• January 20, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రి కోసం మారనున్న రిషి.. జగతిని అంగీకరిస్తాడా?

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తండ్రి కోసం మారనున్న రిషి.. జగతిని అంగీకరిస్తాడా?

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 20 గురువారం నాడు ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 352 ధారావాహికలో రిషి, జగతిలు మహేంద్ర పరిస్థితిని చూసి తెగ బాధపడుతుంటారు. మహేంద్రను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నించండి.. ఆయన మనసులో ఉన్న ఆవేదనను తెలుసుకోండని డాక్టర్ సలహా ఇస్తాడు. కానీ రిషి మాత్రం అవేవీ పట్టించుకున్నట్టు కనిపించలేదు. పైగా జగతిని వెళ్లిపోమన్నట్టుగా పరోక్షంగా చురకలు అంటిస్తాడు. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అందరి గుండెలను బరువెక్కించేలా సాగింది.

    మహేంద్రకు హార్ట్ స్టోక్ రావడం, హాస్పిటల్‌లో చేర్పించడం, అది చూసి రిషి కుంగిపోవడం అందరికీ తెలిసిందే. ఇక రిషి తన తండ్రి గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంటాడు. ఇంతలో గౌతమ్ వచ్చి ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. నాకంటూ ఈ లోకంలో ఎవరున్నారు.. డాడ్‌ని అలా చూసి ఉండలేకపోతోన్నాను అని రిషి బాధపడతాడు. ఏం కాలేదని డాక్టర్లు చెబుతున్నారు.. యూఎస్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కి కూడా రిపోర్ట్స్ పంపానురా.. అంకుల్‌కి ఏం కాదు అని గౌతమ్ ధైర్యం చెబుతాడు.

    ఇంట్లో వాళ్లకు చెప్పావా? అని రిషిని గౌతమ్ అడుగుతాడు. నువ్వె చెప్పు అని గౌతమ్‌ని అంటాడు. తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని గౌతమ్ అంటే.. అదేం వద్దు కానీ నువ్వెళ్లి ఇంట్లో వాళ్లకు చెప్పు అని గౌతమ్‌ని రిషి పంపిస్తాడు. ఇక రిషి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటాడు. వసు వచ్చి కాఫీ ఇస్తుంది. కనీసం ఈ కాఫీ అయినా తాగండి సర్.. మహేంద్ర సర్‌ను బాగా చూసుకోవాలంటే మీరు బాగుండాలి కదా? సర్ అని ఓదార్చుతుంది.

    దీంతో వసు చేతులు పట్టుకుని రిషి ఫీలవుతాడు. డాడ్‌కు ఇలా అవ్వడం ఏంటి? ఇలా చూడలేకపోతోన్నాను అని విలవిల్లాడిపోతాడు. ఆ తరువాత వసు చేతులను వదిలేస్తాడు రిషి. ఇంతలో డాక్టర్ వద్దకు వెళ్లి మహేంద్ర పరిస్థితి గురించి తెలుసుకుందామని అనుకుంటాడు.కానీ జగతి ఆల్రెడీ ఆ పనిలోనే ఉంటుంది. డాక్టర్ చెప్పిన మాటలు రిషి, జగతి వింటారు.

    మహేంద్ర గారికి ఏదో ఆవేదన బాధలున్నాయి.. మనసులో కుమిలిపోతోన్నారు అని అంటాడు డాక్టర్. నాకు తెలిసి మా డాడ్‌కు ఎలాంటి బాధలు లేవు అని చెబుతాడు. జగతి బాధగా రిషి వైపు చూస్తుంది. మనకు చిన్నవి అనిపించేవే.. వాళ్లకు భారంగా మారొచ్చు అని డాక్టర్ సలహా ఇస్తాడు. మహేంద్రను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లండి.. మనో వ్యాధిని మీరే తగ్గించగలరు అని చెబుతాడు డాక్టర్.

    ఇక మహేంద్ర వద్ద వసు కన్నీరు కార్చేస్తుంది. రిషి సర్‌ ఏడ్వడం ఇదే మొదటిసారి ఇది వరకు ఎప్పుడూ అలా చూడలేదు అని వసు అంటుంది. చిన్నతనం నుంచి ఏడ్వకుండా దాచుకున్న కన్నీళ్లన్నీ కూడా ఇలా బయటకు తీసుకొచ్చాడేమో.. రిషి చిన్నతనం నుంచి బాధను మోస్తూ కోపం ముసుగు వేసుకున్నాడు..నేను చిరునవ్వు ముసుగు వేసుకున్నాను.. దేవయాణి వదిన చేసిన వాటికి మా ముగ్గురి జీవితాలు ఇలా తలొదిక్కుకు వెళ్లాయి అని మహేంద్ర బాధపడతాడు.

    ఇన్నాళ్లు దాచుకున్న కన్నీళ్లు వచ్చాయ్.. ఆ బాధంతా కూడా కొట్టుకుపోవాలి.. జగతి కన్నీళ్లను నేను చూడలేకపోతోన్నాను.. నువ్వే జగతిని బాగా చూసుకోవాలి అని వసుకు చెబుతాడు మహేంద్ర. పేషెంట్ మీరా? నేనా?.. విచిత్రంగా ఉంది.. మీరే అందరికీ ధైర్యం చెబుతున్నారు సర్ అని వసు అంటుంది. మన జీవితాలే విచిత్రంగా మారపోయాయ్.. ఇది సందర్భంగా కాదు కానీ.. నీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను.. రిషి, జగతిని కలిపి గురు దక్షిణగా ఇస్తానుఅన్నావ్.. నిలబెట్టుకుంటావ్ అని ఆశిస్తున్నాను.. నీ మాట నిలబెట్టకునే వరకు ఉంటానో కూడా నాకు తెలీదు.. అని మహేంద్ర అంటాడు. అలా అనకండి సర్.. అంత మంచే జరుగుతుందని ఆశిద్దాం సర్.. మీరు రెస్ట్ తీసుకోండి.. అని వసు అంటుంది.

    రిషి సర్ మీతో మాట్లాడాలి అని జగతి అంటుంది. ఫ్యాకల్టీ హెడ్‌లా కాదు.. మహేంద్రతో కలిసి బతకలేకపోయినా, జీవిత భాగస్వామిలా మాట్లాడాలి.. మహేంద్ర మనసులో ఏదో బాధ.. ఏదో దాగుందని నా అనుమానం.. లేకపోతే.. మహేంద్రకు ఇలా జరిగేదేమో కాదు.. అని జగతి అంటుంది. డాడ్ క్షేమం గురించి మాట్లాడితే వింటాను.. మరిచిపోయిన బంధాలను ఇందులోకి తీసుకురాకండి.. అని అంటాడు రిషి.

    మహేంద్ర తన మనసులో ఏదో తెలియని బరువు మోస్తున్నాడు.. అది మోయలేక ఇలా అవుతున్నాడు.. అని జగతి అంటుంది. జరిగిందేంటో తెలియదు కానీ.. టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది.. ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించకండి.. అని అనడంతో జగతి బాధపడుతుంది.

    డాడ్ మనసు గురించి మీరు విశ్లేషణ చేస్తున్నారు కానీ.. మీకంటే ఎక్కువగా నేను ప్రయాణం చేశాను.. మీరు దూరమైన సమయంలో ఎప్పుడూ మీ గురించి బాధపడలేదు.. మీరు వచ్చాకే ఇలా అయింది.. మీతో ఉండటం, ఇంట్లో సమాధానం చెప్పలేక.. నా కళ్లలోకి సూటిగా చూడలేకపోయేవారు.. మీ పర్సనల్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఎప్పుడూ ఈ ప్రస్థావన తీసుకురాలేదు.. అదీ నేను డాడ్‌కు ఇచ్చిన గౌరవం.. ఇప్పుడు చెప్పండి.. అని రిషి అంటాడు. డాడ్ గురించి ఏదో చెబుతా అన్నారు కదా? అంటాడు. అన్నీ చెప్పేసి.. అన్నీ దారులు మూసేశావ్.. ఇప్పుడు ఇలా అడుగుతున్నావా? రిషి అని జగతి తన మనసులో అనుకుంటుంది.

    నాకు బాధలు కొత్తేమీ కాదు.. కానీ ఈ బాధలు మహేంద్రకు కొత్త అని జగతి అంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహేంద్ర, జగతిలు మాట్లాడుకున్న దాంట్లోంచి రిషికి కొత్త ఆలోచన వస్తుంది. నీ మనసు, అందులోని బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నేను తప్పా అని జగతి తల్లడిల్లిపోతుంది. ఇన్నాళ్లూ డాడ్ నా కోసం జగతి మేడంకు దూరంగా ఉన్నారు.. ఇప్పుడు నా కోసం కాకపోయినా డాడ్ కోసమైనా నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందా? అని ఆలోచిస్తాడు.

    Leave a Reply