• December 15, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. మాటలు కలిపిన గౌతమ్.. వసుపై గుర్రుగా ఉన్న రిషి

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. మాటలు కలిపిన గౌతమ్.. వసుపై గుర్రుగా ఉన్న రిషి

    గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే.. బుధవారం నాడు జరగబోయే Guppedantha Manasu Episode 321 ధారావాహికలో గౌతమ్ క్యారెక్టర్ పరిచయం జరుగుతుంది. రిషి, గౌతమ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలుస్తుంది. ఇక వసు గురించి గౌతమ్ చెబుతున్నాడని తెలీక రిషి సాయం చేస్తానని మాటిస్తాడు. మొత్తానికి వసు రిషిల మధ్య దూరం పెరుగుతుందా? గౌతమ్ వల్ల ఇంకా ఆ దూరం తగ్గుతుందా? అన్నది చూడాలి. మొత్తానికి గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ ఎలా కొనసాగిందంటే..

    పెద్దమ్మకు ఎలా ఉంది? అని ఫోన్ కూడా చేయడం లేదు.. కనీస మర్యాద లేదు.. ఒక్క ఫోన్ లేదు మెసెజ్ లేదు..అయినా వసు ఫోన్ చేస్తుందని నేను ఎందుకు వెయిట్ చేయడం.. ఫోన్ చేసి నేనే క్లాస్ పీకుతాను.. తిడతాను అని తెలిసి.. ఫోన్ స్విచ్చాప్ చేసి ఉంటుంది.. అని రిషి అనుకుంటాడు. కానీ వసు ఫోన్‌ను జగతి స్విచ్చాప్ చేసి పెట్టిన సంగతి తెలిసిందే.

    తెల్లారి కాలేజ్‌లో పుష్ప, వసు నడుచుకుంటూ వెళ్తారు. సెమిస్టర్ హాలీడేస్ ఇట్టే గడిచిపోయాయ్ కదా? వసు.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఏమైంది ఏం మాట్లాడటం లేదు.. అని వసుని పుష్ప అడుగుతుంది. నువ్ మాట్లాడుతున్నావ్ కదా? అని వసు కౌంటర్ వేస్తుంది. ఇంతలో రిషి ముందుకు వచ్చి నిల్చుంటాడు. గుడ్ మార్నింగ్ సర్ అని పుష్ప చెబుతుంది. మార్నింగ్ అని రిషి అంటాడు.

    వసు కూడా ఏదో చెప్పాలని అన్నట్టుగాచెప్పేసింది. గుడ్ మార్నింగ్ సర్ అని వసు అంటుంది. మార్నింగ్ అని రిషి అంటాడు. క్లాస్ అయ్యాక కాబిన్కు రా అని వసుకి రిషి ఆదేశాలు జారి చేస్తాడు. సర్ కోపంగా ఉన్నట్టున్నాడు కదా? అని పుష్ప అంటే.. ఆయన గారు కోపంగా ఎప్పుడు లేరు చెప్పు అని వసు కౌంటర్ వేస్తుంది. ఆ మాటలు రిషి వింటాడు. వచ్చేటప్పుడు జగతి మేడంను కూడా తీసుకురా అని రిషి చెబుతాడు, మన మాటలు విన్నాడా? ఏంటి.. అని పుష్ప అంటే.. వింటే వినని.. అన్నదాంట్లో తప్పేముంది..అని వసు అంటుంది.

    ఇక గౌతమ్ ఫుల్ స్పీడులో బైక్ మీద కాలేజ్‌కు వస్తాడు. నమస్తే డీబీఎస్టీ కాలేజ్.. కాలేజ్ సూపర్..అంటూ గౌతమ్ మురిసిపోతాడు. అక్కడి పువ్వులను గౌతమ్ కోయబోతే.. ప్యూన్ వచ్చి.. కోయొద్దని అంటాడు. మీ ఎండీ గారి కాబిన్ ఎక్కడుంది అని గౌతమ్ అడిగేస్తాడు. మీరు కాలేజ్‌లో జాయిన్ అవుతున్నారా? ఏంటి.. క్లాసులు చెబుతారా? అని ఫ్యూన్ అడుగుతాడు. మీ ఎండీ జాబ్ ఇస్తే చేస్తాను.. రిషి సర్ మీలో ఎలా ఉంటాడు.. ఫ్రెండ్లీగానా? కోపంగానా?.. అని గౌతమ్ అడుగుతాడు. చాలా బాగుంటారు.. అని ప్యూన్ చెబుతాడు.

    అక్కడ సీన్ ఓపెన్ చేస్తే జగతి మేడం కాబిన్‌లో సీన్ ఓపెన్ అవుతుంది. వసు.. రిషి సర్ రమ్మన్నాకా? వెళ్లకపోతే బాగుండదు కదా?..జగతి అంటుంది. ఇప్పుడెల్లి మాటలు పడాల్సిన అవసరం లేదు.. తిట్టడానికి ఆయన సిద్దపడి పిలిచినప్పుడు.. గొడవపడటానికి మనం సిద్దంగా ఉంటే తప్పేంటి.. అని వసు బధులిస్తుంది. నేను కూడా వస్తాను అని జగతి అంటే.. నువ్ వెళ్తే ఇంకో మాట ఎక్కువ అంటాడు.. అసలే వాళ్ల పెద్దమ్మ ఇంకో నాలుగు మాటలు నూరిపోస్తోంది.. అని మహేంద్ర వద్దని చెబుతాడు. ఏది ఏమైనా సరే రిషి సర్‌కి నిజం చెప్పే వస్తాను.. ప్రతీ దానికి ఎక్కువగా ఆలోచిస్తే మనం ఏ పనులు చేయలేం.. నేను వెళ్తున్నాను అంతే..అని వసు తెగేసి చెబుతుంది.

    ఇక రిషి కేబిన్ వద్ద గౌతమ్ పిల్ల చేష్టలు చేస్తాడు. దెయ్యం బొమ్మ పెట్టుకుని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. రేయ్ గౌతమ్.. వస్తావా? రమ్మంటావా? నేను వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా? అని రిషి అంటాడు. వద్దులేరా? నేనే వస్తాను ఉండు అని గౌతమ్ వస్తాడు.. రేయ్ రిషి.. ఎలా ఉన్నావ్ రా.. ఎలా గుర్తు పట్టావ్ రా అని గౌతమ్ అంటే.. ఈ కోతి పనులు చేసేది నువ్వే కదరా? అని రిషి అంటాడు.

    యూఎస్ నుంచి ఎఫ్పుడొచ్చావ్ రా అని రిషి అంటే.. నిన్న వచ్చాను రా.. నిన్ను సర్‌ప్రైజ్ చేద్దామని ఈ రోజు వచ్చానని అంటాడు. నిన్న వస్తే.. ఈ రోజు నా దగ్గరకు వస్తావారా? అని రిషి అంటాడు. అదో పెద్ద కథ అని గౌతమ్ చెబుతూ..ఈ కాఫీ వేడిగానే ఉంది.. ఇది నాకు రాసి పెట్టి ఉంది.. ఇది నాదే.. తాగేస్తున్నా.. అని గౌతమ్ అనేస్తాడు. నువ్ ఇంకా మారలేదురా అని రిషి అంటే.. మనం మారొద్దురా.. అలానే ఉండాలని గౌతమ్ అంటాదడు.

    కాలేజ్ ఎలా ఉందిరా?.. అని రిషి అంటే.. నువ్ ఉన్నాకా? కాలేజ్ ఎలా ఉంటుందో నాకు తెలీదారా?.. ఇంత చిన్న వయసులో పెద్ద కాలేజ్‌ని నడుపుతున్నావ్ అని పొగిడేస్తాడు. ఇక్కడే ఉంటావా? అని రిషి అడిగితే.. సరదాగా కొన్ని రోజులు ఉండాలని అనుకున్నా.. కానీ ఓ యాక్సిడెంట్.. నన్ను ఉండేలా చేసేట్టు చేస్తోంది.. అని గౌతమ్ అంటాడు.

    యాక్సిడెంటా? నీకా?.. అని రిషి కంగారు పడితే.. నాకు కాదురా.. ఓ యాక్సిడెంట్ జరిగితే.. ఓ అమ్మాయి నా కారు ఆపింది.. దెబ్బలు తగిలిన పర్సన్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.. ఆ అమ్మాయి ఉంది.. అబ్బబ్బా.. మామూలుగా లేదనుకో.. అని గౌతమ్ అలా చెబుతూ పోతాడు. అడుగుపెట్టావో లేదో ఇలా అమ్మాయి కలిసిందారా? అని రిషి ఆటపట్టిస్తాడు.

    ఈ అమ్మాయి అందరిలాంటిది కాదురా.. సంథింగ్ స్పెషల్.. ముక్కూమొహం తెలీని వ్యక్తికి హెల్ప్ చేసింది. తన లుక్స్‌లో కాన్ఫిడెన్స్ ఉందిరా.. ధైర్యమున్న అమ్మాయి.. తన చిరు నవ్వు ఉందిరా.. ఆ చిరునవ్వు చూసి కవితలు కాదురా. కావ్యం రాసేయొచ్చు.. ఆ అమ్మాయి కోసమైనా నేను ఉంటానురా.. అని గౌతమ్ అంటాడు. నీ సంగతి నాకు తెలీదారా.. కొన్నాళ్లకు వదిలేసి పోతావ్.. ఈ అమ్మాయి మాత్రం సీరియస్‌.. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి.. నువ్వే హెల్ప్ చేయాలి.. అని అంటాడు. నువ్ యమజాతకుడివిరా రాసి పెట్టి ఉంటే నీకే దక్కుతుంది.. నీకు కాకపోతే ఎవరికి హెల్ప్ చేస్తాను చెప్పు.. అని రిషి అంటాడు

    అర్దగంట వరకు ఎవ్వరినీ రానివ్వకు అని వసు వచ్చేది చూసిన రిషి తన ఫ్యూన్‌కు చెబుతాడు. దీంతో వసుని ప్యూన్ ఆపేస్తాడు. ఎవ్వరినీ లోనికి రానివ్వొద్దని అన్నారు అని ప్యూన్ చెబుతాడు. ఎప్పుడు చెప్పారు..అని వసు అడిగితే.. ఇప్పుడే చెప్పారు అని అంటాడు.. కావాలనే నన్ను వెనక్కి పంపిస్తున్నారేమో.. అని వసు వెనక్కి తిరిగి వెళ్లిపోతోంది.

    ఇంకేంట్రా.. టూర్ ప్లానింగ్స్ ఏంటి.. అని రిషి అడుగుతాడు. వచ్చేటప్పుడు ఎన్నో అనుకున్నా.. అన్ని క్యాన్సిల్.. తనని పట్టుకోవాలి.. తనే ప్లానింగ్.. కలుస్తుందారా? అని గౌతమ్ అంటే.. నేనున్నా కదా? డోంట్ వర్రీ అని రిషి హామీ ఇస్తాడు. ఎక్కడుంటున్నావ్ రా అని రిషి అడిగితే.. హోటల్‌లో ఉన్నానని గౌతమ్ అంటే.. నేను ఉండగా హోటల్ ఏంటి.. రేయ్ ఫూల్.. రారా అని రిషి అంటాడు.. పెద్దమ్మకు కూడా రీసెంట్‌గా దెబ్బ తగిలింది అని చెప్పడంతో సరే వస్తాను అని గౌతమ్ అంటాడు

    మరి అమ్మాయి.. అని గౌతమ్ దీర్ఘాలు తీస్తుంటాడు. రేయ్ అని రిషి అనడం.. హెల్ప్ చేస్తావ్ నువ్.. నాకు తెలుసు.. అని గౌతమ్ కవర్ చేసేస్తాడు. కావాలనే రిషి సర్ నన్ను వెనక్కి పంపించాడంటూ వసు పొరబాటు పడుతుంది. నిజంగానే బిజీగా ఉండి ఉంటాడేమో.. అని జగతి, మహేంద్ర అంటారు. మీరు ఎప్పుడూ రిషి సర్‌ను సపోర్ట్ చేస్తారు అని వసు అంటుంది.

    నేను అలా ఆలోచించలేను.. నిజాన్ని నిర్భయంగా చర్చించాలి అని వసు అంటుంది.. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించు.. రిషికి అర్థమయ్యేలా చెప్పు అని మహేంద్రను జగతి అడుగుతుంది. ఈ విషయాలను రిషికి నువ్వే చెప్పు వసు.. ఈ సారి కరెక్ట్‌గా చెప్పు.. నువ్ చెబితే వింటాడు అని మహేంద్ర అంటాడు. నేను నీకు చెబితే.. నువ్ వసుకి చెబుతున్నావ్ ఏంటి.. ఇద్దరికి ఏమైనా గొడవలు జరిగితే ఎలా అని జగతి కంగారు పడుతుంది.

    అయినా దేవయాణి అక్కయ్య గురించి అన్నీ చెప్పడం మంచిది కాదు అని జగతి అంటే.. ఏంటి మేడం ఎన్నాళ్లు దాస్తారు.. అని వసు, నిజనిజాలు ఎన్నేళ్లు దాస్తావ్ అని మహేంద్ర అంటారు.. మనం మంచివాళ్లం.. ఎదుటి వాళ్లం చెడ్డవాళ్లమని చెప్పడం తప్పు అని జగతి అంటుంది.. రిషి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు నువ్ చెప్పు మహేంద్ర అని జగతి అంటాడు.. సరే ప్రయత్నిస్తాను అని మహేంద్ర అంటాడు. పద వసు మనం వెళ్దామని జగతి అంటే.. లైబ్రరీలో పని ఉంది.. మీరు వెళ్లండి.. నేను తరువాత వస్తాను అని వసు అంటుంది.

    అక్కడ సీన్ కట్ చేస్తే.. రిషి, గౌతమ్‌లు కారులో వెళ్తుంటారు. ఆ అమ్మాయి కనిపించినప్పటి నుంచి ఏదోలా ఉంది.. అన్నం తినిపించాలని అనిపించడం లేదు.. ఏదోలా ఉందిరా.. అని గౌతమ్ అంటే.. డాక్టర్‌కి చూపించుకోరా ఏం రోగమో ఏమో అని రిషి కౌంటర్ వేస్తాడు. ఇది రోగమే కానీ.. బాడీకి కాదు.. గుండెకు.. చప్పుడు కూడా మారిందిరా అని అంటాడు గౌతమ్..

    ఆ అమ్మాయి కనిపిస్తుందారా? అని గౌతమ్ మళ్లీ అడుగుతాడు. చెప్పాను కదరా.. మనస్పూర్తిగా కోరుకో.. రాసి పెట్టి ఉంటే కలుస్తుందిరా అని రిషి అంటాడు. సినిమాల్లో జరుగుతాయ్.. నిజ జీవితంలో సాధ్యమారా? ఆ అమ్మాయిని ఎలా కలవాలిరా అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు.. కలవాలని రాసి ఉంటే.. నువ్ పాతాళంలో ఉన్నా సరే వెతుక్కుంటూ వస్తుంది.. అని రిషి అంటాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో వసు, గౌతమ్, రిషి కలిసి ఒకే కారులో వెళ్తారు. వాడు రమ్మనడంతో రావాలా? రాను అని చెప్పొచ్చు కదా? అని రిషి తన మనసులో వసు గురించి అనుకుంటాడు. మీ పేరు ఏంటి? అని గౌతమ్ అడగడం.. వసుధార అని రిషి చెప్పడం.. నీకు ఎలా తెలుసు? అని గౌతమ్ అడిగితే.. తను నా స్టూడెంట్ అని రిషి బదులిస్తాడు. కాలేజ్ పెట్టి మంచి పని చేశావ్ రా అని గౌతమ్ అంటాడు. నాకు మనసులో ఏమనిపిస్తే అదే చెబుతాను అని గౌతమ్ అంటే.. అదే మంచిది.. కొంత మంది ఉంటారు.. మనసులో ఏదో అనుకుంటారు.. ఏదేదో ఊహించుకుంటారు అని రిషి గురించి వసు పరోక్షంగా కౌంటర్లు వేస్తుంది. మొత్తానికి ఈ దెబ్బకు రిషి ఓపెన్ అయ్యేట్టు కనిపిప్తోంది.

    Leave a Reply