• December 14, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. ఇటు ఫ్రెండ్ అటు లవ్.. మధ్యలో రిషి బలి

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. ఇటు ఫ్రెండ్ అటు లవ్.. మధ్యలో రిషి బలి

    గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ అంటే మంగళవారం జరిగే ధారావాహిక అంటే.. Guppedantha Manasu Episode 320 మంచి సీన్లు పడ్డాయి. వసు రిషి మధ్యలో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. గౌతమ్ అనే పాత్రతో కథ మలుపు తిరగబోతోంది. గౌతమ్ మళ్లీ ఎవరో కాదు. రిషి క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు తెలుస్తోంది. ఇక వసుని ప్రేమిస్తున్న విషయం కూడా రిషికి గౌతమ్ చెప్పేస్తాడు. మొత్తానికి గౌతమ్ రాకతో.. వసుల మధ్య దూరం పెరిగుతుందా? తగ్గుతుందా? అన్నది చూడాలి. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

    వసు ఇంకా రాకపోవడంతో జగతి కంగారు పడుతుంది. ఎక్కడున్నావ్ వసు అంటూ ఫోన్ చేసి అడుగుతుంది జగతి. ఆటో కోసం ఎదురుచూస్తున్నాను వస్తున్నాను మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వసు. ఇంతలో ఓ పెద్దాయన్ను కారు గుద్దేసి వెళ్లిపోతోంది. బాబాయ్ బాబాయ్ అంటూ అతడిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఆ కారును ఆపేందుకు వసు ప్రయత్నిస్తుంది.

    అందులో గౌతమ్ ఉంటాడు. వసు ఆందోళన, బాధను చూసి ఆమె బాబాయ్ అని అనుకుని కారులో హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అలా సీన్ అక్కడి నుంచి రిషి మీదకు వెళ్తుంది. నా సంగతి మీకు తెలీదు మేడం అంటూ వసు అన్న మాటలను రిషి తలుచుకుంటాడు. చేసిందంతా చేసి కనీసం సారీ కూడా చెప్పలేదుఅని లోలోపల అనుకుంటాడు రిషి..

    నేను అత్తయ్య గారి దగ్గర ఉంటాను.. నేను చూసుకుంటానులే.. నువ్వెళ్లు రిషి.. అని ధరిణి చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటే చెప్పు అని రిషి అంటాడు.. నేను చెబుతాను రిషి నువ్వెళ్లు అని ధరణి అంటుంది.. అలా బిహేవ్ చేస్తే ఎలా.. పెద్ద చిన్నా తేడా లేకుండా అలా చేస్తే ఎలా.. అదృష్టవశాత్తు ఎలాంటి ఫ్రాక్ఛర్ కాలేదు.. పెద్దమ్మను మనం జాగ్రత్తగా చూసుకుందాం.. అని రిషి అంటాడు. నేను చూసుకుంటాను రిషి.. ఏం జరిగిందో గానీ అత్తయ్య గారు కాస్త ఎక్కువే చేస్తున్నారు అని ధరణి లోలోపల అనుకుంటుంది.. ఈ పొగరు కనీసం సారీ కూడా చెప్పలేదు.. అని వసు గురించి రిషి మనసులో అనుకుంటాడు.

    ఇక ఆ పెద్దాయన్ను హాస్పిటల్‌లో చేరుస్తారు. డీటేల్స్ రాసి సంతకం పెట్టండని అంటే.. ఆయన ఎవరో నాకు తెలీదు.. ఆమె బాబాయ్ అని గౌతమ్ అనేస్తాడు. నాక్కూడా ఆయన ఎవరో తెలీదు అనడంతే గౌతమ్‌కు అసలు విషయం తెలుస్తుంది. ఆయన ఎవ్వరో తెలియదని, తెలియన మనిషి కోసం ఇంత ఆరాటపడిందా? అని గౌతమ్ ఫిదా అవుతాడు. వసు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మొత్తానికి వసుతో గౌతమ్ ప్రేమలో పడ్డట్టు కనిపిస్తోంది.

    గౌతమ్ తన పేరు చెప్పుకుని పరిచయం చేసుకున్నా కూడా.. వసు మాత్రం తన గురించి ఏమీ చెప్పదు. షేక్ హ్యాండ్ ఇస్తున్నా కూడా.. సింపుల్‌గా నమస్కారం పెట్టేస్తుంది. ఆయన ఎవరో మీకు తెలీదా? వావ్ మీరు నిజంగా గ్రేట్.. సాటి మనిషి కోసం ఇంత చేస్తున్నారంటే అని గౌతమ్ పొగిడేస్తుంటాడు. సాటి మనుషులం కదా? ఈమాత్రం చేయకపోతే ఎలా? అని వసు అంటుంది..

    మీలాంటి వాళ్లు నాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది.. నా పేరు గౌతమ్.. అని వసు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ వసు మాత్రం ఆ చాన్స్ ఇవ్వదు. పేషెంట్ సేఫ్ అని తెలిశాక వెళ్తే అదో ఆనందం కదా అండి అని వసు అంటే.. నేనూ అందుకే ఉన్నాను అని గౌతమ్ అనేస్తాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని గౌతమ్ అంటే.. వద్దని వెళ్లిపోతుంది వసు. అలా వెళ్తూ ఒక్క చిరు నవ్వు నవ్వి బాయ్ చెబుతుంది.

    నా పేరు చెప్పినప్పుడు తన పేరు కూడా చెప్పొచ్చు కదా?. నవ్వా అది పూల సునామీ వచ్చిపడ్డట్టుంది. వెన్నెల వర్షం కురిసినట్టు.. అందం, హెల్పింగ్ నేచర్.. ఆ భాష, ఆ మాటతీరు.. కల్చర్.. అసలు తను మనిషేనా.. దేవకన్యలా ఉంది.. అంతే.. అంటూ గౌతమ్ గాల్లో తేలిపోతాడు. ఇక ఇంటికి చేరుకున్న వసు.. రిషి ఆలోచనల్లో మునిగి తేలుతుంది.

    కోపం తగ్గి.. మెసెజ్ ఫోన్ చేస్తారని అనుకున్నాను.. కానీ జరిగిందాంట్లో నా తప్పేమీ లేదు.. దేవయాణి మేడం ఎందుకంత నటించింది.. రిషి సర్ అన్నింట్లో తెలివిగానే ఉంటారు.. కానీ పెద్దమ్మ విషయంలో మాత్రం ఇలా ఆలోచిస్తుంటారు.. అని వసు ఆలోచనలతో సతమతమవుతుంటే.. జగతి వస్తుంది. రిషి సర్ ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు అని వసు అంటుంది. నాకు మహేంద్ర ఫోన్ చేశాడు.. ఇప్పుడు బాగానే ఉందంట అని జగతి చెబుతుంది.

    ఎందుకంత రాద్దాతం చేయాలి.. ఎందుకంత సీన్ చేయాలి.. అని వసు ప్రశ్నిస్తుంది. అందరూ నీలా ఉండరు కదా?. ధరణి కూడా అలానే ఉంది.. రిషి కోసం ఓపిగ్గా ఉండాలి అని జగతి అంటుంది.. తప్పు మన వైపు లేకపోయినా కూడా ఎందుకు అలా ఉండాలి మేడం.. మన మౌనం దేవయాణి మేడంకు తెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తారు.. దేవయాణి గురించి నిజం చెప్పేందుకు ఇది మంచి సమయం.. రిషి సర్‌కు నిజం తెలిపిన వాళ్లం అవుతాం.. ఏంటి మేడం అలా చూస్తున్నారు అని వసు అంటుంది

    మంచివాళ్లు అని నిరూపించడం ఈజీనే కానీ.. మంచివారిగా నటించే వారి నిజ స్వరూపాలను అంత ఈజీగా బయటపెట్టలేం అని జగతి అంటుంది.. నాకు ఆంక్షలు పెట్టకండి.. రిషి సర్‌కు ఎలా చెప్పాలో నాకు తెలుసు.. మేడం సారీ.. ఈ విషయంలో నాకేం చెప్పకండి.. రిషి సర్ ఫోన్, మెసెజ్ చేస్తాడని ఎదురుచూస్తున్నాను.. అని వసు అంటుంది.

    గుడ్ నైట్ అని జగతి చెప్పి వెళ్లబోతోంటే.. గుడ్ నైట్ కాదు.. రిషి సర్ వల్ల బ్యాడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది వసు. వసు చూడక ముందు ఆమె ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది జగతి.. వసు మొండిదనం నాకు తెలుసు.. ఫోన్ చేసినా చేస్తుంది.. ఇద్దరూ డిస్టర్బ్ అవుతారు.. సారీ వసుధార.. ఫోన్ స్విచ్చాప్ చేస్తున్నాను అని పక్కన పడేస్తుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.

    ఇక రేపటి ఎపిసోడ్‌లో రిషి క్లోజ్ ఫ్రెండ్ గౌతమ్ అని తెలుస్తుంది. ఓ అమ్మాయిని చూశాను.. ఆమెను వెతికి పెట్టాల్సింది నువ్వేనని రిషిపైనే గౌతమ్ భారం వేస్తాడు. ఆ అమ్మాయి నీకే అని రాసి పెట్టి ఉంటే కలుస్తుందిలే అని రిషి అంటాడు. ఇక రోడ్డు మీద వసుని చూసిన గౌతమ్ కారు ఆపమంటాడు. గౌతమ్ వెంట రిషి కూడా ఉంటాడు. గౌతమ్ చెప్పింది వసు గురించేనా? అని రిషి కంగారుపడతాడు. దీంతో అసలు కథ రేపటి నుంచి మొదలుకాబోతోందన్న మాట.

    Leave a Reply