• January 25, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రి కోసం మెట్టు దిగిన రిషి.. జగతి కల నెరవేరినట్టే

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రి కోసం మెట్టు దిగిన రిషి.. జగతి కల నెరవేరినట్టే

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 25న మంగళవారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 356 ధారావాహికలో రిషి ముందు తన మనసులోని కోరికను చెప్పేస్తాడు మహేంద్ర. జగతి కావాలని మహేంద్ర చెప్పడంతో రిషి ఆలోచనల్లో పడతాడు. తన తండ్రి కోరికను నెరవేర్చేందుకు రిషి ప్రయత్నాలు మొదలుపెడతాడు. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    రిషి ఏంటి ఇలా పడుకున్నాడు. పోనీలే పడుకోని.. జగతి పాపం ఎంత బాధపడిందో.. ఇంటి దాకా వచ్చి లోపలకు రాకుండా పోయింది.. మెసెజ్ పెడదాం అని మహేంద్ర అనుకుంటాడు. ఐ యామ్ ఓకే అని జగతికి మహేంద్ర మెసెజ్ పెడతాడు.. మహేంద్ర ఈ టైంలో మెసెజ్ చేశాడంటే ఇంకా పడుకోలేదా? అని మెసెజ్ చూస్తుంది. ఐయామ్ నాట్ ఓకే.. ఫోన్ చేయనా? అని జగతి తిరిగి మెసెజ్ చేస్తుంది.

    సారీ జగతి.. పక్కనే రిషి ఉన్నాడు.. అని మహేంద్ర మెసెజ్ పెడతాడు. నా కొడుకు ఎంత మంచివాడో మహేంద్ర పక్కనే ఉన్నాడు..అని జగతి సంబరపడుతుంది. గుడ్ నైట్ మహేంద్ర జాగ్రత్త.. అని జగతి తిరిగి మెసెజ్ పంపుతుంది. గుడ్ నైటా? ఇంకాసేపు చాటింగ్ చేయోచ్చు కదా? అని మహేంద్ర పంపేలోపు.. మహేంద్రకు వాటర్ అవసరం పడుతుంది. దీంతో రిషి కూడా నిద్రలేస్తాడు. వాటర్ అందిస్తాడు. మహేంద్ర ఫోన్ ఆన్ చేశాడని తెలుసుకుంటాడు..

    సెల్ ఫోన్ ఆన్ చేశారు కదా డాడ్ అని అంటాడు.. నిద్ర పట్టడం లేదని అంటూ మహేంద్ర సాకులు చెబుతాడు.. ఏంటి డాడ్ మీరు.. నిద్ర పోవచ్చు కదా? అని రిషి అంటాడు. నిద్ర పట్టాలి కదా? అని మహేంద్ర తిరిగి ప్రశ్నిస్తాడు. ఏమైనా టెన్షన్ ఫీలవుతున్నారా? అని రిషి అనగానే.. మహేంద్ర నవ్వేస్తాడు. ఏంటి డాడ్ నవ్వుతున్నారు.. సంతోషంగా ఉండాలి మీరు అని అంటాడు.

    సంతోషంగా ఉండటం అంటే? ఏంటి అని అడుగుతాడు మహేంద్ర. కంఫర్ట్‌గా ఉండటం.. అని రిషి అంటాడు. కంఫర్ట్ అంటే ఖరీదైన కారుండటం. కానీ అవి ఉండీ కూడా సంతోషంగా ఉండనివారుంటారు.. అవి సౌకర్యాలు.. సంతోషం కాదు.. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం అలాగని ఆ గుడ్ కూడా మార్నింగ్‌లో ఉండదే అని మహేంద్ర అంటాడు.. మార్నింగ్ గుడ్ అవ్వాలని కోరుకోవడమే కదా? అని రిషి అంటాడు.

    కోరుకున్న మాత్రానా అన్నీ చేరుకోవు కదా?.. ఇంటి నిండా మనుషులు ఉండాలి.. ఇళ్లు ఇరుగ్గా ఉన్నా కూడా మనసులు విశాలంగా ఉండాలి లేదంటే.. ఖరీదైనా ప్లాస్టిక్ పూలులా మనుషులు ఉన్నా ఒకలే లేకున్నా ఒకటే అని అంటాడు మహేంద్ర. అంటే ఇళ్లంతా గోలగా ఉండాలా? అని రిషి అంటే.. గోల కాదు సందడిగా ఉండాలని అంటాడు మహేంద్ర.. ఇళ్లు, ఇంట్లోని మనుషులు, వారి మనసులు లైబ్రరీలా నిశ్శబ్దంలా ఉంటే.. సంతోషానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది.. అని మహేంద్ర అంటాడు.

    మీరేదో సంతోషాన్ని మిస్ అయినట్టుగా.. మీ మనసేదో కోరుకున్నట్టుగా అనిపిస్తోంది డాడ్ అని రిషి అంటాడు.. ఇదంతా నాకు 20 ఏళ్లుగా అలవాటైందిలే రిషి.. నా మనసుకు బాధలు అర్థమయ్యాయ్.. మోస్తోంది.. కానీ గుండె తట్టుకోలేకపోయింది.. అని తన బాధను బయటపెట్టేస్తాడు మహేంద్ర. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.. ఏం కావాలి డాడ్ మీకు అని అడుగుతాడు రిషి.

    సంతోషం.. అని మహేంద్ర అంటాడు. అదే నేను అప్పటి నుంచి అడుగుతున్నాను.. మీరు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అని రిషి అంటాడు. దీంతో మహేంద్ర తన మనసులోని కోరికను బయటపెడతాడు. జగతి.. జగతి.. నా భార్య.. నా జీవితం.. నా అర్థాంగి.. మాట్లాడవేంటి రిషి.. సంతోషమంటే.. కోటి రూపాయల కారు చూసుకోవడం కాదు.. చిరునవ్వుతో కాఫీ అందించే తన భార్య మొహం చూడటం.. మీరిద్దరు గొడవ పడాలి.. న్యాయం చెప్పమని నా దగ్గరకు రావాలి.. నేను పెసరట్టు చేయమంటాను.. నాకు ఇడ్లీ కావాలని నువ్ అడగాలి.. నువ్ చెప్పిందే చెస్తానని అంటుంది.. నేను తినని అలుగుతాను.. మీ ఇద్దరు వచ్చి నన్ను బుజ్జగిస్తారు.,. ఇదీ సంతోషమంటే.. ఇది ఎప్పుడైనా జరిగిందా? అని ఇలా మహేంద్ర చెప్పుకుంటూ పోతాడు. అవన్నీ విని రిషి బయటకు వెళ్లిపోతాడు. సంతోషమంటే నాకు ఇంతకన్నా ఏముంటుంది.. ఇదే ఈ మహేంద్ర భూషణ్ సంతోషం అని మహేంద్ర అనుకుంటాడు.

    ఇక ఉదయాన్నే జగతి ఇంటి ముందు ముగ్గులు, హరిదాసు కీర్తనలు వినిపిస్తాయి.. ఏంటి వసు అలా చూస్తున్నావ్ అని జగతి అడుగుతుంది.. సంక్రాంతి అంటే ఊరి పండుగ కదా? అని వసు అంటుంది. అవును లక్ష్మీ దేవీ ఇంటికి రావడం అని జగతి అంటుంది.. గంగిరెద్దులు, గాలి పటాలు.. భోగి మంటలు, బొమ్మల కొలువులు.. మూడు రోజుల పండుగ.. అని వసు ఇలా చెప్పుకుంటూ పోతుంది.

    నాకు అయితే కాలెండర్ల మీదే పండుగలు కనిపిస్తాయి. పండుగలు నా మీద అలిగి వెళ్లిపోయాయ్.. సంప్రదాయాలు పాటిస్తాను.. కాను.. సంతోషపడదామంటే నాకు ఎవరు తోడున్నారు.. నీ చదువు అయిపోగానే నువ్ కూడా వెళ్లిపోతావ్.. అన్ని పండుగలు చేసుకుందామని అనిపిస్తుంది.. ఒంటరిగా చేసుకునే పండుగే లేదు కదా? అందరూ కలిసి సంతోషంగా ఉండటమే కదా? వసు.. అందరూ ఉన్నా ఎవ్వరూ లేని ఏకాకిని వసు.. అందరికీ చాలా పండుగలుంటాయ్.. నాకు రెండే రెండు పండగలు.. మహేంద్ర, రిషి.. మహేంద్ర ఎలా ఉన్నాడో ఏమో.. చీటికి మాటికి ఫోన్ చేస్తే బాగుండదు.. చెయ్యకుండా ఉండలేను.. అని జగతి బాధపడుతుంది.

    మహేంద్ర మాటలను గుర్తు చేసుకున్న రిషి ఓ నిర్ణయానికి వస్తాడు. డాడ్ ఆనందం ముందు ఏదైనా నాకు గడ్డి పరకతో సమానం.. డాడ్ అంతా ఒక వైపు.. ప్రపంచం అంతా కూడా ఒక వైపు.. డాడ్ కోసం నేను ఏమైనా చేయగలను.. అని రిషి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ వచ్చి విసిగించేస్తాడు. నువ్ నా ఫ్రెండ్ అయితే నన్ను ఓ పది నిమిషాలు వదిలేయ్ అని రిషి అంటాడు.

    దీంతో గౌతమ్ వెళ్లిపోతాడు. కోరుకున్నంత మాత్రానా అన్నీ చేరవు కదా? రిషి..అని మహేంద్ర అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. డాడ్ ఆనందంగా ఉండాలంటే.. ఓ పర్మినెంట్ సొల్యూషన్ కావాలి.. ఏం చేయాలి.. అని వసుకు ఫోన్ చేస్తాడు. రెస్టారెంట్‌కు బయల్దేరుతున్నా సర్ అని చెప్పడంతోనే కట్ చేసేస్తాడు రిషి. పూర్తిగా వినరు.. చెప్పనివ్వరు.. అని వసు అనుకుంటుంది.

    ఇక రెస్టారెంట్ వద్ద రిషిని చూసి.. సర్ మీరేంటి ఇక్కడా అని వసు అడుగుతుంది.. నీతో ఓ విషయం మాట్లాడాలి అని అంటాడు రిషి.. రెస్టారెంట్ లోపల మాట్లాడుకుందాం.. అని వసు పిలుస్తుంది. బయటకు వెళ్దామని రిషి అంటే.. సర్ ఇప్పుడు డ్యూటీ ఉంది.. అని వసు అంటుంది. పర్లేదు కారెక్కు.. చాలా ముఖ్యమైన విషయం.. నీ రెస్టారెంట్ కంటే వందరెట్లు ఇంపార్టెంట్.. అన్నిసార్లు.. అన్ని వివరాలు అడగొద్దు.. ఏం మాట్లాడకుండా ఎక్కు.. నా పర్సనల్ మ్యాటర్.. అని అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇ రేపటి ఎపిసోడ్‌లో వసుని, జగతిని తన ఇంటికి తీసుకెళ్లేందుకు రిషి వస్తాడు. మీరు మా ఇంటికి రండి అని జగతిని ఆహ్వానిస్తాడు. దీంతో జగతి తెగ సంబరపడిపోతుంది.

    Leave a Reply