• December 1, 2021

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. వసు మీదున్నది అదే.. దేవయాణికి రిషి క్లారిటీ

Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. వసు మీదున్నది అదే.. దేవయాణికి రిషి క్లారిటీ

    గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే.. బుధవారం నాడు అంటే.. Guppedantha Manasu Episode 309లో వసు మీద ఉన్నదేంటి? అని రిషి తనలో తాను ఆలోచిస్తాడు. మథన పడతాడు. దేవయాణి పేరు చెప్పి మహేంద్ర అడిగిన ప్రశ్నలకు తాను చెప్పిన సమాధానాలకు రిషి ఆలోచనలో పడతాడు. మొత్తానికి రిషికి మాత్రం ఓ క్లారిటీ వచ్చేలా ఉంది.

    రిషి గురించి దేవయాణి ఆలోచనలపై మహేంద్ర బాధపడుతుంటాడు. రిషి నవ్విన రోజే నాకు పండుగ అంటూ దేవయాణితో మహేంద్ర అంటాడు.. వాడు ఆనందంగా ఉండటం కూడా.. వదినకు నచ్చడం లేదు.. అని మహేంద్ర ఫీల్ అవుతాడు. త్వరలోనే తెలుసుకుంటాడు లేండి మావయ్య గారు.. ఆ ఇద్దరూ దగ్గర కావాలని నేను ఆలోచిస్తుంటే.. ఎక్కడ దగ్గరవుతారో అని వదిన మాత్రం భయపడుతూనే ఉంది.. అంటూ మహేంద్ర బాధపడతాడు.

    ఇక సీన్ అక్కడ కట్ చేస్తే టైర్ పంక్చర్ అవ్వడం రిషి రిపేర్ చేసే సీన్ ఓపెన్ అవుతుంది. అలా రిషి టైర్ పంక్చర్ చేస్తుంటే మీకు ఈ పనులు కూడా వచ్చా?.. సర్ అని వసు అంటుంది. అవును వచ్చు.. కాలేజ్ అయ్యాక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తాను అని రిషి కౌంటర్ వేస్తాడు.. ఏంటి సర్ అలా వెటకారంగా అంటారు.. అని వసు ఫీలవుతుంది. కారు ఉన్న వాళ్లకు ఇలాంటి మినిమం పనులు తెలుస్తాయి. అని తన పని తాను చేసుకుంటాడు రిషి.

    చిన్న హెల్ప్ చేస్తావా?.. ఆ టైర్ ఇటివ్వు అని వసుని అడుగుతాడు రిషి. ఆ టైర్ ఇచ్చిన వసు.. సర్ మీరు చిన్నప్పుడు టైర్ ఆట ఆడారా? అని అడుగుతుంది. టైర్ ఆట ఏంటి.. అని రిషి అడుగుతాడు. టైర్‌ను కర్రతో కొట్టుకుంటూ వెళ్లడం సర్ అని చెబుతుంది. ఆడలేదు అని రిషి అంటాడు.. దీంతో రిషి టైర్ ఆట ఆడినట్టు ఊహల్లోకి వెళ్లుంది వసు.. రిషిని తలుచుకుని వసు నవ్వేసింది.. ఏంటి అలా నవ్వావ్ అని అడిగితే కూడా చెప్పదు. ఇక ఆ తరువాత రిషి కూడా వసుని అలా ఊహించుకుంటాడు. టైర్ ఆట ఆడిన వసుని రిషి ఊహించుకుంటాడు.

    వసు వాటర్ తాగుతుంది. రిషి చూసి సైలెంట్‌గా ఉంటాడు. వాటర్ కావాలా? సర్.. అని అడుగుతుంది. ఇక్కడ పని చేస్తున్నాను.. నాకు దాహం వేస్తుంది.. చేతులు బాగా లేవు.. కానీ నువ్ మాత్రం తాగుతున్నావ్ అని అంటాడు. దీంతో నేను తాగిస్తాను సర్ అని వసు అంటుంది.. అంత కష్టంగా తాగాల్సిన అవసరం లేదు అని రిషి వాటర్ తాగడు. ఇక టైర్ మార్చేసిన రిషికి మొహం మీద మరక అంటుతుంది.

    రిషి చేతులు కడుక్కుంటాడు. వసు తన చున్నీ ఇస్తే మాత్రం తీసుకోడు. కారులోంచి న్యాప్ కిన్ తీసుకుని తుడుచుకుంటాడు. మరక ఉందని వసు చెబుతుంది. కానీ రిషి తుడుచుకున్నా పోదు.. దీంతో వసునే తుడిచేస్తుంది.. సర్ మరక మరకపోయింది సర్ అని వసు అంటే.. సరే మనం కూడా పోదాం అని రిషి అంటాడు. ఇంటి వద్ద డ్రాప్ చేసేస్తాడు రిషి.

    ఏంటి మాట్లాడటం లేదు అని అంటే.. మీరు కదా? సర్ తగ్గించమన్నారు అని వసు అంటుంది. తగ్గించమన్నాను. కానీ మానేయమనలేదు.. అని కౌంటర్ వేస్తాడు రిషి. సాయంత్రం రెస్టారెంట్‌కు వస్తాను గుర్తు పెట్టుకో అని రిషి అంటాడు.. ఏమైనా పని ఉందా? అని రిషిని అడుగుతుంది.. అయితే రానులే అని రిషి ఫీలవుతాడు. ఏదైనా పని ఉండి అటు వస్తున్నారేమోనని అడిగాను సర్.. రండి సర్ అని వసు అంటుంది..

    వచ్చి ఏం చేయాలి.. అని రిషి అంటాడు. కాఫీ తాగి వెళ్లండి.. అని వసు అంటుంది. మరి ఇంతకు ముందు ఎందుకు వస్తున్నావ్ అని అడిగావ్ కదా? అని అన్నావ్ అంటూ రిషి కౌంటర్ వేస్తాడు. మీ మనసుకు ఏమనిపిస్తే అది చేయాలి అని వసు చెబుతుంది. అలా రిషి వెళ్లిపోతాడు. అలా రిషితో గడిపి క్షణాలను తలుచుకుంటూ వసు ఇంట్లోకి వెళ్తుంది. కానీ జగతి రెడీగా ఉంటుంది.

    రిషి సర్ డ్రాప్ చేశాడు మేడం అని వసు చెబుతంది. కారు ట్రబుల్ ఇచ్చింది అని వసు అంటే.. నీకు కారు ఎక్కడిది అని జగతి ప్రశ్నిస్తుంది. ఆ మాటకు నవ్వేసిన వసు.. నాకు కారు ఎక్కడిది.. మీ పుణ్యమా? అని మీ కొడుకు పుణ్యమా? అని కారులో తిరుగుతున్నా అని కౌంటర్ వేస్తుంది. కాలేజ్ సెలవు.. నువ్ అక్కడికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతున్నాను అని జగతి ప్రశ్నిస్తుంది. దీంతో వసుకి ఏం చెప్పాలో తెలియకుండా అలా ఉండిపోతోంది. లోపలకు వెళ్లు అని జగతి అంటుంది

    వీరి పరిచయం ఎక్కడకు వెళ్తుందో ఏమో.. మహేంద్ర ఏం చేస్తున్నాడో తెలియడం లేదు.. అంటూ జగతి లోలోపల మథన పడుతుంది. ఇక రిషి ఇంటికి రావడంతో వదిన గారు అంటూ దేవయాణికి మహేంద్ర ఇరికించే ప్రయత్నం చేస్తాడు.. రిషి వచ్చాడు.. రాత్రి ఇంటికి రాలేదని కంగారు పడుతున్నారు కదా?.. అందుకే పిలిచాను అని మహేంద్ర అంటాడు..

    రిషి ఏంటి సంగతులు.. కాలేజ్‌కి వెళ్లి ఏం చేస్తున్నావ్.. నేను అడిగాను.. వదిన కాదు.. వసు ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చిందో వదినకు తెలియదు.. ఈ ప్రశ్న కూడా వదిన అడగమన లేదు.. నీకు అంత స్పెషల్ ఏంటి.. అంత మంది స్టూడెంట్స్ ఉండగా.. శీల, పుష్ప రాలేదు.. వదిన అడగమనలేదు.. నేనే అడిగాను.. అని ఇలా ప్రతీసారి దేవయాణిని ఇరికించేశాడు మహేంద్ర.

    మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారు.. పెద్దమ్మను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో నాకు తెలుసు డాడీ.. ఏదో పెద్దమ్మ చిన్న మాట అడిగి ఉంటుంది.. పెద్దమ్మను బ్లేమ్ చేయాలని చూస్తున్నారా? పెద్దమ్మ అలా ఆలోచించరు.. పెద్దమ్మ ఆలోచనలు ఏంటో.. ప్రేమ ఏంటో నాకు తెలుసు డాడ్.. అని రిషి అంటాడు. నిజాలు ఎప్పుడు తెలుసుకుంటావ్ రిషి అని దేవయాణి మనసులో అనుకుంటుంది..

    ఈ ప్రశ్నలు ఎందుకు వేశారో తెలియదు కానీ ఇప్పుడు చెబుతున్నాను.. వసుధార స్టూడెంట్ మాత్రమే.. కాలేజ్ టాపర్.. మీరనుకున్నట్టుగా నన్ను ఎవ్వరూ ప్రభావితం చేయలేరు.. ఆమెకు లక్ష్యం ఉంది.. లక్ష్యం దిశగా ఆమె ప్రయాణం చేస్తుంది.. నాకు జీవితంలో క్లారిటీ ఉంది.. అవసరం లేని వ్యక్తుల గురించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి.. మీరు అడిగారని చెప్పాను కాబట్టి చెప్పాను.. ఇలా చెప్పడం కూడా నాకు చిరాగ్గా ఉంది.. అని రిషి వెళ్లిపోతాడు. వదిన గారు రిషి మనసులో మీ స్థానం ఎంత గొప్పగా ఉందో తెలిసింది కదా? కానీ మీరు మాత్రం ఇలా ఆలోచిస్తున్నారు..అని దేవయాణికి గడ్డి పెడతాడు మహేంద్ర.

    రిషి అలా అన్నాడేంటి? మావయ్య గారు అని ధరణి అంటుంది. రిషి నాకు అనుకూలమైన సమాధానాలు చెబుతాడుని ఇదంతా చేయలేదు. రిషి ఎప్పుడు నిజం చెప్పాడని.. వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి.. వదినకి సంతృప్తికర నిజాలు దొరుకుతాయ్ అని.. వాడిని వదిన ఇబ్బంది పెట్టకూడదని అలా చేశాను.. వాడు నా కొడుకు అమ్మా అంటూ ధరణికి వివరిస్తాడు మహేంద్ర.

    వసుధార కేవలం స్టూడెంట్ మాత్రమే.. నన్ను ఎవ్వరూ ప్రభావితం చేయలేరు అన్న మాటలను రిషి గుర్తుకు చేసుకుంటాడు.. వసుధార గురించి ఏం మాట్లాడుతున్నాను.. జస్ట్ స్టూడెంటేనా? అసలేం అనుకుంటున్నాను నేను..అసలేం చెబుతున్నాను.. ఏం చేస్తున్నాను.. ఎన్నెన్ని ప్రశ్నలు.. ఎవరు ఎవరికి సమాధానాలు చెప్పాలి.. నన్ను వసు ఎలా గౌరవిస్తుంది. ఎంత గౌరవిస్తుంది.. సీరియస్ సింహం, జెంటిల్మెన్ అంటుంది.. కానీ నేను పొగరు అంటాను.. అది నా పేరా? తనదా?.. వసుని ఇబ్బంది పెట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నాడు రిషి.

    అడ్మిషన్, ఆర్టికల్ నుంచి ఆధిపత్య, అహంకారం చూపిస్తూ వచ్చానా? ముసుగు వేశానా? ముసుగు వేస్తూ వచ్చాను.. నేను ఎవరికి అర్థం అవుతున్నాను.. నాకు నేనైనా అర్థమవుతున్నానా? అంటూ ఇలా తనలో తాను అనుకుంటూ మథనపడతాడు రిషి. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో రిషి నేరుగా జగతి ఇంటికి వెళ్లి.. వసును తీసుకెళ్తున్నాను.. ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా లొకేషన్ సర్చ్ గురించి అని ఇలా చెబుతాడు. మీ పర్మిషన్ లేకపోతే వసు కదలిట్టే కనిపించడం లేదు కదా? అని జగతికి రిషి కౌంటర్ వేస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి మరి.

    Leave a Reply