• December 25, 2021

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. కన్నతల్లి క్షోభ.. వసు విషయంలో రిషి చేష్టలకు జగతి కంటతడి

Guppedantha Manasu నేటి ఎపిసోడ్.. కన్నతల్లి క్షోభ.. వసు విషయంలో రిషి చేష్టలకు జగతి కంటతడి

    గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ అంటే.. శనివారం నాటి Guppedantha Manasu Episode 330 ధారావాహికలో జగతి కంటతడి పెడుతుంది. వసుకి మొహం మీదే చెప్పలేక.. కొడుకు చెప్పిన పని, అన్న మాటలను తలుచుకుంటూ జగతి తల్లడిల్లిపోతుంది. మొత్తానికి వసుని ఇంట్లోంచి పంపించే విషయంలో జగతి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టేసింది.

    నేను ఒకటి అడిగితే చేస్తావా? వసు అని జగతి అంటుంది. మీరు అడిగాక నేను చేయనా? మేడం.. అని వసు అంటే.. అన్నిసార్లు నువ్ అనుకున్నదే అడుగుతాన్ అని అనుకోవద్దంటూ జగతి అంటుంది. మీరు నాకు కొత్తదారి చూపించారు.. కాలేజ్ సీట్ రికమండ్ చేశారు.. ప్రతీసారి ధైర్యాన్ని ఇచ్చారు.. మీరే నాకు స్పూర్తి.. ఇక్కడ ఆశ్రయం కూడా ఇచ్చారు.. ఏ బంధం లేకపోయినా ఆదరిస్తుంటారు.. అని వసు చెప్పుకుంటూ వెళ్తుంది.

    ఈ టైం ఉంది చూడు.. ఎప్పటికీ ఒకేలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మనల్ని బాధపెడుతుంది.. అని జగతి అంటుంది. రిషి చెప్పిన పని గురించి ఆలోచిస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు.. నీతోనే నీ మొహం మీదే ఎలా చెప్పగలను వసు.. రిషి ఏంటి నాన్నా ఇది.. ఇన్నాళ్లు బాధపెడుతుందని చాలదా? కొత్తగా ఈ పని అప్పగించావ్.. అని జగతి తనలో తాను బాధ పడుతూ ఉంటుంది.

    మేడం ఏదైనా ప్రాబ్లమా? దేవయాణి గారు ఏమైనా వచ్చారా? అని వసు అడుగుతుంది. ఏం లేదు వసు.. పద వెళ్లి నిద్రపోదాం.. అని జగతి అంటుంది. ఏదో చెబుతాను అని అన్నారు.. అని వసు అంటుంది. అవసరం లేదనిపించింది.. తలనొప్పిగా ఉంది.. వెళ్దాం అంటూ జగతి అంటుంది. కాఫీ పెట్టాలా?, ట్యాబ్లెట్లు తేవాలా? అని వసు అంటుంది. అవన్నీ నేనూ తెచ్చుకోగలను.. అని జగతి కాస్త కటువుగా ఉంటుంది. వెళ్లమని మొహం మీద చెప్పలేను.. అలా అని నీ మాట కాదనలేను.. ఏంటి రిషి ఇది.. అని జగతి లోలోపల బాధపడుతుంది. ఏంటి మేడం ఏదో డిస్టర్బెన్స్‌లో ఉన్నారు.. ఇప్పుడేం మాట్లాడకపోవడమే కరెక్ట్.. అని వసు సైలెంట్ అవుతుంది.

    ఇక సీన్ రిషి మీద ఓపెన్ అవుతుంది. రిప్లై ఇవ్వలేదని గుడ్ నైట్ పెట్టిందా? అంటే మెసెజ్ చేయోద్దనా?. ఫోన్ చేస్తే ఏం చేస్తుంది.. వద్దులే మరీ లేట్ అయింది.. నేను చెప్పిన పనిని మేడం చేస్తుందా? మేడం నన్ను బ్లేమ్ చేసి ఉంటుందా?. ఏం చేసినా పర్లేదు.. వసుని అక్కడి నుంచి పంపించాలి.. అని రిషి అనుకుంటాడు.

    అలా ఫోన్‌లో ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు. అలా తండ్రి ఫోటోను చూసి.. మహేంద్ర వద్దకు రిషి వస్తాడు. నిద్రపోయిన తండ్రి చేయి పట్టుకుంటాడు.. దీంతో మహేంద్ర నిద్రలేస్తాడు. ప్రతీసారి మీరు నన్ను ప్రేమగా డిస్టర్బ్ చేస్తారు కదా. ఇప్పుడు నా వంతు అనుకోండి..అని రిషి కౌంటర్ వేస్తాడు. థ్యాంక్యూ..అని మహేంద్ర అంటాడు. చెప్పండి డాడ్.. అని రిషి.. ఏం చెప్పాలి రిషి.. అని మహేంద్ర అంటాడు.

    ఏమైనా కబుర్లు చెప్పండి.. అని రిషి అడుగుతాడు. చిన్నప్పుడు కూడా ఇలానే అర్దరాత్రి లేచి ఇలానే కబుర్లు చెప్పమని అడిగేవాడివి.. అని మహేంద్ర గుర్తుకు చేసుకుంటాడు. నేను ఎప్పుడూ చిన్నవాడినే కదా? అని రిషి అంటే..పాతికేళ్లు దాటాయ్, డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అయిన నువ్ చిన్న పిల్లాడివా? అని మహేంద్ర అంటాడు. మనసు ఎప్పుడూ చిన్నదే కదా?అని రిషి అంటాడు. దొంగ మనసు.. దోబూచులాడుతుంది. అదుపు చేస్తే గోల చేస్తుంది.. వదిలేస్తే గొడవలు తెచ్చి పెడుతుంది.. మరేం చేయమంటారు అని అడుగుతావా?.. మనసుని అప్పుడప్పుడు వదలాలి, అప్పుడప్పుడు కల్లెం వేయాలి.. అన్నీ దాచుకుంటే కష్టం.. అని మహేంద్ర చెబుతాడు.

    ఇది కొటేషనా? సజేషనా?.. అని రిషి కౌంటర్ వేస్తాడు. మామూలుగా అయితే కొటేషనే.. కొడుక్కి కాబట్టి సజేషనే.. అని మహేంద్ర అంటాడు. మాటలు బాగా మాట్లాడతారు డాడ్ అని రిషి అనేస్తాడు.. గుడ్ నైట్ చెప్పి రిషి వెళ్లిపోతోంటే.. తలుపులు మూసేయ్.. నీ మనసు తలుపులు తెరిచిపెట్టు.. అని మహేంద్ర అంటాడు. ఇది ఆర్డరా? అని రిషి అంటే.. అభిమానం అని మహేంద్ర బదులిస్తాడు.

    అసలు రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు.. రిషి మనసులో ఏముంది.. అంటూ జగతి తనలో తాను ప్రశ్నలు వేసుకుంటూ బాధపడుతుంది. గుడ్ మార్నింగ్ మేడం.. ఎందుకో డల్‌గా కనిపిస్తున్నారు.. ఏమైంది.. మేడం.. అని జగతిని వసు ప్రశ్నిస్తుంది. ఏం లేదు వసు.. అని జగతి చెప్పి.. కాఫీ పక్కన పెట్టేస్తుంది. అలా పక్కన పెట్టేశారేంటి?.. అని వసు అడుగుతుంది. నచ్చినవి అయినా, నచ్చకపోయినా ఒక్కోసారి పక్కన పెట్టాల్సి వస్తుంది.. అని జగతి చెబుతుంది.

    బాగా లేదా?మేడం.. అని వసు అంటే.. ఒక ప్రశ్నకు మళ్లీ ప్రశ్నలు వేయొద్దు.. అని జగతి అంటుంది. నచ్చకపోతే మళ్లీ కలుపుతాను అని వసు అంటుంది.. నచ్చని ప్రతీ విషయాన్ని మనం మార్చలేం కదా? అని జగతి వెళ్లి కాఫీని పాడేయడంతో వసు ఫీలవుతుంది. ఏమైంది మేడం కాఫీ మళ్లీ కలుపుతాను.. అని వసు అంటుంది. అన్ని పనులు నువ్వే చేయాలని లేదు.. నేను ఒంటరిదాన్ని.. ఇవన్నీ నాకు అలవాటే.. నువ్ నాతో జీవితాంతం ఉండవు కదా?. కాఫీ నేను కలుపుకుంటాను.. అని జగతి అంటుంది. కాఫీ బాగానే ఉంది కదా? మేడంకి ఎందుకు నచ్చలేదు.. అని వసు అనుకుంటుంది.

    రేయ్ ఫ్రెండ్ అంటేనే నువ్ రా.. నిలువెత్తు నిదర్శనంరా.. అని రిషిని పొగిడేస్తుంటాడు గౌతమ్. ఎక్కడికి వెళ్లాలో చెప్పు అని రిషి అంటాడు… కరెక్ట్‌గా గుర్తు లేదు.. చిన్న చిన్న ల్యాండ్ మార్క్.. ఆ రోజు అటు తిప్పి ఇటు తిప్పి వెళ్లాం అని గౌతమ్ అంటాడు. వెళ్లామా? ఎవరెవరురా? అని రిషి ప్రశ్నిస్తాడు. అదేరా వసుధార.. అని గౌతమ్ చెప్పడంతో రిషి షాక్ అవుతాడు.

    నువ్వేం అనుకుంటున్నావ్.. నీకు తెలియని రూట్ అంటే వచ్చాను.. ఇంత పొద్దున్నే అక్కడకు ఏంట్రా.. అని రిషి అంటాడు. అరేయ్ నీకు పొద్దున్నే చెప్పాను కదా? ఈ ప్రశ్నలు అడగొద్దని అంటూ రిషిని కంట్రోల్ చేస్తాడు గౌతమ్. అరేయ్ గౌతమ్ ఇది కరెక్ట్ కాదురా.. అని రిషి అంటే.. అరేయ్ కోపంగా చూడకురా.. వెళ్దాం పదరా అని గౌతమ్ అంటాడు.. అబ్బో పీలైనట్టున్నాడు.. అయినా వీడు అలిగితే నాకేంటి.. ప్రేమంటేనే పెద్ద పరీక్ష.. ఇలాంటివి పట్టించుకోవద్దు.. అని గౌతమ్ తనలో తాను అనుకుంటాడు.

    జగతి పనులను ఊహించుకుని వసు బాధపడుతుంది. కాఫీ టేస్ట్‌గా ఉంది కదా? ఎందుకు నచ్చలేదు.. వాదన ఎందుకని వదిలేశాను. ఏదో మార్పు కనిపిస్తోంది..ఏమై ఉంటుంది. అని వసు ఆలోచిస్తుంటుంది. మేడం ఎక్కడికి వెళ్తున్నారు.. అని వసు అడుగుతుంది. కాలేజ్ టైం అయింది వెళ్తున్నాను.. అని దురుసుగా సమాధానం చెబుతుంది.

    నేను కూడా వస్తాను రెండు నిమిషాలు ఆగండి.. అని వసు అంటుంది. ప్రతీ రోజూ నాతో రావాలని ఉందేంటి.. నేను వెళ్తాను నువ్ రా.. లంచ్ రెడీ చేయలేదు. నాకు నేను నా మట్టుకు సరిపోయేంత లంచ్ చేసుకున్నాను.. అని జగతి అంటుంది. నేను కూడా వస్తాను ఉండొచ్చు కదా? అని వసు అంటుంది. అన్నీ సార్లు మన కోసం ఆగవు.. సౌకర్యాలు మేఘాల్లాంటివి.. ఎక్కువ రోజులుండవు.. కారు అలవాటైందా? ఆటోలో కాలేజ్‌కి వచ్చేయ్.. లంచ్ నా వరకు చేసుకున్నాను.. నీకు కావాల్సింది వండుకో.. అని జగతి అంటుంది.

    ఏంటి మేడం కొత్తగా.. అని వసు అంటుంది. అన్నింటికి ప్రశ్నలు వేయకూడదు.. కొన్ని నేర్చుకోవాలి.. ఒంటరిగా రావడం నేర్చుకో.. అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ లంచ్ బాక్స్ ఖాళీగానే ఉంటుంది. నా మనసు తొందరగా అర్థం చేసుకో.. దాగుడు మూతలు ఆడలేను.. నీకు వెళ్లమని చెప్పలేను.. రిషి చెప్పిన పని చేయకుండా ఉండలేను.. అబద్దాలు ఆడాల్సి వస్తుంది.. నటించాల్సి వస్తుంది.. ఎక్కువగా బాధపెట్టలేను.. నువ్వే తొందరగా అర్థం చేసుకోవాలి.. సారీ వసు.. అని జగతి కంటతడి పెడుతుంది.

    ఇదే వసుధార ఇళ్లు.. కథ, దర్శకత్వం అన్నీ నావే.. నువ్ ప్రేక్షకుడివి మాత్రమే.. అని రిషికి గౌతమ్ కొన్ని సూచనలు చేస్తాడు. ఎక్కువ చేయకు.. అని రిషి అంటే.. కొన్ని సార్లు ఎక్కువ చేస్తేనే బాగుంటుంది.. అని గౌతమ్ అంటాడు. ఇంతలో ఇంట్లోంచి వసు బయటకు వస్తుంది. అది చూసి గౌతమ్ కారు దిగుతాడు. హల్ గుడ్ మార్నింగ్ అని గౌతమ్ అంటే గుడ్ మార్నింగ్ అని వసు అంటుంది. ఇలా వచ్చాడేంటి.. అని షాక్ అవుతున్నావా?. రిషి వస్తుంటే.. నేను కూడా వచ్చాను.. అని గౌతమ్ చెప్పే సమయానికి రిషి వస్తాడు. వసు డల్‌గా ఉందంటే.. మేడం పని ప్రారంభించినట్టుందని రిషి అనుకుంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. వచ్చే వారం నాటి ఎపిసోడ్‌లో మున్ముందు ఇంకేం మలుపులు తిరుగుతుందో చూడాలి.

    Leave a Reply