- December 3, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. మామిడితోటలో రొమాంటిక్ సీన్.. రిషి ఒళ్లోపడ్డ వసు

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే శుక్రవారం నాడు అంటే Guppedantha Manasu Episode 311లో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం. పిల్లలతో పాటు వసు గోలీలు ఆడటం, రిషి చేత కూడా ఆడించడంతో సగానికి పైగా ఈ సీన్లే ఉంటాయి. ఇక వన భోజనాల్లో జగతి, దేవయాణిల పంతం, ఆధిపత్యం, వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరుగుతుంది. జగతి, మహేంద్రల రొమాన్స్ దేవయాణి తట్టుకోలేకపోతుంది. అలా మొత్తానికి గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
కిర్రుగాడు తొండి చేసి ఆడాడంటూ బంటీగాడికి వసు అండగా నిలిచింది. కిర్రు గాడితో కలిసి గోలీలాట ఆడింది వసు. ఆ ఆటలో వసు మొదటగా ఓడింది. కానీ తరువాత అన్నీ గెలిచేసింది. చివరి ఆటను రిషి చేత ఆడించింది. రిషి కూడా గురి చూసి కొట్టేశాడు. అలా చివరి ఆట కూడా గెలిచారు. దీంతో కిర్రుగాడి జేబు ఖాళీ అయింది. దీంతో కాస్త హర్ట్ అయ్యాడు.
బంటిగాడిని దగ్గరుకు తీసుకుంది.. నాలుగు మంచి మాటలు చెప్పింది. ఎవరు గెలిచినా సరే కలిసే ఉండాలి.. కలిసి మెలిసి ఆడుకోవాలి అని అంది. ఇక బంటీ గాడు వసుకు కొన్ని గోలీలు ఇచ్చాడు.. నన్ను గెలిపించినందుకు ఇవి మీకు అని ఇచ్చేశాడు… అనుకోకుండా పిల్లలు కనిపించడం.. ఆడుకోవడం బాగుంది కదా? సర్ అని వసు అంటుంది.. నువ్ బాగానే కలిసిపోయావ్ కదా? అని రిషి సెటైర్ వేశాడు..
నేను ఇలానే ఉంటాను.. అలా ఉంటాను అని అనుకుంటారు కదా? అలా అనుకోకూడదు.. అని వసు అంటుంది. ఇప్పుడు ఈ మాటలు నాకు ఎందుకు చెబుతున్నావ్ అని రిషి అంటాడు. అందరితో ఇట్టే కలిసిపోతుంది.. అయినా కూడా తన సహజత్వాన్ని కోల్పోదు అని వసు గురించి రిషి మనసులో అనుకుంటాడు. ఇందులో సగం మీకు సగం నాకు.. ఆ బంటీ వచ్చి నాకు గోలీలు ఇచ్చినప్పుడు వాడి కళ్లలో ఆనందం చూశాను అని వసు అంటుంది
నువ్ ప్రతీదాంట్లో సంతోషం వెతుక్కుంటావా? అని వసుని రిషి అంటాడు. వెతుక్కోను సర్. తీసుకునే ప్రయత్నం చేస్తాను అని వసు అంటుంది.. మన లొకేషన్ దగ్గర్లోనే ఉంది . అది చూసుకుని వన భోజనాలకు వెళ్దామని రిషి అంటాడు. ఆ తరువాత వన భోజనాల్లో సీన్ ఓపెన్ అవుతుంది. మహేంద్ర ఫ్యామిలీ వస్తుంది. అప్పటికే జగతి వచ్చేసి ఉంటుంది.
మంత్రి గారి భార్య ఎదురెళ్లి మరీ మహేంద్ర ఫ్యామిలీని స్వాగతిస్తుంది. ఫ్యామిలీ వరకు మాత్రమే చేసుకుంటున్నాం.. మీరే మాకు ముఖ్య అతిథులు అని దేవయాణితో మంత్రి భార్య అంటుంది. మీరు మంత్రి భార్య అయినా కూడా ఎంతో సింపుల్‌గా ఉన్నారు అని దేవయాణి కూడా మంత్రి భార్యను పొగుడుతుంది. జగతి మేడం మీ కంటే ముందు వచ్చారు.. వారితో మాట్లాడూతు ఉండండిని చెబుతుంది. నాకు దేవయాణి మేడం ఫ్యామిలీ చాలా క్లోజ్ అని జగతి అంటుంది.
ఇక జగతి, దేవయాణిల మధ్య మాటల యుద్దం ప్రారంభం అవుతుంది. ఎక్కడికెళ్తే అక్కడకి దూరుతున్నావ్.. ఆహ్వానం ఉందా? లేదా? అని జగతిపై దేవయాణి సెటైర్లు వేస్తుంది.. మీరు వస్తే నాకు ఆనందంగా అనిపించింది కానీ.. నేను వస్తే మీకు కోపం వచ్చింది.. అంటే మీదే ప్రాబ్లం అని ఓ థియరినీ చెప్పింది జగతి.. అడవిలో అన్ని రకాల జంతువులుంటాయని ఓ కథను చెప్పుకొచ్చింది..
అడవిలో సింహాలు, పులులు.. గుంటనక్కలు అమాయకమైన కుందేళ్లు కూడా ఉంటాయి.. ఈ అడవి నాది అని ఏ జంతువు అనుకోదు.. కానీ మనిషి మాత్రమే అనుకుంటాడు.. ఎంత ఘోరమో కదా? అని జగతి అంటుంది. లెక్చరర్ కదా? మాటలు ఎన్నైనా చెబుతావ్. నేను ఒక్కటి చెబుతాను విను.. ఎప్పుడైనా సింహాలు, పులుల నుంచి జింకలు తప్పించుకోలేవు అని దేవయాణి అంటుంది..
మీది బలం, నాది సహనం.. ఎవరు గెలుస్తారో చూద్దాం అని జగతి అంటుంది. కూర్చోండి అని జగతి అంటే.. నువ్ చెప్పాలా? మాకు తెలుసంటూ దేవయాణి తన పొగరును చూపిస్తుంది. రిషి గారి పెద్దమ్మ.. తాగడానికి ఏమైనా తీసుకురండి అని జగతి చెబుతుంది. ఏంటి నీ పెత్తనం అని దేవయాణి అంటుంది.. ప్రేమలో కూడా మీకు పెత్తనం కనిపిస్తే నేనేం చేయగలను అని జగతి అంటుంది.. మీ శిష్యురాలు రాలేదా? అని దేవయాణి అడుగుతుంది. గురువున్న చోట శిష్యురాలు ఉండకుండా ఎలా ఉంటుంది వస్తోంది.. దారిలో ఉన్నట్టుంది అని జగతి అంటుంది జగతి.
ఇక జగతి అబ్బా ఎక్కడికెళ్లినా వీరు మాత్రం మారరు..అని జగతి, మహేంద్రల సైగలు చూసి విసుక్కుంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో వన భోజనాల కార్యక్రమంలో చెట్లు ఎక్కే ప్రయత్నం చేస్తుంది వసు. ఉయ్యాల కడతానంటూ వసు ఎక్కడం.. జారి కింద పడిపోతూ.. రిషి ఒళ్లో పడుతుంది. ఇక రొమాంటిక్ సీన్ మంచిగా పండుతుంది.