• January 24, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. జగతి కావాలన్న మహేంద్ర.. నిర్ణయం తీసుకోనున్న రిషి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. జగతి కావాలన్న మహేంద్ర.. నిర్ణయం తీసుకోనున్న రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 24న సోమవారం నాటి Guppedantha Manasu Episode 355 ధారావాహికలో గుండెల బరువెక్కే సీన్లు పడ్డాయి. జగతి, మహేంద్రల పరిస్థితి చూస్తే అందరికీ కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇక మహేంద్ర కోసం జగతి ఆలోచిస్తుంటుంది. రిషి చేసిన పనిని జగతి మనసుతో చూస్తుంది. ఇక మొత్తానికి మహేంద్ర మాత్రం తన మనసులోని విషయాన్ని బయటపెట్టేశాడు. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    అది గడప కాదు.. లక్ష్మణ రేఖ.. గౌరవంగా పిలుస్తేనే వెళ్తాను.. పిలుస్తారో లేదో.. అనాథ శవంలా కాటికి వెళ్తానేమో.. అని జగతి బాధపడుతుంటుంది. మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు.. అని వసు అంటుంది. నిజం మాట్లాడేందుకు ధైర్యం కావాలి.. అబద్దానికి లౌక్యం కావాలి.. అని జగతి అంటుంది. లోపలకు వెళ్లేందుకు అవకాశం వచ్చిందని, వెళ్తే బాగుండని నాకు అనిపించింది.. మేడం అని వసు అంటుంది.

    మహేంద్రను కాపాడుకున్నాను అది చాలు.. అవకాశం కోసం కాదు..మనల్ని డ్రాప్ చేయమని రిషి అన్నాడు. కానీ సున్నితంగా వద్దని అన్నాను.. రిషి మనకు గౌరవం చూపించాడు.. అది అలా ఉంచుకుంటేనే మంచిది.. ఆ ఇళ్లు నన్ను మరిచిపోయింది వసు.. అని జగతి బాధపడుతుంది. ఇక మహేంద్ర వద్ద రిషి, గౌతమ్ ఉంటారు. డాడ్ నేను మీ దగ్గరే ఉంటాను. మీతోనే ఉంటాను.. ఎందుకు రిషి నేను బాగానే ఉన్నాను కదా? అని మహేంద్ర అంటాడు.,

    మీరు ఎన్నారో నాకు తెలుసు.. అని రిషి అంటాడు. ఏదో చిన్న డిస్టర్బ్.. అందరూ నా మీద అలిగినట్టుగా.. నా గుండె కూడా అలిగినట్టుందేమో..అని మహేంద్ర అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నవ్వుతున్నారు.. ఏంటి అని రిషి అడుగుతాడు. నవ్వు, ఏడుపు దేవుడిచ్చిన వరం.. నవ్వలేకఏడుపు అని అంటారు కానీ ఏడుపు రాక నవ్వుని నటిస్తుంటారు.. అని తన బాధ గురించి పరోక్షంగా చెబుతాడు మహేంద్ర. దీంతో గౌతమ్‌ను రిషి పంపించేస్తాడు. నువ్వెళ్లి రెస్ట్ తీసుకోరా గౌతమ్.. అని అంటాడు రిషి.

    గౌతమ్ వెళ్లాక.. డాడ్.. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.. అని అంటాడు రిషి. నువ్ అనవసరంగా భయపడకు..అని మహేంద్ర అంటే.. భయం కాదు డాడ్.. దానికి ఏం పదం వాడాలో కూడా నాకు తెలియడం లేదు అని రిషి అంటాడు. రిషి నువ్ చిన్న పిల్లాడివి కాదు.. కాలేజ్ ఎండీవి.. అన్నింటిని సమానంగా స్వీకరించాలి.. పుట్టుక ఎంత సహజమో.. చావు కూడా అంతే సహజం.. అని మహేంద్ర అంటాడు.

    ఇలాంటి మాటలు మాట్లాడకండి.. ప్లీజ్.. కాలేజ్‌కి ఎండీ అయినా.. మీరు నా జీవితానికి ఎండీ.. నేను ఎప్పుడూ చిన్న పిల్లాడినే మీ ముందు.. డాడ్ మీరు ఏ బారం మోస్తున్నారు.. మనసులో.. మీకు ఎందుకు ఇలా అయింది..అని రిషి అడుగుతాడు. రిషి నాకేం కాలేదు.. బాగానే ఉన్నాను.. నాకేం కాదు.. రిషి నాకోసం ఇబ్బంది పడకు.. అని మహేంద్ర అంటాడు. మీకోసం చేసే ఏ పనైనా నాకు ఆనందాన్ని ఇస్తుంది..అని రిషి అంటాడు. ఆ విషయం చెప్పాలా? నాకు తెలీదా? వెళ్లు.. పనులు చూసుకో.. అని మహేంద్ర అంటాడు. చెప్పాను కదా? మీకంటే ముఖ్యమైన పనులు నాకు లేవు.. ఇక్కడే ఉంటాను.. అని మహేంద్ర ఒళ్లోనే రిషి పడుకుంటాడు.

    ఇక మరో వైపు జగతి తినకుండా మహేంద్ర గురించి ఆలోచిస్తుంటుంది. ఇలా చేస్తే మహేంద్ర సర్‌కు ఫోన్ చేసి చెబుతాను అని వసు అంటుంది. దీంతో జగతి తినేందుకు ఒప్పుకుంటుంది. మరో వైపు మహేంద్రకు తినేందుకు రిషి తీసుకొస్తాడు. నువ్ తిన్నావా? అని మహేంద్ర అడిగితే.. మీ కడుపు నిండాకే నేను తింటాను అని రిషి అంటాడు.. బంధాలు, అనుబంధాలు ఎంత గొప్పవో కదా? రిషి.. ఆత్మియలు, పేగుబంధాలు.. ఒకరికి బాగా లేకపోతే ఇంకొకరు బాధపడతారు.. ఒకరు తినకపోతే.. ఇంకొకరు తినరు.. ఒకరు బాధ పడితే.. ఇంకొకరు బాధపడతారు.. మానవ సంబంధాలు ఎంత గొప్పవో కదా?.. మనిషి సుఖాల వెంట పరుగులు తీస్తుంటారు.. మానవ సంబంధాల నీడలో ఎంత బాగా సేద తీర వచ్చో కదా?.. అని మహేంద్ర అంటాడు.

    ఆ సమయంలో జగతి ఫోన్ నుంచి మహేంద్రకు వసు ఫోన్ చేస్తుంది. అది చూసిన రిషి.. ఫోన్ లిఫ్ట్ చేసి కట్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను.. అందరూ ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు డాడ్ అని అంటాడు రిషి. అందులో సంతోషాన్ని ఇచ్చే వారు కూడా ఫోన్ చేయోచ్చు కదా? అని మహేంద్ర అంటాడు. ఇక రిషి తన ఫోన్ నుంచి వసుకి వీడియో కాల్ చేస్తాడు. మహేంద్రను చూపిస్తాడు. మందులను చూపిస్తాడు. తన తండ్రిని తాను బాగా చూసుకుంటాన్నాను అని చెబుతాడు.

    డాడ్‌కి నేనున్నాను..డాడ్ కోసం కష్టపడ్డవారందరికీ థ్యాంక్స్.. నేను చూసుకుంటాను.. అని చెప్ప కట్ చేస్తాడు. మీకు నిద్ర అవసరం.. పడుకోండి అని రిషి అంటాడు. అవును మంచి నిద్ర అవసరం.. కానీ నిద్ర పట్టడం లేదు.. అని మహేంద్ర అంటాడు. నచ్చినవి తలుచుకోండి.. అని అంటాడు. కళ్లు మూసినా నచ్చినవాడివి నువ్వే ఎదురుగా ఉన్నావ్ కదా?.. నువ్ కూడా నిద్రపో అని మహేంద్ర అంటాడు. నాక్కూడా నిద్ర రావడం లేదు డాడ్ అని రిషి అంటాడు… మనసుకు నచ్చిన సంఘటనలు గుర్తు తెచ్చుకో.. అదే మనకు కమ్మని జోలపాట.. అని మహేంద్ర అంటాడు.

    మరో వైపు వసుని నిద్రపో అని జగతి అంటుంది. ఏంటో మేడం.. నిద్ర రావడం లేదు.. మహేంద్ర సర్‌తో మాట్లాడనివ్వొచ్చు కదా? అని రిషి గురించి వసు టాపిక్ తీస్తుంది. నీకు రిషి మీద కోపం వస్తుందా? అని జగతి అడుగుతుంది. మీకు రావడం లేదా?అని వసు అంటుంది. ఫోన్ ఇవ్వడం లేదని మాత్రమే చూస్తున్నావ్.. ఎందుకు ఇవ్వడం లేదని నేను ఆలోచించాను.. ప్రేమ వసు.. ప్రేమ..

    రిషికి మహేంద్ర అంటే చెప్పలేనంత ప్రేమ.. తనే రిషికి తల్లి, తండ్రి.. గొప్ప ఫ్రెండ్. అంత ప్రేమిస్తున్నాడు కాబట్టే.. అలిసిపోతాడు అని.. పరామర్శలు విని బాధపడతాడు అని ఫోన్ కాల్ మాట్లాడించలేదు.. డిస్టర్బ్ అవ్వకూడదని ఈ పాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు.. అని జగతి అంటుంది. దీంతో ఓ సారి టెస్ట్ చేస్తుంది. మహేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు ఊహించిందే నిజం మేడం అని వసు అంటుంది.. ఎంతైనా నా కొడుకే కదా? వసు.. రిషి మహేంద్రను అపురూపంగా చూసుకుంటాడు.. అక్కడ లేను అనే బాధ ఉన్నా.. కంటికి రెప్పలా చూసుకుంటాడు అని తృప్తిగా ఉంది.. అని జగతి అంటుంది.

    రిషి సర్ మీద మీకు కోపం రాదని తెలుసు.. అని వసు అంటుంది. ఎందుకు రావాలి.. కోపం అనేది మానసిక అపరిపక్వత.. మన కంటే మనసుకు నచ్చిన వాళ్లను బాగా చూసకుంటే.. సంతోషంగా ఉంటుంది.. మహేంద్రకు దగ్గరగా లేకపోయినా మనసులో ఉన్నాను కదా?.. అని జగతి అనుకుంటుంది. ఇక కుర్చీలో నిద్రపోతూ ఉంటాడు రిషి. బెడ్డు మీద నిద్రపోకుండా మహేంద్ర ఆలోచిస్తుంటాడు. దేవయాణి అన్న మాటలను గుర్తు చేసుకుంటాడ. ఇక మరో వైపు మహేంద్ర గురించి జగతి ఆలోచిస్తూ ఉంటుంది.

    అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహేంద్ర తన మనసులోని బాధను చెబుతాడు. సంతోషం అంటే.. తనకు జగతి కావాలని మహేంద్ర చెప్పడంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఈ విషయం మీద మాట్లాడేందుకు వసుని రమ్మంటాడు. తన పర్సనల్ విషయం గురించి చెప్పాలని వసుని పిలుస్తాడు రిషి. మరి ఏం మాట్లాడతాడో చూడాలి.

    Leave a Reply