- December 27, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. తల్లినే అనుమానించిన రిషి.. కొట్టినట్టు కౌంటర్ వేసిన జగతి
గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే.. సోమవారం నాటి Guppedantha Manasu Episode 331 ధారవాహికలో గుండెలు పిండేసే ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. వసుని ఇంట్లోంచి పంపించమనే పని అప్పగించాను.. చేస్తుందా? లేదా? తన జగతి మేడం మీద అనుమానపడతాడు రిషి. అలా తన కేబిన్‌కు పిలిచి అనుమానం వ్యక్తం చేసిన తన కొడుక్కి అదిరిపోయే కౌంటర్ వేసింది జగతి. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
జగతి వెళ్లిన తరువాత వసు కాలేజ్‌కు బయల్దేరుతుంది. ఆ సమయంలోనే గౌతమ్, రిషి జగతి ఇంటికి వస్తారు. ఇక గౌతమ్ అయితే వసుతో పులిహోర కలిపేందుకు తెగ ప్రయత్నిస్తాడు. చెప్పకుండా వచ్చామని ఏమీ అనుకోకండి.. సర్ ప్రైజ్ అనుకోకండి.. ఇక నుంచి చాలా సర్ ప్రైజ్‌లు వస్తాయ్..ఎందుకంటే నేను రిషి ఇంట్లోనే ఉంటాను.. డల్లుగా ఉన్నారు ఏంటి?.. అలా ఉంటే రోజంతా అలానే ఉంటుంది.. అని గౌతమ్ వాగుతూనే ఉంటాడు.
వసు డల్‌గా ఉందంటే.. మేడం పని మొదలుపెట్టేసినట్టుంది.. అని రిషి తనలో తాను అనుకుంటాడు. ఏంటి అతిథి దేవో భవ కాకుండా.. అతిథి జావో భవ అన్నట్టుంది.. మమల్ని లోపలకు రమ్మనరా? అని గౌతమ్ అంటాడు. కాలేజ్ వెళ్లే తొందర్లో ఉన్నాను.. మరిచిపోయాను.. లోపలకు రండి.. అని వసు అంటుంది. వద్దు మనం వెళ్దాం పద అని రిషి అంటాడు .. వసుధార అంత అభిమానంగా పిలుస్తుంటే వెళ్లాలి కదా? అని గౌతమ్ అంటాడు.
ఇక లోపలకు వెళ్లిన తరువాత రిషిని ఇరికిస్తాడు. ఎందుకు వచ్చావ్ రా అని గౌతమ్ అనడంతో ఎంతో చెప్పాలో తెలియక రిషి కంగారు పడతాడు.. షార్ట్ ఫిల్మ్స్ కోసం వచ్చాను.. ఆ పనులు ఎంత వరకు వచ్చాయని అడుగుతాడు.. మేడం ఇంకా ఆ పనిలోనే ఉన్నట్టున్నారు.. నాకు తెలీదు అని వసు అంటుంది.
మేడం ఆ విషయాన్ని అడిగిందో లేదో ఎలా తెలుసుకోవాలి.. పరోక్షంగా అడగాలి.. అని లోలోపల అనుకుంటాడు రిషి. మేడం ఏమైనా చెప్పిందా? అని రిషి అంటే..ఏ విషయం సర్ అని వసు అడుగుతుంది. అదే షార్ట్ ఫిల్మ్ కోసం అని రిషి మాట మార్చేస్తాడు. ఏమో సార్ నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు అని వసు అంటుంది. మేడం కనిపించడం లేదు కారు కూడా లేదు అని రిషి అంటే.. మేడం కాలేజ్‌కు వెళ్లింది అని వసు సమాధానం చెబుతుంది..
మరి నువ్వు ఎలా వస్తావ్..అని రిషి ప్రశ్నిస్తాడు. జగతి మాటలను గుర్తు చేసుకున్న వసు.. ఈ సౌకర్యాలకు అలవాటు పడలేదు.. ఆటోలను నేను మరిచిపోలేదు.. మీరు వెళ్లండి.. నేను ఆటోలో వస్తాను అని వసు అంటుంది. ఏం పర్లేదు వచ్చేయ్.. అని రిషి తన కారులో రమ్మంటాడు. వచ్చేయ్ వసుధార అని గౌతమ్ కాస్త ఎక్స్ ట్రాలు చేస్తుంటాడు.. నెక్ట్స్ టైం వచ్చేటప్పుడు కార్పెట్‌ను పట్టుకుని రా.. ఇంటి నుంచి కారు వరకు పరిచేసేయ్.. నేను పిలుస్తున్నా కదా? మళ్లీ నువ్వెందుకు పిలవడం.. వసుధార కారు దగ్గర ఉంటాను.. వచ్చేయ్.. అని రిషి అంటాడు
జగతి మేడం నేను చెప్పిన పని చేస్తుందా? లేదా? నేను ఎలా అడగాలి.. అని రిషి అనుకుంటూ ఉంటే..వాటర్ ఉందా? అని గౌతమ్ మళ్లీ మొదలుపెడతాడు.. లేవు అని రిషి అంటే.. నా దగ్గర ఉన్నాయ్ సర్.. అని వసు అంటుంది. అవసరం లేదు..కారు ఆపుతాను కొనుక్కో అని గౌతమ్‌కు కౌంటర్ వేస్తాడు. కొబ్బరి బోండాలు తాగుదామా? అని గౌతమ్ అంటాడు. ఇప్పుడేంటిరా అని రిషి అంటే.. వాటికి టైం ఉంటుందారా? అని గౌతమ్ అంటాడు. ఇంతలో వసుతో కొబ్బరి బోండాలు తాగిన ఘటనను రిషి గుర్తు చేసుకుంటాడు.
చిన్నప్పటి విషయాలు ఏమైనా చెప్పాడా? నీకు అంటూ వసుని గౌతమ్ అడుగుతాడు.. నేనేం చేసినా వాడికి చెప్పేవాడిని.. వాడు మాత్రం ఏం చెప్పేవాడు కాదు.. ఇప్పుడు కూడా అంతే.. ఏం చెప్పడు అని గౌతమ్ వాగుతూనే ఉంటాడు. ఇక వసు పర్సనల్ విషయాలు అడుగుతుండటంతో కోపం వచ్చిన రిషి.. గౌతమ్‌ని కారు దించేస్తాడు. క్యాబ్ బుక్ చేశా.. అందులో వెళ్లు అని అంటాడు. వసు గడిపే ఏ ఒక్క అవకాశాన్ని కూడా దొరకనివ్వడం లేదు.. అని గౌతమ్ చిరాకు పడతాడు.
రిషి మాటలను జగతి తలుచుకుంటూ బాధపడుతుంది. వసుని అన్న మాటలు గుర్తు చేసుకుని కుమిళిపోతుంది. ఇంతలో మహేంద్ర వస్తాడు. ఒక విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి.. అని మహేంద్ర ఎంతో ఉత్సాహంగా వస్తాడు. కానీ నా మూడ్ బాగా లేదు.. అని జగతి అంటుంది. నేను రిపైర్ చేస్తా కదా?. ఏం జరిగిందో చెప్పు.. నేను మూడ్‌ని రిపేర్ చేసే మెకానిక్‌ని అని జోకులు వేస్తుంటాడు. వాటికి జగతి విసుక్కుంటుంది..
మహేంద్ర ముందే చెప్పాను.. నా మూడ్ బాగా లేదు అని అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. వసుధార గురించి మాట్లాడదామని అనుకున్నా.. మూడ్ ఏం బాగా లేనట్టుంది.. అని మహేంద్ర లోలోప అనుకుంటాడు. నాకు ఆకలిగా ఉంది.. పొద్దున్నే ఏం తినలేదు.. క్యాంటీన్‌కు వెళ్తాను.. అక్కడికి కూడా రావొద్దు.. అని చెప్పి జగతి వెళ్తుంది. అలా జగతి బయటకు వస్తుండటంతో వసు కూడా కనిపిస్తుంది. మేడం అని వసు పిలుస్తుంది. సారీ వసు..నిన్ను బాధపెడుతున్నాను.. ఈ తప్పు నాది కాదు.. అని జగతి లోలోపల కుమిళిపోతుంది. మేడం ఇందుకెలా మారిపోయారు.. ఏమైంది.. అని వసు అనుకుంటుంది. ఏమైంది మేడం అని వసు అంటే.. తరువాత మాట్లాడతాను అని జగతి వెళ్లిపోతుంది.
మేడం ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు.. అని వసు మనసులో అనుకుంటుంది. సర్ మేడంకి ఏమైంది.. ఎక్కడికి వెళ్తున్నారు.. అని మహేంద్రని వసు అడుగుతుంది. క్యాంటీన్‌కి వెళ్లడం ఏంటి? అని వసు ఆశ్చర్యపోతుంది. టిఫిన్ చేయలేదట.. లంచ్ బాక్స్ తీసుకుని రాలేదట.. అందుకే వెళ్లింది.. అని మహేంద్ర చెప్పడంతో వసు ఆశ్చర్యపోతుంది.
లంచ్ బాక్స్ తీసుకురాకపోవడం ఏంటి.. అసలు మేడంకి ఏమైంది.. అని వసు ఆలోచిస్తుంది. జగతితో అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. ఈ మేడంకి నేను ఒక పని చెప్పాను.. ఏం చేస్తోందో అసలు.. జగతి మేడం నీడలో వసు మంచితనం మసకబారుతోంది.. ముఖ్యంగా పెద్దమ్మ దృష్టిలో చెడు అవుతోంది.. నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను.. అని జగతి మేడంను పిలవమని ప్యూన్‌కు చెబుతాడు.
మేడం మీకొక పని చెప్పాను.. ఆ వివరాలేవీ నాకు అప్డేట్ చేయలేదు.. వసుధార గురించి.. తనను బయటకు పంపే విషయం గురించి.. మేడం మీరేం సంజాయిషీలు చెప్పాల్సిన పని లేదు.. మీరు ఆ పనిని పూర్తి చేస్తున్నారు.. అని జగతితో రిషి అంటాడు. ఇంతలో హాస్టర్ ఫాంను ఫిల్ అప్ చేయమని అంటాడు. అక్కర్లేదు..మీ దగ్గరికే వసు వస్తుంది అడుగుతుంది అప్పుడు ఇవ్వండి.. మీరు పిలించింది ఇందుకే అయితే నేను వెళ్తాను సర్.. త్వరలోనే అయిపోతుంది సర్.. అని చెప్పి వెళ్లిపోతుంది జగతి.
ఇంతలో వసు వస్తుంది. మీ కోసమే వస్తున్నాను మేడం.. షార్ట్ ఫిల్మ్ పనుల్లో ఏమైనా సందేహాలుంటే సర్‌కు చెబుదాం మేడం అని వసు అంటుంది. నాకు ఒకరు పని అప్పగిస్తే.. సంపూర్ణంగా, పర్ఫెక్ట్‌గా చేస్తాను..సందేహాలు రాకుండా ఉండేలా చేస్తాను.. చెప్పే వాళ్లకు సందేహాలున్నా.. అది వాళ్ల ప్రాబ్లం.. కాదు కూడదు అని సందేహాలు వస్తే.. అలాంటి వాళ్లకు నువ్వే సమాధానాలు చెప్పాలి.. చెబుతావ్.. థ్యాంక్యూ సర్..అని జగతి వెళ్లిపోతుంది. దీంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. జగతి మాటల ఉద్దేశ్యం ఏంటో రిషికి అర్థమైంది. దీంతో ఎపిసోడ్ ముగిస్తుంది.