• November 3, 2021

Janaki Kalaganaledu Episode 163: జ్ఞానాంబకు అవమానం.. పరీక్షలో జానకి నెగ్గుతుందా?

Janaki Kalaganaledu Episode 163: జ్ఞానాంబకు అవమానం.. పరీక్షలో జానకి నెగ్గుతుందా?

    Janaki Kalaganaledu Episode 163 జానకి కలగనలేదు సీరియల్‌లో బుధవారం నాడు మంచి ఎమోషనల్ కంటెంట్ ఉండబోతోంది. సవాల్‌ను స్వీకరించిన జానకి.. ఎలా నెగ్గుతుంది. తోటి కోడలిని మల్లిక పోటీలో గెలవనిస్తుందా? మున్ముందు రామ జానకీల ఎడబాటు తప్పదా? అనే అనుమానాలను కలిగించేలా ఎపిసోడ్ గడిచింది. జానకి కలగనలేదు ఎపిసోడ్ 163లో ఏం జరిగిందంటే..

    తోటకు వచ్చిన జ్ఞానాంబ.. తన అమ్మ మాట్లాడుకుండా అలా నిల్చుండటంతో రామ ప్రశ్నిస్తాడు. ఏంటమ్మా రమ్మన్నావ్.. ఏమీ మాట్లాడవేంటని అడుగుతాడు. ఏం మాట్లాడాలి.. ఏముందని మాట్లాడాలి.. మనం ఈ స్థాయికి వచ్చామంటే దానికి కారణం ఆ స్వీట్ కొట్టు. దాన్ని కూడా నువ్ సరిగ్గా చూసుకోలేకపోయావ్.. మన పరువు తీసేస్తున్నావ్ అని జ్ఞానాంబ అంటుంది. మనసు బాగాలేక అలా తప్పు జరిగింది అమ్మ అని రామ అంటాడు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చోవాలి.. కొట్టు తెరవ కూడదు అని జ్ఞానాంబ అంటుంది.

    అలా ఎన్ని రోజులు ఇంట్లోనే కూర్చోమంటారు అత్తయ్య.. ఆరోగ్యం బాగా లేకపోతే ఓ నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఆయన మనసు బాగా లేదు.. అమ్మ మాట్లాడటం లేదని ఆయన బాధపడుతున్నాడు.. దానికి మందు అమ్మ మాటే. అమ్మ మాట్లాడినప్పుడే ఆయన బాగుంటాడు అని జానకి తన అత్తగారైన జ్ఞానాంబతో అంటుంది.

    ఆయనకు మీ కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు.. ఆ దేవుడైనా సరే మీ తరువాతే. భార్య కోసం అబద్దం ఆడలేదు. భార్య అంటే ఎక్కువ ప్రేమ ఉండి అలా చేయలేదు.. అబద్దం ఆడలేదు. అమ్మ ఏమైపోతోందో అని భయపడి నిజం దాచాడు. అమ్మ బాధపడుతుంది.. కొడుకు గురించి ఆలోచించి ఎక్కువగా బాధపడుతుందని అబద్దం చెప్పాడు.

    అయినా ఇదంతా జరిగింది నా వల్లే. శిక్ష వేస్తే నాకు వేయండి. తల్లీకొడుకులను విడదీశాను అనే ఆలోచనలతో నాకు మనసు బాధగా ఉంది. అయినా నా నిజాయితీని నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు భయపడుతున్నారు కానీ.. మీ భయాన్ని ఎలా పోగొట్టాలో మాత్రం చెప్పడం లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ భయాల్ని పోగొట్టి.. మీకు తగ్గ కోడలు, నా భర్తకు తగ్గ భార్యను అని నిరూపించుకుంటాను. చదువుకున్నాను అని పొగరు ఎక్కడా చూపించను, నా భర్తను తక్కువ చేయను అని నిరూపిస్తాను.. ఒక్క అవకాశం ఇవ్వండి అని జానకి వేడుకుంది.

    ఏం చేయమంటే అది చేస్తాను అని అనేసింది జానకీ. ఏం చేయమంటే అది చేస్తావా? అని జ్ఞానాంబ అడిగింది. నా ప్రాణమైన సరే ఇచ్చేస్తాను అని జానకి అంది. అయితే పదిహేను రోజులు సమయం ఇస్తాను. 15 రోజులు గడువు ఇస్తున్నా.. నువ్ చెప్పినట్టుగా.. మంచి భార్య, కోడలు అని అనిపించుకోవాలి.. ఈ పదిహేను రోజుల్లో అబద్దం చెప్పినా, మోసం చేసినా, అహం చూపించినా.. నా కొడుకుతో గొడవ పడినా.. స్వయంగా నా కొడుకే నిన్ను ఇంట్లోంచి.. వాడి జీవితంలోంచి పంపించేస్తాడు.. అందుకు సిద్దమేనా? అంటూ చాలెంజ్ విసిరింది జ్ఞానాంబ. గుర్తు పెట్టుకో.. నేను చెప్పిన షరతుల్లో ఏ ఒక్కటి తప్పినా ఆ క్షణమే వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఆ అవకాశం రాదు రానివ్వను.. నా నిజాయితీని నిరూపించుకుంటాను. మా ఆయనకు తగిన భార్య, మీకు తగ్గ కోడలు అని అనిపించుకుంటాను అని జానకీ అంది. ఇదంతా కారు వెనకాల ఉండి నక్కలా వింది మల్లిక. నిన్ను ఎలా గెలవనిస్తాను జానకీ.. బస్తీ మే సవాల్ అంటూ నాశనం చేసేందుకు మల్లిక కూడారెడీ అయింది.

    ఇక జ్ఞానాంబ తన కొడుకు, కోడలిని క్షమించిందన్న సంతోషంగా గోవింద రాజులు అందరికీ స్వీట్లు పంచాడు. కానీ మల్లికకు మాత్రం ఇవ్వలేదు. స్వీటు తిన్నా నీకు చేదుగానే ఉంటుంది.. ఎందుకంటే నీ కడుపులో మంట ఉంది కదా.. తోటి కోడలు అంటే నీకు మంట కదా? అని చురకలు అంటించాడు. ఇక జ్ఞానాంబకు స్వీట్ ఇస్తే తీసుకోలేదు. ఇళ్లు అలకగానే పండుగ కాదంటూ జ్ఞానాంబ డైలాగ్ కొట్టేసింది. నా కోడలు కచ్చితంగా గెలుస్తుందని గోవింద రాజులు నమ్మకంగా చెప్పాడు.

    అయితే మొదటి రోజే జ్ఞానాంబకు అవమానం ఎదురయ్యేలా ఉంది. జానకీ స్నేహితులు వచ్చి జ్ఞానాంబను నిలదీస్తున్నారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో జ్ఞానాంబ తన ఉగ్రరూపాన్ని చూపించేలా ఉంది. మొదటి రోజే జానకీ ఓడిపోతుందా? అనేది చూడాలి.

    Leave a Reply