- January 19, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. తల్లిని ఆ మాటతో క్షోభ పెట్టిన రిషి.. వసుకి మహేంద్ర పరీక్ష

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అంటే బుధవారం నాడు జనవరి 19న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 351 ధారావాహికలో మహేంద్ర ఆరోగ్య పరిస్థితిపై రిషి, జగత తల్లడిల్లిపోతారు. తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో రిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు అవుతాడు. అయితే తండ్రి కళ్లు తెరవడంతో రిషి, జగతిల ఊపిరి వచ్చినట్టు అవుతుంది. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ కాస్త బరువెక్కినట్టు అనిపిస్తుంది.
రిషికి ఫోన్ చేశావా? అని వసుని జగతి అడుగుతుంది. గౌతమ్‌కి ఫోన్ చేసి రమ్మన్నాను మేడం మళ్లీ ఫోన్ చేస్తాను అని వసు అంటుంది. ఇంతలో రిషి, గౌతమ్ హాస్పిటల్‌లోకి ఎంట్రీ ఇస్తారు. అదే సమయంలో గౌతమ్‌కి ఫోన్ చేస్తుంది వసు. ఆ ఫోన్‌ను రిషి తీసుకుంటాడు. అసలేం జరిగింది? అని అడుగుతాడు రిషి. మీరు వచ్చారా? ఎక్కడున్నారు అని వసు అడుగుతుంది.
నేనేం అడుగుతున్నాను.. నువ్వేం చెబుతున్నావ్.. అని రిషి ఫైర్ అవుతాడు. వచ్చి చెబుతాను సర్ అని వసు అంటుంది. వద్దు.. నువ్వెక్కడున్నావో చెప్పు వస్తాం అని అంటాడు. ఐదో ఫ్లోర్‌కి రండి అని చెబుతుంది వసు. అక్కడ వసు, జగతి వెక్కి వెక్కి ఏడుస్తుండటం చూసి రిషి కంగారు పడతాడు. ఎవరికి ఏమైంది.. నీకైతే ఏం కాలేదు కదా? వసు థ్యాంక్ గాడ్ అని రిషి అంటాడు.
రిషికి తన స్టూడెంట్స్ మీద, వసు మీద బాగానే జాలి ఉన్నట్టుంది అని గౌతమ్ అనుకుంటాడు. మేడం ఎందుకు ఏడుస్తోంది. ఎవరికి ఏమైంది అని అడుగుతాడు రిషి. మహేంద్ర సర్‌కి హార్ట్ ఎటాక్ అని చెప్పడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. డాడ్‌కి హార్ట్ ఎటాకా? అని కంటతడి పెట్టేస్తాడు. ఇక రిషి తన తండ్రి కోసం పరివిధాలుగా తపిస్తుంటాడు.
అంకులే వాడికి ప్రపంచం.. చిన్నప్పుడు నాకు వాడు ఫ్రెండ్ అయ్యే టైంకు అమ్మ దూరమైందట.. అమ్మ గురించి అడిగితే నాకు ఏం చెప్పేవాడు కాదు.. అమ్మ ఫోటోను నేను ఇప్పటి వరకు చూడలేదు.. అమ్మ లేకుండానే పెరిగాడు.. అంకులే వాడి ప్రపంచం.. అని గౌతమ్ చెబుతుంటాడు. ఇక జగతి మరింతగా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్రను చూసేందుకు వైద్యులు పర్మిషన్ ఇస్తారు. చిన్న స్ట్రోక్ సరైన టైంకి తీసుకొచ్చాని అంటాడు.
ఏమైంది.. అని రిషి అడుగుతాడు. సడెన్‌గా ఎక్కువగా నవ్వారు అంటూ జరిగింది చెబుతుంది జగతి.. ఇన్నేళ్లు అందరికీ దూరమై ఒంటరిగా బతుకుతున్నాను. నాకు మిగిలి ఉన్న ఒకే ఒక్క మిత్రులు.. ఏమైనా జరిగితే.. ఈ జగతి తుది శ్వాస విడుస్తుంది.. అని జగతి బాధపడుతుంది. రిషి కూడా తండ్రి గురించి తెగ బాధపడతాడు. అందరిలా ఏడ్చి నా బాధను వ్యక్తపరచలేను.. నాకు ఏడుపు రాదు.. నేను ఏడ్వను.. మీకు తెలుసు కదా? కళ్లు తెరవండి డాడ్.. చూడండి డాడ్..
ప్రతీసారి ఏదో ఒక కొటేషన్ చెబుతారు కదా? చెప్పండి డాడ్.. రిషి నీకు ఇది చెబుతా.. అది చెబుతా అని ఏదో ఒకటి చెబుతారు కదా. డాడ్.. మీరిలా సైలెంట్‌గా ఉండటం నేను చూడలేను డాడ్.. డాడ్ మీకేం కాలేదు.. కాదు కూడా. లేవండి డాడ్.. కళ్లు తెరవండి డాడీ.. నా కోసం లేవండి.. ప్లీజ్.. అని రిషి ఎమోషనల్ అవుతాడు. ఇంతలో మహేంద్ర కళ్లు తెరుస్తాడు.
నాకు తెలుసు మీకేం కాదు అని.. వీళ్లంతా ఏదేదో చెబుతుంటారు.. నేను నమ్మను.. అని రిషి కాస్త రిలాక్స్ అవుతాడు. ఏంటి భయపడ్డారా?.. మహేంద్ర భూషణ్.. సన్నాఫ్ దేవేంద్ర భూషణ్.. నాకేం కాదు.. నా పనైపోయిందని అనుకున్నారా?.. అని మహేంద్ర అంటాడు. ప్లీజ్.. నా గుండె ఆగినంత పనైంది.. నువ్ లేకుండా ఈ జగతి బతకదు.. అని జగతి అంటుంది. చావు అందరినీ పలకరిస్తుంది.. అది తప్పదు కదా? అని మహేంద్ర అంటే.. ఇలాంటి మాటలు నేను వినలేదు.. ఆపండి డాడ్.. అని రిషి అంటాడు.
మీకేంఅయింది.. మీ మనసులో ఏముంది డాడ్.. అంత ఆనందంగా ఉంటారు.. ఏమున్నా చెబుతారు.. రిషి ఇది అది అని చెబుతారు కదా? పుస్తకాలు చదువుతారు.. కొటేషన్లు చెబుతారు.. మీకు స్ట్రోక్ ఏంటి డాడ్.. మీ గుండెలో అందరి మీద ప్రేమే ఉంటుంది. మీకు గుండెపోటు రావడం ఏంటి డాడ్.. అని రిషి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ.. పేషెంట్‌ను డిస్టర్బ్ చేయెద్దు వెళ్లండి.. మీకు కూడా చెప్పాలా? పేషెంట్‌ను ఎంత రిలాక్స్‌గా ఉంటే త్వరగా కోలుకుంటారు.. మీరు ఏడిస్తే ఆయన ఇంకా బాధపడతాడు.. అని అంటాడు.
పక్కనే ఉన్న నర్సుతో.. ప్రతీ గంటకు రిపోర్ట్ ఇవ్వండి అని చెబుతాడు డాక్టర్. ఆయనకు నచ్చిన విషయాలు చెబుతూ ఉండండి. నవ్వుతూ.. ఉండండి.. లేదంటే రిస్క్ పెంచిన వారు అవుతారు.. అని డాక్టర్లు చెబుతాడు. మీకు మేమంతా ఉన్నాం.. లవ్యూ డాడ్.. అని రిషి అంటాడు.. లవ్యూ రిషి అని మహేంద్ర అంటాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో వసు మహేంద్రలు ఇలా మాట్లాడుకుంటారు. ఫస్ట్ టైం.. రిషి సర్ కంట్లో నీళ్లు చూశాను అని వసు అంటుంది. ఇన్నాళ్లు దాచుకున్న కన్నీళ్లు ఇలా బయటకు వచ్చాయన్న మాట.. జగతి, రిషిని కలుపుతాను అని మాటిచ్చావ్ అని వసుకి మహేంద్ర మళ్లీ గుర్తు చేస్తాడు. ఇక మరో వైపు ఈ పరిస్థితిని వాడుకుని దగ్గరవ్వాలని చూడకండి మేడం అంటూ తల్లిని ఇంకా బాధపెడతాడు రిషి.