- December 4, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. వసు రిషిల అన్యోన్యత.. ఓర్వలేకపోతోన్న దేవయాణి

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే శనివారం నాడు జరగబోయే ధారావాహిక అంటే.. Guppedantha Manasu Episode 312 ఎపిసోడ్ అంతా కూడా వన భోజనాల చుట్టే తిరుగుతుంది. మంత్రి ఏర్పాటు చేసిన వన భోజనాల కార్యక్రమంలో ఫణేంద్ర భూషన్ ఫ్యామిలీ, జగతి, వసు ఇలా అందరూ వస్తారు. ఇక రిషి, వసులు కాస్త ఆలస్యంగా జాయిన్ అవుతారు. దేవయాణి మాత్రం రిషి, వసుల మీద ఓ కన్నేసి ఉంచుతుంది. అలా గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ఎలా కొనసాగిందంటే..
వన భోజనాల వద్ద రిషి, వసు దిగుతారు. అలా దిగిన వెంటనే వసు తన పురాణాన్ని ఎత్తుకుంటుంది. పల్లెటూరి గొప్పదనం చెబుతూ ఉంటుంది. సిటీ నుంచి పల్లెటూరు వచ్చే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి సర్.. సిటీలో సహజత్వం తక్కువ.. పల్లెటూరిలో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది.. మనసుకు రెక్కలు వస్తాయ్.. మన ఆలోచనలు, మనసులో ఏదో కొత్తదనం కనిపిస్తుంది కదా? ఈ గాలి, పరిమళం, ప్రకృతి అంటూ లొడలొడ వాగేస్తుంటుంది వసు.
వసు నోటికి అడ్డుకట్ట వేసేట్టుగా.. ఇక్కడే కూర్చుందామా? అని రిషి సెటైర్ వేస్తాడు.. ఎందుకు సర్ అని అమాయకంగా వసు అడిగేస్తుంది. ఏదో కవిత్వం చెబుతున్నావ్ కదా?. ఇక్కడే కూర్చుందామా?. ఒక్క మాటలో చెబుతుంటే అర్థమవుతుంది.. మూడు కలిపి చెబితావ్.. ఇలా అన్నాను అని ఫీల్ అవ్వకు అంటూ వసు మళ్లీ బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు రిషి.. మీరు వద్దన్నా కూడా నేను చెబుతూనే ఉంటాను సర్ అని వసు మళ్లీ యథావిథిగా వాగేస్తుంటుంది
షూ తీయండి సర్ అని వసు అంటే.. ఎందుకు మనమేమీ గుడికి వెళ్లడం లేదు కదా? అని రిషి ప్రశ్నిస్తాడు.. షూ తీయండి సర్ చెబుతాను అని వసు అంటుంది.. ప్యాంట్ కొంచెం మీదకు మడుచుకోండి.. అని మళ్లీ అంటుంది. వింటున్నాను కదా? అని ఏది పడితే అది చెబుతున్నావ్ అని రిషి అంటాడు.. షూ చేతిలో పట్టుకుని నడువండి సర్ .. అలా నడిస్తే మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుందని వసు అంటుంది.
దీంతో థ్యాంక్స్ అని రిషి అంటాడు. ఎందుకు సర్ అని వసు అడిగితే.. పాదాల్లో నరాలు ఉత్తేజితమవుతాయి అని ఏదో ఒకటి చెప్పలేదు కదా? అందుకే థ్యాంక్స్ అని రిషి మరో సెటైర్ వేస్తాడు. చెబుదామని అనుకున్నాను.. సర్ అంత లోపు మీరే చెప్పేశారు.. అంటూ వసు మళ్లీ మొదలుపెట్టేందుకు రెడీ అయింది. ఇక నువ్ వన భోజనానికి వెళ్లు.. నేను ఇంటికెళ్లి భోజనం చేస్తాను అని రిషి కౌంటర్ వేస్తాడు.
ప్రతీదానికి ఇలా మాట్లాడుతావ్ ఏంటి.. ప్రతీదానికి శాస్త్రియత నిరూపించాలని అనుకుంటావ్.. ఇప్పుడు ఇలా నడిస్తే.. ఆ స్పర్శ వేరని అంటావ్.. నీ ఫీలింగ్ నాకు అర్థమైంది..పద వెళ్దామని చేతిలో షూస్ పట్టుకుని అలా నడుస్తుంటారు. వన భోజనాలు అంటే ప్రకృతికి దగ్గరగా బతకడం.. పరుగులు తీసే మనిషి ఇలా కలిసి భోజనం చేయడమే.. కార్తీక భోజనాలు పరమార్థం.. మనిషి ఎప్పుడూ ప్రకృతితో మమేకమై ఉండాలి.. అంటూ వసు మళ్లీ పురాణం మొదలుపెడుతుంది.
చెప్పు ఇంకా వింటున్నాను కదా? అని రిషి కౌంటర్ వేస్తాడు.. మీరు తిడతారని చెప్పడం లేదు అని వసు అంటుంది. ఇలాంటి డిస్కౌంట్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతాడు రిషి. ఆగండి సర్ అని వసు అంటే.. మళ్లీ ఇక్కడి నుంచి మోకాళ్ల మీద నడవాలా?.. అని రిషి కౌంటర్ వేస్తాడు. అలా నేను ఎందుకు చెబుతాను సర్.. మనం ఇలా నడిస్తే అందరూ వింతగా చూస్తారు.. వాళ్లకు మన ఆలోచనలు అర్థం కావు కదా?.. వాళ్లు ఏమైనా అనుకుంటారు.. అని వసు అంటుంది
ఇక లోపలకి వెళ్లాక జగతి మేడం అందరితో కలిసి పని చేయడాన్ని రిషి చూస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తావా? అని వసుని రిషి అడుగుతాడు. అలా జగతి దగ్గరికి వసు వెళ్తుంది. మహేంద్ర, ఫణీంద్ర భూషణ్ దగ్గరికి రిషి వెళ్తాడు. రిషి ఇలా రావడం మొదటి సారి కదా? అని ఫణీంద్ర అంటాడు. అవును పెదనాన్న అని రిషి బధులిస్తాడు. స్టూడెంట్స్‌తో వన భోజనాలు ప్లాన్ చేద్దామని ఫణీంద్ర అంటే.. చూద్దాం పెదనాన్న అంటాడు రిషి. అలా చూసి వస్తాను అంటూ రిషి లేచి వెళ్లిపోతాడు. మహేంద్ర సైతం అక్కడి నుంచి వచ్చి వసు, జగతిలతో ముచ్చట్లు పెడుతుంటాడు.
దేవయాణి కంటపడటంతో అక్కడి నుంచి మహేంద్ర తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అంతా సవ్యంగానే ఉందా? వసు.. అని మహేంద్ర అడుగుతాడు. ఓకే సర్ అని వసు అంటుంది.. మహేంద్ర సర్.. మీ వదిన గారు మనల్నే గమనిస్తున్నారు.. అంటూ జగతి చెప్పడంతో మహేంద్ర మాటలు మారుస్తాడు. ఈ మిషన్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఆలోచించాలి.. అని ఏదేదో వింతగా మాట్లాడుతూ ఉంటాడు.
ఏంటి సర్.. సడెన్‌గా మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు.. అని వసు అనడంతో.. మా వదిన గారు నన్ను చూస్తున్నారట.. అందుకే ఏదో ఒకటి మాట్లాడుతున్నాను.. కాస్త హెల్ప్ చేయవా?. సమిష్టి కృషి ఉంటేనే.. అని ఇలా ఏదేదో వసుతో మాట్లాడతాడు మహేంద్ర. అలా మొత్తానికి అక్కడి నుంచి వసు వెళ్లిపోతుంది.. మహేంద్ర కూడా వెళ్లిపోతాడు.
ఎప్పుడొచ్చావ్ రిషి అని దేవయాణి అడుగుతుంది. ఇందాకే వచ్చామని రిషి బదులిస్తాడు. వచ్చాం అని అంటున్నావ్.. నీతో పాటు ఎవరు వచ్చారు రిషి అని అడుగుతంది. వసుధార వచ్చింది. మేం ఇద్దరం కలిసి అలా ప్రాజెక్ట్ కోసం వెళ్లి వచ్చామని రిషి అంటాడు. అంతలోపు పుష్ప కూడా అక్కడికి వస్తుంది. పుష్ప, వసు కలిసి రిషి వద్దకు వస్తారు. పుష్ప.. నువ్వెంటి ఇక్కడ? అని రిషి అడిగితే.. తోడుగా ఉంటుందని రమ్మన్నాను సర్ అని వసు అంటుంది.
వసుధార నువ్ రా అని రిషి పిలవడంతో.. అలా రిషి, వసు, పుష్ప వెళ్లిపోతారు.. బాడీ గార్డులా నా వెనకాల నిల్చున్నావ్.. ఏంటి.. నా పక్కనుంటే.. ఎవరిని చూస్తున్నావ్ ఏం చేస్తున్నావో నాకెలా తెలుస్తుంది.. నా ముందుంటే నీ మొహమైనా చూస్తాను.. నా వెనకాల ఉంటే గుడ్లగూబలా వెనక్కి తిరిగి చూడాలా?.. వెళ్లు.. వాళ్లేం మాట్లాడుకుంటారో విను అంటూ ధరణిని పంపిస్తుంది దేవయాణి.
అలా ఓ చెట్టు దగ్గరకు వచ్చే సరికి ధరణికి తన చిన్ననాటి మెమోరీస్ గుర్తుకు వస్తాయి. ఈ చెట్టు బాగుంది కదా? అని ధరణి అంటే.. చెట్టు బాగుండటం ఏంటి వదినా? అని రిషి అంటాడు. ఇలాంటి చెట్లకు ఊయల కట్టి ఆడుకునే వాళ్లమని ధరణి అంటే.. మేం కూడా ఆడుకునే వాళ్లమని వసు అంటుంది. ఇప్పుడు చెట్టుకు ఊయలా? కడతారా? ఏంటి? అని రిషి అంటాడు.
అలా చెట్టు ఎక్కి ఊయల కట్టేందుకు వసు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రిషి ఒళ్లో వచ్చి వసు పడుతుంది. పడిపోతోంటే పట్టుకోవచ్చు కదా? సర్ అని వసు అంటుంది. నువ్ పడిపోతుంటే పట్టుకోవడమే? నా పార్ట్ పని అనుకుంటున్నావా? అంటూ రిషి అంటాడు. నువ్ నా మీద పడే సరికి బ్యాలెన్స్ తప్పి నేను కూడా పడ్డాను అని అంటాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ ముగుస్తుంది. వచ్చే వారంలో రిషి, వసులు మరింత క్లోజ్‌గా ఉండటాన్ని దేవయాణి చూసి సహించలేకపోతోంది. ఆటోలోంచి దిగడం, వారిద్దరూ కలిసి అలా రావడంపై దేవయాణికి ఒళ్లు మండుతుంది.