• January 13, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు చేసిన పనికి ఆశ్చర్యపోయిన రిషి.. మహానటి అన్న దేవయాణి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు చేసిన పనికి ఆశ్చర్యపోయిన రిషి.. మహానటి అన్న దేవయాణి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాడు జనవరి 13న ప్రసారం కానున్న Guppedantha Manasu Episode 346 ధారావాహికలో వసు చేసిన పనికి రిషి షాక్ అవుతాడు. ఇక మరో వైపు గౌతమ్ ప్లాన్‌కు రిషి చెక్ పెట్టేస్తాడు. దేవయాణికి సారీ చెప్పినట్టే చెప్పింది కానీ అందులోనూ ఓ లాజిక్‌ను వదిలింది వసు. అలా మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ మంచి ఫన్‌ రైడ్‌గా సాగింది.

    ధరణి.. రిషి ఇంకా రిషి లేవలేదా? అని కావాలనే దేవయాణి అడుగుతుంది. ఏమో అత్తయ్యా ఇంకా లేచినట్టు లేడు.. అని ధరని అంటుంది. రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు.. రిషి లేటుగా వచ్చిన విషయమైనా తెలుసా? అంటూ మహేంద్రకు చురకలు అంటిస్తుంది దేవయాణి. వాడికీ స్వతంత్ర్యం ఉంటుంది కదా? చిన్న పిల్లాడేం కాదు..అని మహేంద్ర అంటాడు.

    అవును దేవయాణి.. అది బాగుండదు.. నీకు ప్రేమ ఎక్కువై అలా అంటున్నావ్.. అని ఫణీంద్ర అంటాడు. ఎంత గొప్పవాడైనా నాకు పిల్లాడేకదా? అని ఇలా దేవయాణి మాట్లాడుతుండగా రిషి వస్తాడు. నీ గురించే కంగారు పడుతోంది.. మీ పెద్దమ్మ అని రిషికి ఫణీంద్ర చెబుతాడు. అదంతా పెద్దమ్మ ప్రేమ పెదనాన్న అని రిషి అంటాడు.. అవును గౌతమ్ ఎక్కడ డాడ్ అని అడుగుతాడు రిషి..

    నాకు కూడా కనిపించలేదు రిషి.. అని మహేంద్ర చెబుతాడు. పొద్దున్నే ఎక్కడికి వెళ్లి ఉంటాడు.. గౌతమ్ పొద్దున్నే బయల్దేరాడంటే.. కచ్చితంగా వసుధార వద్దకే వెళ్తున్నాడేమో.. అని ఫోన్ చేస్తుంటాడు. బైక్ మీద వెళ్తున్న గౌతమ్ ఆపి మరీ ఫోన్ చూడబోతాడు. ఇంకెవడు నా ప్రేమకు విలన్ అయి ఉంటాడు.. అని ఫోన్ చూసుకుంటాడు. వాడే.. మాట్లాడితే వెనక్కి రమ్మంటాడు.. అని కట్ చేస్తాడు. వెనక్కి రమ్మంటానని కట్ చేస్తున్నావ్ కదా? తెలివి నీ ఒక్కడికే ఉందా? నాన్న.. అని రిషి అనుకుంటాడు.

    వెంటనే వసుకి ఫోన్ చేస్తాడు రిషి. అప్పటికే వసు, జగతి ఒకే చోట ఉంటారు. ఫోన్ చేస్తోంది మా అబ్బాయా? మీ సారా? అని జగతి సెటైర్ వేస్తుంది. అది పరిస్థితిని పట్టి చెబుతాను మేడం అని వసు అంటే.. నువ్ తెలివైన దానివే అని జగతి అంటుది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన వసుకి వెంటనే రిషికౌంటర్ వేస్తాడు. ఫోన్ ఫ్రిడ్జ్‌లో పెట్టావా?అని కౌంటర్ వేస్తాడు. అలా ఎందుకు పెడతాను సర్ అని వసు అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అయితే అందుకే అడిగాను అని అంటాడు..రిషి సర్ కోపంగా ఉన్నారు.. మీ అబ్బాయే.. మేడం అని వసు అంటుంది.

    చెప్పండి సర్ అని వసు అంటే.. నువ్ బయల్దేరాలి.. అర్జెంటుగా.. సర్వే ఫీల్డ్ వర్క్ కోసం.. అని రిషి చెబుతాడు. ఇప్పుడా? ఈ రోజా?.. సరే రావా? క్యాన్సిల్ చేస్తానులే బాయ్..అని రిషి అంటాడు. నేను అలా అన్నానా? సర్ అని వసు అంటుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైల్ తీసుకుని మా ఇంటికి రా.. అని రిషి అంటాడు. మీ ఇంటికా? అని వసు అంటే.. ఏ రావా? క్యాబ్ బుక్ చేయాలా?.. అని రిషి అంటాడు.

    సర్ నేను ఏమైనా అన్నానా?.. అని వసు అంటుంది. వన్ టు టెన్ లెక్క పెట్టేలోపు బయటకు రావాలి.. అని చెప్పి కట్ చేస్తాడు. ఇక పది నుంచి లెక్క పెట్టుకుంటూ హడావిడిగా బయటకు వెళ్తుంది వసు. జగతి అడిగినా ఏం చెప్పదు.. మీ అబ్బాయి అంత టైం ఇవ్వడం లేదు.. పది లెక్క పెట్టేలోపే బయటకు వెళ్లాలట అని చెబుతుంది. దీంతో బయటకు వచ్చేస్తుంది. సర్ బయటకు వచ్చాను అని చెబుతుంది.

    గేట్ దాటేశానుసర్.. వచ్చేస్తున్నాను సర్.. అని చెప్పేస్తుంది వసు. అదే సమయంలో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. వసు వెళ్లిపోయిందని తెలియక కాస్త ఓవర్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం.. వసుధారని పిలవరా?.. వసుధార.. అని పిలుస్తుంటాడు. గౌతమ్.. వసు బయటకు వెళ్లింది..అని జగతి చెబుతుంది. నాకు చెప్పలేదు.. చెబితే నేనే డ్రాప్ చేసేవాడిని.. అని గౌతమ్ అంటాడు.

    అన్ని పనులు అందరికీ చెప్పి చెయలేం కదా? అని జగతి కౌంటర్ వేస్తుంది. మేడం కాజువల్‌గా అన్నారా?.. పంచ్ వేశారా? ఎవరి పనులు వాళ్లకి ఉంటాయ్.. ఎవరి బిజీ వాళ్లకి ఉంటుంది.. సర్ ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను అని అంటాడు గౌతమ్. ఏం పని.. అని జగతి అడుగుతుంది. రోమియో జూలియట్ అని చెప్పి.. ఏదేదో కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. నాటకం గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను..అని చివరకు గౌతమ్ చెబుతాడు. ఒక్క ప్రశ్నకు ఇన్ని సమాధానాలుంటాయా? గౌతమ్.. అని జగతి అంటుంది. మీ షార్ట్ ఫిలింలో నాకు చిన్న రోల్ ఇవ్వండని గౌతమ్ అడుగుతాడు. అది నేను డిసైడ్ చేయలేను.. నాకు కాలేజ్ టైం అవుతోంది.. లాక్ వేసుకోవాలి.. అని చెబుతుంది జగతి. సారీ మేడం నేనే వెళ్తాను..అని గౌతమ్ అంటాడు.

    ఎక్కడికైనా వెళ్లాలా? అని ఫణీంద్ర అడుగుతాడు. ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను.. అని రిషి అంటాడు. బయటకు వెళ్లాలి..అని రిషి అంటే.. కాలేజ్‌కు రావా?.. అని మహేంద్ర అడుగుతాడు. లేటుగా వస్తాను అని సమాధానం చెబుతాడు రిషి..లంచ్ బాక్స్ పెట్టించాలా?.. అని దేవయాణి అంటుంది. అంత లేటుకాకపోవచ్చు పెద్దమ్మ అని రిషి అంటాడు.. ఇంతకీ ఎవరొస్తున్నారు.. అని దేవయాణి ప్రశ్నిస్తుంది. వసుధార.. అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వసుధారని ఇంటికి రమ్మన్నాడా? నేను ఆడిన నాటకం పవర్ తగ్గిందా? అని దేవయాణి మనసులో అనుకుంటుంది. తనను ఎందుకు పిలవడం, చేసిన నిర్వాకాలు చాలవా? ఏంటి.. అని రిషితో అంటుంది దేవయాణి.

    ఇంతలో వసు కూడా వస్తుంది. తను రమ్మనగానే సిగ్గులేకుండా వచ్చింది.. అని లోలోపల అనుకుంటుంది. నేను ఎందుకు ఇక్కడ.. అని వెళ్లిపోబోతోన్న దేవయాణిని వసు ఆపుతుంది. మీకు ఒంట్లో ఎలా ఉంది మేడం.. అని వసు అడుగుతుంది. గిల్లి జోల పాడటం అంటే ఇదే.. అని దేవయాణి మనసులో అనుకుంటుంది. నొప్పులు తగ్గిపోయాయా? అని అడుగుతుంది. పర్వాలేదు.. నీ పరామర్శలు, సానుభూతులు నాకు అక్కర్లేదు.. అని దేవయాణి అంటుంది.

    మేడం మీరు పెద్దవారు.. మీరంటే నాకు గౌరవం ఉంది.. జరిగిందాంట్లో తప్పొప్పులు పక్కన పెడితే.. మీరు అలా పడటం నాకు బాధగా అనిపించింది.. మళ్లీ కలిసే అవకాశమే రాలేదు.. మొత్తానికి ఏ ప్రమాదం లేకుండానే బయటపడ్డారు సంతోషం మేడం.. మా రెస్టారెంట్‌కు వచ్చి అలా జరిగినందుకు చాలా బాధేసింది మేడం.. రెస్టారెంట్‌లో మీకు ఏదైనా అసౌకర్యం జరిగి ఉంటే సారీ.. నన్ను క్షమించండి..అని వసు చెప్పడంతో రిషి, మహేంద్ర, ఫణీంద్రలు షాక్ అవుతారు.

    నేనే గొప్పనటిని అనుకుంటే.. నా కంటే మహానటిలా ఉందే అని వసు గురించి దేవయాణి మనసులో అనుకుంటుంది.. రిషి ముందు బాగానే నటించింది.. అని దేవయాణి అనుకుంటుంది. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. అని వసు సలహా ఇస్తుంది. నీ సంస్కారానికి జోహార్లు అని మహేంద్ర అనుకుంటే.. చిరునవ్వుతోనే అహంకారానికి బదులు చెప్పింది.. నీలాంటి కోడలు వస్తే కరెక్ట్.. అని ధరణి నవ్వుకుంటుంది. పని ఉందని అన్నావ్ కదా? వెళ్లు నాన్న.. అని దేవయాణి చెబుతుంది. వెళ్లొస్తాను డాడీ.. అని రిషి వెళ్లిపోతాడు.

    వసు మాటలు గుర్తు చేసుకున్న రిషి.. నిన్ను అంచనా వేయడం కష్టం అని చెబుతాడు.. మీరు మ్యాథ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.. మీకు అర్థం కాకపోవడం ఏంటి.. అని రిషిని వసు అంటుంది. చిక్కు ప్రశ్నలా మారుతావ్ అని రిషి అంటాడు.. ఈ క్షణంలో మీ మనసులోఏముందో నాకు అర్థమైంది.. దేవయాణి గారితో సారీ చెప్పిన విషయం గురించే మీరు ఆలోచిస్తున్నారు కదా? ఎన్ని సార్లు చెప్పమన్నా సారీ చెప్పలేదు.. కానీ ఇప్పుడు చెప్పాను ఏంటి?అని ఆలోచిస్తున్నారు అంతే కదా?

    ఆవిడంటే నాకు ప్రత్యేకంగా కోపమేమీ లేదు.. ఆవిడే మమ్మల్ని సూటిపోటి మాటలతో బాధపెట్టేది.. అవన్నీ మీకు చెప్పనూ లేను.. మిమ్మల్ని బాధపెట్టలేను.. ఆవిడే తనంతట తానే పడింది.. మానవతా దృక్పథంతో.. జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్పాను కానీ తప్పు చేశాను అని చెప్పడం లేదు.. ఇదే నా సంస్కారం.. ఇదే వ్యక్తిత్వం జగతి మేడంలోనూ కనిపిస్తుంది సర్..అని వసు అంటుంది. ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దామా?.. ఎక్కడికి వెళ్దాం.. అని రిషి అడగడంతో వసు షాక్ అవుతుంది. మీరే అన్నారు కదా? మిషన్ ఎడ్యుకేషన్ పని కోసం అన్నారు కదా? అని అడనంతో రిషి కవర్ చేస్తాడు. అదేలే నీకు ప్రత్యేకంగా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అని అడుగుతున్నాను అని అంటాడు రిషి. నాకు ప్రత్యేకంగా ప్లాన్స్ ఏమీ లేవు.. అని ఫోన్‌లో లొకేషన్ సర్చ్ చేస్తుంటుంది వసు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో రిషి చేత చాయ్, బన్ను తినిపిస్తుంది వసు.

    Leave a Reply