- January 4, 2022
Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. వసు విషయంలో పొరబాటు పడ్డ రిషి.. చివరకు మళ్లీ యూటర్న్

గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం నాటి Guppedantha Manasu Episode 338 ధారావాహికలో వసుని రిషి అపార్థం చేసుకుంటాడు. తన కారు కీ కోసం వసు అలా చేస్తోందని తెలియక రిషి ఏదేదో అనేస్తాడు. ఇక మరో వైపు రిషి, వసుల గురించి జగతి, మహేంద్ర ఆలోచిస్తుంటారు. రెస్టారెంట్‌లో గౌతమ్, రిషి కలుసుకుంటారు. ఎందుకు వచ్చావ్ అంటూ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. అలా మొత్తానికి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
రిషి కీ పడిపోవడం చూసిన వసుధార దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. క్లాసులోకి వెళ్లినా కూడా రిషి పిలుస్తున్నా కూడా వసు పరధ్యానంగా ఉంటుంది. క్లాస్ నచ్చకపోతే బయటకు వెళ్లు అని వసుని రిషి అంటాడు. కీ వెతికే చాన్స్ దొరికిందని వెంటనే వసు వెళ్తుంది. అలా ఎలా వెళ్తావ్ అని రిషి అంటే.. మీరే కదా? వెళ్లమన్నారు సర్ అని వసు అంటుంది.
పరధ్యానంలో ఉన్నాను వెళ్లను సర్ అని చెప్పొచ్చు కదా?.. అని రిషి లోలోపల అనుకుంటాడు. పుష్ప నువ్ కూర్చో.. ఇంట్రెస్ట్‌గా సైలెంట్‌గా వినాలి.. చూశారు కదా? వసుని బయటకు పంపించాను.. అని రిషి తన స్టూడెంట్స్‌కు వార్నింగ్ ఇస్తాడు. వసు ఏంటో అర్థమే కాదు.. అని రిషి అనుకుంటాడు. కీ పడితే చూసుకోవాలి కదా? అని దాని కోసం వసు వెతుకుతూ ఉంటుంది. ఇంతలో జగతి వస్తుంది. ఏం వెతుకుతున్నావ్ వసు అని అంటుంది. పోగొట్టుకున్నది దొరకడం చాలా కష్టం.. అని జగతి అంటుంది. నాదేం కాదు మేడం.. మీ అబ్బాయిదే.. అని లోలోపల వసు అనుకుంటుంది.
ఫణీంద్ర మాట్లాడుతూ.. డీబీఎస్టీ కాలేజ్ అంటే.. విలువలతో కూడుకున్నది అనే మంచి పేరు వచ్చింది.. ఇదంతా మీ కృషి వల్లే జరిగింది.. మిమ్మల్ని చూసి గర్విస్తాను.. బంగారానికి మెరుగులు.. దిద్దినట్టు మిషన్ ఎడ్యుకేషన్.. ఇంకా పేరు తీసుకొచ్చింది. పేరు తీసుకొచ్చింది అనేకంటే.. అందరికీ ఉపయోగపడుతుంది.. జగతి మేడం ఆలోచనలు, రిషి ఆచరణలు.. అందరినీ ఆకట్టుకుంటూ.. అందరికీ ఉపయోగపడుతోంది.. మరిన్ని కాన్సెప్ట్‌లు, ఆలోచనలు జగతి మేడంతో పంచుకోండి.. అని ఫణీంద్ర అంటాడు.
మిషన్ ఎడ్యుకేషన్ అనేది బాధ్యత.. అందరూ మనస్ఫూర్తిగా భుజానికి ఎత్తుకున్నారు.. అందరి కృష్టి ఉంది.. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది.. ఇంకా ఇలానే ముందుకు వెళ్దాం.. అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుదాం..అని జగతి ప్రసంగిస్తుంది. ఇక వసు ఒంటరిగా కూర్చుంటుంది. పుష్ప వచ్చి మాట్లాడినా సరిగ్గా స్పందించదు. వెళ్లమని పుష్పకు చెప్పి వసు ఒంటరిగానే ఉంటుంది.
ఇంతలో రిషి బయటకు వస్తాడు. కారు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించే లోపు వసు వస్తుంది. ఏంటి క్లాస్ మిస్ అయ్యావ్ అని సారీ చెప్పేందుకు వచ్చావా? అని వసుని రిషి అంటాడు.. సారీ సర్.. నేను సారీ చెప్పేందుకు రాలేదు అని వసు అంటుంది.. ఇది చెప్పేందుకు కూడా సారీ చెప్పాలా? అని రిషి అంటాడు. నేను ఒక మాట చెప్పకముందే వివరణ ఇస్తావ్.. తమ తప్పేం లేనట్టు చెబుతారు.. అని రిషి ఏదేదో అనేస్తాడు.
ఒక ఆరోపణ చేసేటప్పుడు.. నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా? అని వసు అంటుంది. ఇప్పుడేంటి? కాలేజ్ అయిపోయింది. రెస్టారెంట్‌కు వెళ్లాలి.. లిఫ్ట్ కావాలా? నేను లిఫ్ట్ ఇవ్వను. టాపర్, సిన్సియర్ స్టూడెంట్ అని గౌరవం నీకు ఇస్తాను.. అది పోగొట్టుకోకు.. అని ఇష్టమొచ్చినట్టుగా రిషి వాగుతాడు. కారు డోర్ వెళ్లకపోయే సరికి కీ ఎక్కడ పెట్టాను. అని అనుకుంటూ ఆలోచిస్తాడు.
సర్.. అని ఆ కారు కీని తీసి వసు ఇస్తుంది. నా కీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తాడు.. నేను చెబుదామంటే మీరు వినడం లేదు.. అని జరిగిందంతా చెబుతుంది. కార్ కీ కోసం క్లాస్ పోగొట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.. ఇది టాపర్ లక్షణం కాదు.. అటెండర్‌తో వెతికించేవాడిని..అని మళ్లీ వసుకే క్లాస్ పీకుతాడు. అయితే వసు మాత్రం సెంటిమెంట్ డైలాగ్‌తో కొట్టేస్తుంది. క్లాస్ మళ్లీ చెప్పమంటే చెప్పరా? అని వసు అంటుంది.
ఇక రెస్టారెంట్‌లో గౌతమ్ తిష్ట వేసుకుని కూర్చుంటాడు. వసుధార టేబుల్ దగ్గరే కూర్చుంటాడు. వసుధారని, వసు ఆర్డర్‌నీ మిస్ కాను.. అంటూ వసుతో దిగిన సెల్ఫీని చూసుకుంటూ గౌతమ్ మురిసిపోతాడు. కళ్లు పైకెత్తి చూస్తే బాగుండు.. ఆ కళ్లను డ్రా చేయడానికి ఎంత కష్టపడుతున్నాను.. ఇంత మంది ఉండగా నేను వసుధారకే ఎందుకు కనెక్ట్ అయ్యాను.. ఏమోలే దేవుడి విచిత్రం.. అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రిషి కూడా రెస్టారెంట్‌కు వస్తాడు.
అక్కడ సీన్ కట్ చేస్తే జగతి, మహేంద్రలు ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటారు. రిషి అన్న మాటలను మహేంద్రకు జగతి చెబుతుంది. పుత్ర రత్నం నిన్ను ఇలా కన్ఫ్యూజ్ చేశాడన్నమాట అని మహేంద్ర అంటాడు.. రిషికి క్లారిటీ ఉంది. కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అని రిషి గురించి జగతి చెబుతుంది. నేను ఎన్నో సార్లు చెప్పాను.. కానీ ఆ విషయం మాత్రం చెప్పడం లేదు.. అని మహేంద్ర అంటాడు.
బలవంతంగా ఎవరి మీద అభిప్రాయాలు రుద్దకూడదు.. రిషిలాంటి సున్నితమైన వ్యక్తి మీద ప్రయోగాలు చేయకూడదు.. అని జగతి చెబుతూ.. నెమలి ఈకలు, గోలీలు వేసిన ఫ్లవర్ వాజ్‌ను జగతి చూపిస్తుంది. ఇది నువ్వే రాశావ్ కదా? మూడు ముక్కల్లో వారిద్దరి గురించి చెప్పేశావ్.. అని జగతిని మహేంద్ర పొగిడేస్తాడు. ఇద్దరూ తెలివైన వాళ్లే స్వతంత్రభావాలున్నవారే.. కానీ అడుగు ముందుకు వేయడం లేదు.. నాకు భయంగా ఉంది.. అంటూ జగతి చెబుతుంది.
కొడుకు ప్రేమ కథకు నువ్ వారథిగా ఉంటే బాగుంటుందేమో అని మహేంద్ర అంటాడు.. నువ్ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో… ఎవరికి వారు ప్రత్యేకమే.. మనం ఊహించనిది జరిగితే.. బాధపడతాం.. నిప్పును ప్రేమను దాచలేం.. ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది.. వాళ్లిద్దరి మధ్యలో ఏముందో మనకు తెలియదు గానీ.. ఎవరో ఒకరు బయట పడకపోరు.. చూద్దాం ఏం జరుగుతుందో.. అని మహేంద్ర అంటాడు.
నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి.. తెలివైన దానిలా అనిపిస్తావ్.. అప్పుడే చిన్న పిల్లలా మారిపోతుంది అని వసు గురించి రిషి ఆలోచిస్తుంటాడు. మరో వైపు గౌతమ్ కూడా వసు ఆలోచనలతో సతమతమవుతాడు. ఏం చేద్దామని వచ్చాను.. ఏం చేస్తున్నాను.. ఏంటి మాయ.. అని అనుకుంటూ రిషిని చూసేస్తాడు. వీడేంటి నాకు విలన్‌లా తయారవుతున్నాడు.. అని గౌతమ్ అనుకుంటాడు.
రారా.. అని గౌతమ్‌ని రిషి పిలుస్తాడు. నవ్వెంట్రా ఇలా వచ్చావ్.. అని గౌతమ్ అడుగుతాడు. బుక్ ఎగ్జిబిషన్ అంటే వచ్చాను.. అని రిషి కౌంటర్ వేస్తాడు. మరేంట్రా ఇలా అడుగుతావ్.. అని రిషి అసహనం వ్యక్తం చేస్తాడు. వేర్వేరుగా వచ్చారా? అని వసు అడిగితే.. బిల్ మాత్రం ఒకటే.. అని గౌతమ్ జోక్ వేస్తాడు. వసుధార కాఫీ తీసుకోని రా అని రిషి ఆర్డర్ చెబుతాడు.. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నావ్ ఏంటి? అని గౌతమ్‌ని రిషి అడుగుతాడు.. నేను వచ్చినప్పుడు నువ్ కూడా వస్తున్నావ్ కదా?. ఎందుకు వస్తున్నట్టు.. తెలుసుకోవచ్చా? అని గౌతమ్ రివర్స్ కౌంటర్ వేస్తాడు… నువ్వెందుకు వస్తున్నావో నేనూ అందుకే వస్తున్నా అని రిషి అనడంతో గౌతమ్ షాక్ అవుతాడు. కాఫీ తాగడానికే అని రిషి అనేస్తాడు. కళ్లు మూసుకో అన్నావ్.. ఎందుకురా.. అని రిషి అడిగితే.. సాహసంతో కూడుకున్న సర్ ప్రైజ్ అన్నమాట.. అని వసుతో దిగిన సెల్పీని రిషికి చూపిస్తాడు గౌతమ్. దీంతో రిషి మొహం మాడిపోయినట్టు అయింది. మరి రేపటి ఎపిసోడ్‌లో రిషి ఏం చేస్తాడో చూడాలి.