• February 2, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. పది రోజుల్లో కార్తీక్‌ను పట్టుకుంటుందట.. మోనిత శపథం

Karthika Deepam నేటి ఎపిసోడ్.. పది రోజుల్లో కార్తీక్‌ను పట్టుకుంటుందట.. మోనిత శపథం

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 2 బుధవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Epiosde 1265 ధారావాహికలో శౌర్యకు ఇంకా సర్జరీ మొదలే కాలేదు. గత వారం నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక నేటి ఎపిసోడ్‌లో మోనిత కనిపిస్తుంది. మొత్తానికి డాక్టర్ కార్తీక్ బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    శౌర్యకు కార్తీక్ సెలైన్ ఎక్కిస్తాడు. ఎవ్వరూ చూడకుండా అడ్డుగా ఉండమని దీప, హిమలకు చెబుతాడు. అయితే ఇలా ఏదో చేస్తోన్నారని డాక్టర్‌కి అనుమానం వస్తుంది. ఎవరైనా చూస్తే అరుస్తారు.. కవర్ చేయండని కార్తీక్ అంటాడు. ఇక ఇంతలో ఓ నర్స్ వస్తుంది. ఏంటండి ఈ సెలైన్ ఎవరు పెట్టారు.. మా మేడం చూస్తే అరుస్తారు.. అని ఫైర్ అవుతుంది. ఇంతలో కాంపౌండర్ వస్తాడు. ఆక్సిడెంట్ పేషెంట్‌కి పిట్స్ వస్తున్నాయ్.. అని నర్స్‌ని తీసుకెళ్తాడు. మళ్లీ వస్తాను అంటూ నర్స్ చెప్పి వెళ్తుంది. ఇంతలో డాక్టర్ వస్తుంది. సెలైన్ పెట్టడంపై ఫైర్ అవుతుంది. మీది మీరే చేసుకుంటున్నారు.. మళ్లీ ఏదైనా అయితే బ్లేమ్ చేస్తార.. వైద్యం నేను చేయను.. వీళ్లను బయటకు పంపించేయండి.. అని అనేస్తుంది.

    ఇక ఆదిత్య, శ్రావ్యలను బయట చూసి మోనిత మళ్లీ విసిగిస్తుంది. ఈ మధ్య బయటే కనిపిస్తున్నావ్.. అని ఆదిత్యను మోనిత అడుగుతుంది. అది నీకు అనవసరం.. నీ పని నువ్ చేసుకో అని ఆదిత్య అంటాడు. నీ పని నా పని ఏంటి.. మనం అంతా ఒకటే ఫ్యామిలీ.. అని మోనిత అంటుంది. మేం నిన్ను అంగీకరించినట్టు ఫీలవ్వకు.. అని ఆదిత్య కౌంటర్ వేస్తాడు. మీ అన్నకు బిడ్డను ఇచ్చాను.. ఇంటికి వారసుడిని ఇచ్చాను.. శ్రావ్యా బాగున్నావా? అంటూ మోనిత రెచ్చిపోతుంది. వేసిన వేషాలు చాలు.. రోడ్డు మీద ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నా కోపాన్ని తట్టుకోలేవు.. అని శ్రావ్య ఫైర్ అవుతుంది.

    ఆదిత్య.. శ్రావ్య కూడా చాలా మాట్లాడుతోంది..అని మోనిత అంటుంది. మనం అంతా కూడా ఒకే టీం.. దీప పెద్ద కోడలు.. నేను దేవుడిచ్చిన కోడలు..నువ్ చిన్న కోడలు.. అని మోనిత రెచ్చిపోతుంది. నోర్మూయ్.. ఎప్పుడూ ఏదో ఒకటి అనడం తప్పా ఇంకేం పని లేదా? చిన్నా పెద్దా తేడా లేకుండా చూడను.. చెంప చెల్లుమనిపిస్తాను..అని శ్రావ్య అంటుంది. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఉండటంలో నీ పాత్ర కూడా ఉంది కదా? మోనిత కార్తీక్ ఒక్కటవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు.. వారు లేరన్న బాధ కొంచెం కూడా కనిపించడం లేదా? మీరు దాచి పెట్టినా పెట్టకపోయినా.. శ్రావ్య నువ్ కూడా విను.. నేను ఆ ఇంట్లోకి రాగలను.. పదే పది రోజుల్లో.. ముందు ముందు సరికొత్త సినిమా చూపిస్తాను.. పదే పది రోజుల్లో కార్తీక్, నా బాబుని తీసుకొచ్చి మీ ఇంట్లో అడుగు పెడతాను.. పూలు కూడా రెడీ చేసుకో మా మీద చల్లితే బాగుంటుంది.. అని మోనిత రెచ్చిపోతుంది.

    డాక్టర్ తన కేబిన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. తప్పకుండా రావాలి.. ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం.. అని ఇలా మాట్లాడుతూ ఉంటే కార్తీక్, దీప వస్తార. తెలిసీ తెలియక తప్పు చేశాను.. నా మీద కోపం బిడ్డ మీద చూపించకండి.. అని కార్తీక్ అంటాడు. మీరే నా కూతురిని కాపాడాలి.. డాక్టరమ్మ.. అని దీప తన కష్టాలన్నీ చెబుతుంది. మీరు ఇంతగా బతిమాలాడుతున్నారు కాబట్టి.. నాకు కూడా పాప ఉంది కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు.. థ్యాంక్స్ మాత్రమే సరిపోదు కదా? నా చేతుల్లో ఏముంది.. మా డాడీ చాలా కష్టపడి నన్ను చదివించాడు.. హాస్పిటల్‌ని నడపాలి కదా?.. డాక్టర్ ధనుంజయ్ గారిని ఉండమనండి.. ఇంకో పేషెంట్‌ని చూడాలి.. అని చెబుతుంది.

    రుద్రాణి తన ఇంట్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లి ఉంటారు.. ఆ సారు, దీప ఎక్కడున్నారో తెలుసుకున్నారా? అని అంటుంది. అదే పనిలో ఉన్నామక్కా అని అంటారు.. పులిని చూశారా? అని రుద్రాణి అడుగుతుంది. టీవీలు, సినిమాల్లో చూశాను అని అంటారు.. పులిని వేటాడేటప్పుడు చూశారా? జింక అటూ ఇటూ పరిగెడుతుంటే మీకేం అనిపిస్తుంది.. అని అడుగుతుంది. పులికి కాళ్లనొప్పులు.. జింకకు ప్రాణభయం అనిపిస్తుందక్కా అని అంటారు.. జింక దొరక్కపోతే పులి ఇంకా రెచ్చిపోతుంది.. నేను పులి దీప జింక. తప్పించుకుంటోంది.. కానీ దొరుకుతుంది.. ఇదేరా అసలు సిసలు వేట.. మంకుపట్టు, పట్టుదల, మొండితనం, రౌషం, పెంకితనం, ఇవన్నీ నాకున్నాయ్.. వద్దు అంటే కావాలని అంటాను.. బిడ్డను ఇవ్వను అని వారు.. కావాలని నేను.. ఇస్తే దానం.. లాక్కుంటే దౌర్జన్యం.. నేను లాక్కుంటాను.. ఏం చేసైనా సరే హిమను లాక్కుంటాను.. ఇంకో రుద్రాణిని తయారు చేయబోతోన్నానురా.. అని అంటుంది.

    డాక్టర్ ధనుంజయ్ అసలు విషయం తెలిసి షాక్ అవుతాడు. ఇంతకు ముందు డాక్టర్ కార్తీక్ ఆపరేషన్ చేశాడని చెబుతారు. అంత పెద్ద డాక్టర్ మీ పాపకు సర్జరీ చేశారా?.. మీకు ఆయన అపాయింట్మెంట్ ఎలా దొరికింది.. అని అడుగుతారు. నేను ఆయన ఇంట్లో వంట మనిషిలా పని చేశాను.. అని దీప కవర్ చేస్తుంది. ఆ మాట చెప్పరే.. ఆయన మీకెలా టైం ఇచ్చారా? అని అనుకున్నానని డాక్టర్ అంటాడు.. ఈ సమస్య ఏంటో.. పరిష్కారం ఏంటో ఆయనకే బాగా తెలుస్తుంది. అని ధనుంజయ్ అంటాడు. పాప కండీషన్ బాగా లేదంటున్నారు అని డాక్టర్ అడుగుతుంది.. టైం ఏం లేదు.. గడిచే ప్రతీ నిమిషం.. ఆయుష్షు తగ్గినట్టేనని చెబుతాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ కాస్త డాక్టర్ కార్తీక్‌గా మారతాడు.

    Leave a Reply