- November 29, 2021
Guppedantha Manasu : గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్.. వసుతో ఆ పని చేయించిన రిషి.. సైట్ కొడుతూ రచ్చ

గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్ అంటే.. సోమవారం (నవంబర్ 29) మంచి సీన్ జరిగింది. Guppedantha Manasu serial Episode 306 లో కాలేజ్‌లో అర్దరాత్రి ఆటలు ఆడుకున్నారు వసు, రిషి. మొత్తం ఆటలతోనే సరిపోయింది. ఎపిసోడ్ మొత్తంలో రిషి, వసులు మాత్రమే కనిపిస్తారు. ఇక చివర్లో జగతి మేడం కూడా కనిపిస్తుంది. వసు మీద కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. రాత్రి పూట ఆలస్యంగా రావడం, ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించడంపై జగతి సెటైర్లు వేసింది.
కాలేజ్‌లో రాత్రి పూట బాస్కెట్ బాల్ ఆడుతుంటాడు రిషి. వసు వల్ల ఎందుకింత ప్రభావితం అవుతున్నాను అని రిషి తనలో తాను అనుకుంటాడు.. నీకు నువ్వైనా క్లారిటీ ఇచ్చుకోవాలి అని మహేంద్ర అన్న మాటలను రిషి గుర్తుకు తెచ్చుకుంటాడు. నాకు వసునే ప్రశ్నగా మారింది.. అంటూ రిషి తనలో తాను అనుకుంటాడు. మరో వైపు ఆటోలో వసు లెక్కలేనన్ని ప్రశ్నలతో సతమతమవుతుంది.
రెస్టారెంట్‌కు ఎందుకు వచ్చారు.. శిరీష్ పెళ్లి విషయంలో ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు.. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు.. మీ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా జగతి మేడంతో కలపగలను.. నేను గురు దక్షిణి ఎలా ఇవ్వగలను అని వసు ఇలా పరివిధాలుగా తన మనసులో అనుకుంటూ ఉండగా.. మీరు చెప్పిన అడ్రస్ వచ్చిందని ఆటో వాడు అంటాడు.
తీరా చూస్తే కాలేజ్ వద్దకు వచ్చి ఆటో ఆగుతుంది. ఇక్కడకి వచ్చామేంటి.. అని వసు అడుగుతుంది. మీరు చెప్పిన అడ్రస్ ఇదే కదా? మేడం అని ఆటో వాడు అంటాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వస్తాడు.. ఏమైంది.. మేడం.. ఎందుకు వచ్చారు.. రిషి సర్ రమ్మన్నాడా? అని అడుగుతాడు. రిషి సర్ ఇక్కడ ఉన్నారా? అని వసు తిరిగి ప్రశ్నిస్తుంది. అలా లోపలకు వెళ్తుంది. అక్కడ రిషి బాస్కెట్ బాల్ ఆడుకుంటూ కనిపిస్తాడు.
అక్కడ వసుని రిషి చూడటంతో ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి ఈ టైంలో కాలేజ్‌లో అని అడిగేస్తాడు.. అనుకోకుండా వచ్చాను సర్ అని వసు చెప్పిన సమాధానానికి కౌంటర్ వేస్తాడు.. అలా కూడా వస్తారా? అని రిషి అంటాడు. మీరేంటి సర్ ఈ టైంలో అని వసు అడుగుతుంది. రావాలనిపించింది వచ్చాను అని రిషి అంటాడు.. సర్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని వసు అనబోతోంటే.. అవును ప్రమోషన్ ఇచ్చాను.. అని వసుతో రిషి అంటాడు. ప్రమోషన్ ఎందుకు అని అడుగుతావ్ ఏంటి.. తీసేస్తే అడగాలి కానీ అంటూ రిషి అనేస్తాడు. రిషి సర్ ఎప్పుడేం చేస్తాడో తెలీదు అని లోలోపల అనుకుంటుంది వసు..
మా డాడీకి ఎందుకు కాల్ చేశావ్.. పర్సనల్ అయితే చెప్పొద్దులే.. జగతి మేడం ఏమైనా చెప్పమందా? పర్సనల్ అయితే వద్దులే అని రిషి అనేస్తాడు. మీ ఊర్లో బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందా? బాస్కెట్ బాల్ ఆడటం వచ్చా? అని వసుని రిషి అడిగేస్తాడు. పెద్దగా రాదు అని వసు మెల్లిగా ఏదో అలా గునుగుతంది. పెద్దగా రాదా?.. ఆల్ రౌండర్‌వి కదా? వచ్చి ఉండాలి కదా? బ్యాగ్ అక్కడ పెట్టు..అని రిషి అంటాడు.
ఇక ఇద్దరూ బాస్కెట్ బాల్ ఆడతారు. మధ్యలో టచింగ్స్ కూడా జరిగుతాయి. లుక్స్ కలుస్తాయి. నువ్ అంత ఈజీగా నేర్చుకోలేవ్ లే.. రన్నింగ్‌లో గోల్ వేయడం కష్టం లే.. నేర్పిస్తాను అని రిషి అంటాడు. అలా రిషికి మధ్యలో కాల్ వస్తే బ్రేక్ తీసుకుంటాడు. అప్పుడు వసు గోల్స్ వేయడం చూస్తాడు. అంటే ఆట వచ్చి కూడా కావాలని ఓడిపోతోన్నావా? అని రిషి అంటాడు. అప్పుడు క్యారంబోర్డులో కూడా అలానే చేశావ్.. ఒకరి కోసం ఓడిపోవొద్దని రిషి అంటాడు. గెలుపొటముల గురించి ఆడటం లేదు కదా? సర్ అని వసు అంటుంది.
రాత్రి అయింది ఎలా వెళ్తావ్ అని రిషి అడుగుతాడు. ఆటోలోవెళ్తాను అని వసు అంటుంది. ఇప్పుడు నేను డ్రాప్ చేస్తే జగతి మేడం ఏమైనా అనుకుంటుంది అని రిషి లోలోపల అనుకుంటాడు. డ్రైవర్‌ను ఇచ్చి పంపుతాను అని రిషి అంటాడు. దీంతో వసు కాస్త హర్ట్ అయినట్టు అనిపిస్తుంది. వద్దని వసు అంటుంది. కానీ రిషి మాత్రం ఒప్పుకోడు. డ్రైవర్‌కు ఫోన్ చేస్తాడు.. వసుని ఇంట్లో డ్రాప్ చేయమని అంటాడు.
వసు వెళ్లే సమయంలో కాలి పట్టీ జారి పడిపోతోంది. ఇక ఉదయం కాగానే వసు సోఫాలో హాయిగా కునుకు తీస్తుంటుంది. అలా వసుని చూసిన జగతికి అసలు విషయం తెలుస్తుంది. అంటే వసు లేటుగా వచ్చిందన్నమాట.. వసు పద్దతి ఏంటో అర్థం కావడం లేదు.. వసు.. లే.. ఇప్పటి దాకా పడుకోవడం ఏంటి.. అని జగతి అంటుంది. ప్లీజ్ మేడం 5 మినిట్స్ అని వసు పడుకుంటుంది. అంతలో కాలింగ్ బెల్ మోగుతుంది..
మహేంద్రనా.. ఇంత ఉదయం ఎందుకు వస్తాడు? అని డోర్ తీస్తుంది జగతి. దీంతో రిషిని చూసి దెబ్బకు షాక్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సర్ అని జగతి అంటే.. మార్నింగ్ మేడం అని రిషి అంటాడు. వసుధార అని రిషి అంటాడు. అలా పక్కకు జరిగి చూపించడంతో నిద్రపోతోన్న వసుని రిషి చూస్తాడు. నిద్ర లేపమంటారా? అని జగతి అంటే.. వద్దు అని అంటాడు. ఏమైనా చెప్పమంటారా?.. అని తిరిగి జగతి ప్రశ్నిస్తుంది.
ఈ పట్టీ తనదే.. రాత్రి పారేసుకుంది.. రాత్రిళ్లు ఒంటరిగా తిరగొద్దని మీరు చెప్పరా? మేడం అని అనేసి రిషి వెళ్లిపోతాడు. దీంతో జగతి కోపంతో రగిలిపోతుంది.. వసుని లేపుతుంది. పట్టీని చూపిస్తుంది. ఎక్కడ పడింది.. ఎక్కడ దొరికింది మేడం అని వసు అడుగుతుంది. ఎక్కడ పడింది.. ఎక్కడ దొరికింది అని అడిగే అవకాశం రిషి సర్ నాకు ఇవ్వలేదు అని వెటకారంగా జగతి అంటుంది. రిషి సర్ వచ్చాడా ? అని వసు ఆశ్చర్యపోతుంది.
రిషి సర్ తెచ్చారు.. వెళ్లిపోయారు కూడా.. నిద్రలేపనా? సర్ అంటే.. వద్దన్నారు.. అని జగతి అంటుంది. రిషి సర్ చాలా గ్రేట్ కదా? ఇలా తెచ్చిచ్చారు అని వసు అంటే.. మామూలు గ్రేట్ కాదు.. మహా గ్రేట్..పడేసుకున్న నువ్ గ్రేట్, తెచ్చిన రిషి సర్ గ్రేట్.. మధ్యలో నాదేంటంటా అని విసుగ్గా అనేస్తుంది జగతి .. మేడంకు కోపం వచ్చినట్టుంది అని వసు తనలో తాను అనుకుంటుంది.. మేడం రాత్రి.. అని వసు చెప్పబోతోంది.
అయ్యయ్యో నేను అడిగానా? రెస్టారెంట్ డ్యూటీ అయ్యాక కూడా ఆలస్యమైంది? ఎందుకు.. రాత్రి ఎటు వెళ్లావ్ అని నేను అడిగానా? అడగలేదు కదా?.. రాత్రి వేళలా.. సెలవులున్నా కూడా ఆలస్యంగా వస్తున్నావ్ ఎటు వెళ్తున్నావ్ అని నేను అడిగానా? అడగలేదు కదా? వసు.. నీకు అన్నీ తెలుసు.. చిన్నపిల్లవి కాదు.. ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ తెలుసు.. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిస్తే చాలు నాకు చెప్పకున్నా పర్లేదు అని జగతి వెళ్లిపోతుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కారులో వెళ్తున్న రిషి, వసుకు షాక్ తగులుతుంది. కారు టైర్ పంక్చర్ అవుతోంది. దీంతో వసుతో కారును తోయిస్తాడు రిషి. వసు కారు తోస్తుంటే.. రిషి మాత్రం సైడ్ మిర్రర్ నుంచి సైట్ కొడుతున్నట్టున్నాడు. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి.