• February 10, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు కోసం గౌతమ్ ఆరాటం.. చిక్కుకుపోయిన రిషి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు కోసం గౌతమ్ ఆరాటం.. చిక్కుకుపోయిన రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 10న గురువారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 370 ధారావాహికలో మామూలు సీన్లే పడ్డాయి. గౌతమ్ పిచ్చి చేష్టలు, వసు రిషి ముచ్చట్లతోనే గడిచింది. వసు బొమ్మను చూస్తూ గౌతమ్ చెప్పుకున్న కవితలు, క్లాస్ రూంలో వసు, రిషి లెక్కలే సరిపోయాయి. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ మాత్రం సోసోగానే నడిచింది.

    రిషి చేసిన పని గురించి వసు అనుకుంటూ ఉంటుంది. ఉండమని అంటే సొమ్మేం పోతుందని రిషి గురించి లోలోలప వసు అనుకుంటుంది. అదే సమయంలో రిషి నుంచి వసుకి మెసెజ్ వస్తుంది. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మా ఇంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయ్..అని వస్తుంది. ఏమని రిప్లై ఇవ్వాలి.. అంటూ వసు ఆలోచిస్తుంటుంది.

    ఇక ఇంట్లో గౌతమ్, రిషి ముచ్చట్లు పెట్టుకుంటారు. ఎక్కడికెళ్లావ్ రిషి.. అని గౌతమ్ అడుగుతాడు. చెబితే వచ్చే వాడిని కదా? అని గౌతమ్ అంటే.. అందుకే చెప్పలేదు అని రిషి కౌంటర్ వేస్తాడు.. నీకు ఒక చిన్న కవిత చెబుతాను.. విని ఎలా ఉందో చెప్పు.. అని గౌతమ్ అంటాడు. నువ్ కవిత్వం కూడా చదువుతున్నావా? అని రిషి అడుగుతాడు. చదవడం కాదు.. నేనే రాశాను..అని అంటాడు.

    నీ చిరునవ్వులు నాకు వరం.. నీ పేరు తలుచుకుంటేనే ప్రేమ జ్వరం.. అని గౌతమ్ చెప్పడంతోనే రిషి షాక్ అవుతాడు. ఇంతలో వసు నుంచి మెసెజ్ వస్తుంది. ఏవర్రా మెసెజ్.. అని రిషి ఫోన్‌ని గౌతమ్ లాక్కుంటాడు. నా ఫోన్ చూడాలనుకోవడమే తప్పు.. ఇది నా ఫోన్ రా అని వసు పంపిన మెసెజ్ చూస్తాడు.. సౌకర్యాలు బాగానే ఉన్నాయ్ కానీ.. కానీ ఏంటి.. అని అనుకుంటూ గుడ్నైట్ అని మెసెజ్ పెట్టేస్తాడు.

    వసు ముందు మాట్లాడలేని గౌతమ్.. ఆమె ఫోటోను చూస్తే మాత్రం ధైర్యం వస్తుంది. ఈ ట్రిక్ తెలుసుకుని ఆ చార్ట్‌ని కాలేజ్‌కు తీసుకెళ్దామని అనుకుంటాడు. దాన్ని వసుకి ఇచ్చి క్రెడిట్ కొట్టేద్దామని చూస్తాడు. ఆ చార్ట్ రిషికి తెలియకుండా కాలేజ్‌కు తీసుకెళ్లేందుకు గౌతమ్ నానా కష్టాలు పడతాడు. ఇక క్లాస్‌లో రిషి చెప్పని లెక్కలు కూడా వసు ట్రై చేస్తుంటుంది. ఆమెకు రాకపోవడంతో రిషి వివరిస్తాడు. కానీ వసుకి అర్థం కాదు.

    రిషిని చూస్తూ లెక్కలు వినడం మరిచిపోతుంది వసు. అలా మొత్తానికి గౌతమ్ కూడా చార్ట్ ఇచ్చి క్రెడిట్ కొట్టేసేందుకు ట్రై చేస్తాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌తో వసు, రిషి ఇద్దరూ కూడా లైబ్రరీలోనే చిక్కుకుంటారు. మరి అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారు.. తరువాత ఏం అవుతుందన్నది చూడాలి.

    Leave a Reply