• November 23, 2021

Karthika Deepam Episode 1204 : కార్తీక్ దీపం నేటి ఎపిసోడ్.. ఎక్కడ దెబ్బ కొట్టాలో బాగా తెలిసిన దీప.. దటీజ్ వంటలక్క

Karthika Deepam Episode 1204 : కార్తీక్ దీపం నేటి ఎపిసోడ్.. ఎక్కడ దెబ్బ కొట్టాలో బాగా తెలిసిన దీప.. దటీజ్ వంటలక్క

    కార్తీకదీపం సీరియల్‌లో ఇప్పుడు మంచి ట్విస్టు, టెన్షన్‌లతో సాగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో మోనిత కొడుకు బారసాల చుట్టే కథ నడుస్తోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం, దీప పుట్టింటికి వెళ్లిందన్న సంగతి తెలిసిందే. అక్కడ తండ్రితో దీప మాట్లాడుతూ ఉంటుంది. దీప ఒంటరిగా రావడం, అది కూడా పండుగపూట రావడంతో ఏం జరిగి ఉంటుందా? అని మురళీ కృష్ణ ఆందోళన చెందుతుంటాడు.

    బాగానే ఉన్నావా? అమ్మ అని దీపను ప్రశ్నిస్తాడు. బాగుండటం అంటే ఏంటి నాన్న.. సంతోషంగా ఉండటమా? ఉన్నట్టు నటించడమా?. అని అడుగుతుంది. అలిగి వచ్చాను అని అనుకుంటున్నారా?.. భయపడకు నాన్న.. అని దీప అంటుంది. పెళ్లి అయ్యాక కూతురు ఇలా వస్తే ఎందుకు నాన్న భయపడతావ్ అని దీప ప్రశ్నిస్తుంది. కూతురు పుట్టింకి వస్తే సంతోషిస్తాడు.. ఇలా ఒంటరిగా వస్తే ఏం జరిగి ఉంటుందా? అని భయపడతాడు.. అయ్యో నా కూతురికి ఏ కష్టం వచ్చిందో అని అనుకుంటాడు. అని మురళీ కృష్ణ అంటాడు. నాకు కష్టాలు కూడా బోర్ కొట్టేశాయ్ నాన్న అని దీప అంటుంది..

    ఆ మోనిత మళ్లీ ఏమైనా? అని మురళీ కృష్ణ అంటాడు. దాని గురించి మాట్లాడటానికి ఏముంది. మనకు ఏమైనా కొత్తనా? ఇంకేమైనా కొత్త విషయాలు చెప్పండి.. మీ ఆరోగ్యం ఎలా ఉంది..అని దీప ప్రశ్నిస్తుంది. పర్లేదు బాగానే ఉందమ్మా అని బదులిస్తాడు తండ్రి.. పిన్ని ఎప్పుడు వస్తుంది.. ఎందుకు వెళ్లింది. అని దీప అడుగుతుంది. ఆస్తి కోసం పుట్టింటికి వెళ్లింది? అని తండ్రి అంటాడు. ఇప్పటికీ ఆస్తి కోసంవెళ్లిందా పిన్ని గ్రేట్ నాన్న అని దీప అంటే.. ఏవో నాలుగు ఎకరాలు వస్తాయట.. నీకు, శ్రావ్యకు ఇద్దామని వెళ్లింది.. పుట్టింటి నుంచి ఇంత వరకు లాంఛనంగా ఏమీ ఇవ్వలేదని బాధపడుతుంది అని తండ్రి అంటాడు.

    నాకు ఎందుకు ఎకరాలు నాన్న శ్రావ్యకు ఇవ్వండి అని దీప అంటుంది.. ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి కదా? అని నాన్న అంటే.. దేవుడు నాకు అన్నీ ఎక్కువే ఇచ్చాడు కదా అవి నాకు ఎందుకు నాన్న అని దీప అంటుంది. కబుర్లుచెప్పుకుంటూ, భోజనం చేసి ఎన్నో ఏళ్లు అవుతోంది రా నాన్న తిందామని అంటుంది దీప. దీపకు ఏమైంది.. పండుగకు ఒక్కతె వచ్చింది.. అడిగితే ఏం చెప్పడం లేదు. ఏమైనా గొడవ జరిగిందా? అనుకుంటూ తనలో తాను మురళీకృష్ణ ఆందోళన చెందుతాడు.

    ఇక బారసాల పనులతో మోనిత ఫుల్ బిజీగా ఉంటుంది. అందరికీ పనులు చెబుతుంది. ప్రియమణిని అన్నింటిని చూసుకో అని చెబుతుంది. వచ్చినవాళ్లని మర్యాదగా పలకరించమని అంటుంది. ఇలా తెగ హడావిడి చేస్తున్న సమయంలోనే భారతీ కూడా వస్తుంది. రా భారతి.. నా ఆత్మీయుల్లో నెంబర్ వన్ నువ్వే కదా? అని మోనిత అంటుంది. ఏం చేస్తున్నావ్ మోనిత అంటే.. ఇంటిని ముస్తాబు చేస్తున్నాను బారసాల కదా? అని కౌంటర్ వేస్తుంది.. ? కార్తీక్ స్టాఫ్, నీ స్టాఫ్‌ని పిలుస్తున్నావట.. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అని భారతి ప్రశ్నిస్తుంది.

    బారసాల అంటే అందరినీ పిలవాలి కదా?.. అని అంటుంది. అంత బాగుండి అంత సవ్యంగా జరిగితే నువ్ చెప్పింది వర్కవుట్ అవుతుంది. అన్నీ సంప్రదాయంగా జరిగితే కదా? నువ్ చేయాల్సింది.. అని మోనిత కౌంటర్ వేస్తుంది భారతి. దీపక్కే చెప్పింది.. బారసాలకు ఏర్పాలు చేసుకోమ్మని.. అంటూ మోనిత చెబుతుంది. దీప మాట మీద నిలబడుతుందని అనుకున్నావా? అని భారతి ప్రశ్నిస్తుంది. నిలబడాలలి.. కార్తీక్ సంతకం పెడతాడని నువ్ అనుకున్నావా? గుళ్లోకి వచ్చి పూజ చేస్తాడు అని అనుకున్నావా? అనుకోలేదు.. ఇది కూడా అంటే అని మోనిత మొండిగా వాదిస్తుంది.

    స్టాఫ్ ఎంత మంది వస్తారో నాకు తెలీదు.. నువ్ మాత్రం రా… నీకు చెప్పినా మారవ్ నాకు తెలుసు కానీ నా ఫ్రెండ్‌వి కాబట్టి చెబుతాను.. నాకు పని ఉంది వెళ్తాను అని భారతి అంటుంది.. నేను ఎందుకు మారతాను.. నా చుట్టూ ఉన్న వాళ్లని మారుస్తాను..దీపక్కే మారింది.. రేపు బారసాల గ్రాండ్‌గా జరుగుతుంది.. ఎంతైనా ఆనంద్ రావు గారు లక్కీ..అని మోనతి అంటుంది. నాకు ఎందుకో డౌట్ అమ్మా రేపు ఏమైనా గొడవలు జరుగతాయోమోనని అనిపిస్తోందంటూ మోనిత ముందు ప్రియమణి అంటుంది. నువ్ భయపడి నన్ను భయపెట్టకు అని మోనిత కౌంటర్ వేస్తుంది. మీ ధైర్యం ఏంటమ్మా.. తాళిని చూపిస్తూ.. ధైర్యే సాహసే మోనిత.. అని అంటుంది

    ఇక ఉదయం కాగానే..కారులో కార్తీక్, సౌందర్య, ఆనంద్ రావులు బారసాలకు బయల్దేరుతారు. దీప మాటలను గుర్తు చేసుకుంటూ కార్తీక్, సౌందర్యలు తెగ కంగారు పడుతుంటారు.. ఏంటిది సౌందర్య మనం ఏం చేస్తున్నాం.. ఎక్కడికి వెళ్తున్నాం.. ఏం అర్థం కావడం లేదు అని ఆనంద్ రావు అంటాడు. అర్థం కాకపోవడానికి ఇంకేం మిగిలి ఉంది.. అంతా కళ్లకు కనిపిస్తోంది.. దీప గుళ్లో మనల్ని చూసినప్పటి నుంచి మోనిత ముందు అంతా చెప్పింది.. అయిపోయింది అంతా అయిపోయిందండి.. అని సౌందర్య కంటతడి పెడుతుంది.

    అయినా మనం మోనిత ఇంటికి వెళ్లడం ఏంటి?. అవసరమా?ఆలోచించండి.. అని ఆనంద్ రావు అంటాడు. అవును మమ్మీ.. వెనక్కి వెళ్దాం.. మోనిత ఇంక ఎన్ని ప్లాన్లు వేస్తుందో అని కార్తీక్ అంటే.. నువ్ మోనిత గురించి ఆలోచిస్తున్నావ్.. నేను దీప గురించి ఆలోచిస్తున్నావ్..నువ్ ఒక్క మాట అన్నావ్ అని అనుమానించావ్ అని 11 ఏళ్లు దూరంగా ఉంది.. అన్నీ తెలిశాక మన ఇంట్లో ఉంటుందా? నా పెద్ద కోడలిని ఇకపై చూడగలనా? అని వెళ్తున్నాను అండి.. సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తుంది.

    నువ్వే ఇలా ఏడిస్తే ఎలా సౌందర్య. మా ధైర్యం నువ్వే కదా? అని ఆనంద్ రావు అంటాడు. నా ధైర్యం దీపతో వెళ్లిపోయింది.. మళ్లీ ఇప్పుడు మోనిత ఇంటికి వెళ్లకపోతే.. ఇకపై దీపను చూడలేమని వెళ్తున్నా.. ఈ రోజుతో మనకు దీప దూరమవుతుందండి.. 11 ఏళ్లకు తిరిగి వచ్చిన దీప.. కల మెలుకువ వచ్చినట్టు వెళ్లిపోతుందా.. చివరగా మనకు చూసుకునే అవకాశం ఇచ్చిందేమో.. ఇన్నేళ్లలో ఎప్పుడూ నోరు తెరిచి అడగలేదు.. మొదటిసారిగా అడిగింది.. ఇదే ఆఖరి సారి అవుతుందేమో. ఏమో ఎవరికి తెలుసు.. అని సౌందర్య కంగారు పడుతుంది.

    దీపక్క నిజంగానే వస్తుందా? అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? అని మోనిత కంగారు పడుతుంది. ఏంటి భారతి నువ్ కూడా లేటుగా వస్తే ఎలా.. నా అత్తగారు, మామగారు నా కార్తీక్ రావాలి అని కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఓవర్ చేస్తున్నావ్ అని భారతి అంటే.. కొన్ని సార్లు ఓవర్ చేయాలని కౌంటర్ వేస్తుంది. మోనితకు ఏంటంత ధైర్యం ప్రియమణి అని భారతి అంటే… మనం చెబితే వినదు కదా? అమ్మా అని ప్రియమణి అంటుంది..

    ఏం జరుగుతుందా? అని టెన్షన్ మనం పడుతున్నాం.. మోనిత మాత్రం చూడు ఎంత జాలీగా తిరుగుతోంది.. ఓ మనిషి పడవలోంచి నీళ్లలో పడితే ఏం చేయాలి అని మోనిత అడుగుతుంది.. ఈదుకుంటూ రావాలి అని భారతి అంటుంది. ఇప్పుడు నేను చేసే పని కూడా అదే.. అయ్యో నన్ను రక్షించండి కాపాడండి అంటే ఏం జరగదు. ధైర్యం ఈదుకుంటూ ఒడ్డుకో, పడవ దగ్గరకో చేరుకోవాలి.. ఇదే నేను నేర్చుకున్న పాఠం.. టెన్షన్ పడితే పనులు కావు..అని మోనిత తన పిచ్చి పిలాసఫీని చెబుతుంది. ఇంకా మా అత్తగారు రావడం లేదు.. దీపక్క ఇంకా రాలేదు.. అసలు వస్తుందా? రాదా?.. అని మోనిత అనుకుంటూ ఉంటుంది.

    ఇక వారణాసి ఆటోలో దీపక్క దిగుతుంది. వెళ్లు వారణాసి అంటే.. నేను ఇక్కడే ఉంటాను అక్కా.. నా భయం వేస్తోంది అని అంటాడు. నేను నీకు భారం అవుతాను అని భయమారా? అని దీప అంటుంది. నువ్ నాకు భారమేంటి? దీపక్క అని వారణాసి బాధపడతాడు. ఏదైనా గొడవ జరుగుతుందేమోనని భయంగా ఉందక్క అని అంటాడు. ఏం కాదు వెళ్లు అని అంటుంది. ఇక బ్యాగుతో పాటుగా లోపలకి వచ్చిన వంటలక్కను చూసి మోనిత షాక్ అవుతుంది.

    బ్యాగ్ పట్టుకుని వచ్చిందంటే.. ఇటు నుంచి ఇటే బస్తీకి వెళ్తుందన్న మాట.. దీపక్క రా దీపక్క.. స్వాగతం అని చెబుతుంది మోనిత. పర్లేదు మోనిత గొప్పగానే చేస్తున్నావ్.. అని దీప అంటే.. అంతా నీ ఆశీర్వాదం దీపక్క అని మోనిత అంటుంది. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడైనా ఉంటుంది అని దీప అంటుంది. బాగున్నావా? డాక్టరమ్మ.. నువ్వే కదా? ఆపరేషన్ చేసింది.. ప్రియమణి బాగున్నావా? ఈ బ్యాగు లోపల పెట్టేసేయ్.. అడిగినప్పుడు ఇవ్వు అని దీప అంటుంది.

    అలా ఎపిసోడ్ గడుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మోనితకు దిమ్మతిరిగేట్టుంది. అన్ని సాక్ష్యాధారాలతో మోనిత గుట్టు విప్పేందుకు దీప రెడీ అయింది. ఈ బిడ్డకు తండ్రి కార్తీక్, కార్తీక్ వల్లే తల్లిని అయ్యాను అని మోనిత అంటుంది. ఒకరోజు రాత్రి తాగి వచ్చి అని మోనిత పూర్తి చేసేలోపు.. దీప అందుకుంటుంది. అసలు సంగతిని బయటపెట్టేస్తుంది. మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్‌ మాత్రం మంచి రసవత్తరంగా ఉండేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply