- November 18, 2021
Karthika Deepam Episode 1200 : గుడికి వెళ్దామన్న దీప.. షాకైన కార్తిక్.. మళ్లీ ఏం జరగనుందో?

కార్తీక దీపం సీరియల్‌లో ఇప్పుడు దీప ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మోనిత కార్తీక్ కలిసి గుళ్లో పూజ చేయడం దీప చూసింది. అప్పటి నుంచి దీప ప్రవర్తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో దీప కాస్త మామూలుగా మారి.. డాక్టర్ బాబుతో మాట్లాడింది. కానీ అంతలోపే మోనిత చెడగొట్టేసింది. బుధవారం అంటే 1200వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
నా కార్తీక్‌తో కలిసి దీపావళి ఎప్పుడు జరుపుకుంటానో అని మోనిత తనలో తాను అనుకుంది. ఆ తరువాత ప్రియమణిని పిలిచింది. ఆనంద్ రావు గారిని జాగ్రత్తగా చూసుకో బయటకు వెళ్లొస్తాను అని అంటుంది.. ఎక్కడికైనా వెళ్తున్నారా? అని ప్రియమణి అంటుంది. అవును.. ఈ దీపావళికి ఆ దీపో ఈ మోనితో తేల్చుకోమని అంటాను.. నేను ఓ గొప్ప ప్రేమికురాలిని.. ఆ విషయం ఎవ్వరికీ తెలియడం లేదు.. 11 ఏళ్లు నా భుజం మీదవాలి అన్నీ చెప్పుకునే వాడు.. అప్పుడు అలా చేసి ఇప్పుడు ఇలా చేస్తే తప్పు కదా? ప్రియమణి.. తప్పే కదా? అని ప్రియమణి భయపెట్టడంతో.. తప్పే అమ్మగారు అని అంటుంది.
తప్పేంటి? తప్పున్నర తప్పు.. అప్పుడేమో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌వి.. ఇప్పుడు కటీఫ్ అంటే నేను ఊరుకుంటానా? డాక్టర్ బాబు అని ప్రేమగా దీప పిలిస్తే , ఏరా పెద్దోడా? అంటూ అమ్మ పిలిస్తే వెంటనే కార్తీక్ కరిగిపోతాడు.. మమ్మీ చెప్పు అని చిన్న పిల్లాడవుతాడు. ఎవరేం చెబితే అదే నమ్మేస్తాడు.. ఆ మంచితనమే నాకు కొన్ని సార్లు ప్లస్ అయ్యింది.. చాలా సార్లు మైనస్ అయింది. ఆ మంచితనంతోనే దీప మాయలో పడ్డాడు. బయటకు తీసుకొస్తాను. ఇంటికెళ్లి తాడో పేడో తేల్చుకుంటాను. పండుగ కదా? కనీసం చీర, స్వీట్ బాక్స్ ఇలా ఏమైనా ఇచ్చాడా? లేదు.. ఏం ఇవ్వ లేదు.. అన్నీ దీప కోసమే ఉంటాడు.. దీప దీపం ఆర్పుతాను. అని మోని అంటుంది. ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రియమణి అడుగుతుంది. సినిమా మొత్తం చూసి హీరో ఎవరు అని అడిగినట్టుందని మోనిత ఫైర్ అవుతుంది. ఆనంద్ రావు గారిని జాగ్రత్తగా చూసుకో.. నేను ఆనంద్ రావు తండ్రి దగ్గరికి వెళ్లొస్తాను.. అని మోనిత బయల్దేరుతుంది.
అక్కడ సీన్ కట్ చేస్తే ఇంటి గార్డెన్ ఏరియాలో కార్తీక్ ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తాడు. దీపకు ఏమైంది. కావాలనేఅంటుందా? క్యాజువల్‌గా అంటుందా? గుళ్లో చూసింది.. ఆ టాపికే తీయడం లేదు.. చెడామడా తిట్టినా బాగుండేది.. పూజ చేయడం తన కళ్లతో చూసింది.. మరింత ఉత్సాహంగా మాట్లాడుతోంది. దీప మనసులో ఏముంది. తీసుకోకూడని నిర్ణయం తీసుకుందా? దేవుడా ఏంటి నా పరిస్థితి.. అని తనలో తాను అనుకుంటూ మథన పడ్డాడు కార్తీక్.
ఇంతలో ఓ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. డాక్టర్ కార్తీకా? అండి అని అంటుంది మోనిత.. అవును మీరు ఎవరు అని కార్తీక్ అడుగుతాడు.. నేను డాక్టర్ మోనిత. మోనిత కార్తీక్.. ఇది కొత్త నంబర్.. నువ్ నా నంబర్ కట్ చేస్తున్నావ్.. అందుకే ఇలా కొత్త నంబర్ల నుంచి ఫోన్ చేస్తాన.. ఇదికట్ చేస్తే ఇంకా పది నంబర్ల నుంచి చేస్తాను అంటే.. ఫోన్ వదలని ఆడ విక్రమార్కుడిలా అని మోనిత అంటుంది. ఎందుకు ఫోన్ చేశావ్? అని మోనితను అడుగుతాడు కార్తీక్.. భార్య భర్తకు ఎందుకు చేస్తుంది.. అని మోనిత అనడంతో.. షటప్ మోనిత అంటూ కార్తీక్ ఫైర్ అవుతాడు.. చెప్పేది వినండి నాథ.. అది తీసుకురండి.. ఇది తీసుకురండి అలాంటివి చెప్పే చాన్స్ లేదు కదా? శ్రీవారు అని ఇలా కొత్త కొత్తగా పిలుస్తుంది మోనిత.. నువ్ అలా పిలవకు ఒళ్లు మండుతోంది కార్తీక్ చీదరించుకుంటాడు. మీ ఇంటి చివర ఎదురుచూస్తున్నాను ప్రాణనాథ.. మీరు ప్రాణేశ్వర..అంటూ వింతవింతగా మాట్లాడుతుంది మోనిత. ఎక్కువ మాట్లాడుతున్నావ్ మోనిత..నేను రాను అంటే ఏం చేస్తావ్ అని కార్తీక్ అంటాడు.. నువ్ రాకపోతే నేను వస్తాను.. ప్రాణేశ్వర.. ఆ పిలుపు బాగుందా?.. ఈ పదాలన్నీ వెతికి మరీ నేర్చుకుని అంటున్నాను. నీ రాక కోసం ఎదురుచూస్తే నీ అర్థాంగి మోనిత.. అని అంటుంది. దీంతో ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్.
ఇంటి వరకు వచ్చి బెదిరిస్తుందా? వెళ్లను గాక వెళ్లను., ఒక వెళ్లకపోతే.. నిజంగా ఇంటికి వస్తే.. వెళ్లి నాలుగు దులిపి వస్తాను.. అని కార్తీక్ బయల్దేరుతాడు. ఇంతలో దీప.. డాక్టర్ బాబు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు.. అని అంటుంది. ఎక్కడికి లేదు దీప అని అంటాడు. ఏంటి టెన్షన్‌గా ఉన్నారు. దీపావళి రోజున పటాకులు పేల్చాలి..జోకులు కాదు.. ఇంటి నిండా దీపాల వెలుగుంది.. కానీ మీ మొహంలో మాత్రం లేదు.. ఏమైంది డాక్టర్ బాబు.. అని దీప అంటుంది.
ఇంతలో మళ్లీ డాక్టర్ బాబుకు ఫోన్ వస్తుంది. కానీ లిఫ్ట్ చేయడు. మాట్లాడండిద.. పండుగ కదా? ఎవరో శుభాకాంక్షలు చెప్పడానికి చేసి ఉంటారు.. అసలే మీకు అభిమానులు ఎక్కువగా ఉంటారు కదా? అని సెటైర్ వేసింది. ఏంటి డాక్టర్ బాబు.. మాట్లాడటం లేదేంటి? అని మళ్లీ అంటుంది. బాగానే ఉన్నాను దీప.. నువ్వే కొత్తగా మాట్లాడుతున్నావ్.. అని కార్తీక్ అంటాడు. ఊరుకో స్వామీ నాకేం ఏమైంది బాగున్నాను.. నా పిలుపు కూడా మారింది.. దీప దీపావళి భళే ఉంది కదా? డాక్టర్ బాబు.. మనం రేపు గుడికి వెళ్తామా? అని దీప అడుగుతుంది.
సముద్రంలో వేటకు వెళ్దామా? అని అడగలేదు.. గుడికి వెళ్దామా? అని అడిగాను. దానికే అంత షాక్ అవుతున్నారేంటి?అని దీప అంటుంది. గుడికి ఎందుకు ఏమైనా స్పెషలా? అని అంటాడు. మీరు బాగుండాలని దేవుడిని కోరుకుంటాను.. నాకు ఇంకేం ఉంటుంది. అన్నీ తెలిసి ఇలా ఎందుకు కూల్‌గా ఉంటోంది అని కార్తీక్ బాబు తన మనసులో తాను అనుకుంటాడు.. ఏంటి డాక్టర్ బాబు.. టెన్షన్ పడుతున్నారా? అంటే.. లేదంటారు.. మాట్లాడుతుంటే ఏటో చూస్తున్నారు.. మీతో చాలా మాట్లాడాలి అని దీప అంటుంది. అవును మనం మన కోసం మాట్లాడుకుని ఎన్నాళ్లో అయింది అని కార్తీక్ అంటాడు..కొన్ని సార్లు మౌనంగా ఉంటే మంచిది. మాట్లాడుకుంటే మంచిది అని అంటారు అని దీప చెబుతుంది.. ఇన్నాళ్లు దీపకు నార్మల్‌గా మాట్లాడుతోంది.. చాలా రోజులకు దీప కూల్‌గా మాట్లాడుతుంటే.. మోనిత ఇలా చంపుతోంది.. అది ఇక్కడికి వస్తే.. దీప ఈ మాత్రం కూడా మాట్లాడదు.. అని అనుకుంటాడు. ఇప్పుడే వస్తాను.. పిల్లలను రెడీ చెయ్ అని కార్తీక్ వెళ్లిపోతాడు. నేను కూడా రావాలా? అని దీప అంటే.. వద్దు అని అంటాడు
ఏంటి కార్తీక్‌కు నేను వస్తానన్నా కూడా భయం లేదా?.. అంటూ మోనిత కూడా కార్తీక్ ఇంటికి బయల్దేరుతుంది. కానీ కార్తక్ మధ్యలోనే కలుస్తాడు. మంగళ సూత్రం చూస్తే అస్సలు మాట్లాడడు.. మంగళ సూత్రం చూపించే మంగళకరమైన రోజు ముందుందిలే..అని మోనిత అనుకుంటుంది. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నవ్ వస్తానంటే భయపడిపోతాను అని అనుకున్నావా? అని కార్తీక్ అంటాడు.. హ్యాపీ దీపావళి.. స్వీట్లు, గిఫ్ట్ ఏవి.. అని మోనిత అడుగుతుంది.
ఎక్కువగా మాట్లాడకు.. ఆ సంతకం పెట్టకుండా ఉంటే బాగుండేది.. మమ్మీ చెప్పిందని పెట్టాను అని కార్తీక్ అంటాడు. మరి ఆంటి చెప్పిందనే బిడ్డను కన్నావా? అని మోనిత అంటుంది. దీంతో కార్తీక్‌కు కోపం వచ్చేస్తుంది.. నేను ఏం చేయగలను అనుకుంటే.. చేస్తాను.. జగన్నాటకం అంతా నేను జరిపిస్తుందే.. నువ్ ఇక్కడ ఏం చేసినా మీ ఏరియాను నీ పరువే పోతోంది అని మోనిత అంటుంది.. జైలు, కోర్టు పోలీస్ స్టేషన్ అయింది.. ఏం చేయగలవు అని కార్తీక్ అంటాడు. బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయ్.. అవును పోయాయ్ అని మోనిత అంటుంది. తన టీంకు ఫోన్ చేస్తుంది. రమ్మని అంటుంది మోనిత. మన ప్రేమాయణం అందరికీ తెలిసిపోయింది.. ఏడిస్తే పట్టించుకోవు.. అరిస్తే వినవు.. నా ఇంటికి రావొచ్చు కదా? అని మోనిత అంటుంది. అది ఇంపాజిబుల్ అని కార్తీక్ అంటాడు. మరి నేను రావాలా?. అలా వచ్చి ఇలా వెళ్లిపోతాను.. అని అంటుంది మోనిత.
ఇక కార్తీక్ బయల్దేరే సమయానికి కొంత మంది వస్తారు. వాళ్లని నేనే రమ్మన్నాను.. నీ ఫ్యాన్స్ అని మోనిత అంటుంది. అలా తన స్టాఫ్‌ను రంగంలోకి దింపింది మోనిత.. సోషల్ మీడియాలో మీ పిక్స్ పెడితే లైక్స్, కామెంట్స్ వస్తాయని వాళ్లు చెబుతారు.. ఏంటిది నాన్ సెన్స్ అని పైర్ అవుతాడు కార్తీక్.. ఏం చేయగలవు అన్నావ్ కదా? ఇదే కొసరు.. ఇప్పుడు నీ ఒక్కడి ఫోటోనే తీసుకుంటున్నారు.. ఇద్దరిది కలిపి తీసుకుంటే.. అది పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో..అని మోనిత అంటుంది. అలా ఎపిసోడ్ మొత్తానికి ముగుస్తుంది. మరి గుడికి వెళ్దామన్న దీప ఏం మాట్లాడుతుందో? తుది నిర్ణయం ఏమైనా తీసుకుంటుందో చూడాలి.