• November 24, 2021

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. వంటలక్క రాక్స్ మోనిత షాక్

Karthika Deepam : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. వంటలక్క రాక్స్ మోనిత షాక్

    కార్తీక దీపం సీరియల్‌లో ఇప్పుడు బారసాల ప్రధానంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళ వారం నాటి ఎపిసోడ్‌లో మోనిత ఇంటికి దీప వస్తుంది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. ఏం మోనిత అన్ని ఏర్పాట్లు చేశావా? పంతులు వచ్చారా? అని దీప అడుగుతుంది. పంతులు వస్తున్నారు.. కానీ కేటరింగ్ వాళ్లే రావడం లేదు హ్యాండ్ ఇచ్చారు అని మోనిత అంటుంది.. ఏంటి మోనిత ఇలా చేశావ్? నీ కార్తీక్ వస్తున్నాడు.. అత్తయ్య గారు.. నీ అత్తయ్య గారు వస్తున్నారు.. వాళ్లకు ఇష్టమైనవి చేసి వారి మనసు దోచుకోవచ్చు.. ఇంగ్లీష్‌లో ఏదో అంటారు.. అని దీప తడబడుతుంటే.. ఇంప్రెస్ అంటూ భారతి హింట్ ఇస్తుంది. ఆ అదే ఇంప్రెస్ చేయోచ్చు అని దీప అంటుంది.. ఆ వంటన్నీ నేను చేస్తాను లే.. మనసారా దీపక్క అంటావ్ కదా?.ఈ మాత్రం చేయకూడదా? అని దీప చొచ్చుకుపోతుంది.

    దీప, మోనితలను చూసిన గెస్టులు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇదేం విడ్డూరం.. ఆమె డాక్టర్ కార్తీక్ మొదటి భార్య కదా?.. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ పట్టించుకోవడం లేదులే.. పైగా ఆమె చదువుకోలేదట కదా? అని చెవులు కొరుక్కుంటారు.. ఆ తరువాత సీన్ కార్తీక్, సౌందర్య, ఆనంద్ రావుల మీద ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడకు రావడం ఏంటి? అని కార్తీక్ అసహనం వ్యక్తం చేస్తాడు.. మనం ఇక్కడకు వచ్చింది.. మోనిత కోసం కాదు.. దీప కోసం వచ్చామని సౌందర్య అంటుంది. దీప కోసం అయితే.. పుట్టింటికి వెళ్లాలి.కానీ ఇక్కడకు ఎందుకు? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు..

    దీప వెళ్లడానికి కారణం ఏంటో మనకు తెలుసు.. అందుకే ఇక్కడకు వచ్చామని సౌందర్య అంటుంది.. మళ్లీ మోనిత ఎలాంటి కుట్రలు చేస్తుందో అని కార్తీక్ భయపడిపోతుంటాడు.. దీపకు నేను ఇస్తున్న గౌరవం అనుకో.. నా పెద్ద కోడలి మీద నాకు ప్రేమ అనుకో తను రమ్మంది.. నేను వచ్చాను.. నీకు నా మీద గౌరవం ఉంటే రా .. లేదంటే వెళ్లిపో..అని సౌందర్య కారు దిరుగుతుంది. ఆనంద్ రావు కూడా దిగుతాడు. ఇక చేసేదేం లేక కార్తీక్ కూడా దిగుతాడు.

    వారణాసి ఆటోను కార్తీక్ చూస్తాడు. అంటే దీప వచ్చింది అని అనుకుంటాడు. వారణాసి దీప వచ్చిందా?.. వచ్చింది డాక్టర్ బాబు.. బ్యాగ్ సర్దుకుని వచ్చింది.. నాకు భయమేస్తోంది.. అక్క మనల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయేట్టు కనిపిస్తోంది.. అని వారణాసి కంటతడిపెట్టేస్తాడు. వారణాసి ఏడ్వకు.. ఎక్కడకు వెళ్తుందో నేనూ చూస్తాను..అని కార్తీక్ అంటాడు.

    కార్తీక్, సౌందర్య, ఆనంద్ రావులు ఇంట్లోకి అడుగుపెడతారు. దీపక్క.. వంటలు అవుతున్నాయా? నీకు ఇంకొకరిని హెల్ప్‌కు పంపించాలా? వంటల గురించి నువ్ అస్సలు టెన్షన్ పడకు.. అని మోనిత, దీప మాట్లాడుకోవడం చూస్తారు. దీంతో షాక్ అవుతారు. మీరు రారు ఏమోనని పాపం మోనిత టెన్షన్ పడుతోంది.. నేను చెప్పాను కదా? వాళ్లను తీసుకొస్తాను అని.. అలా చూస్తావేంటి? వెళ్లు.. వచ్చిన వాళ్లని ఆహ్వానించవా? అంటూ మోనితో దీప అంటుంది.. అలా దీప అనడంతో.. అన్నింటిని వదిలేసి త్యాగం చేస్తోందేమో అని మోనిత లోలోప మురిసిపోతుంది..

    వంటలక్కగా మారిన దీపను చూసిన డాక్టర్ బాబు ఫైర్ అవుతాడు. నీకు ఇక్కడేం పని.. నువ్ వంటలు చేయడం ఏంటి దీప అని కార్తీక్ అంటాడు.. వంటలక్క చేసేది వంటలే కదా? డాక్టర్ బాబు.. ఇందులో తప్పేముంది.. అని దీప అంటుంది. ఏంటి మోనిత అలా చూస్తున్నావ్.. బారసాల ప్రారంభించు.. ఉయ్యాలలో బాబును వెయ్యి.. కన్నతల్లివి కదా? నువ్.. అని దీప అంటుంది. పెద్దవారు ఆంటీగారు.. తన చేత్తో బాబును ఉయ్యాలలో వేస్తే బాగుంటుంది.. అని మోనిత అంటుంది. నీ ముచ్చట్లు అన్నీ తీర్చుకునేవు లే.. ముందు బారసాల ప్రారంభించు..అని దీప కౌంటర్ వేస్తుంది.

    దీపక్క ఈ రోజు ఈ కథకు ఏదో ఒక క్లైమాక్స్ ఇచ్చేలా ఉంది.. అని మోనిత మనసులో సంబరపడిపోతుంది. పంతులు గారు బారసాల ప్రారంభించండి.. మోనితకు కొత్త కదా?.. ఏం తెలీదు అని దీప అంటుంది. బాబును తీసుకురండి అని అంటాడు. ప్రియమణి తీసుకొచ్చి మోనిత చేతిలో పెడితే.. మోనిత ఆ బాబును సౌందర్య దగ్గరకు తీసుకెళ్లింది. కానీ సౌందర్య ఒక్క చూపు చూడటంతో మోనిత వెనక్కి తగ్గింది. దీంతో మోనితే బాబును ఉయ్యాలలో వేసింది. ఆనంద్ రావు అంటూ పేరును చెప్పింది. ఆ సమయంలో తాళి కూడా బయటకు కనిపించింది.

    బాబు తండ్రిని పిలవండి అని పంతులు అంటాడు.. ఏంటి మోనిత.. వచ్చినవారిని అందరికీ పరిచయం చేయవా? అని దీప అంటుంది. మా అత్తగారు, మా మావయ్య గారు.. మా వారు అని చెబుతుంది మోనిత. అందరినీ పరిచయం చేశావ్..నన్ను పరిచయం చేయలేదేంటి మోనిత అని దీప అంటుంది.. తను దీపక్క అని మోనిత అందరికీ పరిచయం చేస్తుంది..నేను నీకు అక్కను ఎలా అవుతాను.. పెద్దమ్మ కూతురినా? ఇంకేమైనా వరుసలో అక్కనా? అని ప్రశ్నిస్తుంది దీప..

    ఏంటి గేర్ మార్చింది.. అని మోనిత లోలోపల అనుకుంటుంది. చెప్పు మోనిత.. నీకు అక్కను ఎలా అయ్యాను..అని దీప అంటే.. ముందు బారసాలను కానివ్వండని పంతులు అంటాడు.. బాబుకు ఎప్పుడో పేరు పెట్టేసుకుంది.. బారసాలను ఎప్పుడైనా చేసుకోవచ్చు అని దీప అంటుంది. ఏంటి ఈ వావి వరసల గొడవు.. ఇంతకీ ఈవిడ ఎవరండి? అని దీప గురించి పంతులు అడుగుతాడు… ఈవిడే నా భార్య.. దీపే నా భార్య.. నా అర్థాంగి.. నా జీవితం.. నా ప్రపంచం.. అని డాక్టర్ బాబు చెబుతాడు. దీంతో పంతులు షాక్ అవుతాడు.

    ఈవిడ గారు మీ ఆవిడ అయితే.. ఆవిడ ఎవరు..? అని పంతులు అడుగుతాడు. మంచి ప్రశ్న అడిగారు.. ఈవిడ కథ ఏంటో కథాకమామీషు ఏంటో నేను చెబుతాను.. అని దీప అంటుంది. దీపక్క ఇవన్నీ అవసరమా? అని మోనిత అంటే .. ఇవన్నీ అవసరమే మోనిత చెల్లి.. అసలేం జరిగిందంటే.. నేను చెబుతాను.. పంతులు గారు అంటూ జరిగిన కథ అంతా వివరిస్తుంది. అలా నేను దేవుడిచ్చిన అక్కను అయ్యాను.. జరిగిన కథ అది అయితే.. జరుగుతున్నది వేరేలా అవుతుంది.. ముప్పై రూపాయలు పెట్టి.. పసుపు తాడు కొనుక్కుని.. తనకు తానే మెడలో వేసుకుంది.. ఇది తాళి ఎలా అవుతుంది.. దొంగ సాక్ష్యాలు, దొంగ మాటలు, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్స్ కొట్టేయడం అంటూ మోనిత గుట్టు మొత్తం విప్పేస్తుంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో సాక్ష్యాలన్నీ కూడా బయటపెట్టబోతోంది. దీంతో వంటలక్క దెబ్బకు మోనితకు దిమ్మతిరిగిపోయింది.

    Leave a Reply