• December 23, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. కొడుకు మాటలకు జగతి షాక్.. రిషి మూర్ఖత్వానికి వసు బలి

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. కొడుకు మాటలకు జగతి షాక్.. రిషి మూర్ఖత్వానికి వసు బలి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాటి Guppedantha Manasu Episode 328 ధారావాహికలో రిషి మూర్ఖత్వాన్ని మరోసారి బయటపెట్టేశాడు. పెద్దమ్మ మీద అతి ప్రేమతో కళ్లు మూసుకుని గుడ్డివాడైపోయాడు. దీంతో వసుకి మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా వసు ఇలా తయారవ్వడానికి కారణం కూడా జగతి అని భ్రమపడతాడు. ఆ ఇద్దరినీ వేరు చేసేందుకు రిషి కంకణం కట్టుకుంటాడు. ఏకంగా వసుని బయటకు పంపించండి అని జగతితోనే రిషి చెబుతాడు.

    వసుని బయటకు తీసుకెళ్లిని రిషి తన పెద్దమ్మ గురించి చెబుతాడు. తప్పు చేశావ్ వసుధార.. పెద్దమ్మ విషయంలో అంటూ రిషి మళ్లీ పాత పాటే పాడతాడు.. జరిగింది వేరు.. మీకు అర్థమైంది వేరు.. ఆ రోజు జరిగింది వేరు అని వసు చెప్పబోతే వారిస్తాడు. వసు చెప్పేది వినడు.. ఎలా పడిపోయిందో నేను చూశాను.. వేలు చూపించి.. కోపంగా మాట్లాడావ్ అని వసుని నిందిస్తాడు రిషి..

    ఆమె ఏం అన్నారో మీకు తెలీదు.. అని వసు తన వాదనను వినిపించబోయింది. కానీ రిషి మాత్రం వినకుండా మూర్ఖంగా ప్రవర్తించాడు. పెద్దమ్మ అంటే మీరు అంటారా? అని రిషి రివర్స్ అటాక్ చేస్తాడు. వసు ఏదో చెప్పబోతోంటే.. నేను చెప్పేందుకు వచ్చాను.. నువ్ చెప్పింది వినడానికి కాదు అంటూ అడ్డంగా వాదిస్తాడు.. మీ పెద్దమ్మ ఆలోచనలకు కాకపోయినా వయసుకైనా గౌరవిస్తాను.. తప్పు నా వైపుంటే.. తప్పక సారీ చెప్పేదాన్ని.. పొరబాటు జరిగితే సారీ చెబుతాను..

    పంతానికి వెళ్లడం లేదు.. జరిగిందాంట్లో నా తప్పుగానీ, జగతి మేడం తప్పుగానీ ఏమీ లేదు..అని వసు చెప్పింది. పెద్దమ్మే నాకు జీవితం.. ఆమెను బాధపెడితే.. వంద రెట్లు నేను బాధపడతాను.. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది.. కన్నతల్లి వదిలి వెళ్లిపోతే.. నన్ను చూసుకుంది.. అని రిషి చెబుతాడు. సర్ ఆ రోజు ఫోటోలు చూపించి.. ఆ రోజు కూడా నా మీద ప్రేమతో రెస్టారెంట్‌కు వచ్చింది.. వసుధార విను.. ఏం జరిగిందని అడగను.. సారీలు కూడా అడగను.. పెద్దమ్మను గౌరవించకపోతే.. నేను ఫీల్ అవుతాను అని రిషి అంటాడు. నేను చెప్పేది పూర్తిగా వినడం లేదు.. అని వసు మళ్లీ ఇంకా ఏదో చెప్పబోతోంది. ఇంక ఈ విషయం వదిలేద్దాం.. అని రిషి అంటాడు. తను చెప్పిందే గానీ ఎదుటి వాళ్లు చెప్పింది వినరు..అని వసు లోలోపల అనుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావ్.. వెల్దాం పద..అని వసుని ఎక్కించుకుని రిషి వెళ్తాడు.

    రిషి పొద్దున్నే ఇంటికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు.. అని జగతిని మహేంద్ర అడుగుతాడు. నాకెలా తెలుస్తుంది.. నీకు తెలీకుండా వచ్చాడా? నువ్ రిషిని పట్టించుకోవడం లేదు.. అని జగతి అంటే.. నాకు అన్నీ చెప్పి చేస్తాడా? తన సంగతి నీక్కూడా తెలుసు కదా? పుత్ర రత్నం మూడ్ ఎలా ఉందో అని మహేంద్ర అడుగుతాడు. దీనికి మళ్లీ జగతి సీరియస్ లుక్ ఇస్తుంది.

    రిషి గురించి సమాచారం నేను నిన్ను అడగాలి.. నువ్ నన్ను అడుగుతావ్ ఏంటి.. తనతో కలిసి ఉంటుంది నువ్.. అని మహేంద్రతో జగతి అంటుంది. ధరణితో మాట్లాడుతుంటే.. దగ్గరకు వచ్చి వెళ్లాడు.. నాకు ఎన్నో ప్రశ్నలున్నాయ్.. అని మహేంద్ర అంటాడు. నాక్కూడా ఎన్నో ప్రశ్నలున్నాయ్.. రిషితో ఉండేది నువ్వే కదా? అని జగతి అంటుంది. పక్కనే ఉంటాను కానీ మనసులోకి తొంగి చూసేందుకు అవకాశం ఇవ్వడు.. వసుని కలిస్తే గానీ అసలు విషయం తెలియదు.. చిక్కు లెక్కల్లా మారిపోతున్నాడు.. నువ్వే పరిష్కరించాలి.. కనీసం ప్రయత్నమైనా చేయాలి కదా? అని మహేంద్రను జగతి అడుగుతుంది.

    రిషి వచ్చాడని తెలిసి.. నొప్పి అమ్మా.. అంటూ దేవయాణి నాటకం ఆడుతుంది. ఈ జ్యూస్ తాగండి పెద్దమ్మ.. అని రిషి అంటాడు. నువ్ ఎందుకు తెచ్చావ్ రిషి.. ధరణి ఉంది కదా? అని దేవయాణి అంటే.. మీకు సేవ చేయడం నాకు ఎప్పుడూ భారం కాదు.. అని రిషి ప్రేమను కురిపిస్తాడు. మీకు త్వరగా భాగవ్వాలి.. అని రిషి అంటాడు. నన్ను అవమానించారు.. పడేశారు.. అని దేవయాణి ఇంకా నాటకం ఆడుతుంది.

    ఆ ఫోటోలు నీకు ఎవరో పంపిస్తే ఏంటి. మీరు ఎందుకు అక్కడికి వెళ్లాలి అని రిషి ప్రశ్నిస్తే.. టాపిక్ డైవర్ట్ చేస్తుంది దేవయాణి. నన్ను వాళ్లు అంత అవమానించారు.. అసలే నువ్ అమాయకుడివి.. వాళ్ల మీద గెలవలేం.. అని దేవయాణి ఇంకా రెచ్చగొడుతుంది. నా గురించి మీరు వాళ్లతో వీళ్లతో మాటలు పడకండి.. అని రిషి అంటాడు. వాళ్లని నువ్ గెలవలేవ్ రిషి.. అని దేవయాణి అంటే.. మిమ్మల్ని ఇలా చేసిన వాళ్లని వదిలి పెడతానని అనుకుంటున్నారా? నా కళ్ల ముందే జరిగింది కదా.. ఊరుకోను..అని రిషి ఇంకా రెచ్చిపోతాడు.

    క్లాస్ రూంలోకి రిషి వస్తాడు. కానీ వసు ఇంకా కనిపించదు. క్లాస్ మొదలుపెట్టే టైంకు వసు వస్తుంది. ఏంటి లేటు.. అని రిషి అడుగుతాడు. మీ వల్లే లేట్ అయింది.. మళ్లీ మీరే అడుగుతున్నారా? అని వసు లోలోపల అనుకుంటుంది. కొంపదీసి నా వల్లే లేటు అయిందని చెబుతుందా? ఏంటి.. అని రిషి అనుకుంటాడు. సమాధానం చెబుతున్న వసుని ఆపి.. ఆల్రెడీ టైం వేస్ట్ అయింది.. నోట్ బుక్ ఇచ్చి వెళ్లు..అని అంటాడు రిషి.

    అలా నోట్ బుక్ తీసే సమయంలో బ్యాగులో ఉన్న గోలీలు కిందపడతాయి. దీంతో అందరూ నవ్వుతారు. ఆ గోలీల మీద కాలు వేసి వసు జారి కిందపడుతుంది. దీంతో రిషి చేయిచ్చి పైకి లేపుతాడు. ముందు చూసి నడువ్.. మళ్లీ ఎవరి మీదైనా పడతావ్.. క్లాస్ స్టార్ట్ చేద్దాం..అని రిషి అంటాడు. ఇక రిషి కేబిన్‌లో జగతి ఎదురుచూపులు చూస్తుంటుంది..

    సారీ మేడం వెయిట్ చేయించాను.. అని రిషి అంటే.. పర్లేదు సార్ అని జగతి అంటుంది. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అయిందా?అని రిషి, ఇంకా కాలేదు సర్ అని జగతి మాట్లాడుకుంటారు.. పూర్తిగా అయ్యాకే ఇవ్వండి.. అని రిషి అంటాడు. సరే సర్.. అని జగతి వెళ్లబోతోంది. మేడం మీతో మాట్లాడాలి.. వసుధార గురించి మీతో మాట్లాడాలి.. అని జగతిని ఆపుతాడు రిషి.

    సర్ వసు ఏమైనా తప్పు చేసిందా?. అని జగతి అడుగుతుంది. వసుధార తప్పు చేయదు.. నా మనసులోని మాట చెప్పాలని అనుకుంటున్నాను.. వీలు కాలేదు.. అని జగతికి రిషి చెబుతాడు. ఓ గొడవ కాదన్న మాట.. ప్రేమ గొడవా? ఇన్నాళ్లకు చెప్పబోతోన్నాడా? అమ్మ ముందు మనసు విప్పబోతోన్నాడా?.. అని జగతి లోలోపల సంబరపడిపోతుంది.

    వసుని మీ ఇంట్లోంచి పంపించేయండి మేడం.. అని రిషి అన్న మాటలకు జగతి షాక్ అవుతుంది. సర్.. అని జగతి షాక్ అవుతుంది. మీరు సరిగ్గానే విన్నారు మేడం.. వసుధారని మీ దగ్గరి నుంచి పంపించేయండి.. అని రిషి చెబుతాడు. సర్ కానీ.. అని జగతి అంటుంది. ఎందుకు ఏంటి అని వివరాలు అడగొద్దు.. నాకుండే కారణాలు నాకున్నాయ్.. బంగారం మెరుగు పెడితే మరింత మెరగాలి మేడం.. అంతేగానీ మసకబారిపోవద్దు.. వసు ధార నీటిలో పెరిగిన తామరాకులాంటిది.. చుట్టూ నీళ్లున్నా కూడా తన మీద నీటి చుక్క పడనివ్వదు.. కానీ ఇప్పుడు భయం వేస్తుంది.. నన్ను ఏమీ అడక్కండి.. నేను ఏదీ అనవసరంగా మాట్లాడను.. కాస్త ఆవేశంగా మాట్లాడతాను తప్పా.. తనకి ఉజ్వలమైన భవిష్యత్తుంది.. తనను తాను కోల్పోవడం నాకు నచ్చడం లేదు.. వసుధార అభివృద్దిని కోరుకునేవారు అయితే.. వ్యక్తిత్వం మీద మచ్చ రానివ్వని వారే అయితే.. మీరు వసుని మీ ఇంటి నుంచి పంపించేయండి అని రిషి అంటాడు. ఆ మాటలన్నీ కూడా వసు వింటుంది. మరి వసు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

    Leave a Reply