- February 18, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి వసులపై అనుమానం.. విడగొట్టనున్న గౌతమ్

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 18న శుక్రవారం నాటి Guppedantha Manasu Episode 377 ధారావాహికలో రిషి, వసు ఇద్దరూ కూడా ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉంటారు. మరో వైపు గౌతమ్ ఆరా తీసే పనిలో పడతాడు. ఇందులో భాగంగా జగతి ఇంటికి వెళ్తాడు. వసుధార రూంలో ఉన్న వస్తువులను చూస్తాడు. రిషి, వసుధార మధ్య ఏదో కనెక్షన్ ఉందని అనుమానిస్తాడు. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.
ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా వసుధార, రిషి బయట తిరుగుతుంటారు. రిషి కోట్ మీద బురద పడుతుంది. దాన్ని వసు శుభ్రం చేస్తుంటుంది. అలా నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక నేటి ఎపిసోడ్ అక్కడి నుంచే మొదలవుతుంది. నువ్ అందరి దగ్గర ఇలానే ఉంటావా? అని వసుని రిషి అడుగుతాడు. అందరి దగ్గర ఇంకా బాగా ఉంటాను.. మీరంటే భయం కాబట్టి కాస్త తక్కువగా ఉంటాను అని వసు చెబుతుంది.
చేసేవన్నీ చేస్తావ్ మళ్లీ భయం అని అంటావ్ ఏంటి..అని రిషి అంటాడు. బాల్యం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా? సర్.. అని వసు అడుగుతుంది. నాకు తెలీదు..అని రిషి అంటాడు. ఇక వసు మెడపై ఏదో ఉందని చెబుతాడు రిషి. తుడుచుకునేందుకు కర్చీప్ ఇస్తాడు. ఆ కర్చీప్‌ను ఉతికిస్తాను అని వసు అంటుంది. మొత్తానికి అలా ఆ ఇద్దరూ అక్కడి నుంచి బయల్దేరుతారు.
వసు పుస్తకాలను సర్దేందుకు జగతి రెడీ అవుతుంది. ఇంతలో గౌతమ్ వస్తాడు. వసుధార కోసం వచ్చాను అని గౌతమ్ చెబితే.. రిషి, వసు బయటకు వెళ్లారు అని జగతి అంటుంది. ఆ ఇద్దరికి ఏం పని ఉంటుంది మేడం అని గౌతమ్ అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ పని కోసం వసుని పీఏగా పెట్టుకున్నాడు కదా? అని జగతి అంటుంది. అవును ఏరికోరి వసులాంటి తెలివైన అమ్మాయిని పెట్టుకున్నాడు అని గౌతమ్ అంటాడు.
జగతిని కాకపట్టేందుకు గౌతమ్ రెడీ అవుతాడు. షార్ట్ ఫిల్మ్ టాపిక్ తీస్తాడు. కారెక్టర్ గురించి అడుగుతాడు. అది ఫైనల్ చేయాల్సింది రిషి అని జగతి చెబుతుంది. ఇక వసుధార పుస్తకాలను చూసి వాటిని తాను లోపల పెడతాను అని అంటాడు గౌతమ్. అలా వసు రూంలోకి వెళ్లగానే గోలీలతో నిండి సీసా చూస్తాడు. రిషి దగ్గర కూడా ఇలాంటిదే ఉంది కదా? రెంటికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంటే విడగొట్టేయాలని గౌతమ్ అనుకుంటాడు.
ఇక సైట్ విజిట్ కోసం వసు, రిషిలు ఊర్లోకి వెళ్తారు. అందరికీ వివరిస్తారు. ఈ విజిట్ సక్సెస్ అవ్వడంతో చాక్లెట్‌తో సెలెబ్రేట్ చేస్తావా? అని వసుని రిషి ఆటపట్టిస్తే పల్లీలు తీస్తుంది. వాటిని ఓ పెద్దాయనకు ఇస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెబుతుంది. ఓ పిల్లాడిని కూడా పిలుస్తుంది. వసు ఏం అడుగుతుందో రిషి ముందే చెబుతాడు. నీ పేరేంటిరా అని అడుగుతుంది అని రిషి లోపల అనుకుంటాడు.
వసు బయటకు అనేస్తుంది. నీ పేరేంటి నాన్నా అని ఆ బుడ్డోడిని వసు అడుగుతుంది. ఏం చదువుతున్నావ్ అని నెక్ట్స్ అడుగుతుంది అని రిషి అనుకుంటాడు. వసు అలానే అడుగుతుంది. మొత్తానికి ఆ బుడ్డోడు మాత్రం వసు ఇచ్చే పల్లీలను తీసుకోడు. ఊరికనే ఏది తీసుకోవద్దని మా అమ్మ చెప్పిందంటూ.. తన వద్ద ఉన్న పెన్సిల్‌ను తీసుకుంటే పల్లీలు తీసుకుంటాను అని అంటాడు.
ఆ పిల్లాడి మంచితనానికి రిషి, వసు ఫిదా అవుతారు. మరి నా దగ్గర ఇచ్చేందుకు పెన్సిల్ లేదు పెన్ను ఇవ్వాలా? అని వసుతో రిషి జోక్ చేస్తాడు. మీరు నాకు చదువు చెబుతున్నారు అంతకంటే ఇంకేం కావాలని వసు అంటుంది. వసులో ఏదో ప్రత్యేకత ఉంది.. సంథింగ్ స్పెషల్ అని రిషి లోలోపల అనుకుంటాడు. అలా మొత్తానికి వసుని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు రిషి. నువ్ నాకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పావో లెక్క పెట్టి చెప్పు అని రిషి అంటాడు. మీరు రెస్టారెంట్‌కు వచ్చి ఎన్ని సార్లు కాఫీ తాగారో నాకు చెప్పండని రివర్స్‌లో వసు కౌంటర్ వేస్తుంది.మొత్తానికి అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్‌లో గౌతమ్ ఏదో చిచ్చు పెట్టబోతోన్నట్టు కనిపిస్తోంది. నీ గురించి జగతి మేడం అంతా చెప్పింది.. నువ్ పెద్ద మోసగాడివి అంటూ రిషితో చెబుతాడు గౌతమ్. ఏం చెప్పారు మేడం అని రిషి రివర్స్ ప్రశ్నిస్తాడు. నిజాలు చెప్పిందని గౌతమ్ బుకాయిస్తాడు. మరి తొందరపడి రిషి నిజం చెప్పేస్తాడా? అన్నది చూడాలి.