగ్గిపోతాడు.. మోనితకు నొప్పులు వస్తే.. వెళ్లి సంతకం చేసివచ్చాను.. నీ ముందు తప్పించుకున్నాను.. అబద్దాలు చెప్పాను.. అదే విషయం నీకు చెబితే నువ్వే తీసుకెళ్లేదాని..
నీలో అంత మానవత్త్వం లేదా? అని అనుకున్న అమాయకుడిని.. నువ్వే తీసుకెళ్లేదానివి లేదా వేరే ఏ మార్గమైనా చెప్పేదానివి.. ఆ విషయం నీకు చెప్పకుండా.. భర్తగా సంతకం చేసి ఆయుధాన్ని మోనితకు ఇచ్చాను.. అంతటి భారాన్ని మోసి.. ఒంటరిపోరాటం చేసి.. మోనిత మొహం పగలగొట్టావ్.. అలా కాకుండా నువ్ కూడా నన్ను అనుమానిస్తే.. నేను ఏమైపోయేవాడిని.. ఇంత ఓర్పు, నేర్పు మీ ఆడవాళ్లకు ఎక్కడిది.. అంటూ డాక్టర్ బాబు ఎమోషనల్ అవుతాడు.
నమ్మకం అనే పునాది మీద జీవితం ముందుకు వెళ్తుంది. మొదటి సారి ల్యాబ్ ఓనర్ చాలా నటించాడు. రెండో సారి దొరికిపోయాడు అని దీప అంటుంది.. ఉదయాన్నే లేచి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారించాలని అంటారు కానీ భార్య కాళ్లకు కూడా దండం పెడితే బాగుంటుంది.. అని డాక్టర్ బాబు అంటాడు.ఏంటండి మీరు.. అంటూ అప్పుడే డాక్టర్ బాబు కాళ్ల మీద దీప పడబోతోంది. నేను చేయాలనుకున్న పని నువ్ చేస్తున్నావా? అని దీపను కార్తీక్ అంటాడు. అయితే మోనిత మళ్లీ లాయర్‌ను పిలిపించింది. దీంతో మరో కుట్రకు తెరదీసినట్టు కనిపిస్తోంది. సుఖాంతం అనుకునే లోపే ఇంకో మలుపు వస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.