• January 25, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. డాక్టర్ బాబు కాలర్ పట్టుకుని నిలదీసిన దీప

Karthika Deepam నేటి ఎపిసోడ్.. డాక్టర్ బాబు కాలర్ పట్టుకుని నిలదీసిన దీప

    కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 25న మంగళవారం నాడు ప్రసారం కానున్న Karthika Deepam Epiosde 1258 ధారావాహికలో ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. ఇక కార్తీక్ మీద బురద జల్లాలని చూసి రుద్రాణి మనుషులకు తిరిగి షాక్ ఇచ్చేస్తాడు. ఇక మరో వైపు రుద్రాణి అప్పు గురించి దీప ఆలోచిస్తుంటుంది. ఇంకో వైపు కార్తీక్, తన బిడ్డ గురించి మోనిత బాధపడుతుంటుంది. అలా కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    ఏ సంబంధం లేని ఆనందం దూరమైతేనే.. నేను ఇంత బాధపడుతున్నాను.. అలాంటింది కొడుకు, మనవరాళ్లు దూరమైతే.. అత్తయ్య మామయ్యలు ఇంకెంత బాధపడి ఉంటారో.. కళ్ల ముందున్నా కూడా సేవచేయలేకపోయాను.. కనీసం పలకరించలేకపోయాను.. క్షమించండి అత్తయ్య.. అని దీప కన్నీరు పెట్టుకుంటుంది. నాకు ఈ ఆరువేలే.. ఆరు లక్షల్లా అనిపిస్తోంది.. దీప అంత డబ్బు ఎలా ఇస్తుంది.. ఆ హోటల్లో పని చేసేది దీపేనా?.. ఆ వంట మనిషిని దీపేనా?. రుద్రాణి వద్దకు కాదు.. ఇంటికి వెళ్లాలి.. ఇంట్లో ఆనంద్ ఉంటే.. అడ్వాన్స్ తీసుకుంది కచ్చితంగా దీపే.. ఇంట్లో ఆనంద్ ఉండకూడదు.. వంటమనిషే దీప కాకూడదు.. కానీ ఇంటికి వెళ్లి చూడటంతో అక్కడ ఆనంద్‌ను దీప రెడీ చేస్తుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ సీన్ చూసి కార్తీక్ షాక్ అవుతాడు.

    మీకు ఇంత డబ్బు ఎక్కడిది అండి.. అని దీప అడుగుతుంది. అంత డబ్బు అని అంటున్నావేంటి? ఇప్పుడు మనకు వంద రూపాలు కూడా పదివేలలా అనిపిస్తున్నాయి కదా?.. అని కార్తీక్ అంటాడు. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడిదో చెప్పలేదు.. అని దీప మళ్లీ అడుగుతుంది. నాకు ఎవరు ఇచ్చారని ఆశ్చర్యపోతోన్నావా? ఆనంద్ కోసం అడ్వాన్స్ తీసుకున్నా.. అని కార్తీక్ అంటాడు.

    అయినా ఇవి వట్టి కాగితాలే.. సున్నాలతో విలువ పెరుగుతోంది.. మీరు, మీ చిరునవ్వు తోడుంటే నాకు ప్రపంచంలో ఏదీ సాటి రాదు అండి.. అని దీప అంటుంది. పక్క ఊర్లో ఎరువుల కొట్లో పని చేస్తున్నా కదా? అడ్వాన్స్ తీసుకున్నా అని కార్తీక్ చెబుతుంది. ఈయన నిజమే చెబుతున్నారా? అని దీప లోలోపల అనుకుంటుంది. అడిగి ఇంకాస్త బాధపెట్టలేను.. అని దీప అనుకుంటుంది. మీరే నాకు విలువైన బహుమతి.. అని కార్తీక్‌తో దీప అంటుంది.

    ఇక మోనిత ఇంట్లో విన్ని తింటూ కనిపిస్తుంది. సారీ మేడం ఆకలేసి తింటున్నా అని వచ్చిన మోనితను చూసి విన్ని అంటుంది.. రావడానికి లేట్ అవుతుంది.. నేనే తినమని చెబుదామని అనుకున్నా అని మోనిత అంటుంది.. టెన్షన్స్ విన్ని టెన్షన్స్.. అని మోనిత.. పూజ నాటి విషయాలను తలుచుకుంటుంది.. కార్తీక్, బాబు గుర్తుకు వస్తున్నారు.. వారికి దూరంగా ఇన్ని రోజులు వాళ్లని ఎలా ఉన్నానో అని బాధ పడుతుంది.

    ఒకటి నుంచి పది లెక్కపెట్టండి, స్విమ్మింగ్ చేయండి బాధ తగ్గిపోద్ది అని విన్ని సలహా ఇస్తుంది.. ఆ స్టేజ్ ఎఫ్పుడో దాటి పోయాను.. కోటి లెక్క పెట్టినా కూడా కార్తీక్‌ని మరిచిపోలేను.. ఈత ఏంటి. సముద్రాలు దాటినా కూడా మరిచిపోలేను.. కార్తీక్ తరువాత స్థానం నా బుజ్జి ఆనంద్‌కే.. ఇంటి గోడల నిండా కార్తీక్ అని రాయాలనుంది.. భయపడకు లే విన్ని ఆ పని చేయనులే అని మోనిత అంటుంది.

    కార్తీక్ సర్ ఎక్కడున్నారో వారి ఇంట్లో వాళ్లకి తెలిసి ఉండొచ్చు.. వాళ్లు ఎలా ఉన్నారు? టెన్షన్‌గా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అని విన్ని అంటుంది. టెన్షన్‌గా లేరు హ్యాపీగా లేరు అని మోనిత అంటుంది. అంటే వాళ్లకు కచ్చితంగా తెలిసి ఉంటుందని విన్ని చెబుతుంది. అవును నువ్ చెప్పిందాంట్లో కూడా లాజిక్ ఉంది.. ఆదిత్య తెలివైనోడు.. కార్తీక్ ఎక్కడున్నావ్.. అని అనుకుంటుంది మోనిత.

    ఇక రోడ్డు మీద కార్తీక్ నడుచుకుంటూ వెళ్తాడు. దీప గురించి ఆలోచిస్తాడు. దీప కష్టపడుతోంది.. కాదు.. నేనే కష్టపెడుతున్నాను.. ఈ సమస్యకు పరిష్కారం లేదా? నవ్వుతూనే కనిపిస్తూ ఉన్నా.. ఆ నవ్వు వెనకున్న బాధ నన్ను ఇంకా బాధ పెడుతోంది.. నన్ను గట్టిగా తిడితే బాగుండు.. అని కార్తీక్ అనుకుంటాడు. ఇక ఇంతలో రుద్రాణి మనుషులిద్దరూ కార్తీక్ మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తారు. కారును స్పీడ్‌గా నడిపించి కార్తీక్ మీద నీళ్లు చల్లే ప్లాన్ వేస్తాడు. దాన్ని ముందే పసిగట్టిన కార్తీక్.. చేతిలో రాయితో రెడీగా ఉంటాడు. దీంతో రుద్రాణి మనుషులు చేతులు ముడుచుకుని వెళ్తారు. సీన్ రివర్స్ అయితే కూడా తప్పించుకోవడం తెలివే.. అని పిల్లి గడ్డం అంటాడు. వాడికి బాగా తెలివి ఉందిరోయ్.. అని అంటాడు. ఆ మాత్రం తెలివి ఉంది కాబట్టే రుద్రాణక్కకు ఎదురొస్తున్నార్రా.. అని అనుకుంటూ వెళ్తారు.

    ఇక ఇంట్లో దీప బాధపడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లల కోసం ఏమీ చేయడం లేదు.. ముందు ఆ రుద్రాణి అప్పు తీర్చేస్తే అన్ని బాధలు తీరిపోతాయి.. కష్టాలు వచ్చినప్పుడల్లా.. ఏదో ఒక వెలుగు రేఖ కనిపిస్తూనే ఉంటుంది.. పిల్లలు, డాక్టర్ బాబు ఉండగా నాకు కష్టాలేంటి.. అప్పు తీర్చేసి.. పక్క ఊర్లో హోటల్ పెట్టేసి.. చీటి డబ్బులు కట్టేసి హైద్రాబాద్‌కు వెళ్తాం.. అక్కడ ఆనంద్, దీపుగాడు ఆడుకుంటారు.. ఏంటో కలలు బాగానే కంటున్నాను.. కానీ పగటి కలలు కావు కదా? అని దీప అనుకుంటుంది.

    ఇక పిల్లల్లిద్దరూ కంగారు పడుకుంటూ వస్తారు. రుద్రాణి మనుషులు కనిపించారు.. మీ నాన్న జాగ్రత్త అన్నారు.. ఎందుకు అలా అన్నారు.. అంటూ దీపను పిల్లలు అడుగుతారు. చెడ్డవాళ్లు కదా? అలానే అంటారని దీప సర్దిచెబుతుంది. అలా ఎపిసోడ్ గడుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కార్తీక్‌ను చూసి దీప షాక్ అవుతుంది. కాలర్ పట్టుకుని నిలదీస్తుంది.. ఏం చేస్తున్నారంటూ కన్నీరుమున్నీరవుతుంది.

    Leave a Reply