• January 10, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. లవ్ లెటర్ రాసిన రిషి.. జగతి, వసుల ముందు బుక్ చేసిన గౌతమ్

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. లవ్ లెటర్ రాసిన రిషి.. జగతి, వసుల ముందు బుక్ చేసిన గౌతమ్

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే సోమవారం నాటి Guppedantha Manasu Episode 343 ధారావాహిక అంతా కూడా సరద సరదాగా గడిచింది. ఇక ఎప్పటిలానే గౌతమ్ కాస్త ఓవర్ యాక్షన్ చేయడం, రిషిని విసిగించడం వంటివే జరిగింది. కానీ ఈ సారి మాత్రం రిషి ఏకంగా లవ్ లెటర్ రాసేవరకు పరిస్థితిని తీసుకొచ్చాడు గౌతమ్. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    కాలేజ్ స్టెప్స్ వద్దున్నాను.. అంటూ రిషికి వసు వాయిస్ మెసెజ్ పెడుతుంది. ఇది ఆర్డరా? రిక్వెస్టా?.. అంటే వసు అలా పిలిస్తే వెళ్లాలా? నేను వెళ్లను అని రిషి అనుకుంటాడు. ఇలా మెసెజ్ పెట్టాను ఏంటి? అది ఆర్డరా? రిక్వెస్టా? అని కచ్చితంగా అనుకుంటారు.. అయినా మెసెజ్ పెట్టకముందు ఇలాంటి ఆలోచనలు రావు.. పెట్టాక కొత్త కొత్త ఐడియాలు వస్తాయ్.. అని వసు అనుకుంటూ ఉంటుంది.

    ఇంతలో రిషి వచ్చేస్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పి వసు లేవబోతోంటే.. కూర్చో ఇదేం క్లాస్ రూం కాదు.. అని అంటుంది. ఎందుకు రమ్మన్నావ్ అని అడుగుతాడు రిషి. మన మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటుంది.. క్లాస్, సబ్జెక్ట్ తప్పా ఇంకేం ఉంటుంది.. అని రిషి అంటాడు. చాక్లెట్ తినాలని ఉంది సర్ అని వసు అంటుంది. తినాలనిపిస్తే తిను… మీ మేడంని డబ్బులు అడిగి కొనుక్కుని తిను.. అని వెటకారంగా రిషి కౌంటర్ వేస్తాడు.

    నా దగ్గర చాక్లెట్ ఉంది సర్ అని వసు అంటుంది. అయితే తిను అని అంటాడు. మీరు తింటేనే నేను తింటాను అని అంటుంది.. ఒక్కటే ఉందా? అని రిషి అడుగుతాడు. నా దగ్గర ఇంకోటి ఉంది సర్ అని వసు అంటే.. నిజంగానా? అని రిషి అడుగుతాడు. నాకు తెలుసు నీ దగ్గర ఇంకోటి లేదు అని సగం నువ్ తీసుకో అని ఇస్తాడు రిషి.. చాక్లెట్ బాగుంది అని రిషి అంటాడు. మీటింగ్ ఉందని రిషి వెళ్లిపోతాడు. సర్ మూడ్ బాగానే ఉంది.. అసలు ఎందుకు పెట్టాను మెసెజ్.. సర్‌ని చూస్తే అన్నీ మరిచిపోతాను.. అని వసు అనుకుంటూ ఉంటుంది.

    ఇక ఫణీంద్ర,మహేంద్ర, జగతి ఇలా అందరూ కూడా మిషన్ ఎడ్యుకేషన్ గురించి మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వచ్చి చాక్లెట్ గురించి షార్ట్ ఫిల్మ్ అని అనుకున్నాం కదా అంటాడు. దీంతో మహేంద్ర, జగతి షాక్ అవుతారు. సారి మిషన్ ఎడ్యుకేషన్ గురించి షార్ట్ ఫిల్మ్ అని సర్దుకుంటాడు. అలా మొత్తానికి ఆ మీటింగ్ అయిపోతుంది.

    ఇంట్లో గౌతమ్ రూంలో ధరణి సర్దుతుంది. అక్కడ వసుధార బొమ్మ కనిపిస్తుంది. ఇదేంటి గౌతమ్ ఇలా చేశాడు.. రిషికి ఈ విషయం తెలుసా? ఈ విషయం చిన్న మామయ్యకు చెప్పాలో వద్దో కూడా తెలియడం లేదు.. అని ధరణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోదేవయాణి ధరణిని చూస్తుంది. ఏం ధరణి అక్కడ నిల్చుని ఏం చేస్తున్నావ్ నా బొమ్మ గీస్తున్నావా? ఇలా నిల్చుంటాను నా బొమ్మ గీస్తావా? అని దేవయాణి సెటైర్ వేస్తుంది.

    రూం సర్దుతున్నాను..అని ధరణి అంటే.. అన్నీ పనులు బాగానే చేస్తావ్ కానీ నేను అడిగే పనులు మాత్రం చేయవు. జగతి, వసుల గురించి చెప్పవు.. ఇలా అమాయకంగా చూస్తావ్,.. వెళ్లి పని చూసుకో..అని అంటుంది దేవయాణి. నేను వసుధారని లవ్ చేస్తున్నాను.. నీకేంట్రా ప్రాబ్లం.. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి.. చెప్పరా రిషి.. మాట్లాడవేంట్రా ఇడియట్.. వసుధార విలన్ అవ్వాలి. కానీ నువ్వెంట్రా అడ్డుపడతావ్.. నువ్ నా ఫ్రెండ్‌విరా హెల్ప్ చేయాలి.. ఎంకరేజ్ చేయాలి..అంటూ రిషి కాబిన్‌లో రిషి ఫోటోను పెట్టుకుని గౌతమ్ మాట్లాడుతుంటాడు.

    ఇక ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. రేయ్ గౌతమ్.. అని రిషి అంటాడు. రారా రిషి..అని గౌతమ్ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఏం చేస్తున్నావ్ రా.. ఏవో మాటలు వినిపించాయ్.. ఎవరితో మాట్లాడుతున్నావ్.. అని రిషి ప్రశ్నిస్తాడు. నాకు నేనే.. అంటే ఆత్మ పరిశీలన.. అని చెబుతాడ. ఏడ్చావ్ లే.. పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకోకు..అని రిషి కౌంటర్ వేస్తాడు.

    రిషి మై ఫ్రెండ్..డీబీఎస్టీ ఎండీ.. యంగ్ అండ్ డైనమిక్ ఫ్రెండ్.. అంటూ రిషికి మసాజ్ చేస్తుంటాడు గౌతమ్. అసలు విషయం అర్థమైన రిషి ఏం పని కావాలి అని అడుగుతాడు. అడిగిన తరువాత నో చెప్ప కూడదు అని గౌతమ్ అంటాడు. న్యాయమైందే అయితే అడ్డు చెప్పను అని రిషి అంటాడు. పవిత్రమైనది.. ప్రపంచమంతా నిండి ఉన్నది..ప్రేమ.. ప్యార్ ఇష్క్ మహబ్బత్.. అని ఇలా గౌతమ్ ఏదేదో చెబుతుంటాడు.

    బాయ్ రా.. ఏదో చెబుతున్నావ్ కదా? ఇవన్నీ నాకు ఎందుకు వెళ్తున్నా.. అని రిషి వెళ్లిపోబోతోంటే గౌతమ్ అడ్డు పడతాడు. అసలు విషయం ఏంటో చెప్పు.. అని రిషి అంటాడు. నువ్ నాకు ఒక లవ్ లెటర్ రాసి పెట్టాలిరా.. అని గౌతమ్ అనడంతో రిషి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా.. మతి ఉండే మాట్లాడుతున్నావా?.. అయినా ఎవరికి ఇద్దామని.. అని రిషి అడుగుతాడు.

    దీంతో ఏదో ఒక పిచ్చి కథ చెబుతాడు. అమెరికాలో ఓ గ్రూపు.. ప్రేమలేఖల పోటీ.. ఎవరైతే అందంగా హార్ట్ టచింగ్‌గా రాస్తారో వారికి ప్రైజ్ మనీ.. కోసం అని చెబుతాడు. మనీ కోసం కాదురా.. పరువు ఇంపార్టెంట్.. నా తెలుగు ఎంత మాత్రమో నీకు తెలుసు.. నాతో పోల్చితే నువ్ బెటర్ కదరా?. గొప్పగా రాయ్ రా.. నువ్ ఏది రాస్తే అదే గొప్ప.. ఆకాశం, నెమలీక. వర్షం.. ఇలా దేని గురించైనా రాయ్.. అంటూ రిషిని బతిమిలాడుతాడు గౌతమ్. నువ్వెళ్లురా నేను రాస్తాను.. అని రిషి ఆలోచిస్తుంటాడు.

    ఏం రాయాలి.. ఎలా మొదలుపెట్టాలి.. మై డియర్ లవ్లీ.. అని రాస్తాడు. చీ.. ఏం బాగాలేదు అని పేపర్ నలిపి అవతల పారేస్తాడు. ప్రేమ లేఖ రాయడం అంత ఈజీ కాదన్న మాట.. అని రిషి అనుకుంటాడు. ఒక్కాసారిగా వసు తన ముందుకు వచ్చినట్టు.. కూర్చున్నట్టుగా ఊహించుకుంటాడు. ఇక అలా ప్రేమలేఖను పూర్తి చేసేస్తాడు రిషి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో ఆ లెటర్ కాస్తా జగతి చేతిలోపడుతుంది. ఎవరో వసుకి లవ్ లెటర్ రాశారు.. వదిలి పెట్టొద్దు సర్ అని రిషికే చెబుతుంది జగతి. మరి ఏం జరగుతుందో చూడాలి.

    Leave a Reply