• February 4, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అంతా ఒకే చోటకు.. కార్తీక్‌ వద్దకు మోనిత

Karthika Deepam నేటి ఎపిసోడ్.. అంతా ఒకే చోటకు.. కార్తీక్‌ వద్దకు మోనిత

    కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఫిబ్రవరి 4న శుక్రవారం నాటి Karthika Deepam Epiosde 1267 ధారావాహికలో శౌర్యకు డాక్టర్‌గా మారిన కార్తీక్ ఆపరేషన్ చేస్తాడు. అలా మొత్తానికి ఆపరేషన సక్సెస్ అవుతుంది. అంత డబ్బు ఎలా వచ్చిందని రుద్రాణి షాక్అవుతుంది. డాక్టర్ అంజలి ఇంట్లోని బర్త్ డే పార్టీకి మోనిత, భారతి బయల్దేరుతారు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    శౌర్యకు ఆపరేషన్ మొదలవుతుంది. డాక్టర్ కార్తీక్ గారు నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి.. అంటూ కార్తీక్‌తో అన్న మాటలను దీప తలుచుకుంటుంది. అలా ఎలా వదిలేసి వెళ్లారు.. అని దీప లోలోపల బాధపడుతుంది. అమ్మా డాడీ ఎక్కడికి వెళ్లారు.. అక్కా ఆపరేషన్ జరుగుతోందా? అని హిమ, అప్పరావులు అడుగుతారు. డాక్టర్ బాబు.. అత్తమ్మకు ఇలా ఉంటే మీరు ఎక్కడికి వెళ్లారు.. అని దీప బాధపడుతుంటుంది. మనసు తలుచుకుంటే ఏదైనా సాధ్యమండి.. అంటూ దీప చెప్పిన మాటలను తలుచుకుంటూ కార్తీక్ ఆపరేషన్ చేసేస్తాడు.

    ఈ అమ్మాయినైనా కొన్ని రోజులు ఉంచుతావా? అని విన్ని గురించి మోనితను భారతి అడుగుతుంది. నేను ఎవరినైనా పంపించను.. ఈ బస్తీవాళ్లే పంపించారు.. అని మోని అంటుంది. మోనిత మనసును అర్థం చేసుకుని పని చేసుకో.. ఏ ప్రాబ్లం రాదు.. అని విన్నికి భారతి చెబుతుంది. రాత్రి వస్తాను.. బ్యాగ్ సర్దుకో.. అని భారతి చెబుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి పట్టుకో.. అని భారతిని మోనిత అడుగుతుంది. కార్తీక్ ఉంటాడని ఒకటి.. ఉండండని ఇంకొకటి.. ఉంటాడనే వేలు పట్టుకున్నావ్.. అని మోనిత సంబరపడుతుంది.

    సార్ మీ రియల్లీ గ్రేట్ సర్.. అని ఆపరేషన్ అనంతరం కార్తీక్‌ను డాక్టర్లు పొగిడేస్తారు. నో ఫార్మాలిటీలీస్ థ్యాంక్స్.. అని కార్తీక్ అనేస్తాడు. వాళ్లు కూడా ఏం ఇచ్చుకోలేరంట.. అని అంజలి అంటుంది. ఓకే.. పర్లేదు అని డాక్టర్ కార్తీక్ అనేస్తాడు. మీతో కలిసి ఇలా ఆపరేషన్ చేసే అదృష్టం.. రావడం సంతోషం అని అంజలి అంటుంది. పోస్ట్ ఆపరేషన్ ఫార్మాలిటీస్ చూసుకోండి.. అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు.

    ఆపరేషన్ థియేటర్ నుంచి కార్తీక్ బయటకువస్తాడు. దీప గుర్తిస్తుంది. సక్సెస్ అయినట్టు కార్తీక్ చెబుతాడు. మీరు చాలా అదృష్టవంతులండి.. కంగ్రాట్స్ అని ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు చెబుతారు. మీ ఆయన ఎక్కడికి వెళ్లారు.. అని డాక్టర్ అడుగుతుంది. బయటకు వెళ్లారు.. అని దీప చెబుతుంది. ఆపరేషన్ అయిందా? ఏంటి అని రుద్రాణి షాక్ అవుతుంది.

    అవునక్కా.. ఆపరేషన్ అయిందట.. సీక్రెట్‌గా కనుక్కుం.. అని పిల్లిగడ్డం గాడు చెబుతాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. వడ్డీకే డబ్బులు లేవు.. ఆపరేషన్‌కు ఎంత అయిందట.. అని రుద్రాణి అడుగుతుంది. కనుక్కోలేదు అక్కా అని అంటారు. సన్నాసులు ఒక్క పని కూడా సరిగ్గాచేయరు అని తిడుతుంది.. ఒక్క రూపాయి కూడా దొరక్కుండా చేశాను కదా?చీటి ఇవ్వకుండా చూశాను.. అన్ని దార్లు మూసేశాను.. ఆపరేషన్ చేయించుకోగలిగారంటే.. నా బాకీ కూడా తీర్చేస్తారు.. నాకేం విలువ ఉంటుంది.. నాకేం భయపడతారు..అని రుద్రాణి అనుకుంటుంది.

    అమ్మా.. ఇంటికి వెళ్దాం.. అని శౌర్య అంటుంది. అది మన ఇష్టం కాదు.. వాళ్లు పంపించినప్పుడు వెళ్లాలి అని దీప అంటుంది. దేవుడి దయ వల్ల గండం గడిచింది.. నువ్వేం ఆలోచించకుండా పడుకో.. అని శౌర్యకు చెబుతుంది. ఈ డబ్బు తీసుకెళ్లండి.. అవసరానికి పనికొస్తుంది.. అని రుద్రాణి మాటలను తలుచుకుంటుంది. తమ్ముడు ఎలా ఉన్నాడు.. అని శౌర్య అడిగితే.. బాగున్నాడమ్మా.. మహాలక్ష్మీ వాళ్లింట్లో ఉన్నాడు..అని చెబుతుంది దీప.

    నాన్న, హిమ కనిపించడం లేదు.. అని అడిగితే బయటే ఉన్నారు.. అని చెబుతుంది. నాకేం అయింది అమ్మా.. అని శౌర్య అడుగుతుంది. ఏం కాలేదమ్మా.. కడుపు నొప్పి.. అని దీప చెబుతుంది. కడుపు నొప్పి అయితే ఇక్కడెందుకమ్మా నొప్పిగా ఉంది.. అంటూ శౌర్య తన హార్ట్ ఆపరేషన్ గురించి అడుగుతుంది. నానమ్మ, తాతయ్యలను చూడాలని ఉంది.. అమ్మా నాకేం కాదు కదా అమ్మా. అని అడుగుతుంది.

    ఏంటి అత్తమ్మ నీకేం అవుతుంది.. నీకేం కాదు.. అని దీప అంటుంది. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. కడుపునొప్పి అంటావ్.. రక్షించాడంటావ్.. ఏంటమ్మా నువ్.. అని శౌర్య అడుగుతుంది. నీ తెలివితేటలన్నీ నా దగ్గరే చూపిస్తావ్.. నాకు ఇక్కడ నొప్పిగా ఉంటే కడుపునొప్పి అని అంటున్నావ్.. అంటే నువ్ అబద్దం చెప్పినట్టే కదా? అని అడుగుతాడు.. నానమ్మ, తాతయ్యలు నన్ను చూసేందుకు రారా.. తెలిస్తేనే కదా వచ్చేది.. తెలియకపోతే ఎలా వస్తారు.. అని శౌర్య అంటుంది.

    కార్తీక్‌తో అప్పిగాడు ఇలా మాట్లాడతాడు.. నువ్ ఎక్కడికి వెళ్లొచ్చావ్ బావ.. గుడికెళ్లి దండం పెట్టుకొచ్చావ్ కదా? నాకు తెలుసు.. నువ్ మంచోడివి.. నీకు అంతా మంచే జరుగుతుంది.. నువ్ గొప్పోడివి.. టైం బాగా లేక ఇలా వచ్చి ఉంటావ్.. అని అప్పారావ్ అంటాడు. నువ్ అనుకునేంత గొప్పోడిని కాదు.. అని డాక్టర్ బాబు అంటాడు. తెలిసో తెలియక ఏదేదో అనేశా.. జూనియర్ అసిస్టెంట్ అని ఏదేదో అనేశా.. బావా అని ఎందుకు పిలిచానో.. అదే నాకు చాలా ఆనందంగా ఉంది.. ఓనర్ ఫోన్‌లు చేస్తున్నాడు.. హోటల్‌కు వెళ్తాను.. అని అప్పారావ్ అంటాడు. ఇంత సేపు మాతోనే ఉన్నావ్.. థ్యాంక్స్.. అని కార్తీక్ అంటాడు. మనలో మనం చేసుకోకపోతే ఎలా.. ఆ డాక్టర్ ఎవరో గానీ డబ్బులు కూడా తీసుకోలేదట.. చల్లగా ఉండాలి.. వస్తాను బావ.. అని అప్పారావ్ వెళ్లిపోతాడు.

    డాక్టర్ అంజలి ఊరికి భారతి, మోనితలు బయల్దేరుతారు. నువ్ వస్తున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. అని భారతి అంటుంది. నీకు కాదు నాకే ఆశ్చర్యంగా ఉంది.. ఏదో శక్తి నా ప్రమేయం లేకుండా నన్ను తీసుకెళ్తోన్నట్టుంది.. బహుషా అది నా కార్తీక్ మీదున్న ప్రేమే కావచ్చు.. నా కారులో వెళ్దామంటే వినలేదు.. అని మోనిత అంటుంది. బర్త్ డే పార్టీకి అంత దూరం వెళ్తున్నావ్ ఏంటో..అని మోనిత అంటే.. తెల్లారే సరికి అక్కడ ఉంటాం..అని భారతి చెబుతుంది. కళ్లు మూస్తే కార్తీక్. తెరిస్తే ఆనంద్ రావు కనిపిస్తున్నారు.. అని మోనిత అంటుంది. నువ్ అలా ఉంటే టూర్ బోర్ కొడుతుంది.. అని భారతి అంటుంది. వారి కనిపిస్తేనే నా మొహంలో ఆనందం కనిపిస్తుంది..అని మోనిత చెబుతుంది.

    హాయ్ శౌర్య.. గొప్ప కార్డియాలజిస్ట్ నీకు ఆపరేషన్ చేశారు.. నీకేం కాదు.. అని డాక్టర్ అంజలి అంటుంది. కార్తీక్ లాంటి గొప్ప సర్జన్ ఇక్కడకు వచ్చారంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. మా హాస్పిటల్‌కి కార్తీక్ మీ వల్ల రావడం అదృష్టంగా భావిస్తున్నా.. అని డాక్టర్ అంటుంది. మా పరిస్థితి తెలుసుకుని మీరు సాయం చేశారు.. అని కార్తీక్, దీపలు థ్యాంక్స్ చెబుతారు.

    మీ వల్ల డాక్టర్ కార్తీక్ మా హాస్పిటల్‌కి వచ్చారని ఆనందం ఎప్పటికీ ఉంటుంది.. అంత పెద్ద డాక్టరే ఫీజు వద్దని అన్నప్పుడు.. మేం మిమ్మల్ని ఫీజు అడగడం కూడా కరెక్ట్ కాదు.. అని డాక్టర్ అంటుంది. మీరు మాకు పెద్ద సాయం చేశారు.. అని కార్తీక్, దీపలు అంటారు. మీది ఏ ఊరు.. మీరు వంట బాగా చేస్తారట కదా?. మీతో వచ్చిన అబ్బాయి చెప్పాడు.. గెస్టులకు వంట చేసి పెడతారా? అని దీపను అడుగుతుంది. ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? అని దీప అంటే.. నేను కూడా మా ఆవిడకు సాయంగా వస్తాను.. ఇలానైనా మీ రుణం తీర్చుకుంటాం అని కార్తీక్ అంటాడు.. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది.. మీ మాట తీరు, పద్దతి బాగున్నాయ్ అని అంజలి అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    Leave a Reply