• February 7, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. దేవయాణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. మహేంద్ర అనూహ్య నిర్ణయం

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. దేవయాణి ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. మహేంద్ర అనూహ్య నిర్ణయం

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 7న సోమవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 367 ధారావాహికలో దేవయాణి అదిరిపోయేలా నాటకం ఆడింది. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రిషిని బోల్తా కొట్టించేసింది. ఇక దేవయాణి నాటకాలు తెలుసుకున్న మహేంద్ర అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు. పాటలు పాడమని అంటున్నారు.. పిండి వంటలు తీసుకురా ధరణి అని మహేంద్ర అంటాడు. ఇక ఇంతలో వసు అందుకుని.. రిషి సర్ బాగా పాటలు పాడుతారు సర్..అని అంటుంది. అవునవును అంటూ గౌతమ్ ఊ కొడతాడు.. మీరు కరెక్ట్ పాయింట్‌కు వచ్చారు.. రిషి వచ్చాకా? పాడించండి చూద్దాం అని మహేంద్ర అంటాడు..

    రిషిని ఒప్పించడం కష్టం.. నీకు తెలుసు కదా? అని ఫణీంద్ర అంటాడు. నన్ను మాత్రం ఇలానా? రిషికి ఒక న్యాయం నాకో న్యాయమా?.. అంతేనా అన్నయ్య.. అదిగో రిషి వచ్చేస్తున్నాడు.. అని మహేంద్ర అంటాడు. రా రిషి..కూర్చో అని ఫణీంద్ర అంటే.. పెద్దమ్మ ఎక్కడున్నారు.. అని రిషి అడుగుతాడు. రూంలోఉందని గౌతమ్ అంటాడు. అందరూ ఇక్కడ ఉండగా.. పెద్దమ్మ ఒక్కరూ గదిలో ఉండటం ఏంటి.. అని వెళ్లిపోతాడు.

    పెద్దమ్మ ఏమైంది. అని రిషి అడుగుతాడ. ఇక దేవయాణి నాటకం మొదలెట్టుతుంది. నువ్ బాగుండాలి రిషి.. ఆనందంగా ఉండాలి.. నువ్ బాగుండటమే ఈ పెద్దమ్మకు ఆనందం.. ప్రపంచంలో నాకు ఏదీ ముఖ్యం కాదు.. నేను ఎక్కడున్నా కూడా నువ్ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని యాక్టింగ్ చేస్తుంటుంది.. నువ్ ఏం అంటున్నావ్ పెద్దమ్మ అని రిషి కంగారు పడతాడు.

    ఇంట్లోంచి వెళ్లిపోతోన్నాను.. అని దేవయాణి అంటుంది. మీరు వెళ్లిపోవడం ఏంటి.. అని రిషి ఆశ్చర్యపోతాడు. అవును నా కొడుకు దగ్గరకు వెళ్లిపోతోన్నాను రిషి.. అని చెబుతుంది. నీ కొడుకేంటి.. నేనూ నీ కొడుకునే కదా? అని రిషి అంటాడు. ఇన్నాళ్లూ నేనూ అదే అనుకున్నాను రిషి.. మంచేదోచెడోదే తెలిసేలా పెంచాను.. కానీ నీకు తెలియకుండానే వలలో ఇరుక్కున్నావ్.. ఆలోచనలు మారుతున్నాయ్.. నువ్వూ మారుతున్నావ్.. అని అంటుంది.

    నేను మారడం ఏంటి పెద్దమ్మ అని అంటాడు రిషి.. ఏం జరగలేదు రిషి.. నా పెంపకం మీద నాకే డౌట్ వస్తోంది.. చిన్నప్పటి నుంచి ప్రతీది అడిగేవాడివి.. చేసేవాడివి.. చిన్న విషయానికి కూడా పెద్దమ్మ అని సందడి చేసేవాడివి.. కానీ ఈ రోజు పెద్దమ్మ మీద ప్రేమ లేదేమోననిపిస్తుంది.. అని దేవయాణి అంటుంది. పెద్దమ్మ మీరు ఎందుకు ఇలా అటున్నారు.. మీరు కాదన్నది నేను చేయను కదా? అని రిషి అంటాడు.

    కాలం, మనషుుల, మనసులు మారుతున్నారు.. ఇంట్లో ఎటు వైపు వెళ్లినా నాదనే భావన ఉండేది.. నా రిషి అని గర్వంగా అనిపించేది కానీ ఇప్పుడు.. పరాయి వ్యక్తులు వచ్చి ఇంట్లో తిరుగుతుంటుంటే.. నా ఇల్లు కాదేమో.. నా రిషి కాదేమో.. అని దేవయాణి మరింత నటిస్తుంది. ఆ మాట అనకండి భరించలేను.. పెద్దమ్మ మీకు నచ్చని పనులు ఎప్పుడూ చేయలేదు.. కానీ డాడ్ హెల్త్.. అని రిషి చెబుతాడు.

    నేనేం నిన్ను తప్పబట్టడం లేదు.. నీ జీవితం నీది. నీ నిర్ణయం నీది.. నీ ఆలోచనలు నీవి.. నన్ను అడగాలని, సంప్రదించాలని అనడం లేదు.. నచ్చని వ్యక్తులు వచ్చాక. ఈ ఇంట్లోనా విలువేంటో అర్థమైంది.. అందుకే నేను వెళ్తాను.. నేను ఎక్కడున్నా కూడా నువ్ బాగుండాలనే కోరుకుంటాను.. నేను ఇన్నాళ్లు బతికిందే నీ కోసం.. నేను చచ్చిపోయానని తెలిస్తే ఒక్కసారి వచ్చి చూడు..అని పీక్స్‌కు వెళ్లి నటిస్తుంది దేవయాణి.

    పెద్దమ్మ.. ప్లీజ్.. నేను మీ కొడుకు.. నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్లొద్దు.. వెళ్లినివ్వను.. అని రిషి అంటాడు. నువ్ బాధ పడొద్దు నాన్న. నీ కళ్లలో నీళ్లు చూడకూడదని ఇన్ని రోజులు నేనేం చేయలేదు.. కాలం మళ్లీ వెనక్కి తిరుగుతోంది.. అని దేవయాణి అంటుంది. మీరేం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థమైంది.. రిషి ఎక్కడుంటాడో మీరు అక్కడే ఉంటారు.. మీరే నాకు అమ్మా.. మీరే నాకు పెద్దమ్మ.. మీరే నాకు దైవం.. మీరు బాధపడకండి.. రిషి మీ కొడుకు.. మీ కొడుకు.. అని అంటాడు. ఇదంతా కూడా మహేంద్ర వింటాడు.

    వదిన కచ్చితంగా ఏదో చేయబోతోంది.. రిషిని వాడుకుంటుందా? జగతిని మళ్లీ అవమానించబోతోందా? ఏదో ఒకటి చేయాలి.. అని మహేంద్ర అనుకుంటాడు. ఇంతలో జగతి వస్తుంది. పండుగ స్పెషల్ ఏదైనా చేయమంటావా? ఏమైంది మహేంద్ర.. ఒంట్లో బాగా లేదా?.. బాగానే ఉంది కదా? ఎందుకు అలా ఉన్నావ్.. అని జగతి అడుగుతుంది.

    నువ్ ఒక పని చేయాలి.. అని జగతిని మహేంద్ర అడుగుతాడు. నా కొడుకు వచ్చి ఒక పని చేయాలి అన్నాడు.. ఇప్పుడు నువ్ చేయమంటున్నావ్.. ఏమైంది మహేంద్ర చెప్పు.. అని అడుగుతుంది. దీంతో దేవయాణి ప్లాన్ గురించి మహేంద్ర చెప్పేస్తాడు.. దేవయాణి మాటలను రిషి తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో సూట్ కేస్ పట్టుకుని జగతి, మహేంద్రలు దిగుతారు.

    తను వచ్చిన పని అయిపోయింది రిషి.. జగతి వెళ్లిపోతుంది.. అని మహేంద్ర అంటాడు. వెళ్లమని ఎవ్వరూ చెప్పలేదు కదా? డాడ్.. అని రిషి అంటాడు. ఆకలేస్తుంటే.. ఏడ్వమని పసిపాపకు ఎవ్వరూ చెప్పరు.. సముద్రంలో నీటిని ఆవిరి చేయమని సూర్యకిరణాలకు ఎవ్వరూ చెప్పరు.. సూర్యుడిని డూటీకి ఎక్కమని, దిగమని ఎవ్వరూ చెప్పరు.. అదంతా ప్రకృతి ధరమం.. జగతి తన ధర్మానికి లోబడి నడచుకుంది.. ఎవరి క్లారిటీలు వాళ్లకుంటాయ్ కదా?.అని మహేంద్ర అంటాడ. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు..అని రిషి లోలోపల అనుకుంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నావా? అని మహేంద్ర కనిపెట్టేస్తాడు. ఇక ఇంతలో రుద్రాణి వచ్చి చూస్తుంది. ఆ నిర్ణయాన్ని విని షాక్ అవుతుంది. కానీ ఫణీంద్ర ఎమోషనల్ అవుతాడు. నువ్ రావడం అందరికీ సంతోషమే కదా? అని అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

    Leave a Reply