• January 6, 2022

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి వసు మధ్యలో గౌతమ్.. అదిరిపోయే ప్లాన్ వేసిన మహేంద్ర

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. రిషి వసు మధ్యలో గౌతమ్.. అదిరిపోయే ప్లాన్ వేసిన మహేంద్ర

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాటి Guppedantha Manasu Episode 340 ధారావాహికలో వసుధార, రిషి, గౌతమ్ మధ్యే ఎక్కువగా సీన్లు నడిచాయి. ఇక జగతి, మహేంద్రలు కూడా రిషి, గౌతమ్ గురించే మాట్లాడుకున్నారు. గౌతమ్ వాడుకుని రిషి మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టిద్దామని మహేంద్ర ఓ ప్లాన్ వేస్తాడు. అలా మొత్తానికి గుప్పెడంత నేటి ఎపిసోడ్ ముందుకు సాగింది.

    లైబ్రరీలో సైలెంట్‌గా ఉండని రిషి.. పాటలు పాడుకుంటూ టేబు‌ల్‌ని డప్పులా వాయిస్తుంటాడు. పాటలో వసు ఉండాలి.. వసు నిండాలి. వసు పొంగాలి, పొర్లాలి.. కవిత్వం కూడా బాగానే వచ్చురో అని గౌతమ్ తనది తాను పొగుడుకుంటాడు. అలా అల్లరి చేస్తున్న గౌతమ్‌ను సైలెంట్‌గా ఉండమని వసు అంటుంది. ఇలానే లైబ్రేరియన్ కూడా అన్నాడు.. నీ ఉద్యోగం ఊడిపోవాలా?.. రిషి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అని బెదిరించాను.. దెబ్బకు వెళ్లిపోయాడు అది గౌతమ్ అంటే..అని బిల్డప్ ఇస్తాడు.

    రిషి సర్ ఫ్రెండ్ అనే గౌరవంతోనే ఇలా మీ కోసం పుస్తకాన్ని వెతుకుతున్నాను కాస్త సైలెంట్‌గా ఉండండి అని పేపర్ మీద రాసి ఇస్తుంది వసు. కష్టం వసుధార.. పొర్లుకుంటూ దొర్లుకుంటూ కాలేజ్ గ్రౌండ్ మొత్తం రౌండ్స్ వేస్తాను.. కానీ సైలెన్స్‌గా మాత్రం ఉండను.. సరే నువ్వెల్లి పుస్తకం వెతుకు.. లైబ్రేరియన్‌ని మాత్రం అడగొద్దు.. సైలెంట్‌గా ఉంటాను..లోలోపల ఎంజాయ్ చేస్తాను అని గౌతమ్ అంటాడు.

    ఇక లైబ్రరిలో గౌతమ్‌ని చూసిన రిషి.. రేయ్ ఏంట్రా ఇక్కడున్నావ్ అని అంటాడు. కానీ గౌతమ్ బుద్ది మంతుడిలా సైలెన్స్ మెయింటైన్ చేస్తాడు. వసు రాసిన లెటర్ చూసి.. నన్ను ఇలా కూడా వాడుకుంటున్నావా.. అని రిషి అంటాడు. నువ్ నాకు ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషపడురా అని గౌతమ్ అంటాడు. మళ్లీ ఏ కోతి పని చేశావ్ రా? అని రిషి అంటే.. నేను కోతి పని చేస్తానా? ఈ మనసే పెద్ద కోతి.. అని గౌతమ్ అంటాడు.

    ఈ బుక్కేంటి.. వసుధారకి పని ఎందుకు చెబుతున్నావ్.. అని రిషి ఫైర్ అవుతాడు. నువ్వే కదరా అడిగింది.. యానివర్సరీ రోజు రోమియ్ జూలియట్ నాటకం వేద్దామని చెప్పావ్ కదా? అని రిషికి సైగ చేస్తాడు. అలా చెబితే అల్లుకుపోవాలి అని రిషిని గౌతమ్ ఇరికిస్తాడు.. నువ్ క్లాసుకు వెళ్లు అని వసుని రిషి అంటాడు. మీకు కూడా టైం అవుతుంది సర్ అని వసు అంటే.. నాకు తెలుసు.. నువ్ చెప్పక్కర్లేదు.. నేను వెళ్తే గానీ నువ్ రావా?.. అని వసు మీదకు రిషి ఫైర్ అవుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ పెండింగ్.. అని వసు చెప్పబోతోంది. నాకు తెలీదా.. నుమ్ ముందు క్లాసుకు వెళ్లు.. అని తిట్టేస్తాడు. అలా ఎందుకు తిడుతున్నావ్ రా అని రిషిని గౌతమ్ అంటాడు. నిన్ను తిట్టలేక అని అంటూ.. నువ్వెల్లి నా కేబిన్‌లో ఉండు అని గౌతమ్‌కు రిషి ఆర్డర్ వేస్తాడు.

    అలా గౌతమ్ వెళ్తూ ఉంటే.. జగతి, మహేంద్రలు కేబిన్‌లో ఉంటారు. అది చూసిన గౌతమ్ లోపలకి వెళ్లి రిషి గురించి చెబుతాడు. రిషి అర్థం కావట్లేదు.. రిషి దగ్గర ఎలా పని చేస్తున్నారు.. మీ పరిచయం ఎప్పటినుంచి అని జగతిని గౌతమ్ అడుగుతాడు. జగతి ఏదో చెప్పబోతోంటే మహేంద్ర అడ్డుకుంటాడు. మా పరిచయం కొన్ని నెలలే అని జగతి చెబుతుంది.

    నా సుపుత్రుడు నాకే అర్థం కాలేదు.. నీకేం అర్థం అవుతాడు అని గౌతమ్‌కు మహేంద్ర సెటైర్ వేస్తాడు.. కారులో ఒకలా కాలేజ్‌లో ఒకలా.. అప్పుడే ప్రేమ చూపిస్తాడు.. అప్పుడే కోప్పడతాడు.. అని రిషి గురించి గౌతమ్ చెబుతుంటాడు. ఇక్కడ లేని ఎండీ గారి గురించి ఎందుకు.. అని జగతి అంటే.. అవునవును నిజమే రిషి ఏంటో నేనే తెలుసుకుంటాను.. ఈ రోమియో జూలియట్‌లను విడగొట్టాడు.. అని గునుక్కుంటూ వెళ్తాడు గౌతమ్.

    ఏంటి రోమియో జూలియట్ అని అంటున్నావ్ అని మహేంద్ర అడుగుతాడు. అదంతా చెప్పాలంటే టైం పడుతుందని గౌతమ్ వెళ్లిపోతాడు.. గౌతమ్ తీరు చూస్తుంటే.. రిషికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాడు..అని జగతి అంటే. రిషికి తనకు తానే పెద్ద తలనొప్పి. మనసు దాచుకోవడమే పెద్ద శిక్ష.. వాడికి వాడే తలనొప్పి.. అని మహేంద్ర అంటాడు.

    అందరూ ఒకేలా ఉండరు.. ఒకేలా ఆలోచించరు.. నా కొడుకుని విమర్శించడం కాదు.. వీలైతే తెలుసుకుని పరిష్కరించండి అని జగతి అంటుంది. తన మనసులో ఏముందో తాను చెప్పడు.. అని మహేంద్ర అంటే.. ఏముందే తెలుసుకునే బాధత్య నీది కాదా?. అని జగతి అంటుంది. నువ్ తిట్టాలని ఫిక్స్ అయ్యావ్ కదా? తిట్టు.. అని మహేంద్ర అంటే.. అలా అని తప్పించుకోకు.. రిషి కష్టసుఖాలో నీకు భాగం ఉంది..అని జగతి అంటుంది. ఈ గౌతమ్‌ని వాడుకుని రిషి మనసులో ఏముందో తెలుసుకోవచ్చేమో.. నాకొక ఐడియా వచ్చింది అంటూ మహేంద్ర ఎగ్జైట్ అవుతాడు. ఐడియా కాదు.. ఆచరణలో పెట్టు.. అని జగతి అంటుంది.

    ఇక క్లాస్ రూంలోకి ఎంట్రీ ఇచ్చిన రిషి.. చేతిలో పట్టుకున్నది రోమియో జూలియట్ పుస్తకం అని తెలియక.. ఏదో చెప్పేస్తాడు. దాన్ని కవర్ చేసేందుకు రోమియో జూలియట్ నాటకం వేస్తున్నామంటూ ఎప్పుడో జరిగే కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ గురించి చెబుతాడు. ఇక ఇందులో కొంత మంది కొన్ని డౌట్లు అడుగుతారు. మన భాషలో ఎన్నో నాటకాలుండగా.. పక్క భాషలు ఎందుకు సర్ అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు వసు సమాధానం చెబుతుందని రిషి తప్పించుకుంటాడు. మీకు రాదని నన్ను ఇరికిస్తున్నారా? మీరు గ్రేట్ సర్ అని వసు లోలోపల అనుకుంటుంది. ఇతర భాషను నేర్చుకోవడం విజ్ఞానం.. మన భాషను మరిచిపోవడం అజ్ఞానం.. చాలా బాగా చెప్పావ్..

    ఇంగ్లీష్ నవలను నాకు ఎందుకు ఇచ్చారు.. విన్నాను కానీ చదవలేదు.. అయినా తెలుగులో గొప్ప గొప్ప నాటకాలుండగా.. ఈ ఇంగ్లీష్ నవలను చదవడం ఏంటో.. అని గ్రౌండ్‌లో కూర్చుని వసు ఆలోచిస్తుండగా.. రిషి వస్తాడు. సర్ అని వసు నిల్చుండబోతోంటే.. కూర్చో కూర్చో అని అంటాడు.. ప్రేమంటే ఏంటో అర్థమైందా? ఆ బుక్‌లో.. అని రిషి అడుగుతాడు.

    నేనింకా చదవలేదు సర్.. అని వసు అంటుంది. చదవమనే కదా? ఇచ్చింది..అని రిషి కౌంటర్ వేస్తాడు. తెలుగులో కూడా గొప్ప గొప్ప నాటకాలున్నాయ్.. దీన్ని కాలేజ్‌ యానివర్సరీకి వేస్తే ఎలా ఉంటుందనేది ఆలోచన.. ఎలా ఉందో చెప్పు అని రిషి అడుగుతాడు.. కాళిదాసువి ఉన్నాయ్ కద సర్ అని వసు అంటుంది. వీలైతే అన్నీ చేద్దాం..అని రిషి అంటాడు.

    ఇంతలో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. రోమియో జూలియట్ ఒక సలీం అనార్కలి.. లైలా మజ్ను.. దేవదాస్ పార్వతి.. వీళ్లందరిలో కామన్ విషయం ఏంటో తెలుసా?;ప్రేమ, లవ్ ఇష్క్ కాదల్, మొహబ్బత్.. అని గౌతమ్ ఏదేదో వాగేస్తాడు. ఏంట్రా నీ గోల అని రిషి అంటాడు.. ఇది లైబ్రరీ కాదు.. కాలేజ్ గ్రౌండ్.. ఏదేైనా, ఎంతైనా, గట్టిగా కూడా మాట్లాడొచ్చు.. వసుధార నువ్ ఈ రోమియో జూలియట్ చదవలేదా? అని అడుగుతాడు. లేదు సర్.. అని వసు సమాధానం ఇస్తుంది. చదవలేదా? అసలు నేనొక పాతిక ముప్పై సార్లు చదివాను.. ఐ లవ్ దిస్.. అని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో రిషి, మహేంద్ర, గౌతమ్ అందరూ కూడా ఒకరి తరువాత ఒకరు జగతి ఇంటికి వెళ్తారు. అందరూ నీళ్లు అడుగుతారు. రేపటి ఎపిసోడ్ సరదాగా సాగేట్టు కనిపిస్తోంది.

    Leave a Reply