- October 28, 2021
Janaki Kalaganaledu E159 : ఇంకా దూరం పెట్టేసిన జ్ఞానాంబ.. కొడుకు డబ్బులు కూడా వద్దంటూ

Janaki Kalaganaledu E159 జానకి కలగనలేదు సీరియల్‌లో డ్రామా గుండెలను పిండేస్తోంది. మొత్తానికి మల్లిక కోరుకున్నట్టుగానే తల్లి కొడుకుల మధ్య దూరంపెరిగింది.. జానకీని జ్ఞానాంబ అసహ్యించుకుంటోంది. వారిని జ్ఞానాంబ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అంత కూడా మల్లిక జోష్ నడుస్తోంది. ఇక వీటికి తగ్గట్టు పుండు మీద కారం చల్లేందుకు ఇరుగుపొరుగు వారు ఉండనే ఉంటారు. ఇక అక్టోబర్ 28న రాబోయే 159వ ఎపిసోడ్‌లో హృదయాన్ని బరువెక్కించే సీన్స్ పడ్డాయి.
తమ్ముడికి ఏ అవసరం వచ్చినా డబ్బులు ఇచ్చే రామచంద్రకు ఈ సారి చుక్కెదురు అయింది. అఖిల్‌కు డబ్బులు ఇవ్వడంపై రామచంద్ర, జ్ఞానాంబ మధ్య ఎంత దూరం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ్ముడికి డబ్బులు కూడా ఇవ్వొద్దు.. నా కొడుకు ఎవ్వరి దగ్గరా అడుక్కోవద్దు అంటూ రామచంద్రను పరాయి వ్యక్తిలా జ్ఞానాంబ చూసింది.
అలా రామచంద్రను దూరంగా జ్ఞానాంబ పెట్టడంతో.. ఇదే అదును అనుకుని స్వీట్ షాప్ మీద మల్లిక కన్నేసింది. ఆ బాధ్యతలు తాము చూసుకుంటాని మల్లిక దొంగ నాటకాలు మొదలుపెట్టేసింది. కానీ గోవింద రాజులు మధ్యలో అడ్డుపుల్ల వేశాడు. ఇలా ఇంట్లో ఉన్న గొడవలు చాలవన్నట్టుగా ఇంకా బయటి నుంచి వచ్చిన వ్యక్తులు జ్ఞానాంబ గుండెకు చిల్లులు పెడుతున్నారు. కొడుక్కి తల్లికి దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
పాత పగను మనసులో పెట్టుకుని నీనావతి మరింత రెచ్చిపోయింది. నా కూతురు పదో తరగతి చదివిందని వద్దన్నావ్.. ఇప్పుడు నీ కోడలు డిగ్రీ చదివిందంట కదా? అని సెటైర్లు వేసింది. ఇలా నీనావతి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే.. గోవింద రాజులు ఆపే ప్రయత్నం చేశాడు. నా నోరు మూయించగలవు కానీ బయట జనాలు నోర్మూయించగలవా? జ్ఞానాంబ బాధను తీర్చగలవా? అని మరింత రెచ్చగొట్టేసింది.
వంటగదిలో పని చేసుకుంటున్న జానకీ వద్దకు వెళ్లి పుల్లలు పెట్టే పనిలో మల్లిక పడింది. ఏదో ఒక రోజు నువ్ నీ భర్తను అహంకారంతో అవమానిస్తావ్ అని అత్తయ్య భయపడుతోంది అని అనడం, ఆ మాటలకు జానకీకి ఆగ్రహం రావడం అదే సమయంలో జ్ఞానాంబ కూడాఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆమాటలన్నీ కూడా జ్ఞానాంబ వింటుందా? అసలేం జరుగుతుందన్నది చూడాలి.