- January 14, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. ఏకాంతంగా రిషి, వసు.. మంచి ప్లాన్ వేసిన గౌతమ్
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు అంటే జనవరి 14న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 346 ధారావాహికలో గౌతమ్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఇక గౌతమ్‌ను సైడ్ చేసిన రిషికి.. వసుతో సైట్ లొకేషన్ అంటూ చక్కర్లు కొట్టేస్తుంటాడు. అలా మొత్తానికి ఈ ఇద్దరికి మంచి ఏకాంత సమయం దొరికినట్టు అయింది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ కూల్‌గా ముందుకు సాగింది.
వసు సారీ చెప్పిన విధానం గురించి దేవయాణి ఆలోచిస్తుంటుంది. రిషి ముందు సారీ చెప్పినట్టే చెప్పి.. నవ్వుతూనే నన్ను అనాల్సిన మాటలన్నీ అనేసింది. జగతి కీ ఇస్తే ఆడే బొమ్మ ఈ వసు అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక రిషి, వసు ఇద్దరూ కూడా లొకేషన్ సర్చింగ్‌లో ఉంటారు. గాలికి వసు చున్నీ రిషి డిస్టర్బ్ చేస్తుంటుంది.
ఇక అలా వెనక్కి వెళ్తూ వెళ్తూ జారి పడబోతోంటాడు. ఇంతలో వసు పట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇక కాసేపటి మళ్లీ ఈ లోకంలోకి వస్తారు. అలాంటి సమయంలో పట్టుకుంటే నువ్ కూడా పడిపోతావ్ జాగ్రత్త అని అంటాడు. ఆ సమయంలో అవన్నీ ఆలోచించం కదా? సర్ అని వసు అంటుంది. అలా మళ్లీ పనిలో మునిగిపోతారు.
ఆ చున్నీ గాలికి ఎగిరి రిషికి తాకుతూ ఉంటుంది. బరువైన చున్నీలు ఉండవా? అని రిషి అడిగితే.. వసు షాక్ అవుతుంది. అలాంటివి ఉండవు అని చెబుతుంది. చున్నీ అంచున డిజైన్‌లా ఏదైనా చేస్తే బరువుకి గాలికి ఎగరకుండ ఉంటాయ్ కదా? అని ప్లాన్ చెబుతాడు. అరే ఈ ఐడియా బాగుందే.. నెక్ట్స్ టైం ట్రై చేస్తాను సర్ అని వసు అంటుంది.
అయితే రిషికి బాగా ఆకలి వేస్తుంది. కానీ బయటకు చెప్పడు. ఆకలి వేస్తోందని చెప్పడానికి కూడా ఏమవుతుందో అని వసు లోలోపల అనుకుంటుంది. నాకు అయితే చాలా ఆకలేస్తుంది సర్ అని అంటుంది వసు. కారులో స్నాక్స్ ఏమీ లేవు అని రిషి అంటాడు. మీ అమ్మాయిల బ్యాగులో ఏవో ఒకటి ఉంటాయ్ కదా? అని రిషి అంటే.. మామూలుగా ఉండేవి కానీ మీరు ఈ రోజు హడావిడిగా రమ్మన్నారు అందుకే ఏమీ తీసుకుని రాలేదు అని చెబుతుంది వసు.
మొత్తానికి అక్కడి నుంచి బయల్దేరుందుకు రెడీ అవుతారు. ఆ సమయంలో రిషికి గౌతమ్ కాల్ చేస్తాడు. బిజీగా ఉన్నా.. ఏదైనా ఉంటే మెసెజ్ చేయ్ అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. కనీసం గౌతమ్ చెప్పేది కూడా వినడు. వసు అయితే ఇలా చేయదు అని ఆమెకు ఫోన్ చేస్తాడు గౌతమ్. వసు అయితే మరీ దారుణం.. బిజీగా ఉన్నాను అని పెట్టేస్తుంది. చీ చీ గౌతమ్ పరువుపోయిందిరా అని అనుకుంటాడు. ఎవరు ఫోన్ అని రిషి అడుగుతాడు. అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు అని వసు అంటుంది.
మరో వైపు సూచన అంటూ షార్ట్ ఫిల్మ్ గురించి జగతి చెబుతుంది. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు ఎలా అందరికీ సొంతమో ఈ మిషన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కూడా అందరికీ సొంతమనే కాన్సెప్ట్‌తో షార్ట్ ఫిల్మ్ రెడీ చేస్తోంది జగతి. ఆ కాన్సెప్ట్ మీద మహేంద్ర, ఫణీంద్రలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకసారి మన ఎండీగారికి కూడా చెప్పి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. మంత్రి గారి నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా రావాలి అని జగతి అంటుంది.
ఓ పాత్ర ఇప్పించండి అని గౌతమ్ బతిమిలాడటాన్ని మహేంద్ర గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒక పాత్ర ఇద్దామా? అని మహేంద్ర అడుగుతాడు. మన స్టూడెంట్స్ ఉంటేనే బాగుంటుందని జగతి అంటుంది. శిరీష్ ఎలా హెల్ప్ చేశాడో ఇప్పుడు గౌతమ్ కూడా అలానే హెల్ప్ చేస్తాడు.. పెట్టుకోండి అని ఫణీంద్ర అంటాడు. దీంతో గౌతమ్ గాల్లో ఎగిరిపోతాడు. వసు కూడా నటిస్తుంది.. నా పాత్రతో వసు పాత్రతో కలిసి నా కారెక్టర్‌ను పెంచేస్తా అని గౌతమ్ సంబరపడిపోతాడు.
ఇక మరో వైటీ టీ షాపు కారు ఆపమంటుంది వసు. ఇక్కడేం ఉంది తినడానికి అని రిషి ఆశ్చర్యపోతాడు. టీ, బన్ను టేస్టును కూడా రిషికి చూపిస్తుంది వసు. చాయిలో ఈ బన్నుని ముంచుకుని తినడం నేర్పిస్తుంది వసు. మొత్తానికి ఆ టేస్ట్ రిషికి బాగానే నచ్చినట్టుంది. అలా ఎపిసోడ్ అంతా కూడా సరదాసరదాగా సాగింది.