- February 3, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. మంట పెట్టేసిన దేవయాణి.. వసుపై రిషి ఆగ్రహం

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే ఫిబ్రవరి 3న గురువారం నాటి Guppedantha Manasu Episode 364 ధారావాహికలో రిషి, వసు మధ్య మాటలు, ఆటలే సరిపోయాయి. ఇక వంటగదిలో ధరణి, జగతి కష్టసుఖాలు, దేవయాణి చురకలతోనే నిండిపోయింది. మొత్తానికి గుప్పెడంత నేటి ఎపిసోడ్ ముందకు సాగింది.
జగతి చెప్పిన పనిని వసు చేసే పనిలో పడింది. రిషిని ముందే లాక్ చేసేసింది. మాటివ్వండి.. అని రిషిని వసు అడుగుతుంది. సంక్రాంతి గిఫ్ట్ అని చెబుతుంది. రెండు మాటలివ్వండని అడుగుతుంది. ఇచ్చిన గిఫ్ట్‌ను కాదనకుండా తీసుకోవాలని చెబుతుంది. దీంతో జగతి ఇచ్చిన కొత్త బట్టలను రిషికి ఇస్తుంది వసు. కాదనకుండా ముందే లాక్ చేసేశావ్ కదా? అని అంటాడు రిషి.
ఇక రెండోది ఏంటో అని రిషి అడుగుతాడు. యస్, నో అంటూ చిట్టిల ఆటలు ఆడిస్తుంది వసు. ఎవరికి ఎక్కువ యస్‌లు వస్తే వారే గెలిచినట్టు చెబుతుంది. గెలిచిన వారు ఏం చెబితే ఓడిన వారు అది చేయాల్సి ఉంటుందని నిబంధన చెబుతుంది. దీంతో ఆ ఆటలో రిషి ఓడిపోతాడు. ఏం చేయాలో చెప్పు అని రిషి అడుగుతాడు
నేను అయితే చిన్నప్పుడు అందరితో టీచర్ అని పిలిపించుకునే దాన్ని అంటూ వసు చెబుతుంది. మీరు జగతి మేడంని ఈ రోజంతా అమ్మా అని పిలవండి అని చెబుతుంది. దీంతో రిషి షాక్ అవుతాడు. నో నో అంటూ అరిచేస్తాడు. అయితే ఇదంతా కూడా రిషి కలకంటాడు. ఇంకా నువ్వేం అడగలేదా? అని రిషి కంగారు పడతాడు. ఈ రోజు అంతా కూడా ఎవరు ఏమన్నా కూడా కోప్పడకూడదు అని మాట తీసుకుంటుంది.
డ్రెస్ ఎలా ఉందో చెప్పరా? సెలెక్షన్ ఎలా ఉంది? అని వసు అడుగుతుంది. మరి నా సెలెక్షన్ ఎలా ఉందో అడగవా? అని వసుకి కొనిచ్చిన లంగావోణి గురించి రిషి అడుగుతాడు. ఇది మీ సెలెక్షనా? నేను మహేంద్ర సర్‌ది అనుకున్నా సర్ అని వసు సంబరపడిపోతోంది. అలా మొత్తానికి రిషి వెళ్లిపోతాడు. అయ్యో థ్యాంక్స్ చెప్పకుండానే వెళ్లిపోయాడేంటి అని వసు అనుకుంటుంది.
ఇక వంటగదిలో ధరణి, జగతి ముచ్చట్లు పెట్టుకుంటారు. చిన్నత్తయ్య స్టవ్ ఆఫ్ చేశాను.. ప్రతీ రోజూ ఇదే కిచెన్‌లో ఉండి.. మీ గురించే ఆలోచించే దాన్ని.. వందసార్లు ఆలోచించేదాన్ని.. ఏదేవుడు వరం ఇచ్చారో.. మొత్తానికి వచ్చారు.. అని ధరణి ఎమోషనల్ అవుతుంది.
ఎప్పుడూ ఇక్కడే ఉండిపోండి..అని ధరణి అంటుంది. గుడికి వెళ్లాలి గానీ.. అక్కడే ఉండిపోవాలని కోరుకోకూడదు..అని జగతి అంటుంది. ఎన్ని కష్టాలు పడ్డారు అని ధరణి ఆలోచించిస్తుంది.. ఇంత వరకు నీకు ఏం చేయలేకపోయాను.. ఏం ఇవ్వలేదు.. చిన మామయ్య గారిని బాగా చూసుకుంటారు. రిషి మీద కోపం చూపించరు.. అని ధరణి అంటుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడో అని అనుకున్నా.. ఇప్పుడు రోజూ చూస్తున్నాను.. ఇంత కంటే ఏం కావాలో చెప్పు.. అని జగతి ఎమోషనల్ అవుతుంది.
కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారా? అని జగతి, ధరణి మీద దేవయాణి సెటైర్లు వేస్తుంది. అడవిలోకి వెళ్తే నెమళ్లు, పక్షులు కనిపించాలని కోరుకుంటాం కానీ.. పులులు, సింహాలు గురించి మాట్లాడుకోరు అని జగతి కౌంటర్ వేస్తుంది.. ఈ మాత్రం భయం ఉంటే చాలు.. ఇద్దరికి.. ఏం ధరణి నీకు ఇష్టమైన, అభిమానమైన జగతి అత్తయ్య వచ్చిందని గాల్లో ఎగిరిపోకు.. గాలివాటానికి వచ్చిన వారు వెళ్లకతప్పదు.. అని దేవయాణి కౌంటర్లు వేస్తుంది.
భూమ్మిద ఎవరూ శాశ్వతం కాదు.. ఆ గర్వం తగ్గించుకంటే మంచిది.. అని జగతి సటైర్ వేస్తుంది. లెక్చరర్‌వి కదా? ఎన్నైనా మాట్లాడతావ్.. చేసింది చాలు..నువ్ ధరణిని కూడా మార్చేలా ఉన్నావ్.. జీవితాన్ని నాశనం చేసుకోకు..అని దేవయాణి అంటుంది. ఇప్పుడేదో అద్భుతంగా ఉన్నట్టు..అని జగతి కౌంటర్ వేస్తుంది. నాకు తెలుసు ఇలానే మాట్లాడుతావ్ అని.. ఇంకేం చూస్తున్నావ్.. అందరూ ఎదురుచూస్తున్నారు.. అందరికీ వడ్డించు వెళ్లు అని దేవయాణి బెదిరిస్తుంది. నిన్ను కూడా నాకు వ్యతిరేకంగా మార్చుతుంది.. వెళ్లు.. అని ధరణిని దేవయాణి పంపుతుంది. అడుగు పెట్టాను అని విర్రవీగకు.. అడుగు అడుగునా అడ్డుపడేందుకు నేనున్నాను అని గుర్తు పెట్టుకో.. హద్దుల్లో ఉంటే మంచిది.. అని దేవయాణి అంటుంది. మీకు ఇష్టమైన గీతలు గీసి ఇదే హద్దులు అంటే ఎలా? నేను ఇక్కడి దాకా వచ్చాను అని భయపడుతున్నారా? అని దేవయాణికి జగతి కౌంటర్ వేస్తుంది. ఇక అలా ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ దేవయాణి బాంబ్ పేల్చుతుంది. ఆ డ్రెస్ సెలెక్ట్ చేసింది జగతి అని చెప్పడంతో రిషి ఊగిపోతాడు. ఇక వసు మీద ఫైర్ అయ్యేట్టు కనిపిస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.