• November 22, 2021

Karthika Deepam Episode 1203 : దూరంగా వెళ్లిపోనుందా.. క్లైమాక్స్ అదిరిపోనుందా?.. వంటలక్క అవతారమెత్తిన దీప

Karthika Deepam Episode 1203 : దూరంగా వెళ్లిపోనుందా.. క్లైమాక్స్ అదిరిపోనుందా?.. వంటలక్క అవతారమెత్తిన దీప

    కార్తీకదీపం సీరియల్‌లో సోమవారం నాడు అంటే నవంబర్ 22న ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గతవారంలో అంటే శనివారం నాటి ఎపిసోడ్‌లో కార్తీక్ ఇంటికి వస్తుంది మెనిత. బారసాలకు అందరినీ ఆహ్వానిస్తుంది. బారసాలకు నేను తీసుకొస్తాను అని అంటున్నా కదా?నువ్ హ్యాపీగావెళ్లు.. నీకు చెప్పాను కదా? మోనిత.. ఈ సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్ చూపిస్తాను అని వెళ్లు.. అది రేపే ఉంటుంది.. బొకే తెచ్చినందుకు థ్యాంక్స్ అని మోనితకు దీప షాకిస్తుంది.. అత్తయ్య మీరు.. గుడికి వచ్చేలా కనిపించడం లేదు గానీ.. నేనూ పిల్లలు కలిసి వెళ్లోస్తాం..అని దీప అంటుంది.

    కారులో వెళ్తున్న మోనిత.. తనలో తాను భయాందోళనకు గురవుతుంది. దీపక్క ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేస్తోంది.. లబోదిబోమని ఏడవాలి.. కానీ ఆ ధైర్యం ఏంటి..పోనీలే ఏదో ధైర్యం తెచ్చుకోండని అనుకున్నాను. కానీ ఈ రోజు కూడా అలానే ఉంది. దీప ప్లాన్ ఏంటి? ఎటు నుంచి నరుక్కుని వస్తోంది.. దీపక్క ఏదో కొత్త ప్లాన్ చేసినట్టుంది.. మనసులో ఏముంది.. దీపక్క ఏం చేయబోతోంది.. ఎందుకు నన్నింత టెన్షన్ పెడుతుంది.. అప్పగింతలు చెప్పి.. నానన్న, తాతయ్యలు చెప్పిన మాటలు వినాలి.. నాన్న మాట వినాలి.. అలా ఇంట్లోంచి అస్తవ్యస్తంగా వెళ్ళిపోతుందని నేను ఊహించాను.. ప్రతీ సినిమాలో ఇలానే ఉంటుంది కదా? మరి దీపక్కకు ఏమైంది.. నేను ఊహించిన క్లైమాక్స్ కాకుండా.. కొత్తగా రాస్తుందా?.. నన్ను భయపెట్టాలని చూస్తుందేమో.. ఇక్కడి దాకా వచ్చాను.. ఇంకో అడుగు దూరంలో విజయ తీరంలో ఉన్నాను.. నేను భయపడటం ఏంటి? నువ్ అస్తమించే సూర్యుడి వైపు.. నేను ఉదయిస్తున్న సూర్యుడివైపు వెళ్తున్నాను.. నేను మా కార్తీక్, ఆనంద్ రావు, పిల్లలు, మరిది గారితో కలిసి ఉంటాను.. ఆ ఊహే ఎంత బాగుందో. నువ్ ఉత్తినే బెదిరిస్తున్నావ్ అని తెలిసిపోయింది దీపక్క..అంటూ మోనిత తనలో తాను అనుకుంటుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. సౌందర్య, కార్తీక్, ఆనంద్ రావుల మీద ఓపెన్ అవుతుంది. ఏంటి మమ్మీ.. దీప ఏం చేస్తోందో అర్థమవుతుందా? మనల్ని బారసాలకు తీసుకెళ్తానని అంటోంది.. అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా ఉంటోందని కార్తీక్ అంటాడు.. నిలదీసిన బాగుండేది.. నా మనసు తేలికపడేది. కానీ ఏం మాట్లాడటంలేదు.. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోయాను. నేను చేసింది దీప మంచి కోసమే కదా?.. నేను ఒకటి చేశాను.. అదేంటో అడగాలి కదా? ఏం తెలియనట్టు సైలెంట్‌గా ఉంటే నాకేం అర్థం కావడం లేదు.. కార్తీక్ అని సౌందర్య బాధపడుతుంది

    మీరేం మాట్లాడరేంటంటి?.. మోనిత వచ్చినప్పుడు దీప ఏం మాట్లాడిందో చూశారు కదా? అని ఆనంద్ రావుతో సౌందర్య అంటుంది. దీప మౌనంగా ఉందని, ఆ మౌనం మిమ్మల్ని భయపెడుతుందా.. అన్ని తెలిసి.. పూజ దగ్గరకు వచ్చి.. అన్నీ చూసి.. చిరునవ్వుతో మాట్లాడుతోంది చూడు.. అది ఎంత మందికి సాధ్యం సౌందర్య.. కోపంగా నిలదీసిన బాగుండు అన్నావ్.. కొద్దిసేపు అరిస్తే పోయే బాధా? అది.. మీరు దీప కళ్లకు గంతలు కట్టేశారు.. ఆ గంతల్లోంచి అంతా కనిపిస్తున్నా. ఏం తెలియనట్టే ఉంది.. అది అమాయకత్వమో, చేతగానితనమో కాదు.. గొప్ప మనసుండాలి.. అంటూ దీప గురించి సౌందర్య, కార్తీక్‌లతో ఆనంద్ రావు అంటాడు.

    దీప ఏం చేయబోతోంది మమ్మీ.. అన్నీ అరేంజ్ చేసుకోమంటోంది.. మనల్ని తీసుకెళ్తాను అని అంటోంది.. పరిస్థితి చేజారిపోతోంది.. ఏదో ఒకటి చేయ్ మమ్మీ.. అని కార్తీక్ అంటాడు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదురా? దాని అంతరంగం ఏంటో అర్థం కావడం లేదు.. అని సౌందర్య కంగారు పడుతుంది. ఏం చేస్తుందా? అని ఊహకందడం లేదు.. దీప రాగానే కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతాను.. నిజం చెప్పేస్తాను.. మీరు చెప్పిందే కరెక్ట్ డాడీ.. నిజం చెబితే గుండెలో ఇంత భారం ఉండేది కాదేమోనని డాక్టర్ బాబు అంటాడు.

    ఆ తరువాత కారులో దీప, పిల్లలపై సీన్ ఓపెన్ అవుతుంది. నువ్ డాడీని పిలిస్తే వచ్చేవాడు మమ్మీ అని పిల్లలుంటారు. డాడీకి పని ఉంటుందని దీప అంటుంది. నువ్వే పిలవలేదు.. పిలిస్తే వచ్చేవాడు అని హిమ అంటుంది. నేను పిలిస్తే ఒకప్పుడు డాక్టర్ బాబు వచ్చేవారు.. కానీ ఇప్పుడు మారిపోయారు.. అని లోలోపల అనుకుంటుంది దీప. బయటకు వచ్చినట్టు అనిపించడం లేదు అమ్మా అని శౌర్య అంటుంది.. ఏం చేస్తే ఆనందంగా ఉంటారో నాకు తెలుసు అని దీప అంటుంది. ఏం చేస్తే ఆనందంగా ఉంటామో చెప్పు అని శౌర్య అంటుంది. బయటకు రెస్టారెంట్‌కు వెళ్దామని దీపి అనగానే పిల్లలు ఆనంద పడతారు. నీకు తెలివితేటలు బాగున్నాయ్ అమ్మా అని పిల్లలు అంటారు. అవునవును ఎన్ని ఉన్నాయో నాకు తెలిసింది.. ఇన్ని జరిగినా కూడా ఏం మాట్లాడలేకుండా ఉన్నాను అని తనలో తాను అనుకుంటుంది… టిఫిన్ తింటారా? భోజనం చేస్తారా? అని వారణాసి అంటే.. రాకరాక బయటకు వస్తే టిఫిన్ ఏంటి.. మంచి భోజనం చేస్తారు పిల్లలు అని వారణాసి మీద కాస్త కసురుకుంటుంది.

    హోటల్‌కు వద్దు రెస్టారెంట్‌కు వెళ్దామని పిల్లలు అంటారు.. రెండింటికి తేడా ఏంటి అని దీప అడుగుతుంది. హోటల్ అంటే చిన్నది.. రెస్టారెంట్ అంటే పెద్దది అని శౌర్య అంటే.. ఏమో అంతేనేమో అని హిమ అంటుంది.. నేను చదువులేని దద్దమ్మని నాకేం తెలుసు.. నువ్ వంటలక్కవి కదా? వేరే వాళ్లు చేసినవి నీకు నచ్చుతాయా? అన్నీ మనకు నచ్చినవే జరుగుతాయా? అన్నింటిని నవ్వుతూనే భరించాలి.. వంటలో అయినా జీవితంలో అయినా.. అని పిల్లలకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. ఏం అడిగినా కూడా బేరాలు ఆడేదానివి. ఈరోజేంటి? ఏం అడిగినా సరే అంటున్నావ్.. ఏదైనా స్పెషలా? అమ్మ అని పిల్లలు అంటే.. అవును ఈ రోజు ఎంతో స్పెషల్ అని దీప అంటుంది. మళ్లీ ఫాస్ట్‌గా వెళ్లు వారణాసి.. అమ్మ మనసు మార్చుకుంటుంది.. అని శౌర్య అంటుంది. ఈ సారి మార్చుకోనమ్మ అని దీప ఏదో డబుల్ మీనింగ్ డైలాగ్‌లో అనేస్తుంది..

    అలా సీన్ కట్ చేస్తే మళ్లీ ఆనంద్ రావు, కార్తీక్, సౌందర్యల మీద ఓపెన్ అవుతుంది. దీప ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుంది.. దీప ఆలోచనల్ని మనం అందుకోలేకపోతోన్నాం.. షాక్ ఇవ్వబోతోంది అని కార్తీక్ అంటాడు.. రేయ్ నువ్వేదో ఊహించుకుని మమ్మల్ని భయపెట్టకురా?.. అని సౌందర్య అంటే.. ఏదో జరగబోతోందని నాకు తెలుస్తోంది.. ఊపిరి ఆగిపోతోన్నట్టు అనిపిస్తోంది. మమ్మీ ఏదో ఒకటి చెయ్యి.. దీప మనల్ని వదిలి వెళ్లేట్టు కనిపిస్తోంది.. ఏం చేస్తే మనతో ఉంటుంది అని కార్తీక్ అంటాడు

    ఇంత చేశాక.. ఏ భార్య ఉంటుందిరా అని ఆనంద్ రావు అంటే.. డాడీ వీలైతే మంచి సలహాను ఇవ్వండి అని కార్తీక్ అసహనం వ్యక్తం చేస్తాడు.. నేను ఎప్పుడూ పెద్దరికం వహించిందీ లేదు.. సలహాలు ఇచ్చిందీ లేదు.. దీపకు నిజం చెప్పండని అన్నాను.. మీరు చెప్పలేదు.. ఈ సమస్యకు ఇంత కంటే మంచి పరిష్కారం ఉంటుందని నేను అనుకోలేదు.. అని ఆనంద్ రావు అంటాడు. ఇంతలో కారు సౌండ్ వినిపించగానే.. దీప వచ్చి ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి.. అని సౌందర్య అంటుంది.

    డాడీ.. మేం కొన్నామో తెలుసా? మా షాపింగ్ చూడు నానన్మ..అంటూ పిల్లలు సంతోషంగా అడుగుతారు. మీ అమ్మ ఏదే.. అమ్మ రాలేదేంటే.. అంటూ సౌందర్య, కార్తీక్‌లు ప్రశ్నిస్తారు. అందరూ కలిసి వెళ్లారు కదా? రెస్టారెంట్‌లో తిన్నాక వస్తామని అన్నారు కదా? అని సౌందర్య అడుగుతుంది. అమ్మ వెళ్లిపోయింది నానమ్మ.. అని శౌర్య అంటుంది. వెళ్లిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్లిపోయింది.. అని సౌందర్య కంగారు పడుతూ అడుగుతుంది. అమ్మ.. అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తాను అంది అని శౌర్య చెబుతుంది. అదేంటి? అక్కడికి వెళ్లింది అని సౌందర్య అడిగితే.. అమ్మ నాతో ఎక్కువ మాట్లాడలేదు.. అమ్మమ్మ దగ్గరకు వెళ్తాను అని అంది.. మిమ్మల్ని రేపు ఎక్కడికో రమ్మందట కదా? అక్కడే కలుస్తానంది.. అని శౌర్య క్లారిటీ ఇస్తుంది.

    ఇంటికి రాకుండా అక్కడికెళ్లడం ఏంటే.. దీపకు ఒకసారి ఫోన్ చేయ్ కార్తీక్.. మీ ఇద్దరూ లోపలకు వెళ్లండి..అని సౌందర్య అంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్.. అని వస్తోంది.. అలా ఎందుకు పెడుతుంది.. అంటే దీప అక్కడకు వెళ్లలేదా? అని అంతా షాక్ అవుతారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో వంటలక్కగా మారిన దీప కనిపిస్తోంది. మోనిత ఇంట్లో బారసాలకు వంటలక్కగా మారింది దీప. అది చూసి కార్తీక్ షాక్ అయ్యాడు. ఇక్కడ ఈ పని ఎందుకు చేస్తున్నావ్ అని అరుస్తాడు. అంటే రేపటి ఎపిసోడ్‌లో ట్విస్ట్ రాబోతోందన్న మాట.

    Leave a Reply