• December 18, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అడ్డంగా బుక్కైన వసు.. గౌతమ్ చేష్టలతో బయటపడనున్న రిషి

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. అడ్డంగా బుక్కైన వసు.. గౌతమ్ చేష్టలతో బయటపడనున్న రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే శనివారం నాటి Guppedantha Manasu Episode 324 ధారావాహికలో గౌతమ్ మరింత రెచ్చిపోతాడు. గౌతమ్ చేష్టలకు రిషి తన మనసులోని మాటను ఎప్పుడో సారి బయట పెట్టేవాడిలా కనిపిస్తున్నాడు. మొత్తానికి గౌతమ్ మాత్రం వసుని లైన్‌లో పెట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో వసునే గౌతమ్‌కి ఫోన్ చేయడంతో రిషికి ఇంకా మాడిపోతోంది. అలా గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    వసు నంబర్ కోసం రిషి, మహేంద్రను బతిమిలాడుతున్న సమయంలోనే గౌతమ్‌కు ఫోన్ వస్తుంది. హలో సర్ నేను వసుధారని అని అనడంతో గౌతమ్ షాక్ అవుతాడు. అలా మొత్తానికి వసునే ఫోన్ చేయడంతో గాల్లో తేలిపోతాడు. ఇక రిషిని ఉడికించేందుకు కాస్త ఓవర్ చేస్తాడు గౌతమ్. మీ కార్డ్స్ ఎప్పుడు తీసుకుంటారు అని అవతల వసు అడుగుతుంది. అదొకటి ఉంది కదా? త్వరలో తీసుకుందాం.. మీ నంబరేనా? సేవ్ చేసుకోవచ్చా?.. విత్ యువర్ పర్మిషన్.. అని గౌతమ్ అడిగేస్తాడు.

    దానికేముందండి.. సేవ్ చేసుకోవచ్చు.. అని వసు అంటుంది. డెస్టినీ గ్రేట్.. విధి విచిత్రమైంది.. ఎలా ఆలోచిస్తే అదే జరుగుతుంది.. అని గౌతమ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. ఏంటి అని వసు అంటే.. విధి విచిత్రమైంది.. ఈ సారి కలిసినప్పుడు చెబుతాను.. అని గౌతమ్ అంటాడు. సర్ కార్డ్ ఎప్పుడు తీసుకుంటారు.. ఈవెనింగ్ మీ రెస్టారెంట్‌కు వస్తాను.. కాఫీ షేర్ చేసుకుందాం.. అప్పుడు తీసుకుంటాను అని అంటాడు. దీంతో వసు ఫోన్ పెట్టేస్తుంది. అయినా కూడా వసు ఇంకా లైన్‌లోనే ఉందన్నట్టుగా గౌతమ్ రెచ్చిపోతాడు. బాయ్ వసుధార.. సీయూ అంటూ ఎక్కువ చేస్తాడు.

    గౌతమ్ గాడు ఫుల్ హ్యాపీ.. అని అరిచేస్తాడు. కాఫీకి వెళ్దాం అంకుల్ అని మహేంద్రను గౌతమ్ అడుగుతాడు. నేను రాను మీరు మీరు చూసుకోండి అని అంటాడు. అరేయ్ రిషి మనం వెళ్దాం రా అని అంటాడు. నేను రాను.. అని రిషి అనేస్తాడు. మరీ మంచిది.. నన్ను రెస్టారెంట్ వద్ద డ్రాప్ చేయ్ అని గౌతమ్ అనేస్తాడు. రేయ్ వసుధార నీకు ఎందుకు ఫోన్ చేసింది.. నీ నంబర్ ఎలా వచ్చింది.. అని గౌతమ్‌ని రిషి అడుగుతాడు.

    రేయ్ రారా.. అని గౌతమ్ యాటిట్యూడ్ చూపిస్తూ రిషిని పిలుస్తాడు. పర్సనల్ మ్యాటర్ అడగొద్దు మిత్రమా?. అని కౌంటర్ వేసి వెళ్లిపోతాడు. వసుధార.. ఈ మార్నింగ్ ఎంత హాయిగా ఓపెన్ అయిందో.. అని గౌతమ్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. వసుధార తనకు ఎందుకు కాల్ చేసి ఉంటుంది.. అని రిషి అయోమయంలో పడిపోతాడు. ఇక సీన్ జగతి, వసుల మీద ఓపెన్ అవుతుంది.

    కారులో వెళ్తూ.. హాస్పిటల్‌లో ఎవరినో జాయిన్ చేశావ్ కదా? వారి గురించి కనుక్కున్నావా?.. అని వసుని జగతి అడుగుతంది. కనుకున్నాను మేడం అని వసు అంటుంది. నువ్ ఈ రోజు రిషి సర్‌తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని వసుని జగతి అడుగుతుంది.. నేను మాట్లాడను మేడం అని వసు అంటుంది.. దేవయాణి అక్కయ్య విషయంలో అలా జరిగిందని ఇలా అంటున్నావా?. రోజురోజుకూ మొండిదాన్ని అవుతున్నావ్.. అని జగతి అంటే.. కాదు మేడం స్ట్రాంగ్ అవుతున్నాను..అని వసు చెబుతుంది.

    సరే నేనే మాట్లాడతాను నాకు తప్పదు కదా? అని జగతి అంటే.. రిషి సర్‌తో మీరు మాట్లాడతారా?.. అని వసు ఆశ్చర్యపోతుంది. కాదు మహేంద్ర సర్‌తో అని జగతి అంటుంది. ఇక ఫోన్ చేసి స్పీకర్‌లో పెట్టి జగతి మాట్లాడుతుంది. హలో మహేంద్ర సర్ అని అంటుంది జగతి. ఎలా గుర్తొచ్చానో ఇంత పొద్దున్నే.. అని మహేంద్ర కాస్త తేడాగా మాట్లాడుతూ ఉంటే.. ఫోన్ స్పీకర్‌ మోడ్‌లో ఉంది.. పక్కనే వసు ఉందని జగతి చెబుతుంది.

    ఓ సరే పని చెప్పండి.. ఎండీ గారితో మీటింగ్ గురించి చెప్పాలి.. అని జగతి అంటుంది. మీటింగ్ పెట్టమని నేను రిషి సర్‌కు చేరవేయాలి అంతేనా? అని మహేంద్ర అంటాడు.. అక్కయ్యకు ఎలా ఉంది? అని జగతి అడిగితే.. ఆవిడకేంటి? బాగానే ఉంది అని మహేంద్ర చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.. ఏంటో వసు.. నీ పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది.. అని జగతి అంటుంది. మీరు రిషి సర్ అమ్మలా ఆలోచిస్తున్నారు.. మీ శిష్యురాలికి గురువులా ఆలోచించండి.. నాది పంతమో, అభిమానమో.. మీకే తెలుస్తుంది.. ఆయన ఎలా మాట్లాడాలో మీకు చెప్పాను కదా? నేను ఎందుకు సారీ చెప్పాలి.. అని వసు నిలదీస్తుంది. నువ్ మారవ్.. రిషి మారడు.. అని జగతి లోలోపల అనుకుంటుంది.

    క్లాసులోకి రిషి ఎంట్రీ ఇచ్చాడనే ధ్యాసలో కూడా వసు ఉండదు. అందరూ లేచి నిలబడితే వసు మాత్రం కూర్చునే ఉంటుంది. క్లాసులో వసు తప్పా నోట్స్ ఇంకెవ్వరూ రాయరు. దీంతో పుష్పకు తన నోట్స్ ఇచ్చేస్తుంది.. నీదే అని చెప్పు.. లేదంటే క్లాస్ అందరికీ తిట్లు పడతాయ్ అని వసు అంటుంది. అయితే ఆ పుస్తకంలో గౌతమ్ విజిటింగ్ కార్డ్.. ఉండటంతో వసు అడ్డంగా బుక్కవుతుంది. ఆ నోట్ బుక్ వసుదే అని తెలుస్తుంది. పుష్పని బోర్డు మీద లెక్కలు చేయమని అంటాడు. అయ్యో రిషి సర్‌కు అది నా పుస్తకం అని తెలిసినట్టుంది.. ఇప్పుడు వచ్చి తిడతారు.. తిట్టనీ.. నేను అయితే సారీ చెప్పను.. నా పక్కనే వచ్చి కూర్చుంటారు.. అని వసు అనుకుంటుంది. కానీ రిషి మాత్రం వేరే చోట కూర్చుంటాడు.

    ఇక దేవయాణి చేసిన రచ్చను జగతి, మహేంద్రలు కలిసి ఫణీంద్రకు చెబుతారు. ఒకడు చెబితే రిషి నమ్మడు.. తనది తాను తెలుసుకుంటే తప్పా నమ్మడు.. నమ్మించాలని చూస్తే అది నిజం ఎలా అవుతుంది. ఇది అసలు పట్టించుకోకండి.. అలా వదిలేయండి.. రిషినే తెలుసుకుంటాడు.. మీరు ప్రాజెక్ట్ మీటింగ్ పనుల్లో ఉండండి.. అని ఫణీంద్ర అంటాడు.

    ఏంటి మహేంద్ర.. బావగారు కూడా చేతులెత్తేశారు.. ఈ సారీల గొడవ అయిపోతుందని అనుకున్నా.. అని జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో హాయ్ అంకుల్.. అంటూ గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు. మేడం తను గౌతమ్.. రిషి క్లాస్ మేట్, బెస్ట్ ఫ్రెండ్.. అని పరిచయం చేస్తాడు మహేంద్ర. జగతి మేడం.. మా కాలేజ్‌కు చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ.. మేడం మ్యాథమేటిక్స్‌లో గోల్డ్ మెడల్.. అని చెప్పడంతో.. మా రిషి కూడా అంతే అని గౌతమ్ అంటాడు. జీన్స్ రా జీన్స్..తల్లిదారిలోనే నడుస్తున్నాడు అని మహేంద్ర లోలోపల అనుకుంటాడు..

    మీరు మ్యాథ్స్ చెబుతారన్న మాట.. అని గౌతమ్ అంటే.. మిషన్ ఎడ్యుకేషన్.. అని జగతి చెప్పబోతోంది. కానీ మహేంద్ర అడ్డుపడి జగతి గొప్పల గురించి చెబుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ అని ఓ సంచలనం సృష్టించింది.. అని మహేంద్ర అంటే.. ప్రాజెక్ట్ ఫోటోలను ధరణి వదిన చూపించింది.. అని గౌతమ్ అంటాడు. ఆ ఐడియా ఈ మేడందే.. అని మహేంద్ర చెబుతాడు. మీలాంటి వాళ్లు కాలేజ్‌కి ఒక్కళ్లు ఉంటే చాలు.. అని గౌతమ్ పొగిడేస్తాడు.

    మహేంద్ర సర్.. చాలు.. అని జగతి ఆపుతుంది. చెప్పనివ్వండి మేడం.. నిజాలే చెబుతున్నారు కదా? అని గౌతమ్ అంటాడు. అలా వసుధార రాకని చూసిన గౌతమ్ గాల్లో తేలిపోతాడు.. మై డియర్ ఏంజిల్.. అని లోలోపల అనుకుంటాడు. హాయ్ వసుధార అని గౌతమ్.. హాయ్ సర్ అని వసు ఒకరినొకరు పలకరించుకుంటారు. ఏంటి మళ్లీ కాలేజ్‌కి వచ్చాడని అనుకుంటున్నారా?? అని వసుని గౌతమ్ ప్రశ్నిస్తాడు.

    అయ్యో అలా ఎందుకు అనుకుంటారు.. వదిన ఫోటోలు చూపించింది.. అందులో జగతి మేడం ఎక్కడా కనిపించలేదు.. రిషి, వసుధారే కనిపించారు.. మా రిషికి రైట్ హ్యాండ్ అట.. వాడు అసలు నాకు చెప్పనే లేదు.. కళ్లారా చూశాను కదా?. అని ఈ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ దృశ్యాన్ని రిషి చూస్తాడు. అలా సీరియల్ ముగుస్తుంది. ఇక వచ్చేవారం నాడు కథ మరింత మలుపు తిరిగేలా ఉంది. గౌతమ్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు.. మన రిషి సర్ ఉన్నాడు. కనీసం మాట కూడా మాట్లాడాడు.. అంటూ పుష్పతో వసు చెబుతూ ఉంటుంది. అది రిషి వింటాడు. మా పెద్దమ్మకు సారీ చెప్పాలి.. అని రిషి అంటే.. జగతి మేడం గానీ, నేను గానీ సారీ చెప్పడం లేదు సర్..అని వసు మొండికేస్తుంది.

    Leave a Reply